2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: పాత ధర, కొత్త ఫీచర్లు: రివ్యూ
మారుతి సుజుకి అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ 'ఎస్ఎక్స్4'లో ఓ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసినదే. ధరలో ఎలాంటి మార్పు లేకుండా, పాత ధరకే తసరికొత్త ఫీచర్లతో కంపెనీ ఈ కారును విడుదల చేసింది. ఇది వరకటి ఎస్ఎక్స్4 సెడాన్‌తో పోల్చుకుంటే.. మరింత మెరుగైన డిజైన్, ఆకర్షనీయమైన లుక్, విలాసవంతమైన ఫీచర్లతో ఈ కొత్త ఎస్ఎక్స్4 సెడాన్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. మరి ఈ కొత్త 2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్‌లోని విశిష్టతలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!
కొత్త ఎస్ఎక్స్4 సెడాన్‌లో ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు. పాత వెర్షన్‌లో ఉపయోగించిన ఇంజన్లనే ఈ కొత్త వెర్షన్‌లోనూ ఉపయోగించారు. అయితే, మునుపటి వెర్షన్ ఇంజన్ల కన్నా కాస్తంత మెరుగైన మైలేజీనిచ్చేలా వీటిని ట్యూన్ చేశారు. పాత వెర్షన్‌తో పోల్చుకుంటే, ఇవి 6 శాతం అధిక మైలేజీనిస్తాయని (పెట్రోల్ - 16.51 కెఎమ్‌పిఎల్, డీజిల్ - 21.79 కెఎమ్‌పిఎల్, సిఎన్‌జి - 22.1 కి.మీ/కేజి) మారుతి సుజుకి పేర్కొంది. ఈ కొత్త కారుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
ఇది వరకటి ఎస్ఎక్స్4 సెడాన్‌తో పోల్చుకుంటే.. మరింత మెరుగైన డిజైన్, ఆకర్షనీయమైన లుక్, విలాసవంతమైన ఫీచర్లతో ఈ కొత్త ఎస్ఎక్స్4 సెడాన్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. మరి ఈ కొత్త 2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్‌లోని విశిష్టతలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్4లో 1586సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 104.7 పిఎస్‌ల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (జెడ్ఎక్స్ఐ వేరియంట్)లతో లభిస్తుంది.

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
డీజిల్ వేరియంట్ ఎస్ఎక్స్4లో 1248సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే లభ్యమవుతుంది.

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
కొత్త క్రోమ్-ఫినిష్ డ్యూయెల్ టోన్ ఫ్రంట్ గ్రిల్, రీ-ప్రొఫైల్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, సరికొత్త హెడ్‌ల్యాంప్స్, డ్యూయెల్ టోన్ ఫాగ్ ల్యాంప్స్, సరికొత్త రియర్ డిజైన్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను గమనించవచ్చు.

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
ఇందులో విశాలమైన క్యాబిన్ స్పేస్, సరికొత్త డ్యాష్‌బోర్డ్, బ్లాక్ అండ్ బీజ్ ఇంటీరియర్స్, కొత్త ఫ్యాబ్రిక్ సీట్స్, క్రోమ్ ఫినిష్డ్ ఏసి వెంట్స్, క్రోమ్ ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్ వంటి ఇంటీరియర్ మార్పులను చేశారు. బ్లూటూత్, నావిగేషన్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఆడియో సిస్టమ్, సింగిల్ స్క్రీన్‌పై మల్టిపుల్ యూసేజ్ ఆప్షన్, జిపిఎస్ కనెక్టివిటీ, టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ రియర్ వ్యూ మిర్రర్స్ వంటి మార్పులు ప్రధానంగా చెప్పుకోదగినవి.

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
కొత్త 2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్ ధరలో ఎలాంటి మార్పులు లేవు. ఈ కొత్త మోడల్ ధరలు ఇలా ఉన్నాయి.
2013 ఎస్ఎక్స్4 విఎక్స్ఐ (పెట్రోల్) - రూ.7,38,115
2013 ఎస్ఎక్స్4 విఎక్స్ఐ (సిఎన్‌జి) - రూ.7,99,974
2013 ఎస్ఎక్స్4 జెడ్ఎక్స్ఐ (పెట్రోల్) - రూ.8,24,765
2013 ఎస్ఎక్స్4 విడిఐ (డీజిల్) - రూ.8,27,458
2013 ఎస్ఎక్స్4 జెడ్‌డిఐ (డీజిల్) - రూ.9,21,669

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
విశాలమైన ఇంటీరియర్ స్పేస్

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
డ్యూయెల్ కలర్ డ్యాష్‌బోర్డ్, స్టోరేజ్ స్పేస్

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
కొత్త ఫ్యాబ్రిక్ సీట్స్

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
ఆల్ పవర్ విండోస్

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
క్రోమ్ ఫినిష్డ్ ఏసి వెంట్స్

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
క్రోమ్ ఫినిష్డ్ ఇన్‌సైడ్ డోర్ హ్యాండిల్స్

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
బ్లూటూత్, నావిగేషన్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఆడియో సిస్టమ్

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
యూఎస్‌బి చార్జింగ్ యూనిట్

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
సింగిల్ స్క్రీన్‌పై మల్టిపుల్ యూసేజ్ ఆప్షన్, జిపిఎస్ కనెక్టివిటీ

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
టిల్ట్ అడ్జస్టబల్ పవర్ స్టీరింగ్

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌బోర్డ్

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ
టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రిక్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4: రివ్యూ



Click it and Unblock the Notifications








