Just In
- 16 hrs ago
కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఐ20 కొత్త ధరలు - వివరాలు
- 1 day ago
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- 2 days ago
అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- 2 days ago
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
Don't Miss
- Movies
K Viswanath పాట రాస్తూ కే విశ్వనాథ్ మృత్యువు ఒడిలోకి! కొనఊపిరి వరకు సినిమా కోసం కళాతపస్వి తపన
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
టెస్టింగ్ సమయంలో కనిపించిన కొత్త River EV: ఫోటోలు
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు, ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో సైకిల్స్ నుంచి పెద్ద కార్ల వరకు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అడుగుపెడుతున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ విఫణిలో విడుదల కావడానికి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ తయారవుతోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
ఇండియన్ మార్కెట్లోకి 'రివర్' కంపెనీ ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కంపెనీ గత 2 సంవత్సరాల నుంచి టెస్ట్ చేస్తూనే ఉంది. ఇటీవల టెస్టింగ్ సమయంలో మరోసారి కనిపించింది. అయితే ఈ కొత్త లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్టింగ్ ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. కావున ఇది 2023 మొదటి త్రైమాసికంలో విడుదలయ్యే సూచనలు ఉన్నాయి.

నిజానికి భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో వాహనాల వినియోగం కూడా అంతకు మించిన వేగంతో పెరిగిపోతోంది. కావున దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి ఎక్కువవుతోంది, దీనిని నిర్మూలించడానికి కొన్ని చిన్న ఎలక్ట్రిక్ వాహనాల అవసరమా ఎంతైనా ఉంది. అంతే కాకుండా పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావలసిన అవసరం కూడా చాలా ఎక్కువగానే ఉంది.
రివర్ కంపెనీ విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ స్టైలిష్ గా ఉంది, స్పాట్ టెస్ట్ లో కనిపించిన కొన్ని ఫోటోలను గమనించినట్లయితే, ఇది రోజువారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉండే వాహనం అని తెలుస్తోంది. ముందు భాగంలో రెండు పెద్ద హెడ్ లైట్స్, మంచి గ్రిప్ అందించడానికి అనుకూలంగా ఉండే హ్యాండిల్ బార్, వాహనం గురించి సమాచారం అందించడానికి ఉపయోగపడే ఒక డిస్ప్లే వంటివి చూడవచ్చు.
అంతే కాకుండా రైడర్ కి అనుకూలంగా ఉండే ఫుట్ రెస్ట్ మరియు పిలియన్ రైడర్ కి అనుకూలంగా ఉండే సీట్ వంటివి కూడా ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా వరకు కప్పబడి ఉండటం వల్ల ఎక్కువ డిజైన్ సమాచారం మరియు బ్యాటరీ కెపాసిటీ వంటి వాటిని కూడా వివరాలు అందుబాటులో లేదు. ఇవన్నీ త్వరలోనే కంపెనీ వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నాము.
రివర్ కంపెనీ 2020 సంవత్సరం చివరిలో 'అరవింద్ మణి' మరియు 'విపిన్ జార్జ్' చేత స్థాపించబడింది. ఈ ఇద్దరూ కూడా ద్విచక్రవాహన విభాగంలో మంచి అనుభవం కలిగి ఉన్నారు. అరవింద్ మణి ఒకప్పుడు పెట్రోకెమికల్స్ పరిశ్రమలో పనిచేసిన ఇంజనీర్. అంతే కాకుండా అల్ట్రావయోలెట్‌లో వ్యాపార వ్యూహానికి ఇటీవల వైస్ ప్రెసిడెంట్ కూడా. జార్జ్ కూడా హోండా R&Dలో ఎనిమిదేళ్లపాటు హెడ్ డిజైనర్‌గా పనిచేసి ఇటీవల అల్ట్రావయోలెట్‌లో డిజైన్ లీడ్‌గా ఉన్నారు.

ఈ ఇద్దరు వ్యక్తులు కనుగొన్న మల్టీ-యుటిలిటీ టూ-వీల్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ RX-1 అనేక బ్యాటరీ ప్యాక్ పరిమాణాలలో అందుబాటులో ఉంది. ఇది ఒక ఛార్జ్ తో 100కిమీ మరియు 180కిమీ రేంజ్ అబ్దిస్తుందని తెలిసింది. ఇది కేవలం 4 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 80కిమీ వరకు ఉంటుంది. ఇది దాదాపు 200 కేజీల బరువును మోసే కెపాసిటీని కలిగి ఉంటుంది.
కాలుష్యం కలిగించే గ్యాస్ మరియు డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపైనా ప్రభుత్వం సబ్సిటీ వంటి వాటిని కూడా అందిస్తోంది. సాధారణ రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ మరియు జొమాటో వంటి ఈ కామర్స్ మరియు డెలివరీ కంపెనీలు ఈ రకమైన ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నాయి.
2025 నాటికి స్విగ్గి ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ప్రతిరోజూ 8,00,000 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉందని గతంలోనే వెల్లడించింది. అదే సమయంలో వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ 2030 నాటికి 25,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే, రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఇప్పుడున్న దాని కంటే మరింత ఎక్కువగా ఉంటుందని స్పష్టమవుతోంది.
రివర్ కంపెనీ విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ స్కూటర్లను నేరుగా రెస్టారెంట్లు వంటి వ్యాపారాలకు, అలాగే ఫ్లీట్ ఆపరేటర్లకు మరియు వినియోగదారులకు విక్రయించడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి కూడా సన్నాహాలు చేస్తోంది. మొత్తం మీద రివర్ కంపెనీ రానున్న రోజుల్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగంలోకి తీసుకురావడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తోంది.