ఆటో ఎక్స్‌పో 2023: ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌లో కనిపించిన హీరో గ్లామర్ Xtec

ఆటో ఎక్స్‌పో 2023 లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన హీరో గ్లామర్ Xtec ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రదర్శించింది. దేశీయ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న హీరో గ్లామర్ Xtec ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ గా దర్శనమిచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో ఇప్పటికే అత్యధిక అమ్మకాలు పొందుతున్న బైకుల జాబితాలో హీరో గ్లామర్ ఒకటి. అయితే కంపెనీ ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ విభాగంలో కూడా అడుగుపెట్టేసింది. ఇందులో భాగంగానే హీరో గ్లామర్ Xtec ఫ్లెక్స్ ఫ్యూయల్ తీసుకురానుంది. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ ఇథనాల్ ఆధారిత ఇంధనాల (E20 నుండి E85 వరకు) శ్రేణిపై నడుస్తుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌లో కనిపించిన హీరో గ్లామర్ Xtec

ఫ్లెక్స్ ఫ్యూయెల్ మరియు ఇథనాల్ ఆధారిత ఇంధనం విషయానికి వస్తే, సాధారణంగా రెండు అంకెల సంఖ్య ముందు 'E' తో సూచించబడతాయి. అంటే ఇక్కడ ఆ సంఖ్యలు ఇంధన శాతాన్ని చూపిస్తాయి. E20 ఇంధనం అంటే ఇందులో 20 శాతం ఇథనాల్ ఉంటుంది. అదే సమయంలో E80 అని ఉంటే ఇందులో 80 శాతం పెట్రోల్ ఉంటుంది. ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల్లో 100 శాతం పెట్రోల్ ఉపయోగించబడదు. ఇందులో ఇథనాల్ కూడా ఉపయోగించబడుదుతుంది.

హీరో గ్లామర్ Xtec ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ 124.7 సిసి, ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 10.06 bhp పవర్ మరియు 7,500 rpm వద్ద 10.7 Nm గరిష్ట టార్క్‌ అందిస్తుంది. అంతే కాకుండా ఈ హీరో గ్లామర్ Xtec ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున పనితీరు పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌లో కనిపించిన హీరో గ్లామర్ Xtec

పరిమాణం పరంగా కూడా ఈ కొత్త హీరో గ్లామర్ Xtec ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ రైడర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ 2,051 మిమీ పొడవు, 743 మిమీ వెడల్పు, 1,074 మిమీ ఎత్తు మరియు 1,273 మిమీ వీల్‌బేస్‌ కలిగి ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే హీరో గ్లామర్ Xtec ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి, 198 కేజీల బరువును కలిగి ఉంటుంది.

హీరో గ్లామర్ Xtec ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ 10 లీ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. ఈ బైక్ డిజైన్ పరంగా స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. ఫీచర్స్ కూడా సాధారణ మోడల్ మాదిగానే ఉంటుంది. ఇందులో పెద్దగా మార్పులు జరిగినట్లు కనిపించదు. కావున చూడటానికి సాధారణ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌లో కనిపించిన హీరో గ్లామర్ Xtec

హీరో గ్లామర్ Xtec ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ యొక్క పనితీరుని గురించి మరియు మైలేజ్ గురించి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందించలేదు. బహుశా కంపెనీ ఈ బైక్ కి సంబంధించిన చాలా సమాచారాన్ని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది. ఆటో ఎక్స్‌పో 2023 లో సుజుకి జిక్సర్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మరియు హోండా XRE 300 ఫ్లెక్స్-ఫ్యూయెల్ వంటి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్స్ కూడా ప్రదర్శించబడ్డాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడ్డాయి మరియు విడుదలయ్యాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన/విడుదలైన వాహనాలను గురించి తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.

Most Read Articles

English summary
Auto expo 2023 hero glamour xtec flex fuel showcased details in telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X