2024 Mercedes EQS SUV Full Review: 809 కి.మీ భారీ రేంజ్ అందించే ఈ లగ్జరీ కారుని కొనుగోలు చేయవచ్చా, లేదా?
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల విప్లవం కొనసాగుతోంది. అందులోనూ లగ్జరీ కార్ల సంస్థలు కూడా ఎలక్ట్రిక్ ఉత్పత్తలను ప్రవేశపెడుతన్నాయి. ఇందులో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ కూడా ఉంది. ఇది EQAని ప్రారంభించిన రెండు నెలల లోపే, మెర్సిడెస్ EQS SUV లాంచ్‌తో భారతదేశంలో తన EV పోర్ట్‌ఫోలియోను మరోసారి అప్‌డేట్ చేసింది. ఈ మేబాక్ వెర్షన్ ఎలక్ట్రిక్ లగ్జరీ SUVలు అన్నింటికన్నా ఉత్తమమైనదిగా ఉంది. ఈ మెర్సిడెస్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUVని మేము టెస్ట్‌డ్రైవ్ చేశాము. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన పూర్తి రివ్యూ మీకోసం..
డిజైన్: మెర్సిడెస్ మొట్టమొదటిసారిగా EQS (సెడాన్)ను భారత మార్కెట్‌కు తీసుకువచ్చినప్పుడు, దాని ICE-ఆధారిత మోడళ్ల మాదిరిగా కాకుండా ఢిఫరెంట్‌గా ఉంటుందని భావించాము.అయితే ఈ EQS SUV అదే ఏరోడైనమిక్ ఆకారంతో వాటి మునుపటి మోడళ్ల వలె కనిపించింది. దీని Mercedes త్రీ-పాయింటెడ్ స్టార్స్ EQS సెడాన్ కంటే కాస్త పెద్దదిగా ఉంటుంది.

దీని ఫాక్స్ గ్రిల్‌కి ఇరువైపులా మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్స్, గ్రిల్‌పై LED లైట్‌బార్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీని సైడ్ ప్రొఫైల్‌లో 10-స్పోక్ లైట్ వెయిట్ AMG అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇల్యుమినేటెడ్ రన్నింగ్ బోర్డ్స్ బ్రష్ చేసిన అల్యూమినియం సరౌండ్‌లతో (క్రోమ్ కాదు) సైడ్ డిజైన్‌తో వస్తుంది. ఇక వెనక భాగంలో కనెక్ట్ చేయబడిన LED టైల్‌లైట్స్ ఉన్నాయి.
ఇంటీరియర్: కొత్త 2024 మెర్సిడెస్ EQS SUV లోపలికి అడుగు పెట్టగానే లగ్జరీయస్ అనుభూతిని అందిస్తుంది. క్యాబిన్ డాష్‌బోర్డ్ ఒక ఎండ్ నుంచి మరొక ఎండ్ వరకు MBUX హైపర్‌స్క్రీన్‌తో ఆధిపత్యం చెలాయిస్తుంది.ఈ భారీ 56-అంగుళాల హైపర్‌స్క్రీన్, మూడు డిస్‌ప్లేల కలయికతో ఉంటుంది. 12.3-ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 17.7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల ఫ్రంట్ ప్యాసింజర్ స్క్రీన్ ఉంటాయి.

కారు లోపలి భాగంలో దాదాపు ప్రతి అంశం మీకు ఎంటర్‌టైన్ చేయడానికి సహకరిస్తుంది. ఈ భారీ హైపర్‌స్క్రీన్ సెటప్ 15-స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడింది. ఇది EQS SUV క్యాబిన్ లోపల ట్యూన్‌లను భారీ శబ్దంతో సాంగ్స్, మ్యూజిక్‌ని వినవచ్చు. ముందు సీట్లు మల్టీ సెట్టింగ్స్, అడ్జస్ట్‌మెంట్స్‌తో వస్తాయి. హాట్-స్టోన్ మసాజ్ ఫంక్షన్స్ ముందు ఉన్నవారికి ఒత్తిడి లేకుండా చేస్తుంది.
ఈ EQSలో వెనుక ప్రయాణీకుల ప్రయాణ సాఫీగా సాగుతుంది. వీరి కోసం కోసం 11.6-అంగుళాల డిస్‌ప్లేలు ఉన్నాయి. మూడవ వరుస సీట్లు పిల్లలకు కంఫర్ట్‌గా ఉంటాయి. ఎందుకంటే ఇందులో పెద్దలు కూర్చునెలా ఎక్కువ స్థలం లేదు. దీనిని మీరు మడతపెట్టవచ్చు. దీంతో మీకు బూట్ స్పేస్ లభిస్తుంది. మొత్తం 195 లీటర్ల నుంచి 645 లీటర్ల బూట్ స్పేస్ మీకు లభిస్తుంది.

