ఇండియాలో ఇంత కంటే మంచి కారు ఉందా? నెంబర్ 1.. 33km మైలేజ్, రూ. 6.26 లక్షలు, 5-స్టార్ సేఫ్టీ

దేశంలో పేద, మధ్యతరగతి ప్రజల కారు కలను నిజం చేసిన కంపెనీల్లో మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తుంది. తక్కువ ధరలో మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ కలిపి సామాన్య వినియోగదారుడికి సరిపోయే కార్లను అందిస్తూ, ఈ సంస్థ కోట్ల మంది మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే కార్లను తయారు చేయడం ద్వారా, మారుతి సుజుకి భారత ఆటోమొబైల్ రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇలాంటి బలమైన నేపథ్యంతో ముందుకు సాగుతున్న ఈ సంస్థకు చెందిన ప్రసిద్ధ సెడాన్ మారుతి సుజకి డిజైర్ (Maruti Suzuki Dzire) మరోసారి తన సత్తాను చాటుకుంది.

సాధారణంగా ఈ మధ్య కాలంలో SUVలు, యుటిలిటీ వాహనాలు మార్కెట్‌ను ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో, ఒక సెడాన్ కారు టాప్ స్థానాన్ని దక్కించుకోవడం నిజంగా విశేషమే. డిజైర్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఏప్రిల్ 2025 నుండి ఫిబ్రవరి 2026 వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే, డిజైర్ మొత్తం 2,07,906 హోల్‌సేల్ అమ్మకాలను నమోదు చేసింది.

Maruti Dzire Emerges As Highest Selling Car In Fy26 India With Record Sales

ఈ సంఖ్యలు కేవలం విజయాన్ని మాత్రమే కాదు, వినియోగదారుల నమ్మకాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా, భారీ డిమాండ్ ఉన్న SUVలు, UVల వంటి విభాగాల్లోని ప్రముఖ మోడళ్లను కూడా అధిగమించి డిజైర్ ఈ స్థానాన్ని దక్కించుకోవడం మరింత విశేషం. డిజైర్ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన అంశాలు సరసమైన ధర, అద్భుతమైన మైలేజ్, కుటుంబ అవసరాలకు సరిపోయే విశాలమైన క్యాబిన్, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటివి కీలకం.

2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అగ్రశ్రేణి కార్ల జాబితాను పరిశీలిస్తే, మార్కెట్‌లో జరుగుతున్న మార్పులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ముందుగా డిజైర్ అగ్రస్థానాన్ని దక్కించుకుని సంచలనం సృష్టించగా, దాని వెంటనే టాటా నెక్సాన్ 1,96,244 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో నిలిచింది. మొత్తం SUV సెగ్మెంట్‌లో పెరుగుతున్న డిమాండ్‌కు ఇది ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. ఇక మూడవ స్థానంలో హ్యూందాయ్ క్రెటా 1,84,083 యూనిట్ల అమ్మకాలతో నిలిచింది.

Maruti Dzire Emerges As Highest Selling Car In Fy26 India With Record Sales

డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ముందుభాగంలో కొత్త ఫ్రంట్ బంపర్, LED హెడ్‌లైట్లు, DRLsతో మంచి లుక్ ఇస్తుంది. పెద్ద గ్రిల్, కొత్త ఫాగ్ ల్యాంప్ డిజైన్ కూడా ఆకట్టుకుంటాయి. సైడ్‌లో షోల్డర్ లైన్ బాగా కనిపిస్తుంది. ఇతర ఫీచర్లలో షార్క్ ఫిన్ యాంటెన్నా, బూట్ స్పాయిలర్, అలాగే క్రోమ్ స్ట్రిప్‌తో కలిసిన Y-షేప్ LED టెయిల్‌లైట్లు ఉన్నాయి. ఇది LXi, VXi, ZXi, ZXi+ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ధర పరంగా ఎక్స్-షోరూమ్ సుమారు రూ. 6.26 లక్షల నుంచి రూ. 9.31 లక్షల మధ్య ఉంటుంది. ఇంజిన్ విషయానికొస్తే, 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.2-లీటర్ CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉండటం వినియోగదారులకు మరింత ఎంపికలను ఇస్తుంది. ట్రాన్స్‌మిషన్ పరంగా 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉండటం వలన డ్రైవింగ్ స్టైల్‌కు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు.

Maruti Dzire Emerges As Highest Selling Car In Fy26 India With Record Sales

మైలేజ్ విషయంలో డిజైర్ ఇప్పటికే మంచి పేరు సంపాదించుకుంది. పెట్రోల్ వెర్షన్‌లో సుమారు 24.79 kmpl వరకు, CNG వెర్షన్‌లో 33.73 km/kg వరకు మైలేజ్ ఇవ్వడం దీని పెద్ద ప్లస్ పాయింట్. కేవలం బయట లుక్‌తోనే కాదు, లోపలి క్యాబిన్ డిజైన్‌తో కూడా మంచి ఇంప్రెషన్ ఇస్తుంది. ఈ కారు గ్లోబల్, భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ సాధించింది.

More from DriveSpark

Article Published On: Thursday, April 2, 2026, 15:06 [IST]
English summary
Maruti dzire emerges as highest selling car in fy26 india with record sales
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+