2025 Skoda Kodiaq Review: కొత్త తరానికి కొత్త జోష్.. 2025 స్కోడా కోడియాక్ కారు ఎలా ఉందో తెలుసా?

కోడియాక్ బ్రౌన్ బేర్ పేరు మీద పేరుపొందిన స్కోడా కోడియాక్, తొలిసారి 2016లో స్కోడా విజన్ కాన్సెప్ట్ S రూపంలో ప్రపంచానికి పరిచయమైంది. కేవలం ఒకటిన్నర సంవత్సరాల తర్వాత, మనం భారతదేశంలో, ప్రత్యేకంగా కేరళలో మొదటి తరం స్కోడా కోడియాక్‌ను తొలిసారి డ్రైవ్ చేశాం. ఆ అనుభవం మాకు మామూలుగా అనిపించలేదు స్కోడా ఫ్లాగ్‌షిప్ ఫ్యామిలీ SUV, తన డిజైన్, ప్రయాణ అనుభవం, ఫీచర్లు అన్నింటితో మనల్ని బాగా ఆకట్టుకుంది. అది కేవలం SUV కాదు కుటుంబంతో కూడిన ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మార్చేలా చేసే ఒక ప్రీమియం ఫ్యామిలీ క్యారియర్. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి తర్వాత, సుమారు ఐదేళ్ల విరామం తీసుకున్న స్కోడా, తన ఫ్లాగ్‌షిప్ SUV అయిన కోడియాక్‌కి ఒక తాజాగా కొత్త రూపాన్ని అందించింది.

ఇకపై దీని డీజిల్ వేరియంట్ అందుబాటులో ఉండదు. భారత మార్కెట్‌లో పెట్రోల్ పవర్‌ట్రైన్‌‌కు మాత్రమే స్కోడా మొగ్గు చూపింది. ఇవన్నీ కఠినమైన ఉద్గార నిబంధనలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయాలే. మేము చివరిసారి ఈ బిగ్ బేర్‌ను మూడు సంవత్సరాల క్రితం చూశాం. ఆ గ్యాప్‌లో స్కోడా కారులో చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు నడిపిన SUV కన్నా ఇది మరింత స్టైలిష్, మరింత టెక్-ఫ్రెండ్లీ, మరింత ప్రీమియమ్‌గా మారింది.

2025 Skoda Kodiaq Driving Impression

చెక్ కార్ల తయారీదారు స్కోడా, తన స్టేబుల్స్ నుంచి తన ఫ్లాగ్‌షిప్ SUVకి ఒక కొత్త రూపాన్ని ఇచ్చింది. ముంబై వీధుల్లో, ఈ కొత్త రెండవ తరం స్కోడా కోడియాక్ కారును నడిపే అవకాశం మా డ్రైవ్‌స్పార్క్ టీంకు వచ్చింది. ఈ కారు నడిపిన సమయంలో అనిపించిన ఎక్స్‌పీరియన్స్ గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది

డిజైన్ & ఫీచర్స్ - మరింత స్పష్టంగా కనిపించే బేర్: రెండవ తరం స్కోడా కోడియాక్‌ను భారత మార్కెట్‌ కోసం స్పోర్ట్‌లైన్, లారెంట్ & క్లెమెంట్ (L&K) అనే రెండు ప్రధాన వేరియంట్‌లలో అందిస్తున్నారు. ఈ కొత్త వెర్షన్, దాని ముందు ఉన్న కోడియాక్ వలేనే కనిపించవచ్చు, కానీ దగ్గరగా చూసినపుడు కొన్ని అప్‌డేట్స్ స్పష్టంగా కనిపిస్తాయి. LED హెడ్లాంపులు ఇప్పుడు మరింత సొగసుగా రూపుదిద్దుకున్నాయి.

