ఒకే రోజు 200 iQube స్కూటర్లను డెలివరీ చేసిన TVS.. పండుగల తరువాత కూడా తగ్గని జోరు

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'టీవీఎస్' మార్కెట్లో 'ఐక్యూబ్' ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలతో మంచి ఆదరణ పొందుతోంది. ఇటీవల కంపెనీ ఒక మెగా డెలివరీ ఈవెంట్ ప్రారంభించింది.

ఒకే రోజు 200 iQube స్కూటర్లను డెలివరీ చేసిన TVS

టీవీఎస్ మోటార్ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటరు కోసం మొదట నుంచి మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందుతోంది. ఇటీవల కంపెనీ నిర్వహించిన ఒక మెగా డెలివరీ ఈవెంట్ లో ఒకే సారి 200 మంది కస్టమర్లకు 200 ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేసింది. దీన్ని బట్టి చూస్తే 'ఐక్యూబ్' ఎలక్ట్రిక్ స్కూటరు కి ఎంత ఆదరణ ఉందొ స్ఫష్టంగా అర్థమవుతోంది.

టీవీఎస్ కంపెనీ నిర్వహించిన ఈ మెగా డెలివరీ ఈవెంట్ దేశ రాజధాని 'ఢిల్లీ'లో జరిగింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్లో విడుదల చేసినప్పటినుంచి ఢిల్లీలో 2000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేయగలిగింది. అయితే ఇప్పుడు ఒకేసారి 200 యూనిట్లను డెలివరీ చేసి డెలివరీలలో ఒక కొత్త రికార్డ్ సృష్టించింది. కంపెనీ డెలివరీ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లల్లో iQube, iQube S వున్నాయి.

ఒకే రోజు 200 iQube స్కూటర్లను డెలివరీ చేసిన TVS

టీవీఎస్ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఐక్యూబ్' మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 100 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. టీవీఎస్ iQube మరియు iQube S రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు 3.4 kWh బ్యాటరీ ప్యాక్ పొందుతాయి. అయితే iQube ST వేరియంట్ మాత్రం 5.1 kWh బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 140 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

టీవీఎస్ ఐక్యూబ్ ధరల విషయానికి వస్తే, ఇందులో స్టాండర్డ్ వేరియంట్ ఐక్యూబ్ ధర రూ. 99,130 కాగా, ఐక్యూబ్ ఎస్ వేరియంట్ ధర రూ. 1,04,123 (ఆన్ రోడ్ ఢిల్లీ). అయితే కంపెనీ ఇంకా తన టాప్ వేరియంట్ అయిన ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

ఒకే రోజు 200 iQube స్కూటర్లను డెలివరీ చేసిన TVS

టీవీఎస్ ఐక్యూబ్ స్టాండర్డ్ వేరియంట్ లో చిన్న 5 ఇంచ్ ఫుల్ కలర్ TFT డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లేను 5 వే జాయ్‌స్టిక్ ద్వారా నావిగేట్ చేయవచ్చు. అయితే iQube S మరియు iQube ST వేరియంట్లలో అప్‌గ్రేడ్ చేయబడిన పెద్ద 7 ఇంచ్ ఫుల్ కలర్ TFT యూనిట్‌ ఉంటుంది. అయితే ఇందులో ST వేరియంట్ మాత్రమే టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఆప్షన్ పొందుతుంది.

iQube ST వేరియంట్లో అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక వైపు అడ్జస్టబుల్ ట్విన్ షాక్‌లు, ఫ్రంట్ 220 మిమీ డిస్క్ బ్రేక్‌లు, వెనుక 130 డ్రమ్ బ్రేక్, ఎల్ఈడి లైటింగ్, మల్టిపుల్ రైడ్ మోడ్‌లు, రివర్స్ మోడ్, కీలెస్ అన్‌లాకింగ్, సోషల్ మీడియా, ఇరువైపులా 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి మరియు వాటిపై 90/90-12 సెక్షన్ టైర్‌లు వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

Most Read Articles

English summary
Tvs delivered 200 units of iqube electric scooter in single day details
Story first published: Tuesday, November 15, 2022, 12:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X