Ultraviolette F77 టీజర్ వీడియో.. మరి లాంచ్ ఎప్పుడంటే?

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో కర్ణాటక రాజధాని నగరం బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు Ultraviolette (అల్ట్రావయోలెట్) ఎలక్ట్రిక్ పెర్ఫార్మెన్స్ బైక్ F77ను పరిచయం చేసింది. ఈ కొత్త పవర్ పుల్ బైక్ సాధారణ బైకులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. అంటే ఈ బైక్ స్టాండర్డ్ బైక్స్ అందించే పర్ఫామెన్స్ అందిస్తుంది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ కొత్త Ultraviolette F77 ఎలక్ట్రిక్ బైక్ యొక్క కొత్త టీజర్ విడుదల చేసింది.

Ultraviolette F77 టీజర్ వీడియో.. మరి లాంచ్ ఎప్పుడంటే?

నివేదికల ప్రకారం, కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ బైకును ఈ సంవత్సరం ప్రథమార్ధంలో విడుదల చేసే అవకాశం ఉంటుంది. మీరు ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రొడక్షన్ వెర్షన్‌ను ఈ టీజర్‌లో చూడవచ్చు. ఇందులో ఈ బైక్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కంపెనీ ఈ బైక్‌ను ఇప్పటికే చాలా సార్లు టెస్ట్ చేసింది. కావున త్వరలో కంపెనీ దీనిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Ultraviolette F77 టీజర్ వీడియో.. మరి లాంచ్ ఎప్పుడంటే?

కంపెనీ ప్రస్తుతం ఈ బైక్ యొక్క ఉత్పత్తిని వేగవంతం చేస్తోంది, కావున దీనికి నిధులను కూడా సేకరిస్తోంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్‌ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. మీరు ఈ వీడియోలో గమనించినట్లైతే ఈ బైక్ లో మొబైల్ యాప్ ఉంటుందని, దీన్ని స్మార్ట్ వాచ్‌కు కూడా కనెక్ట్ చేయవచ్చని చూడవచ్చు.

Ultraviolette F77 టీజర్ వీడియో.. మరి లాంచ్ ఎప్పుడంటే?

Ultraviolette F77 బైక్ గరిష్టంగా గంటకు 140 కిమీ వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకూండా ఇది కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 60 కిమీ / గం వరకు వేగవంతం అవుతుంది. Ultraviolette F77 బైక్ ఒక పూర్తి ఛార్జింగ్‌తో 150 కి.మీల పరిధిని అందిస్తుంది.

Ultraviolette F77 టీజర్ వీడియో.. మరి లాంచ్ ఎప్పుడంటే?

ఈ బైక్‌కు మరింత ఎక్కువ పరిధి అందించే మోడల్‌పై కూడా కంపెనీ పనిచేస్తోంది. బైక్ గరిష్టంగా 4.2 కిలోవాట్ సామర్థ్యం కలిగిన మూడు లిథియం-అయాన్ బ్యాటరీలతో శక్తిని పొందుతుంది. బైక్ యొక్క ఎలక్ట్రిక్ మోటార్ 2,250 ఆర్‌పిఎమ్ వద్ద 33.5 బిహెచ్‌పి పవర్ మరియు 99 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

Ultraviolette F77 టీజర్ వీడియో.. మరి లాంచ్ ఎప్పుడంటే?

కొత్త Ultraviolette F77 బైక్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను ఉపయోగిస్తుంది. దీని మధ్యలో ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. బైక్ ముందు భాగంలో USD ఫోర్క్ సస్పెన్షన్‌ మరియు వెనుకవైపు అడ్జస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ యూనిట్ ఉంటుంది. ఈ బైక్‌ను కంపెనీ మూడు వేరియంట్లలో తీసుకురానుంది. అవి లైటింగ్, లేజర్ మరియు షాడో వేరియంట్స్.

Ultraviolette F77 టీజర్ వీడియో.. మరి లాంచ్ ఎప్పుడంటే?

కంపెనీ యొక్క ఈ మూడు బైక్‌ల ఫీచర్లు ఒకేలా ఉన్నప్పటికీ వాటి డిజైన్‌లో మాత్రం స్వల్ప తేడాను గమనించవచ్చు. ఈ బైక్ లో LTE ఇంటిగ్రేటెడ్ e-SIM వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించబడ్డాయి. అంతే కాకుండా టెంపరేచర్ సెన్సార్, యాక్టివ్ ట్రాకింగ్, షాక్ ఇంపాక్ట్ సెన్సార్ వంటి ఆధునిక స్మార్ట్ ఫీచర్లు కూడా ఈ బైక్‌లో అందించబడ్డాయి.

