2023 Mercedes GLC Benz మెర్సిడెస్‌ బెంజ్ GLC డిజైన్, ఫీచర్స్, పెర్ఫార్మెన్స్ ఫుల్ రివ్యూ

అంతర్జాతీయ మార్కెట్‌లో మెర్సిడెస్‌ బెంజ్‌ కారు గురించి తెలియని వారుండరు. లగ్జరీ కార్ల జాబితాలో మెర్సిడెస్‌ బెంజ్‌ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. అయితే ఇటీవల కర్ణాటకలోని చారిత్రక కట్టడం హంపికి వెళ్లినప్పుడు యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ను సందర్శిస్తుండగా.. అక్కడ 2023 మెర్సిడెస్‌ GLC మా డ్రైవ్స్‌పార్క్‌ టీం కంట పడింది. ఒక్కసారిగా మెర్సిడెస్‌ బెంజ్‌ లగ్జరీ విశేషాల్లోకి మా ఆలోచనలు వెళ్లిపోయాయి.

మెర్సిడెస్‌ బెంజ్‌ రెండవ తరం GLC బాడీషెల్‌.. దాని మునుపటి తరం నుంచి వేరు చేసేలా పలు మార్పులు చేశారు. ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దడంలో మెర్సిడెస్‌ విజయం సాధించిందనే చెప్పవచ్చు. ఇక మెర్సిడెస్‌ GLC రెండవ తరం బెంజ్‌ డిజైన్‌, ఫీచర్లు, పర్ఫామెన్స్‌ ఈ రివ్యూ ద్వారా మీకు అందిస్తున్నాం.

2023-Mercedes-GLC

డిజైన్‌: మెర్సిడెస్‌ బెంజ్‌ GLC డిజైన్‌ను పరిశీలిస్తే ఇది దాని మధ్యలో భారీ మెర్సిడెస్‌ త్రీ పాయింటెడ్‌ స్టార్‌ బ్యాడ్జ్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా చివర అంచుల వరకూ క్రోమ్‌ బార్‌లతో పెద్ద గ్రిల్‌ను కలిగి ఉంది. గ్రిల్‌కు చుట్టుపక్కల రీషేప్‌ చేయబడిన హెడ్‌లైట్‌లు, కొత్త DRL సిగ్నేచర్‌తో ఆకర్షణీయంగా ఉంది. ఫ్రంట్‌ బంపర్‌ దిగువ భాగం స్పోర్ట్స్‌ ఎయిర్‌ ఇన్‌టేక్‌లు రెండు వైపులా ఉన్నాయి.

కొత్త 2023 మెర్సిడెస్‌ GLC సైడ్స్‌లో మాత్రం ఏ మార్పు చేయలేదు. క్రోడ్‌ విండోతో పాటు 19 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉన్నాయి. అయితే వాటిని మనం అలాగే చూస్తున్నట్లయితే డాక్టర్‌ స్ట్రేంజ్‌ కాలిడోస్కోపిక్‌ మిర్రర్‌ డైమెన్షన్‌ ద్వారా స్పిన్‌ అవుతున్న ఫీలింగ్‌ అనిపిస్తుంది. ఇక కొత్త GLC వెనుక భాగం GLE మరియు కొత్త C క్లాస్‌ మిక్స్‌ అయి ఉంది.

2023-Mercedes-GLC

పవర్డ్‌ టెయిల్‌గేట్‌తో సహా కొత్త GLC వెనుక పార్టులు మొత్తం పెద్ద GLE ని పోలి ఉంటుంది. 3D LED టెయిల్‌లైట్‌లను GLC లో అందించడంతో దానికి ప్రీమియం లుక్‌ను జోడించింది. రూఫ్‌ మౌంటెడ్‌ స్పాయిలర్‌ మూడవ బ్రేక్‌ లైట్‌ను కలిగి ఉండటంతో GLC కి ప్రత్యేక రూపాన్ని జోడించింది. ఇతర హైలైట్‌లను చూసుకుంటే టైల్‌లైట్‌లను కనెక్ట్‌ చేసే బ్లాక్ ట్రిమ్‌ మరియు ఎగ్జాస్ట్‌ల చుట్టూ క్రోమ్‌ అండర్‌ గార్డ్‌ ఉన్నాయి.

