2024 Hyundai Creta Facelift Review హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు, ఇంజిన్ పర్మామెన్స్ పుల్ రివ్యూ
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా 2015లో కియా క్రెటాను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఈ సెగ్మెంట్‌లో అయితే కొద్ది కాలంలో కియా తన ఉత్పత్తుల ద్వారా మంచి ఆదరణ సంపాదించుకుంది. అనంతరం 5 సంవత్సరాల తర్వాత హ్యుందాయ్ తన రెండో తరం క్రెటాను విడుదల చేసింది. అందరి నుంచి ప్రశంసలు అందుకుంది.
అయితే కొన్ని మార్పులతో అంతర్జాతీయ మార్కెట్‌లో iX53 మోడల్‌తో విక్రయించినా.. భారత్ మార్కెట్‌లో అప్‌డేట్ చేయబడిన SUV కోసం చాలా కాలంపాటు వేచిచూడాల్సి వచ్చింది. అయితే తాజాగా హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. ఈ కారు రివ్యూ కోసం మా డ్రైవ్‌స్పార్క్ బృందాన్ని జోద్‌పూర్‌కు ఆహ్వానించినప్పుడు ఎంతో ఆనందించాం.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ రివ్యూ : డిజైన్, ఫీచర్లలో మార్పులు
2020 సంవత్సరంలో అందుబాటులోకి వచ్చిన క్రెటా డిజైన్‌లో కొన్ని అన్‌హింగ్డ్ కర్వ్‌లు, స్లాష్‌లు కొంత గందరగోళానికి గురిచేశాయి. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన క్రెటా 2024 వెర్షన్ అన్ని కోణాల్లోనూ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
అయితే హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మోడల్ ముందువైపు నుంచే చూస్తే చాలా మార్పులను స్పష్టంగా గమనించవచ్చు. అమెరికా ప్రస్తుతం విక్రయంలో ఉన్న పాలిసేడ్ ఎస్‌యూవీ నుంచి ప్రేరణ పొంది, ఈ క్రెటా 2024 స్క్వేర్డ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంది.

దీర్ఘచతురస్రాకారం (rectangular grille) లో ఉండే గ్రిల్ ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్‌ను కలిగి ఉంది. డై టైమ్ రన్నింగ్ లైట్లతో వస్తుంది. ప్రతి వైపు L-ఆకారంలో ఉంటుంది. హెడ్‌లైట్లు ముందు బంపర్ పైన ఇరువైపులా ఉంటాయి. ఫ్రంట్ బంపర్ ముందు భాగం ఫాక్స్ గ్రే బాష్ ప్లేట్‌తో సహా క్లాడింగ్‌ను కలిగి ఉంటుంది. అయితే సైడ్‌లో ఎక్కువ మార్పులు చోటుచేసుకోలేదు. గతం కంటే మెరుగ్గా కనిపించింది.
క్రెటా ఫేస్‌లిఫ్ట్ SUV మరింత మెరుగైన లుక్‌ను కలిగి ఉంది. పాత మోడల్ కంటే ఆకర్షణీయంగా ఉంది. మరియు చతురస్రాకార డిజైన్‌తో వచ్చింది. వెనుకవైపున కూడా కనెక్టెడ్ టెయిల్‌లైట్‌లు ముందువైపున ఉన్నట్లుగానే LED DRL సెటప్‌ను కలిగి ఉంటాయి. ముందు భాగం కంటే ఎక్కువ క్లాడింగ్‌ను కలిగి ఉంటాయి.