EQS SUV ఇంటీరియర్‌లలోని ఇతర ముఖ్యాంశాలు Nappa లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ (మెటీరియల్ సీట్‌లపై ఉన్నట్లే ఉంటుంది). రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ (ముందు ఒకటి మరియు వెనుక ఒకటి), 7-అంగుళాల టాబ్లెట్ ఉంటుంది. దీని ద్వారా వెనుక ప్రయాణీకులు కారు ఫంక్షన్స్‌ని ఆపరేట్ చేయవచ్చు. హెడ్స్ అప్ డిస్‌ప్లే, గ్లాస్ రూఫ్, ఎయిర్ ఫిల్ట్రేషన్ వంటివి ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్లు: ఈ EQS SUV మెర్సిడెస్ ప్రీ-సేఫ్ సేఫ్టీ సెటప్‌తో వస్తుంది. యాక్టివ్ డిస్టెన్స్ అసిస్ట్, యాక్టివ్ బ్లైండ్ స్పాట్ అసిస్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో లెవల్ 2 ADAS సూట్‌తో పాటు 9 ఎయిర్‌బ్యాగ్స్ ఇతర సేఫ్టీ ప్రయాణికులకు మెరుగైన సేఫ్టీని అందిస్తుంది.

స్పెక్స్ & డైమెన్షన్స్: ఈ 2024 మెర్సిడెస్ EQS SUV 5,125mm పొడవు, 1,959mm వెడల్పు మరియు 1,718mm పొడవు, 3,210mm పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీని మొత్తం బరువు 2,845 కిలోలు (అన్‌లాడెన్)గా ఉంది. ప్యాసింజర్స్‌తో ఇది మూడు టన్నుల గ్రాస్ వెయిట్ కంటే ఎక్కువ బరువును కలిగి ఉన్నట్లు లెక్క.
ఇక ఇందులోని 122kWh భారీ బ్యాటరీ ప్యాక్ ఒకే ఛార్జ్‌పై 809కిమీల ARAI- ధృవీకరించబడిన రేంజ్‌ని అందిస్తుంది. ఈ భారీ బ్యాటరీ ప్యాక్ 200kW ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. DC ఛార్జర్‌తో EQS SUV బ్యాటరీని కేవలం 31 నిమిషాల్లో 0-80% నుంచి ఛార్జ్ చేయవచ్చు. 22kW AC ఛార్జర్‌తో పూర్తి ఛార్జ్ చేయడానికి 6.25 గంటల సమయం పడుతుంది.

దీని బ్యాటరీ డ్యూయల్-మోటారు, ఆల్-వీల్-డ్రైవ్ సెటప్‌ను అందిస్తుంది. ఇది నాలుగు చక్రాలకు 536bhp, 858Nm గరిష్ట టార్క్‌ను పంపుతుంది. ఇది 0-100km వేగాన్ని సమయాన్ని కేవలం 4.7 సెకన్లలో అందుకుంటుంది. ఇది గరిష్టంగా 210km/h వేగంతో ప్రయాణిస్తుంది. ఈ మెర్సిడెస్ EQS SUV సంస్థ ఎయిర్‌మేటిక్ ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్‌తో వస్తుంది. 244/45 టైర్లతో 21-అంగుళాల అల్లాయ్ వీల్స్ షాడ్‌పై రైడ్ చేస్తుంది.
డ్రైవింగ్ ఇంప్రెషన్స్: 2024 మెర్సిడెస్ EQS SUV దాని ఇతర మోడళ్ల మాదిరిగానే మీరు 'స్పోర్ట్' మోడ్‌ని డ్రైవ్ చేస్తే 0-100 వేగాన్ని కేవలం 4.7 సెకన్లలో అందుకుంటుంది. సూపర్ కార్ స్పీడ్‌తో వెళ్లాలనుకుంటే కాస్త ఇబ్బందింగా ఉంటుంది. ఈ EQS SUVని నడపడానికి ఉత్తమం కంఫర్ట్ మోడ్. ఈ మోడ్‌లో ఇది భారీ స్పీడ్‌లో దూసుకెళ్తుంది.

దీనిలో ఎయిర్ సస్పెన్షన్ ఉన్నప్పటికీ EQS SUV కొద్దిగా రోల్ అవుతుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇది ఆఫ్-రోడింగ్ మోడ్‌ను కూడా కలిగి ఉంది. అయితే దీనిని పరీక్షించడానికి మాకు తగినంత సమయం లేదు. ఈ మోడ్‌లోనూ కాస్త రోలింగ్, కొద్దిపాటి సస్పెన్షన్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండవచ్చు.
చివరగా: 2024 Mercedes EQS SUVతో మొత్తం కుటుంబం అంతా కలిసి రోడ్లపై విలాసవంతంగా ప్రయాణించవచ్చు. ఇది చూడటానికి చాలా పెద్దదిగా, సౌకర్యవంతమైనదిగా కనిపిస్తుంది. మీ దగ్గర పెద్ద మొత్తంలో నగదు ఉంటే (రూ. 1.41 కోట్లు, ఎక్స్-షోరూమ్) మీ కుటుంబాన్ని స్టైల్‌గా, లగ్జరీయస్ అనుభూతితో తీసుకెళ్లాలనే కోరిక ఉంటే ఈ 2024 Mercedes EQS SUV ఫర్ఫెక్ట్ అని మేము భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