ఇంటీరియర్‌: ఇక కొత్త 2023 GLC క్యాబిన్‌లోకి అడుగు పెట్టినట్లయితే మరో లోకంలోకి వెళ్తామనడంలో ఆశ్చర్యం లేదు. విలాసవంతమైన సౌకర్యాలతో ప్రయాణికులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. క్యాబిన్‌ మునుపటి తరం మాదిరిగా కాకుండా కొత్త C క్లాస్‌ను పోలి ఉంటుంది. ఒక్కసారి ఆ సీట్లలో కూర్చున్నట్లయితే మీరు మైమరిచిపోవడం ఖాయం. విశాలమైన సన్‌రూఫ్‌తో పాటు అందులో ఉపయోగించిన మెటీరియల్‌ మీకు మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది.

2023-Mercedes-GLC

ఫీచర్లు: ఇక ఫీచర్లను చూసుకుంటే డ్యుయల్‌ డిస్‌ప్లే సెటప్‌తో కూడిన స్ట్రీ టూ లేయర్‌ డ్యాష్‌బోర్డ్‌ మిమ్మల్ని ఇట్టే ఆకర్షిస్తుంది. C క్లాస్‌లో వలె 11.9 అంగుళాల పోర్ట్రెయిట్‌ ఓరియంటెడ్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ కొద్దిగా డ్రైవర్‌ వైపు మళ్లి ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటుంది. మ్యూజిక్‌ నుంచి ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌, హీటెడ్‌ సీట్ల వరకు ప్రతి అంశాన్ని కంట్రోల్‌ చేస్తుంది.

2023-Mercedes-GLC

ఇంకా ఇది యాపిల్‌ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్‌ ఆటోకి మద్దతు ఇస్తుంది. ఇంకా మీరు 15 స్పీకర్‌, 710 వాట్‌ బర్మీస్టర్‌ సౌండ్ సిస్టమ్‌ ద్వారా మ్యూజిక్‌ను ఆన్‌ చేసినప్పుడు మీరు డ్రైవ్‌ను మరింతగా ఆస్వాదిస్తారు. ఇక ఆటోమెటిక్‌ టెయిల్‌గేట్‌ను తెరిచినట్లయితే కొత్త 2023 మెర్సిడెస్‌ GLC లో 620 లీటర్‌ బూట్‌ స్పేస్‌తో విశాలంగా ఉంటుంది. ఇది మీరు లాంగ్‌ డ్రైవ్‌, ట్రిప్‌లకు వెళ్లినప్పడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

2023-Mercedes-GLC

ఇంకా కొత్త మెర్సిడేస్‌ GLC SUV లో అనేక భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో సేఫ్టీ గేర్‌లో ఏడు ఎయిర్‌ బ్యాగ్‌లు, యాక్టివ్‌ పార్కింగ్‌ అసిస్ట్‌, 360 డిగ్రీ కెమెరా, కారు టు ఎక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంకా అనేక అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. SUV అటెన్షన్‌ అసిస్ట్‌, యాక్టివ్‌ బ్రేక్‌ అసిస్ట్‌. బ్లైండ్‌ స్పాట్‌ అసిస్ట్‌, యాక్టివ్‌ బ్రేక్‌ అసిస్ట్‌ ఇంకా యాక్టివ్‌ లేన్‌ కీపింగ్‌ అసిస్ట్‌ వంటి కొన్ని ADAS ఫీచర్లను కలిగి ఉంది.

ఇంజిన్: 2023 మెర్సిడెస్ GLC రెండు టర్బోచార్జ్డ్ ఇంజన్ ఎంపికలతో (పెట్రోల్ మరియు డీజిల్) తో భారత్‌లోకి మెర్సెడెస్‌ సంస్థ తీసుకువస్తుంది. రెండూ 2.0-లీటర్ల డిస్‌ప్లేస్ మరియు మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్, 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానుంది. దీంతోపాటు పవర్‌ఫుల్‌ ఫోర్-వీల్-డ్రైవ్‌తో వస్తాయి.

2023-Mercedes-GLC

GLC 220d 4Matic 1,993cc టర్బోచార్జ్డ్ ఫోర్-పాట్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 194.4bhp మరియు 440Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జెనరేటర్ (ISG) 23bhp మరియు 200Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. 0-100km/h వేగాన్ని చేరుకోవడానికి GLC 220d 4Matic కి 8 సెకన్ల సమయంలో పడుతుంది. ఇది 19.47km/l మైలేజీని అందిస్తుంది.

