2022 చివరలో గణనీయంగా పెరిగిన 'టీవీఎస్ ఐక్యూబ్' అమ్మకాలు: కారణం అదేనా?

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను చాలా డిమాండ్ ఉంది. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తున్నాయి, ఇప్పటికే విడుదలైన వాహనాలు మంచి అమ్మకాలు పొందుతున్నాయి. ఇందులో భాగంగానే టీవీఎస్ ఐక్యూబ్ గత ఏడాది డిసెంబర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

టీవీఎస్ కంపెనీ దేశీయ విఫణిలో తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలు పొందుతూనే ఉంది. ప్రారంభంలో అమ్మకాలు కొంత మందగించినప్పటికీ క్రమంగా ఈ అమ్మకాలు బాగా వృద్ధి చెందాయి. అయితే కంపెనీ కూడా ఎప్పటికప్పుడు ఈ స్కూటర్ ని అప్డేట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే గత ఏడాది 'మే'లో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను అప్డేట్ చేసింది.

2022 చివరలో గణనీయంగా పెరిగిన టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాలు

అప్డేటెడ్ టీవీఎస్ ఐక్యూబ్ పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగి, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మునుపటి మోడల్ కంటే కూడా ఆధునిక కాస్మోటిక్ అప్డేట్స్ పొందింది, కావున చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మరింత మంది వాహనదారులను ఆకరించడానికి అనుకూలంగా తయారైంది. ఈ అప్డేట్స్ వల్ల టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు మరింత పెరిగాయి.

కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టీవీఎస్ ఐక్యూబ్ 2022 కేవలం 1420 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. అయితే 2022 చివరి నాటికి ఈ అమ్మకాలు భారీగా పెరిగాయి. అంటే కంపెనీ యొక్క అమ్మకాలు 2022 డిసెంబర్ నెలలో 11,071 యూనిట్లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ అమ్మకాలు ఏ స్థాయిలో పెరిగాయి అనేది స్పష్టంగా అర్థమవుతోంది. కాగా ఈ కొత్త సంవత్సరంలో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు తప్పకుండా మెరుగుపడతాయని ఆశిస్తున్నాము.

TVS iQube Sales
Month and Year Sales
April 2022 1,420
May 2022 2,637
June 2022 4,667
July 2022 6,304
August 2022 4,418
September 2022 4,923
October 2022 8,103
November 2022 10,056
December 2022 11,071

టీవీఎస్ ఐక్యూబ్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో స్టాండర్డ్, ఎస్ మరియు ఎస్టీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ మరియు ఐక్యూబ్ ఎస్ రెండూ కూడా ఒకే 3.4kwh బ్యాటరీ ప్యాక్ తో పనిచేస్తాయి. ఇవి పూర్తి ఛార్జ్‌ పై గరిష్టంగా 100 కిమీ రేంజ్ ను అందిస్తాయి. ఇక టాప్ వేరియంట్ ST 4.56 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది ఒక ఛార్జ్ తో 145 కిమీ రేంజ్ అందిస్తుంది.

కొత్త TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మూడు వేరియంట్‌లు కూడా కేవలం 4.2 సెకన్లలో గంటకు గరిష్టంగా 0 నుండి 140 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతాయి. అంతే కాకుండా iQube మరియు iQube S యొక్క టాప్ స్పీడ్ 78 కిమీ/గం కాగా, టాప్ వేరియంట్ iQube ST యొక్క టాప్ స్పీడ్ 84 కిమీ/గం వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఐక్యూబ్ మరియు ఐక్యూబ్ ఎస్ రెండు వేరియంట్లు కూడా 650W మరియు 950W ఛార్జర్ కి సపోర్ట్ చేస్తాయి. ఇవి 650W ఛార్జర్‌తో చార్జ్ చేసినప్పుడు నాలుగున్నర గంటల వ్యవధిలో 0-100 శాతం ఛార్జ్ అవుతాయి. అదే 950W ఛార్జర్ తో అయితే ఆ సమయాన్ని కేవలం 2 గంటల 50 నిమిషాలకు తగ్గించవచ్చు. ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ 950W మరియు 1.5kW ఛార్జర్లను సపోర్ట్ చేస్తుంది.

ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ 950W ఛార్జర్‌ ద్వారా 4 గంటల 6 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అదే .5kW (1500W) ఛార్జర్ సాయంతో కేవలం రెండున్నర గంటలలోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. కావున ఛార్జింగ్ పరంగా కూడా కస్టమర్లు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. టీవీఎస్ ఐక్యూబ్ స్టాండర్డ్ వెర్షన్ ధర రూ .99,130 కాగా, 'ఎస్' వేరియంట్ ధర రూ. 1.04 లక్షలు. టీవీఎస్ కంపెనీ ఐక్యూబ్ ఎస్టీ ధరలను ఇంకా వెల్లడించలేదు.

Most Read Articles

English summary
Tvs iqube sales in december 2022 details in telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X