ఈ సరికొత్త స్విఫ్ట్ టైగర్ ఎడిషన్ 100 మందికి మాత్రమే

By Anil

మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్‌ స్విఫ్ట్ ను స్పెషల్ ఎడిషన్ అవతారంలో విడుదల చేసింది. టైగర్ ఎడిషన్‌ పేరుతో విడుదలైన ఈ స్విప్ట్‌ను లిమిటెడ్ ఎడిషన్‌గా కేవలం 100 యూనిట్ల వరకు మాత్రమే అందుబాటులో ఉంచారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఇది భారతీయుల కోసం కాదు ఇటలీ మార్కెట్ కోసం అభివృద్ది చేశారు.

మారుతి సుజుకి స్విఫ్ట్ టైగర్ లిమిటెడ్ ఎడిషన్

ఈ స్విఫ్ట్ టైగర్ ఎడిషన్‌ను వ్యక్తిగతంగా కొనుగోలు చేయాలనుకునే వారు అక్టోబర్ 31 లోపు డీలర్ల వద్ద బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ టైగర్ లిమిటెడ్ ఎడిషన్

ఇటాలియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న దీని ధర సుమారుగా 13,500 యూరోలుగా ఉంది. మన రుపాయల్లో దీని విలువ 10.12 లక్షలు గా ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ టైగర్ లిమిటెడ్ ఎడిషన్

అయితే వచ్చే నవంబర్ నుండి సుజుకి వారు తమ టైగర్ ఎడిషన్‌ను 16,650 యూరోలకు అందించనున్నారు. అంటే 12.43 లక్షలు రుపాయలు.

మారుతి సుజుకి స్విఫ్ట్ టైగర్ లిమిటెడ్ ఎడిషన్

మారుతి సుజుకి ఈ స్విఫ్ట్ టైగర్ ఎడిషన్‌లో 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ అందించారు. ఇది సుమారుగా 92.49బిహెచ్‌పి పవర్ మరియు 118ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

మారుతి సుజుకి స్విఫ్ట్ టైగర్ లిమిటెడ్ ఎడిషన్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. దీని గరిష్ట వేగం గంటకు 165కిలోమీటర్లుగా ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ టైగర్ లిమిటెడ్ ఎడిషన్

ఎక్ట్సీరియర్ మీద అత్యంత విభిన్నమైన డ్యూయల్ టోన్ పెయింటింగ్ చేశారు. ఆరేంజ్ మరియు నలుపు రంగులో ఈ టైగర్ ఎడిషన్‌ను డిజైన్ చేశారు.

మారుతి సుజుకి స్విఫ్ట్ టైగర్ లిమిటెడ్ ఎడిషన్

మారుతి ఈ స్విప్ట్ టైగర్ ఎడిషన్‌ను ట్యురిన్ స్టైల్ సెంటర్‌లో అభివృద్ది చేసారు. ఇందులోని సి-పిల్లర్ మీద జపాన్ భాషలో టోరా అనే వ్రాయబడి ఉంటుంది. టోరా అంటే టైగర్ అని అర్థం.

మారుతి సుజుకి స్విఫ్ట్ టైగర్ లిమిటెడ్ ఎడిషన్

ఇంటీరియర్ పరంగా ఏ విధమైన వివరాలను వెల్లడించలేదు. అయితే టైగర్ ఎడిషన్‌ను సూచించే విధంగా గుర్తులు, ప్రతేక రంగులో ఇంటీరియర్, మరియు స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జిలు ఇందులో ఉండే అవకాశం ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ టైగర్ లిమిటెడ్ ఎడిషన్

మారుతి సుజుకి స్విఫ్ట్ టైగర్ లిమిటెడ్ ఎడిషన్

మారుతి సుజుకి స్విఫ్ట్ టైగర్ లిమిటెడ్ ఎడిషన్

ఇండియన్ మార్కెట్లోకి పండుగ సీజన్ కోసం అందుబాటులోకి వచ్చిన స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్ డెకా

మారుతి సుజుకి స్విఫ్ట్ టైగర్ లిమిటెడ్ ఎడిషన్

  • లేటెస్ట్ అప్‌డేట్స్‌తో 2017 మారుతి వ్యాగన్ఆర్
  • ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్
  • ఒక లక్ష మైలు రాయిని దాటిన మారుతి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

Most Read Articles

English summary
Suzuki Launches The Swift Hatchback In A Special Edition Avatar
Story first published: Thursday, October 6, 2016, 10:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X