మరో 1,999cc ఇంజన్ ఆప్షన్‌ కలిగిన GLC 300 4matic టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 255bhp మరియు 400Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.ISG సహాయంతో, GLC 300 4మ్యాటిక్ 0-100కిమీ/గం నుండి 6.2 సెకన్లలో అందుకుంటుంది. ఇది 14.72 కిలో మీటర్ల మైలేజీని అందిస్తుంది.

2023-Mercedes-GLC

రెండవ తరం మెర్సిడెస్ GLC 4,716mm పొడవు, 1,890mm వెడల్పు మరియు 1,640mm ఎత్తు కలిగి ఉంటుంది. మెర్సిడెస్ GLC యొక్క వీల్‌బేస్ 2,888mm పొడవు ఉంది. కొత్త Mercedes GLC దాని ముందున్న దాని కంటే 60mm పొడవు మరియు 15mm పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది.

డ్రైవింగ్‌ ఇంప్రెషన్స్: 2023 మెర్సిడెస్ GLCలో డ్రైవ్‌ చేస్తున్న ఫీల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో ఈ కారు డ్రైవ్‌లో మంచి అనుభూతిని పొందవచ్చు. కొత్త GLC ఎత్తు పల్లాలు ఉన్న రోడ్లపై కూడా ఎలాంటి అసౌకర్యానికి మీరు లోనవ్వరు. ఇది మంచి లగ్జారియస్‌ ఫీల్‌గా ఉంటుందని అభివర్ణించవచ్చు.

2023-Mercedes-GLC

హైవేలో, మీరు అధిక వేగంతో వెళుతున్నప్పుడు ఓవర్ బూస్ట్ ఫంక్షన్ సుమారు 30 సెకన్ల పాటు సహాయం చేస్తుంది, ట్రిపుల్ డిజిట్‌లకు ప్రయాణాన్ని మరింత సులభం చేస్తుంది. పెడల్‌ను మొత్తం నొక్కి పెట్టినప్పుడు ఆటోమేటిక్ బాక్స్ షేక్‌ అవ్వడాన్ని మేము గమనించాము.

బ్రేక్ పెడల్ కొంచెం అస్పష్టంగా ఉంటుంది మరియు స్టీరింగ్ వీల్ కూడా అంత గొప్పగా అనిపించదు. అయితే దీని ప్రయాణంలో అన్నింటికీ ముఖ్యంగా భావించే GLC మెర్క్ యొక్క 4మ్యాటిక్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను పొందుతుంది. ఈ ఫీచర్‌ అద్భుతంగా ఉంటుంది. ట్రాన్స్‌పరెంట్‌ బానెట్‌ ఫీచర్‌ని ఇందులో గమనించవచ్చు.

2023-Mercedes-GLC

ఈ లగ్జరీ కారుపై మా అభిప్రాయం: ఈ లగ్జరీ మెర్సిడెస్ GLC సాధారణంగా కనిపించే స్పోర్టిలుక్‌ కంటె కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. దీని ముందు భాగంలోని ఐకానిక్ త్రీ-పాయింటెడ్ స్టార్ లోగో కారు రాజసంగా కనిపిస్తుంది. దీనిలోని అద్భుతమైన లగ్జరీ ఫీచర్లతో జర్నీని ఎంజాయ్‌ చేస్తూ మీ గమ్యస్థానానికి తీసుకువెళుతుంది.

GLC లగ్జరీ కారు క్యాబిన్‌ విశాలంగా ఉంటుంది. దీనిలో ప్రయాణిస్తున్నప్పుడు బయటి ప్రపంచం నుంచి మైమరిచిపోయినట్లు అనిపిస్తుంది. ఈ లగ్జరీ కారు ఆకర్షణీయమైన డిజైన్, సాంకేతికత మరియు విలాసవంతమైన క్యాబిన్‌ ఫీచర్లతో వస్తుంది. ఏదైనా లాంగ్‌డ్రైవ్‌ మరియు అడ్వెంచర్‌లో పాల్గొనేందుకు ఇది ఉత్తమ ఆప్షన్‌గా ఉంటుంది. మొత్తానికి గ్లామరస్ మరియు లగ్జరీ ఫీల్‌ అనుభూతిని పొందుతారు.

Article Published On: Tuesday, August 8, 2023, 11:30 [IST]
English summary
2023 mercedes glc benz design features and performance full review in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+