ఒక్క ఫోన్ చేస్తే చాలు మీ ఆఫీస్ వద్దకే కారు సర్వీసింగ్ సెంటర్.. మారుతి మైండ్ బ్లోయింగ్ ప్లాన్

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) తన కస్టమర్ల కోసం ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. కారు సర్వీసింగ్ కోసం గంటల తరబడి వర్క్‌షాపుల చుట్టూ తిరగడం, వీకెండ్స్ పాడు చేసుకోవడం వంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ.. మీ ఆఫీసు వద్దకే సర్వీస్ సెంటర్‌ను తీసుకువచ్చే క్విక్‌స్టాప్ (QuickStop) సేవలను ప్రారంభించింది.

ఏమిటీ క్విక్‌స్టాప్ సేవలు?
సాధారణంగా కారు సర్వీసింగ్ చేయించాలంటే పెద్ద వర్క్‌షాప్‌కు వెళ్లాలి. అక్కడ ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి, క్యూలో వేచి ఉండాలి. పోనీ పిక్-అప్ అండ్ డ్రాప్ సౌకర్యం వాడుకుందామన్నా రోజంతా కారు మన దగ్గర ఉండదు. ఈ సమస్యలన్నింటికీ మారుతి సుజుకి ఒక స్మార్ట్ పరిష్కారం కనిపెట్టింది. అదే క్విక్‌స్టాప్. ఇవి చూడటానికి చిన్నగా ఉండే కంటైనర్ ఆధారిత సర్వీస్ యూనిట్లు. షిప్పింగ్ కంటైనర్లను అత్యాధునిక సాంకేతికతతో మొబైల్ వర్క్‌షాప్‌లుగా మార్చి, కస్టమర్లకు అత్యంత చేరువలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

Maruti Suzuki Launches QuickStop Container-Based Service Centers for Faster Maintenance

ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి?
ఈ సరికొత్త ప్రాజెక్టును మారుతి సుజుకి ప్రస్తుతం పైలట్ ప్రాతిపదికన దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ-NCR, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, సూరత్, కాలికట్, బాగ్డోగ్రాలో ప్రారంభించింది. వీటిని ఎక్కడో దూరంగా కాకుండా.. కార్ల రద్దీ ఎక్కువగా ఉండే ఐటీ పార్కులు, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసు క్యాంపస్‌లు, ఎయిర్ పోర్టులు టాక్సీలు/ఫ్లీట్ హబ్స్ ఉండే చోట్ల ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 10 సెంటర్లు అందుబాటులోకి రాగా, త్వరలోనే వందలాది సెంటర్లను దేశవ్యాప్తంగా విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

బిజీ లైఫ్ ఉన్నవారికి ఇది ఒక వరం
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పర్సనల్ సమయం చాలా విలువైనది. ముఖ్యంగా ఆఫీసుకి వెళ్లే వారికి కారు సర్వీసింగ్ అంటే అదొక పెద్ద టాస్క్. క్విక్‌స్టాప్ ద్వారా ఈ టెన్షన్ ఉండదు. మీరు ఉదయం ఆఫీసుకి వెళ్లేటప్పుడు మీ కారును అక్కడే ఉన్న క్విక్‌స్టాప్ సెంటర్‌లో ఇచ్చి వెళ్లవచ్చు. మీరు ఆఫీసు పనుల్లో బిజీగా ఉండగానే, అక్కడ నిపుణులైన మెకానిక్లు మీ కారుకు సర్వీసింగ్ పూర్తి చేస్తారు. సాయంత్రం మీరు ఇంటికి వెళ్లే సమయానికి మీ కారు కొత్తదానిలా మెరుస్తూ సిద్ధంగా ఉంటుంది. దీనివల్ల మీకు ప్రత్యేకంగా సెలవు తీసుకోవాల్సిన అవసరం ఉండదు, అలాగే మీ వీకెండ్ ప్లాన్స్ పాడు కావు.

Maruti Suzuki Launches QuickStop Container-Based Service Centers for Faster Maintenance

ఏమేం పనులు చేస్తారు?
ఈ చిన్న కంటైనర్ సెంటర్లలో కారుకు అవసరమైన దాదాపు అన్ని ముఖ్యమైన పనులు చేస్తారు.
రొటీన్ మెయింటెనెన్స్: ఇంజిన్ ఆయిల్ మార్చడం, ఫిల్టర్లు శుభ్రం చేయడం వంటివి.
చిన్నపాటి రిపేర్లు: బ్రేక్ ప్యాడ్లు మార్చడం, వైపర్లు చెక్ చేయడం వంటి మైనర్ పనులు.
డయాగ్నోస్టిక్స్: కారులో ఏవైనా సమస్యలు ఉన్నాయేమో కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ద్వారా చెక్ చేయడం.
పెద్ద యాక్సిడెంట్ రిపేర్లు లేదా పెయింటింగ్ వంటి పనులు తప్ప, రోజువారీ అవసరాలన్నీ ఇక్కడే తీరిపోతాయి.

వాటర్-లెస్ టెక్నాలజీ
మారుతి సుజుకి కేవలం సౌకర్యం మీద మాత్రమే కాకుండా పర్యావరణం మీద కూడా దృష్టి పెట్టింది. ఈ క్విక్‌స్టాప్ సెంటర్లలో వాటర్-లెస్ కార్ వాష్ (Waterless Car Wash) సదుపాయం ఉంది. దీనివల్ల కారును కడగడానికి వేల లీటర్ల నీటిని వృథా చేయాల్సిన పని లేదు. ప్రత్యేక రసాయనాలతో కారును తక్కువ నీటితోనే క్లీన్ చేస్తారు. ఇక్కడ వాడే చాలా పరికరాలు బ్యాటరీతో నడిచేవే. దీనివల్ల శబ్ద కాలుష్యం ఉండదు. విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది.

Maruti Suzuki Launches QuickStop Container-Based Service Centers for Faster Maintenance

తక్కువ ఖర్చు.. వేగవంతమైన సేవలు
ఈ మొబైల్ యూనిట్ల వల్ల డీలర్లకు కూడా లాభమే. ఎందుకంటే పెద్ద వర్క్‌షాప్ కట్టడానికి కావాల్సిన స్థలం, భారీ భవన నిర్మాణం వంటి ఖర్చులు ఇక్కడ ఉండవు. కేవలం ఒక కంటైనర్, కొద్దిపాటి స్థలం ఉంటే సరిపోతుంది. ఈ తక్కువ నిర్వహణ ఖర్చుల వల్ల కస్టమర్లకు కూడా చౌకగా, నాణ్యమైన సర్వీసింగ్ అందించే అవకాశం ఉంటుంది.

సిఈఓ మాటల్లో క్విక్‌స్టాప్ లక్ష్యం
మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఈఓ హిసాషి టేకుచి మాట్లాడుతూ.. "కస్టమర్లే మాకు ముఖ్యం. కారు కస్టమర్లకు సేవ చేయాలి కానీ, కారు సర్వీసింగ్ కోసం కస్టమర్లు తిరగకూడదు అనేది మా ఉద్దేశ్యం. క్విక్‌స్టాప్ అనేది కస్టమర్లకు అత్యంత చేరువగా వెళ్లడానికి మేము వేసిన ఒక పెద్ద అడుగు. భవిష్యత్తులో మరిన్ని నగరాల్లో ఈ సేవలను విస్తరిస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు.

More from DriveSpark

Article Published On: Monday, March 30, 2026, 19:00 [IST]
English summary
Maruti suzuki launches quickstop container based service centers for faster maintenance
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+