ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇలా కూడా పనికొస్తోందా: వాట్ ఏ ఐడియా గురూ.. వీడియో

భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' తన ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విడుదల చేసినప్పటినుంచి ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉన్నాయి. గతంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద చాలా నెగిటీవ్ కంప్లైంట్స్ వచ్చినప్పటికీ, ఇటీవల ఒక సానుకూల స్పందన వచ్చింది.

నివేదికల ప్రకారం ఇటీవల విడుదలైన ఒక వీడియోలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను క్రికెట్ ఆడే సమయంలో కామెంట్రీ చెప్పడానికి ఉపయోగించుకున్నారని తెలిసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంత మంది గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుంటే ఒక యువకుడు ఎలక్ట్రిక్ స్కూటర్ లోని వైర్లెస్ స్పీకర్ సాయంతో కామెంట్రీ చెబుతున్నాడు. ఇది చూస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా అని తప్పకుండా అనిపిస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇలా కూడా పనికొస్తోందా

ఈ సంఘటన ఒడిశా రాష్ట్రానికి చెందినట్లు తెలుస్తోంది. ఈ వీడియో బికాష్ బెహెరా అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసాడు. ఈ వీడియో చూసిన ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ 'మా వెహికల్ ను అత్యంత సృజనాత్మకంగా వినియోగించుకోవడం నేను మొదటి సారి చూస్తున్నా' అంటూ రీప్లే ఇచ్చారు. ఈ ట్వీట్ పైన కొంతమంది ఇది ఇండియా.. ఇక్కడ అన్నీ సాధ్యమవుతాయి అంటూ రీప్లే కూడా ఇస్తున్నారు.

ఈ వీడియోలో కనిపించే ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంది. కావున ఇందులో బ్లూటూత్ మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా వున్నాయి. వీటి సాయంతో యువకుడు అక్కడ జరిగే క్రికెట్ మ్యాచ్ కామెంట్రీ చేయడానికి బ్లూటూత్ ద్వారా ఫోన్ ను స్కూటర్ కు కనెక్ట్ చేశాడు. ఇందులో ఆ యువకుడి యొక్క సృజనాత్మకతకు ఎవ్వరైనా తప్పకుండా ఫిదా అవ్వాల్సిందే.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ సింపుల్‌ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ ఆప్రాన్‌ మధ్యలో OLA బ్యాడ్జ్‌తో చూడవచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఉన్న ఏకైక ఫీచర్ హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ల చుట్టూ ట్విన్-పాడ్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్ మరియు కాంటూర్డ్ సీట్లు ఉన్నాయి.

అంతే కాకూండా ఇందులో అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

'ఓలా ఎస్1 ఎయిర్' ఎలక్ట్రిక్ స్కూటర్ 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారును పొందుతుంది. కావున ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అదే సమయంలో ఛార్జింగ్ విషయానికి వస్తే 'ఎస్1 ఎయిర్‌' ఎలక్ట్రిక్ స్కూటర్ 500W పోర్టబుల్ హోమ్ ఛార్జర్‌ని ఉపయోగించి 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 4:30 గంటల సమయం పడుతుంది.

Most Read Articles

English summary
Video viral use of ola scooter for cricket commentary details
Story first published: Sunday, December 25, 2022, 6:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X