2023 Tata Safari Full Review 2023 టాటా సఫారీ డిజైన్‌, ఫీచర్లు, పర్ఫామెన్స్‌ ఫుల్‌ రివ్యూ

స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ నుంచి 2021 లో విడుదలైన Tata Safari SUV కస్టమర్లకు ఫేవరెట్‌ కారుగా మారింది. బోల్డ్‌ లుక్, ప్రీమియం క్యాబిన్‌, సౌకర్యవంతమైన ప్రయాణంతో మార్కెట్లో సక్సెస్‌ సాధించింది. అయితే ఇప్పుడు మరిన్ని మార్పులతో టాటా సఫారీ ఎస్‌యూవీ అప్‌డేట్‌ అయింది.

కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త టాటా సఫారీలో అధునాతన మార్పులు చేసింది. ఈ క్రమంలో కొత్త టాటా సఫారీని పూణెలో టెస్ట్‌ డ్రైవ్‌ చేసేందుకు మా డ్రైవ్‌స్పార్క్‌ టీమ్‌కు ఆహ్వానం లభించింది. మరి టాటా సఫారీ డ్రైవింగ్‌లో మేము ఏం గమనించాం. డిజైన్‌, ఫీచర్లు, ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేసింది.?? పూర్తి రివ్యూ(Tata Safari 2020 Review)ను ఈ కథనంలో మీకు అందిస్తున్నాం.

2023-Tata-Safari

కొత్త టాటా హారియర్‌ మాదిరిగానే 2023 టాటా సఫారీలో కూడా టాటా మోటార్స్‌ పలు మార్పులు చేసింది. డిజైన్‌ విషయానికి వస్తే ఎక్స్‌టీరియర్‌ మిడ్‌- సైకిల్‌ ఫేస్‌లిఫ్ట్‌ మాదిరిగా మార్పులు చేశారు. అప్‌డేటెడ్‌ కొత్త పారామెట్రిక్‌ గ్రిల్‌తో పాటు ఎగువ భాగంలో స్పోర్ట్స్‌ బాడ్‌- కలర్‌ ఇన్వర్టులు, టాటా బ్యాడ్జ్‌, దిగువ భాగంలో రాడార్‌ సెన్సార్‌తో పాటు బ్లాక్‌ ఇన్‌స్టర్‌లు, ముందు భాగంలో సిల్వర్‌ బాష్‌ ప్లేట్‌పైన ఎయిర్‌ ఇన్‌టేక్‌ ఉన్నాయి.

గ్రిల్‌కు పై భాగంలో పూర్తి-వెడల్పుగా LED DRL రన్‌ అవుతుంది. డ్యూయల్‌-LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ఫాగ్ లైట్లు, ఫ్రంట్ బంపర్ అంచులలో వాటి స్వంత ఎన్‌క్లోజర్‌లలో ఉంటాయి. కొత్త 2023 టాటా సఫారీ యొక్క సైడ్‌లు ఫ్లేర్డ్ వీలర్‌చ్‌లు మరియు బ్లాక్-అవుట్ A, B & C పిల్లర్లు మరియు రూఫ్‌తో చాలా వరకు పాత వెర్షన్ మాదిరిగానే ఉంటాయి.

2023-Tata-Safari

బ్లాక్ క్లాడింగ్‌ని కలిగి ఉన్న వీలర్‌లు కొత్త డ్యూయల్-టోన్ స్పైడర్ అల్లాయ్ వీల్స్‌తో వస్తాయి. ఇవి వేరియంట్‌ను బట్టి.. అల్లాయ్‌ వీల్స్‌ 17 నుంచి 19 అంగుళాల పరిమాణంలో ఉంటాయి. ఇక టాటా సఫారీ వెనుక భాగానికి వస్తే.. బ్రేట్‌లైట్‌తో రూఫ్‌ మౌంటెడ్‌ స్పాయిలర్‌ను కలిగి ఉంది. రియర్‌ టెయిల్‌లైట్‌లు పూర్తిగా కనెక్ట్ చేయబడిన LED యూనిట్‌లను కలిగి ఉంటాయి.

