2024 Nissan X-trail Full Review కొడితే కుంభస్థలాన్నే బద్దలు కొట్టాలంటున్న నిస్సాన్‌ కొత్త ఎస్‌యూవీ

భారతదేశంలో X-ట్రైల్ SUVని 2005లో నిస్సాన్‌ ప్రారంభించింది. ఇక 2007లో 1st జనరేషన్‌ (T30) నిస్సాన్ X-ట్రైల్‌ని భారీ అంచనాల మధ్య విడుదల చేసింది. చెన్నైలోని రెనాల్ట్-నిస్సాన్ ఉత్పత్తి కేంద్రంలో దీనిని సంయుక్తంగా అసెంబుల్ చేశారు. పూర్తిగా ఫ్యామిలీ ఎస్‌యూవీగా బ్రాండ్‌ చేస్తూ తీసుకువచ్చారు. అయితే జనాలు నుంచి దీనికి ఆశించినంత ఆదరణ లభించలేదు. ఇక ఇదే కారుని 2nd జనరేషన్‌లో (T31)గా తీసుకువచ్చారు. ఈ సారి X-ట్రైల్ పరిమాణంలో కొంచెం పెద్దదిగా కారులో ఉన్నవారు సౌకర్యవంతంగా కూర్చునేలా ప్రవేశపెట్టింది. దీనిని ఆఫ్‌ రోడ్‌లోనూ తీసుకువెళ్లేలా రూపొందిచారు. మళ్లీ అదే కథ రిపీట్‌ అయ్యింది.

ఇక భారత్‌లో X-ట్రైల్‌కి సరైన గిరాకీ లేదని భావించి దీని ఉత్పత్తిని నిలిపివేయాలని 2014లో నిస్సాన్‌ భావించింది. ఆ తర్వాత SUV థర్డ్-జెన్ (T32) వెర్షన్‌ను ఆవిష్కరించినప్పటికీ అది ముందుకు కదలలేదు. దీంతో కేవలం తొమ్మిదేళ్లకే ఈ కారు ప్రస్థానాన్ని ముగించింది. కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాలనే రీతిలో ఇప్పుడు, X-ట్రైల్‌ని దశాబ్ద కాలం తర్వాత మళ్లీ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

2024-Nissan-X-Trail-Full-Review-In-Telugu

జపనీస్ కంపెనీకి చెందిన ఈ 4th జనరేషన్‌ SUV (T33) ఇప్పుడు సరికొత్త అవతార్‌లో మరోసారి తిరిగి వచ్చింది. కొత్త 2024 నిస్సాన్ ఎక్స్-ట్రైల్‌ను న్యూఢిల్లీలో కొత్త 2024 నిస్సాన్ ఎక్స్-ట్రైల్‌ని మా డ్రైవ్స్‌పార్క్‌ టీమ్‌ టెస్ట్‌డ్రైవ్‌ చేసింది. ఈ ఎస్‌యూవీ భారీ మార్పులతో మన దేశంలో అడుగుపెట్టింది. ఈ అధునాతన కారు ఎలా ఉంది దాని ఫీచర్లు, ఇంజిన్‌ ఫర్ఫామెన్స్‌కి సంబంధించిన ఫుల్‌ రివ్యూ మీ కోసం..

డిజైన్ & ఫీచర్లు: కొత్త 4th జనరేషన్‌ నిస్సాన్ X-ట్రైల్ క్రాస్ఓవర్‌ని ఆకట్టుకునే డిజైన్‌లో కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ SUV మరింత ప్రీమియం SUVish డిజైన్‌ని కలిగి ఉంది. ముందు భాగం నిటారుగా ఉండే డబుల్ V-మోషన్ గ్రిల్‌ని గమనించవచ్చు. గ్రిల్‌కు ఇరువైపులా ఉండే స్ప్లిట్ LED హెడ్‌లైట్ సెటప్ 'U' లెటర్‌ ఆకారంలో ఉంటుంది. ఇందులోని షార్పర్ టాప్ సెక్షన్ DRL మరియు టర్న్ ఇండికేటర్‌గా సూచిస్తుంది.