హ్యుందాయ్ క్రెటా వెనుకవైపు ఉన్న నంబర్ ప్లేట్‌కు ఇరువైపులా క్రెటా, వేరియంట్ బ్యాడ్జ్‌లు అమరి ఉన్నాయి. మరియు రిజిస్ట్రేషన్ ప్లేట్‌కు పైన హ్యుందాయ్ బ్యాడ్జ్ ఉంటుంది. వెనుక బంపర్ మధ్యన రివర్సింగ్ లైట్ అమర్చబడింది. అయితే కెటా 2024 వెర్షన్ ఇంటీరియర్‌లో అనేక మార్పులను గమనించవచ్చు.
డ్యాష్‌బోర్డ్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేలు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే అన్ని కనెక్టివిటీ కంట్రోల్‌లను కలిగి ఉంటుంది. బోస్ ప్రీమియం ఆడియో సెటప్‌తో వస్తుంది. అయితే భారతీయ భాషల్లో ఉన్న కమాండ్‌లు సరిగ్గా పనిచేయలేదు. డ్యూయల్ జోన్ AC వెంట్‌లు కలిగి ఉంది. ఫిజికల్ డయల్ మరియు బటన్ల ద్వారా కూడా నియంత్రించవచ్చు.

డ్యూయల్ టోన్ థీమ్ క్యాబిన్, మరియు పెద్ద సన్‌రూఫ్ ఆకర్షణీయంగా ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా కొన్ని ప్రాంతాల్లో సాఫ్ట్ టచ్ మెటీరియల్‌ను ఉపయోగించింది. ఇది ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. దీంతోపాటు యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
హ్యుందాయ్ క్రెటా మెరుగైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. 6 ఎయిర్‌బ్యా్గ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX చైల్డ్ మౌంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లను అన్ని వేరియంట్లలోనే కలిగి ఉంది.

క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ SX, SX(O) వేరియంట్లు 19 డ్రైవర్ ఎయిడ్‌లను అందించే లెవల్ 2 ADASను కలిగి ఉంటుంది. ఇందులో ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిజన్ వార్నింగ్, లేన్ కీపింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు లేన్ డిపార్చర్ వార్నింగ్, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్, స్మార్ట్ అండ్ గో తో కూడిన స్మార్ట్ క్రూయిజర్ కంట్రోల్‌ను కలిగి ఉంది.
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ పనితీరు:
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో 1.5 లీటర్ టర్బోఛార్జడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ ఇంజిన్ 5500 rpm వద్ద 158bhp శక్తి, 1500 నుంచి 3500 rpm వద్ద 252Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఈ ఇంజిన్ 18.4 కి.మీ మైలేజీ ఇస్తుంది.

దీంతోపాటు కొత్త హ్యుందాయ్ క్రెటా 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఇంజిన్ 113bhp శక్తి, 144Nm టార్క్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్ తో జతచేయబడుతుంది.
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ డ్రైవింగ్ అనుభూతి:
జోద్‌పూర్‌లో హ్యుందాయ్ క్రెటా 2024 వెర్షన్ టర్బో డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్‌ను డ్రైవ్ చేశాం. ఈ ఇంజిన్ చాలా మృదువైన అనుభూతిని ఇస్తుంది. అతివేగంగా డ్రైవింగ్ చేసిన సమయంలోనూ ఎటువంటి వైబ్రేషన్‌లు గుర్తించలేదు. మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు. గత మోడల్ కంటే క్రెటా సస్పెన్షన్ సెటప్‌లో కొద్దిపాటి మార్పులు చేసింది.

స్టీరింగ్ వీల్ కూడా మెరుగ్గా ఉంటుంది. అధిక వేగంలోనూ విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. ఇంజిన్ బ్రేకింగ్ కొంత నెమ్మదించినా.. డిస్క్ బ్రేకులు మెరుగైన పనితీరును కనబరుస్తాయి. లెవల్ 2 ADAS సెటప్ అద్భుతంగా పనిచేస్తుంది. జోద్‌పూర్‌లో ప్రయాణించినప్పుడు అనేక హెచ్చరికలు జారీచేసింది.
హ్యాందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ 2024 రివ్యూ :
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కొత్త ఇంజిన్, కొత్త ఫ్రంట్ మరియు రియర్ డిజైన్లు, మరియు అప్‌డేట్ చేయబడిన క్యాబిన్ ను కలిగి ఉంది. ఇవన్ని కూడా కొత్త క్రెటా వాహనం వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది. ఈ SUV ప్రారంభ ధర రూ.11 లక్షల (ఎక్స్‌షోరూం) గా ఉంది.


Click it and Unblock the Notifications