టాటా సఫారీ వెనుక ఫాగ్‌ల్యాంప్‌లు మరియు రిఫ్లెక్టర్‌లు వెనుక బంపర్ అంచులలో వాటికోసం కేటాయించిన పాడ్‌లలో అమర్చారు. ఇంకా సిల్వర్ రియర్ బాష్‌ప్లేట్ కూడా కనిపిస్తుంది. ఇది పవర్డ్ రియర్ టెయిల్‌గేట్ కోసం సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. టెయిల్‌ గేట్‌తో పాటు కారు డోర్లపై కూడా సఫారీ బ్యాడ్జ్‌ను చూడవచ్చు.

2023-Tata-Safari

కొత్త 2023 టాటా సఫారీ ఇంటీరియర్‌ విషయానికొస్తే.. అధునాతమైన టెక్నాలజీతో పాటు క్యాబిన్‌ను అత్యంత విశాలంగా తీర్చిదిద్దారు. ఇంటీరియర్‌లో భారీ అప్‌డేట్‌లు చేశారు. ముఖ్యంగా డ్యాష్‌బోర్డ్‌ అప్‌డేటెడ్‌ యాంబియంట్‌ లైటింగ్‌ను కలిగి ఉంది. ఇంకా వెంటిలేషన్ కోసం భారీ పనోరమిక్‌ సన్‌రూఫ్‌ను ఏర్పాటు చేశారు.

కొత్త టాటా సఫారీలో పెద్ద 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేతో పాటు 360-డిగ్రీ కెమెరా సదుపాయం ఉంది. ఇది కొత్త డ్యాష్‌బోర్డ్ వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి సపోర్ట్‌గా ఉంటుంది. దీంతో సెకండ్‌ జెన్‌ iRA కనెక్ట్ చేయబడిన కార్ సూట్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు.

2023-Tata-Safari

డ్యాష్‌బోర్డ్‌లో పెద్ద 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను ఆకర్షణీయంగా రూపొందించారు. నావిగేషన్‌తో సహా ప్రయాణంలో మీకు కావాల్సిన మొత్తం సమాచారాన్ని దీని ద్వారా పొందవచ్చు. ఇంకా కొత్త డ్యూయల్‌ టోన్‌ ఫోర్‌ స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌ను కలిగి ఉంది. ఇంకా దీనిపై కెపాసిటివ్‌ బటన్‌లు, సాధారణ స్విచ్‌గేర్‌తో పాటు వీల్‌ మధ్యలో ప్రకాశవంతమైన టాటా లోగో ఉంది.

కొత్త టాటా సఫారీలో పవర్డ్ ఫ్రంట్ సీట్లు మెయిన్‌ ఫీచర్‌. డ్రైవర్‌ సీట్‌తో పాటు ఫ్రంట్‌ సీట్‌ వెల్‌కమ్‌, మెమరీ ఫంక్షనాలిటీని కలిగి ఉంది. ఫ్రంట్‌ సీట్లకు రెండు వైపులా దానికి సంబంధించి కంట్రోలింగ్‌ బటన్‌ ఉంటుంది. ఫ్రంట్‌, రెండవ వరుస సీట్లు వెంటిలేటెడ్‌ సీట్లగా రూపొందించారు. వేసవి కాలంలో ఉక్కపోత సమయంలో ఈ వెంటిలేటెడ్‌ సీట్లు ఆన్‌ అవుతాయి.

2023-Tata-Safari

ఫ్రంట్‌ సీట్ల నుంచి కూడా రెండవ, మూడవ వరుస సీట్లను యాక్సెస్‌ చేయవచ్చు. కొత్త టాటా సఫారీలో రెండవ వరుస సీట్లు కూడా సౌకర్యవంతమైన హెడ్‌రెస్ట్‌లను అందిస్తాయి. ఇక మూడవ వరుస సీట్లను సులభంగా యాక్సెస్‌ చేయలేరు. ఇది పెద్దలు మరియు పిల్లలకు సరిగ్గా సరిపోతుంది. సీట్లు ఓస్టెర్ వైట్ లెథెరెట్ అప్హోల్స్టరీలో కవర్ అయి ఉంటాయి.