భారతదేశంలో మొట్టమొదటి పర్ఫామెన్స్ బేస్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఈ కొత్త Ultraviolette F77. కంపెనీ ఈ బైక్‌ను వివిధ ప్రాంతాల్లో నిరంతరం పరీక్షిస్తోంది, అయితే ఇప్పుడు ఇది చివరి దశలో ఉంది. కావున త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఎలాంటి ఆదరణ పొందుతుంది అనే విషయం తెలుస్తుంది.

Ultraviolette F77 టీజర్ వీడియో.. మరి లాంచ్ ఎప్పుడంటే?

ఇదిలా ఉండగా భారతీయ మార్కెట్లో కేవలం Ultraviolette F77 బైక్ మాత్రమే కాకుండా మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా విడుదల కానున్నాయి, వీటిని గురించి కూడా మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ప్రీవైల్ ఎలక్ట్రిక్ (Prevail Electric):

ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అయిన Prevail Electric 'ఎలైట్, ఫైనెస్ మరియు వోల్ఫ్యూరీ' అనే మూడు ప్రీమియం-మోడల్ స్కూటర్‌లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, దీని ధర రూ. 1,29,999. ఇది గరిష్టంగా 200 కిలోల లోడ్‌తో గంటకు 80 కిమీ గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఇందులో స్వాపబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీ పరిధిని అందిస్తుంది. బ్యాటరీ అయిపోయిన తర్వాత, 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

Ultraviolette F77 టీజర్ వీడియో.. మరి లాంచ్ ఎప్పుడంటే?

ఇక ఫైనెస్ స్కూటర్ విషయానికి వస్తే, దీని ధర రూ. 99,999. ఈ స్కూటర్ గంటకు 60 కి.మీ గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఇది స్వాపబుల్ బ్యాటరీ ఆప్సన్ కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ లోని బ్యాటరీ కేవలం 4 గంటల సమయంలో 0 నుంచి 100 శాతం ఛార్జింగ్ చేసుకోగలదు.

Ultraviolette F77 టీజర్ వీడియో.. మరి లాంచ్ ఎప్పుడంటే?

చివరగా ఇందులోని మూడవ మోడల్ అయిన వోల్ఫ్యూరీ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, దీని ధర రూ. 89,999 వరకు ఉంటుంది. దీని గరిష్ట వేగం 50 కిమీ వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

Ultraviolette F77 టీజర్ వీడియో.. మరి లాంచ్ ఎప్పుడంటే?

హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (HOP Electric Mobility):

గ్రీన్, సస్టైనబుల్ మరియు ఎనర్జీ ఎఫెక్టివ్ టూ వీలర్స్‌లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో, HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇప్పటికే దాని పోర్ట్‌ఫోలియోలో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కలిగి ఉంది. కంపెనీ మార్కెట్లో HOP లియో, HOP LYF మరియు HOP OXOలను విక్రయిస్తోంది. ఇవి 2021లో ప్రారంభించబడ్డాయి. HOP LEO, LYF మోడల్‌లు రెండూ 125 కిమీ పరిధిని అందిస్తాయి.

Ultraviolette F77 టీజర్ వీడియో.. మరి లాంచ్ ఎప్పుడంటే?

నెక్జు మొబిలిటీ (Nexzu Mobility):

ప్రముఖ స్వదేశీ ఇ-మొబిలిటీ బ్రాండ్ నెక్జు మొబిలిటీ, దాని స్థానికీకరణ ప్రయత్నాలను ప్రస్తుతం చాలా వేగవంతం చేస్తోంది. నెక్జు పూణేలో ఉన్న దాని తయారీ యూనిట్లతో 100% ‘మేడ్ ఇన్ ఇండియా' EV మొబిలిటీని అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. అంతే కాకుండా కంపెనీ ఎలక్ట్రిక్ సైకిల్స్ విడుదల చేసి దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతోంది. రానున్న రోజుల్లో కంపెనీ మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది.

Most Read Articles

English summary
Ultraviolette f77 electric bike new teaser details
Story first published: Thursday, January 6, 2022, 11:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X