2017 టోక్యో వాహన ప్రదర్శనకు 2017 స్విఫ్ట్ రేసర్ ఆర్ఎస్ ఎడిషన్

Written By:

జపాన్ ఆధారిత దిగ్గజ కార్ల తయారీ సంస్థ సుజుకి ఇప్పటికే తమ మార్కెట్లో 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. అంతే కాకుండా కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ నూతన తరం 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను మార్చి 2017 లో జరగనున్న జెనీవా మోటార్ షో వేదిక మీద ప్రదర్శించనుంది.

అయితే దీనికంటే ముందుగా సుజుకి మరో ఆసక్తికరమైన ఉత్పత్తిని 2017 స్విఫ్ట్ ఆధారంతో సిద్దం చేస్తోంది. సుజుకి ఇప్పుడు తమ స్విఫ్ట్ ను రేసర్ ఆర్ఎస్ వర్షన్‌లో సిద్దం చేస్తోంది.

సుజుకి అధికారికంగా దీనిని కాన్సెప్ట్ రూపంలో 2017 టోక్యో మోటార్ షో వేదిక మీద ప్రదర్శించనుంది. నీలం మరియు నియాన్ గ్రీన్ లివరీ రంగుల్లో రేసర్ వెర్షన్ స్పోర్ట్స్ రూపంలో ప్రదర్శించనుంది. దీనిని సుజుకి మోటోజిపి బృందం అభివృద్ది చేసింది.

స్విఫ్ట్ రేసర్ ఆర్ఎస్ కాన్సెప్ట్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, రోల్ కేజ్, రికారో సీట్లు మరియు స్పోర్టివ్ శైలిలో ఉన్న ఇంటీరియర్‌లతో రానుంది.

సుజుకి కార్ల తయారీ సంస్థ ఈ స్విఫ్ట్ రేసర్ ఆర్ఎస్ స్పోర్ట్ వెర్షన్ యొక్క సాంకేతిక వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. అయితే ఇది 1.0-లీటర్ సామర్థ్యం గల బూస్టర్ జెట్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జపాన్ దిగ్గజం సుజుకి నుండి స్విఫ్ట్ రేసర్ ఆర్ఎస్ స్పోర్ట్ కారుతో పాటు మరో ఆశ్చర్యకరమైన ఉత్పత్తి కలదు. అదే ఈ స్పోర్టివ్ అవతారంలో ఉన్న ఇగ్నిస్. ఇగ్నిస్ మోటోక్రాసర్ స్టైల్ అనే పేరుతో అభివృద్ది చేసింది.

స్విఫ్ట్ లోని ఫీచర్లతో మరియు విభిన్న ఎక్ట్సీరియర్ సొబగులతో దీనిని సుజుకి ఆఫ్ రోడ్ మోటార్ సైక్లింగ్ బృందం అభివృద్ది చేసింది.

దేశవ్యాప్తంగా 30 శాతం డ్రైవింగ్‌ లైసెన్స్‌ నకిలీవే అంటున్న నితిన్ గడ్కరీ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంజూరైన మొత్తం డ్రైవింగ్ లైసెన్సుల్లో 30 శాతం వరకు నకిలీవే అని కేంద్ర రహదారులు మరియు రవాణా శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు పేర్కొన్నారు.

ఇక మీదట హైదరాబాద్‌లో కార్లు కొనడం కష్టమే: ఎందుకంటే...?
హైదరాబాద్‌లో కొత్తగా కొనుగోలు చేసిన కార్ల రిజిస్ట్రేషన్ కు పార్కింగ్ స్పేస్ తప్పనిసరి అని చట్టాన్ని తీసుకొచ్చే నిర్ణయంలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలిసింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ కొనాలనుకుంటున్నారా...? అయితే కొద్ది రోజులు వేచి ఉండండి. త్వరలో 2017 స్విప్ట్ మార్కెట్లోకి విడుదల కానుంది. నూతన డిజైన్ శైలిలో విడుదల కానున్న స్విఫ్ట్ ఎలా ఉందో చూడాలంటే ఇక్కడ ఉన్న ఫోటోల మీద క్లిక్ చేయండి....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
2017 Suzuki Racer RS Concept To Be Showcased At 2017 Tokyo Auto Salon
Please Wait while comments are loading...

Latest Photos