2023 టాటా సఫారీ దాని ఓల్డ్‌ వెర్షన్‌లో మాదిరి మెకానికల్ బిట్‌లను కలిగి ఉంది. బానెట్ కింద, మీరు ఇప్పటికీ స్టెల్లాంటిస్-సోర్స్డ్ 2.0-లీటర్ క్రియోటెక్, టర్బోచార్జ్డ్ ఇన్‌లైన్, ఫోర్-పాట్ డీజిల్‌ను చూడవచ్చు. డీజిల్ ఇంజిన్ 3,750 rpm వద్ద 168bhp, 1,750 మరియు 2,500rpm మధ్య 350 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

2023-Tata-Safari

ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా హ్యుందాయ్ నుంచి తీసుకున్న 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత చేశారు. డ్రైవ్‌ చేస్తున్నప్పుడు ఇంజిన్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కాంబో బాగా పని చేసింది. ఇందులో మూడు డ్రైవింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. ఎకో, సిటీ, స్పోర్ట్ మోడ్‌ ఆప్షన్లు. వీటి ఆధారంగా, డ్రైవ్‌ట్రెయిన్ పవర్ డెలివరీ, గేర్ షిఫ్ట్‌లను మారుస్తుంది.

కొత్త టాటా సఫారీలో స్టీరింగ్ షార్ప్‌గా ఉంటుంది. ఇంకా ఇది మీరు సెలెక్ట్‌ చేసుకున్న డ్రైవింగ్‌ మోడ్‌పై ఆధారపడి ఉంటుంది. హై స్పీడ్‌తో వెళ్తున్నప్పుడు స్టీరింగ్ కొంచెం షార్ప్‌గా అనిపిస్తుంది. ఆల్-వీల్ డిస్క్ బ్రేక్ సెటప్‌ను అన్ని మోడళ్లలో అందించారు. ఇక సస్పెన్షన్ సెటప్ సాఫ్ట్‌గా ఉండటంతో గుంతలు, రాళ్లున్న రోడ్లపై సైతం సులభంగా డ్రైవ్‌ చేయవచ్చు.

2023-Tata-Safari

కొత్త టాటా సఫారీ 200mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. ఇక బూట్‌ స్పేస్ విషయానికొస్తే మూడు వరుస సీట్ల కారణంగా బూట్‌ స్పేస్‌ తక్కువగా అనిపిస్తుంది. లగేజీ ఎక్కువగా ఉన్నట్లయితే మూడవ వరుస సీట్లను ఫోల్ట్‌ చేయడం ద్వారా మరింత ఖాళీ స్థలాన్ని పొందవచ్చు.

చివరిగా టాటా సఫారి 2021లో విడుదలైనప్పుడు, ఇది దాదాపుగా హారియర్‌ మాదిరిని పోలి ఉంది. ఇప్పుడు కొత్త టాటా సఫారీ డిజైన్‌లో చాలా మార్పులు చేయడంతో మునుపటి కంటే మరింత గంభీరంగా కనిపిస్తోంది. క్యాబిన్‌లోని అధునాతన టెక్నాలజీని, మార్పులను పరిశీలిస్తే.. కొత్త టాటా సఫారీ దానికదే ఫ్లాగ్‌షిప్‌గా కనిపిస్తుంది. దాని విశేషమైన ఫీచర్లతో అన్ని రకాలుగా అనుకూలంగా టాటా సఫారీని పొందవచ్చు.

2023-Tata-Safari

More from DriveSpark

Article Published On: Sunday, October 15, 2023, 16:00 [IST]
English summary
2023 tata safari suv design features and engine performance full review
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+