2024-Nissan-X-Trail-Front-View

ఫ్రంట్ బంపర్‌కి కొంచెం కింది భాగంలో యాక్టివ్ షట్టర్‌లతో కూడిన పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ ఉంటుంది. ఇవి ఇంజిన్‌లోకి చల్లని గాలిని అందించడానికి తెరుచుకుంటుంది. కొత్త SUV ఏరోడైనమిక్ సామర్థ్యానికి దగ్గరగా ఉంటాయి. కొత్త X-ట్రైల్ 20-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌తో ఆధిపత్యం చెలాయిస్తాయి. వాటిపై 255/40 టైర్లు చుట్టబడి ఉంటాయి. ప్లాస్టిక్‌తో కూడిన గుండ్రని వీల్‌ఆర్చ్‌లు కింద కూర్చుంటాయి.

కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్, బ్లాక్-అవుట్ A, B మరియు C పిల్లర్లు గమనించవచ్చు. ఇక బ్రేక్ లైట్ల కోసం బూమరాంగ్-ఆకారపు సిగ్నేచర్ లైటింగ్ ఎలిమెంట్‌ ర్యాప్‌రౌండ్‌ కలదు. ఇక వెనక మూడవ బ్రేక్ లైట్‌ హోస్ట్ చేస్తుంది. కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ లోపలికి అడుగు పెట్టండంతోనే మీకు ప్రీమియం అనుభూతిని అందించడానికి సాఫ్ట్-టచ్ మెటీరియల్‌లను కలిగి ఉన్న ఇంటీరియర్ మీకు స్వాగతం పలుకుతుంది.

2024-Nissan-X-Trail-Interior

ప్యాడిల్ షిఫ్టర్‌లతో ఫ్లాట్-బాటమ్-స్టీరింగ్ వీల్ కింద 12.3-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇక మల్టీ-లేయర్డ్ డాష్ మధ్యలో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ భారీగా ఉంటుంది. ఇది 360-డిగ్రీ కెమెరా సెటప్ అవుట్‌పుట్‌ను కూడా ప్రదర్శిస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కింద సెంట్రల్ వెంట్స్ మరియు డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్స్‌ ఇతర పంక్షన్స్‌ నియంత్రించడానికి ఫిజికల్ బటన్‌లు ఉన్నాయి.

ఇక చివర్లో USB పోర్ట్‌లు, 12V సాకెట్ మరియు ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్ ఉన్నాయి. డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్ల మధ్య సెంట్రల్ సెక్షన్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, గేర్ షిఫ్టర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, డ్రైవ్ మోడ్ స్విచ్ మరియు కప్‌హోల్డర్‌లను కలిగి ఉంటుంది. సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్ లోపల మరింత స్టోరేజీ చేసుకోవాడానికి వీలుంటుంది. నిస్సాన్ X-ట్రైల్ SUV మూడు వరుసల ఏడు-సీట్ల వెర్షన్‌గా ఉంది.

2024-Nissan-X-Trail-Full-Review-In-Telugu

ఇందులోని సీట్లు 40/20/40 స్ప్లిట్‌తో పాటు రిక్లైన్ ఫంక్షన్‌ను కలిగి ఉంటాయి. అన్ని సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. రెండవ వరుస సీట్లు పొడవాటి వారిక కోసం తగినంత స్పేస్‌ ఉంటుంది. పెద్ద సన్‌రూఫ్ క్యాబిన్‌ని వాస్తవంగా ఉన్నదానికంటే పెద్దదిగా మరియు విశాలంగా అనిపిస్తుంది. ఈ విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇక మూడవ వరుస సీట్లు పిల్లలకు ఉత్తమంగా వదిలివేయబడతాయి.

ఆఖరు సీట్లు పెద్దలకు ఎక్కువ స్థలాన్ని అందించదు. విశాలమైన ఓపెనింగ్ డోర్లు, రెండవ వరుసలో రోలింగ్ సీట్లు ఉన్నాయి. ఇక దీని సేఫ్టీ విషయానికి వస్తే 7ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, VDC, ట్రాక్షన్ కంట్రోల్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్,TPMS, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లతో పాటు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకింగ్‌ ఉన్నాయి.

