పాకిస్తాన్ కోసం ప్రత్యేకమైన ఆల్టో660

మారుతి సుజుకి ప్రస్తుతం పాకిస్తాన్‌ మార్కెట్లో ఉన్న మెహ్రన్ 800సీసీ స్థానంలో ఆల్టో660సీసీ ని ప్రవేశపెట్టో ఆలోచనలో ఉంది.

By Anil

పాకిస్తాన్‌లోని సుజుకి విభాగం ఆల్టో 660 సీసీ వెర్షన్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. అంతే కాకుండా పాకిస్తాన్‌లోనే ఈ ఆల్టో660 ని ఉత్పత్తి చేయడానికి సుజుకి సన్నద్దం అవుతోంది.

మారుతి ఆల్టో 660

జపాన్‌కు చెందిన సుజుకి పాకిస్తాన్‌లో ఇది వరకే అందుబాటులో ఉంచినమెహ్రన్ 800సీసీ స్థానంలోకి ఆల్టో660సీసీ ని ప్రవేశపెట్టనుంది.

మారుతి ఆల్టో 660

సుజుకి లోని బోర్డు కమిటీ సభ్యుల నిర్వహించిన మీటింగ్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఉత్పత్తుల్లో కూడా సాధారణ భద్రత ప్రమాణాలను కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

మారుతి ఆల్టో 660

ఈ కారణంగానే ప్రస్తుతం పాక్‌లో ఉన్న మెహ్రన్ 800సీసీ స్థానంలో భద్రత ఫీచర్లతో నిండిన ఆల్టో660సీసీ ని విడుదల చేసే నిర్ణయం తీసుకున్నారు.

మారుతి ఆల్టో 660

పాకిస్తాన్ సుజుకి మోటార్ కంపెనీ లిమిటెడ్ పాకిస్తాన్ మార్కెట్లోకి 1,000సీసీ సామర్థ్యం గల సెలెరియో, 1,300సీసీ సామర్థ్యం గల సుజుకి గ్రాండ్ వితారా ఎస్‌యువి మరియు 1,300సీసీ సామర్థ్యం ఉన్న సియాజ్ సెడాన్‌లను 2017 నాటికి దిగుమతి చేసుకోనుంది.

మారుతి ఆల్టో 660

వీటన్నింటిని కూడా భవిష్యత్తులో పాకిస్తాన్‌లోనే అసెంబుల్ చేసే అవకాశాలు ఉన్నాయి.

మారుతి ఆల్టో 660

ప్రస్తుతం పాకిస్తానీలకు అందుబాటులోకి రానున్న ఆల్టో660 లో 660సీసీ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల టర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తున్నారు.

మారుతి ఆల్టో 660

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ గల ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం అయ్యే అవకాశం ఉంది.

మారుతి ఆల్టో 660

2016 ఆల్టో660 లో ఎలక్ట్రిక్ విండోలు, మ్యాన్యువల్ లేదా ఆటో వాతావరణ నియంత్రికలు, స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, కీ లెస్ ఎంట్రీ, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ అద్దాలు, ఎయిఎక్స్-ఇన్ సదుపాయం గల మ్యూజిక్ సిస్టమ్ వంటి ఫీచర్లతో రానుంది.

మారుతి ఆల్టో 660

సుజుకి జపాన్ కోసం ప్రస్తుతం 2-వీల్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గల రెండు వేరియంట్లను రూపొందించింది. అయితే ఇందులో పాకిస్తాన్‌లో పరిచయం అయ్యే వేరియంట్ ఏదో ఇకా తేలాల్సి ఉంది.

మారుతి ఆల్టో 660

ఇండియాలో వీటి విడుదల ఉంటుందా ? ప్రస్తుతం ఎంట్రీ లెవల్ కార్ల విభాగంలో రెనో క్విడ్ అమ్మకాలు నానాటికీ తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ సందర్భంలో మారుతి ఇండియా కోసం నూతన ఆల్టోను అభివృద్ది చేస్తున్నట్లు ప్రకటించింది.

మారుతి ఆల్టో 660

ప్రస్తుతం అభివృద్ది చెందుతున్న ఆల్టోను మునుపటి వాటితో పోల్చితే చాలా స్పోర్టివ్‌గా ఉంటుంది మరియు ఇది క్రాసోవర్ తరహాలో డిజైన్ చేయబడుతోందని తెలిపింది.

మారుతి ఆల్టో 660

అంతర్జాతీయ మార్కెట్ల గురించి అటుంచితే దేశీయంగా దీనిని 2019 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చే సూచనలు ఉన్నాయి.

మారుతి ఆల్టో 660

ప్రతి ఒక్కరి జీవితంలో బాగా కలిసొచ్చే రంగు ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అందుకే కాబోలు సప్తవర్ణాలంకారణలో ....

Most Read Articles

English summary
Read In Telugu: Suzuki To Bring Alto 660cc To Pakistan
Story first published: Tuesday, October 25, 2016, 15:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X