మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ పై బుకింగ్స్ ప్రారంభం

మారుతి సుజుకి ఎట్టకేలకు తమ శక్తివంతమైన బాలెనో ఆర్ఎస్ ను నెక్సా ప్రీమియమ్ షోరూమ్ అధికారిక వెబ్‌సైట్లోకి చేర్చింది. దీనికి సంభందించిన బుకింగ్స్‌ను అధికారికంగా ప్రారంభించింది.

మారుతి సుజుకి తమ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ బాలెనో విడుదల అనంతరం, దీనికి కొనసాగింపుగా అభివృద్ది చేసిన బాలెనో ఆర్ఎస్ అనేక పరీక్షలను రహస్యంగా పూర్తి చేసుకుని ఎట్టకేలకు నెక్సా వేదికను తాకింది. మారుతి సుజుకి ప్రీమియమ్ విక్రయ కేంద్రాల వేదిక నెక్సా వెబ్‌సైట్లో అధికారికంగా చేర్చింది. శక్తివంతమైన బాలెనో ఆర్ఎస్ ప్రేమికులు ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

మారుతి సుజుకి ఈ శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ బాలెనో ఆర్ఎస్ ను మార్చి 3, 2017 న విపణిలోకి అధికారికంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

మారుతి ఈ బాలెనో ఆర్ఎస్ మీద అధికారికంగా బుకింగ్స్ కూడా ప్రారంభించింది. రేసింగ్ ప్రియులు ఈ కారును ఆన్‌లైన్ వేదికగా రూ. 11,000 ల రుపాయలతో బుక్ చేసుకోవచ్చు.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

సాధారణ బాలెనో మరియు ఆర్ఎస్ వేరియంట్‌కి మధ్య విషయానికి వస్తే, డిజైన్ పరంగా రెండు ఒకేలా ఉంటాయి. అయితే బాలెనో ఆర్ఎస్ వేరియంట్లో శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్ కలదు. మరియు ఇంటీరియర్‌లో మరిన్ని మెరుగైన అధునాతన ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

ఇంజన్ పరంగా చూస్తే, మారుతి సుజుకి ప్రత్యేకంగా అభివృద్ది చేసిన 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న టర్బో ఛార్జ్‌జ్ (బూస్టర్ జెట్ ) పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 100బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

బాలెనో ఆర్ఎస్ ఎక్ట్సీరియర్ విషయానికి వస్తే, క్రోమ్ పూత పూయబడిన ఫ్రంట్ గ్రిల్, ఎల్ఇడి లైట్ల జోడింపు గల ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, నల్లటి రంగులో ఉన్న రియర్ పిల్లర్స్, ముందు మరియు వెనుక వైపున అల్ట్రావైలట్ కట్ గ్లాస్ కలదు.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

బాలెనో ఆర్ఎస్ ఇంటీరియర్ ఫీచర్ల పరంగా ఇందులో, స్పోర్ట్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, న్యావిగేషన్ సిస్టమ్, వాయిస్ కమాండ్, సెంట్రల్ లాకింగ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, ఫాలో మి హెడ్ ల్యాంప్స్, స్మార్ట్ కీ ఆధారిత ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లలతో పాటు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు రానున్నాయి.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

రిట్జ్ కారుకు శాశ్వతంగా వీడ్కోలు పలికిన మారుతి సుజుకి

దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో మారుతి సుజుకి తమ రిట్జ్ అమ్మకాలకు శాశ్వితంగా స్వస్తి పలికింది. ఇక మీదట మారుతి రిట్జ్ కారును షోరూమ్ నుండి కొనుగోలు చేయడం దాదాపుగా అసాధ్యమే.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

ఢిల్లీలో ప్రారంభం కానున్న భారతదేశపు మొట్టమొదటి హెలిపోర్ట్

భారత దేశపు యొక్క మొట్టమొదటి హెలిపోర్ట్ ను దేశ రాజధానికి ఢిల్లీలలో ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 28, 2017 న దీని ప్రారంభ ఉందని సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు...

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

మారుతి సుజుకి లోని నూతన మోడళ్లయిన బాలెనో, వితారా బ్రిజా, ఇగ్నిస్ క్రాసోవర్ కార్ల ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. త్వరలో విడుదల కానున్న బాలెనో ఆర్ఎస్ హ్యాచ్‌బ్యాక్ కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

Most Read Articles

English summary
Maruti Suzuki Baleno RS Featured On Website Bookings Begin
Story first published: Monday, February 27, 2017, 13:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X