2024-Nissan-X-Trail-Full-Review-In-Telugu

ఈ 2024 నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ప్రస్తుతం ఒకే ఒక్క డ్రైవ్‌ట్రెయిన్ ఆఫర్‌తో అందించబడుతుంది. ఇది 1.5-లీటర్ వేరియబుల్ జామెట్రీ టర్బో, మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 4,800 rpm వద్ద 161bhp మరియు 2,800 మరియు 3,600rpm మధ్య 300Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఇంజిన్ 12V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని మొత్తం శక్తిని ఎక్స్-ట్రైల్ ముందు చక్రాలకు కంటిన్యూయస్లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (CVT) ద్వారా పంపుతుంది. నిస్సాన్ X-ట్రైల్ 9.6 సెకన్లలో 0-100km/h వేగంతో దూసుకుపోతుంది. ఇది గంటకు 200 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. ఇక ఒక లీటర్‌కి 13.7 కి.మీ మైలేజీ అందిస్తుందని క్లెయిమ్ చేయబడింది.

2024-Nissan-X-Trail-Full-Review-In-Telugu

కొత్త నిస్సాన్ X-ట్రైల్ 4,680mm పొడవు, 1,840mm వెడల్పు మరియు 1,725mm ఎత్తుని కలిగి ఉంది. అంతే కాకుండా 2,705mm వీల్‌బేస్‌ని గమనించవచ్చు. 2024 X-ట్రైల్ 210mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తుంది. ఇక ఇందులో 585-లీటర్ బూట్ స్పేస్‌ ఉంటుంది. మీరు మూడవ, రెండవ వరుస సీట్లను మడతపెట్టడం వల్ల స్టోరేజ్ స్పేస్‌ని 1,484 లీటర్లకు పెంచుకోవచ్చు.

డ్రైవింగ్ ఇంప్రెషన్స్: కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఓ కంఫర్ట్‌ డ్రైవింగ్ SUVగా తీసుకువచ్చారు. మీరు నడిపే విధానాలకు అనుగుణంగా అది ప్రతిబింబిస్తుంది. ఇది హైవేలపై సులభంగా ప్రయాణిస్తుంది. పట్టణంలో కూడా ఇది చాలా సౌకర్యవంతమైన కారుగా ఉంటుంది. దీనిలోని 1.5-లీటర్ ఇంజన్ కొంచెం కరకరలాడే శబ్దాన్ని కలిగిస్తుంది. మూవ్‌మెంట్స్‌లో కారు శబ్దాలు సరిపోలడం లేదు.

Nissan-X-Trail-Telugu-Review

ఈ కారులో మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి ఎకో, స్టాండర్డ్ మరియు స్పోర్ట్‌గా ఉన్నాయి. ఈ మోడ్‌ల ద్వారా మారడం వలన థొరెటల్ రెస్పాన్స్‌ మరియు స్టీరింగ్ బరువులో మార్పు గమనించవచ్చు. అయితే, స్టీరింగ్ స్టాండర్డ్ మోడ్‌లో తగినంత తేలికగా ఉంటుంది. దీని సస్పెన్షన్ సెటప్ చాలా మృదువుగా స్ప్రింగ్ చేయబడింది. మీరు అధిక వేగంతో ఒక గుంతను తాకితే తప్పా మీరు కదిలినట్లు అనిపించదు.

చివరగా.. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ జపనీస్ మార్క్ దాదాపు ఒక దశాబ్దం తర్వాత భారతీయ కార్ మార్కెట్‌కు ఏలేందుకు వస్తుంది. ఇది ఎస్‌యూవీ విభాగంలో కింగ్‌మేకర్‌గా ఎదగాలని చూస్తోంది. ఈ కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఒక భారీ SUVగా ఉంది. ఇది నగరంలో మరియు సుదూర ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటుంది. పెద్ద ఫ్యామిలీలు మంచి SUV కోసం చూస్తున్నట్లైతే వారికి ఇది సరైన ఆప్షన్‌ అని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 23, 2024, 14:01 [IST]
English summary
2024 nissan x trail driving impressions and specifications full review in telugu
Read more on: #nissan #car review #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+