టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పెరుగుతున్న డిమాండ్, ప్రతినెలా 5,000 యూనిట్ల ఉత్పత్తి!

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ఇటీవలే విడుదల చేసిన తమ లేటెస్ట్ 2022 మోడల్ ఐక్యూబ్ (iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో జోరుగా అమ్ముడవుతోంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొత్తగా అప్‌గ్రేడ్ చేసి మెరుగైన ఫీచర్లు మరియు పెద్ద బ్యాటరీ ప్యాక్ తో విడుదల చేయడంతో, ఐక్యూబ్ కు డిమాండ్ మునుపటి కన్నా మరింత ఎక్కువైంది. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా టీవీఎస్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. ప్రస్తుతం, కంపెనీ ప్రతినెలా సుమారు 5,000 యూనిట్ల ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తోంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పెరుగుతున్న డిమాండ్, ప్రతినెలా 5,000 యూనిట్ల ఉత్పత్తి!

టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ కి ప్రజాదరణ పెరగడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, వాటిలో ఒకటి కొత్తగా జోడించబడిన వేరియంట్లు. గతంలో టీవీఎస్ ఐక్యూబ్ ఒకే కలర్ మరియు ఒకే వేరియంట్లో మాత్రమే లభించేంది. అయితే, ఇప్పుడు మూడు వేరియంట్లు మరియు విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫలితంగా, ఇప్పుడు ఇది కస్టమర్‌లకు వారి అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవడానికి మరిన్ని ఎంపికలను అందిస్తుంది. దానికి తోడు, ఇప్పుడు బేసిక్ వేరియంట్ కూడా అదే ధరలో మరింత ఎక్కువ రేంజ్‌తో వస్తుంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పెరుగుతున్న డిమాండ్, ప్రతినెలా 5,000 యూనిట్ల ఉత్పత్తి!

ఈ ఏడాది వేసవి సీజన్ లో జరిగిన వరుస ఎలక్ట్రిక్ స్కూటర్ల అగ్ని ప్రమాదాలు, ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే కస్టమర్లను తమ కొనుగోలు నిర్ణయాన్ని పునరాలోచించేలా ప్రభావితం చేశాయి. ఈ పరిస్థితుల్లో తయారీదారులు కూడా తమ వాహనాల భద్రత విషయంలో అధిక ప్రాధాన్యతనిచ్చేలా చేసింది. ఈ కారణాలన్నీ టీవీఎస్ కొత్త ఈవీ కస్టమర్‌లను పొందడంలో సహాయపడగా, పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ఇందుకు మరింత ఊతమిచ్చాయి. ఈవీ కస్టమర్లు ఇప్పుడు చవకైన ఈవీల కన్నా నాణ్యమైన మరియు నమ్మకమైన ఈవీలకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పెరుగుతున్న డిమాండ్, ప్రతినెలా 5,000 యూనిట్ల ఉత్పత్తి!

ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో టీవీఎస్ మోటార్ కంపెనీ భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండేందుకు ఇప్పటి నుండే భారీ ప్రణాళికలను తయారు చేసుకుంటోంది. ఇందులో భాగంగా కంపెనీ ఇప్పటికే గత సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడిని ప్రకటించింది. ఐక్యూబ్ విజయాన్ని అనుసరించి, TVS ఇప్పుడు కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి మరియు తమ ఈవీ కార్యకలాపాలను మరింత విస్తరించడానికి ఈ ఏడాది మరో రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పెరుగుతున్న డిమాండ్, ప్రతినెలా 5,000 యూనిట్ల ఉత్పత్తి!

జూన్ 2022లో, టీవీఎస్ మొత్తం 4,667 యూనిట్ల ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసింది, ఇది కంపెనీ గడచి మే 2022లో తయారు చేసిన దాని కంటే 2,030 యూనిట్లు ఎక్కువ. అంటే, ఐక్యూబ్ ఉత్పత్తి దాదాపు 77 శాతం పెరిగింది. టీవీఎస్ ఈ ఏడాది చివరి నాటికి నెలకు 20,000 యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పెరుగుతున్న డిమాండ్, ప్రతినెలా 5,000 యూనిట్ల ఉత్పత్తి!

కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది ఐక్యూబ్ (iQube), ఐక్యూబ్ ఎస్ (iQube S) మరియు ఐక్యూబ్ ఎస్‌టి (iQube ST) అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో ఐక్యూబ్ వేరియంట్ ధర రూ. 1.15 లక్షలు కాగా, ఐక్యూబ్ ఎస్ వేరియంట్ ధర రూ. 1,21 లక్షలు గా ఉంది (అన్ని ధరలు ఆన్ రోడ్, హైదరాబాద్). కాగా, ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. వెబ్‌సైట్‌లో ఈ టాప్-ఎండ్ వేరియంట్ కోసం బుకింగ్ లు నిలిపివేయబడినట్లుగా ఉంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పెరుగుతున్న డిమాండ్, ప్రతినెలా 5,000 యూనిట్ల ఉత్పత్తి!

డిజైన్ పరంగా చూసుకుంటే, పాత మోడల్ ఐక్యూబ్ కి ఈ కొత్త 2022 మోడల్ ఐక్యూబ్ కి పెద్దగా మార్పులేవీ లేవు. ఈ కొత్త మోడల్ ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది మరియు iQube S, iQube ST వేరియంట్‌ల విజర్ డిజైన్ లో చిన్నపాటి వ్యత్యాసాలు ఉంటాయి. అలాగే, ఈ రెండు వేరియంట్లు కూడా స్టాండర్డ్ వేరియంట్ కన్నా కొంచెం పెద్దగా ఉండే టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతాయి. ఈ కొత్త మోడల్ ఇప్పుడు బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ (TVS SmartXonnet) కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పెరుగుతున్న డిమాండ్, ప్రతినెలా 5,000 యూనిట్ల ఉత్పత్తి!

స్టాండర్డ్ వేరియంట్ లో చిన్న 5 ఇంచ్ ఫుల్ కలర్ TFT డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లేను 5-వే జాయ్‌స్టిక్ ద్వారా నావిగేట్ చేయవచ్చు. కాగా, iQube S మరియు iQube ST వేరియంట్లలో అప్‌గ్రేడ్ చేయబడిన పెద్ద 7 ఇంచ్ ఫుల్ కలర్ TFT యూనిట్‌ ఉంటుంది. అయితే ఇందులో ST వేరియంట్ మాత్రమే టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఆప్షన్ ను పొందుతుంది. లేటెస్ట్ TVS SmartXonnect సిస్టమ్ సాయంతో రైడర్లు మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్, OTA అప్‌డేట్‌లు, వాహన ఆరోగ్య స్థితి, భద్రతా నోటిఫికేషన్‌లు మరియు బహుళ బ్లూటూత్ మరియు క్లౌడ్ కనెక్టివిటీ ఎంపికలతో సహా అనేక కనెక్టివిటీ ఫీచర్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పెరుగుతున్న డిమాండ్, ప్రతినెలా 5,000 యూనిట్ల ఉత్పత్తి!

ఐక్యూ లైనప్ లోని టాప్-ఎండ్ ఎస్‌టి వేరియంట్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక వైపు అడ్జస్టబుల్ ట్విన్ షాక్‌లు, ఫ్రంట్ 220 మిమీ డిస్క్ బ్రేక్‌లు, వెనుక 130 డ్రమ్ బ్రేక్, ఎల్ఈడి లైటింగ్, మల్టిపుల్ రైడ్ మోడ్‌లు, రివర్స్ మోడ్, కీలెస్ అన్‌లాకింగ్, సోషల్ మీడియా, ఇరువైపులా 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి మరియు వాటిపై 90/90-12 సెక్షన్ టైర్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పెరుగుతున్న డిమాండ్, ప్రతినెలా 5,000 యూనిట్ల ఉత్పత్తి!

ఇక బ్యాటరీ మరియు రేంజ్ విషయానికి వస్తే, కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో స్టాండర్డ్ ఐక్యూబ్ మరియు ఐక్యూబ్ ఎస్ వేరియంట్లు రెండూ కూడా ఒకే రకమైన 3.4 kwh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటాయి. ఇవి రెండూ పూర్తి ఛార్జ్‌ పై గరిష్టంగా 100 కిమీ రేంజ్ ను అందిస్తాయి. కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ఐక్యూబ్ ఎస్‌టి లో పెద్ద 5.1 kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 140 కిలోమీటర్ల రియల్ టైమ్ రేంజ్ ను అందిస్తుంది (పాత మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ కేవలం 2.2kWh బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే లభించేది).

Most Read Articles

English summary
Tvs iqube production reaches almost 5k units automaker details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X