2025 Skoda Kodiaq Driving Impressions Review

ముందు, వెనుక బంపర్‌లను మరింత ఏరోడైనమిక్ రూపంలో ఇచ్చారు. వెనుకవైపు ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్ ఎలిమెంట్ రూపంలో డిజైన్‌కు స్పోర్టీ ఫ్లేవరూ జత చేశారు. అంతేకాదు, ఇది ఇప్పుడు 59mm పొడవుగా, 17mm తక్కువగా ఉంది. మరొకవైపు డైనమిక్ లుక్‌కి కూడా కట్టుబడి ఉంది. ముందుభాగం నుంచి వెనుక భాగం దాకా తీసుకొచ్చిన ఏరో ప్రొఫైల్డ్ డిజైన్, దాని గాలి తేర్చుకునే సామర్థ్యాన్ని పెంచి, కేవలం 0.282 ఏరోడైనమిక్ కోఎఫీషియంట్ ఉంటుంది.

వీల్ ఆర్చ్‌లు ఇప్పుడు స్క్వేర్ షేప్‌లో డిజైన్ చేయబడ్డాయి, ఇది కారుకి మరింత బలంగా కనిపించే లుక్‌ను ఇస్తోంది. చక్రాల డిజైన్ కూడా మార్చబడింది. మెరుగైన ఏరోడైనమిక్స్‌కి తగినట్లు మార్పులు ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి, ఎక్స్‌టీరియర్ ట్రిమ్ కూడా భిన్నంగా ఉంటుంది: స్పోర్ట్‌లైన్ వేరియంట్‌లో గ్లోస్ బ్లాక్ ఫినిష్ వస్తే, లారెంట్ & క్లెమెంట్ వేరియంట్‌లో మ్యాట్ డార్క్ క్రోమ్ డిజైన్ శైలిని కలిగి ఉంటుంది.

2025 Skoda Kodiaq Driving Impression Test Drive

కారు లోపల అడుగు పెట్టగానే, ఒక ప్రత్యేకమైన కొత్త మినిమలిస్టిక్ థీమ్‌ అడ్డంగా కనిపిస్తుంది. మినిమలిస్టిక్ క్యాబిన్ థీమ్, హాయిగా వుండే సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, , వివిధ టెక్స్చర్‌లతో కూడిన ప్లాస్టిక్ బిట్స్. ఇవన్నీ కలిపి ఫీల్‌గుడ్ ఫాక్టర్‌ను రెట్టింపు చేస్తాయి. ఇన్‌ఫోటైన్‌మెంట్ టెక్నాలజీలో స్కోడా మరో మెట్టు ఎక్కింది. 10-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 13-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

ఈ రెండింటినీ మెరుగైన గ్రాఫిక్స్‌తో తీర్చిదిద్దారు. కనెక్టివిటీ ఆప్షన్స్ విస్తృతంగా ఉండగా, యూజర్ ఇంటరాక్షన్ కూడా చాలా ఈజీ అయింది. ఇందులో స్మార్ట్ డయల్స్ (మూడు) జోడించబడ్డాయి, వీటితో మీరు ఇన్ఫోటైన్‌మెంట్, HVAC సిస్టమ్, సీటు హీటింగ్‌ను సులభంగా నియంత్రించవచ్చు. ఇంకా ఒక కీలకమైన మార్పు ఎంటంటే, గేర్ లీవర్‌ను ఇప్పుడు స్టీరింగ్ కాలమ్‌కు మార్చారు, దీని వల్ల మధ్య భాగంలో మరింత స్పేస్ లభిస్తుంది.

2025 Skoda Kodiaq

ప్రధాన హైలైట్‌లలో ఒకటి స్కోడా 'ఫోన్ బాక్స్' ఒకటి. రెండు స్మార్ట్‌ఫోన్‌లను ఒకేసారి వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది, ఒక్కొక్కదానికీ 15 వాట్స్ వేగం టుంది.. అంతే కాదు, ఎక్కువ టైం ఛార్జింగ్ వల్ల వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో యాక్టివ్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అదనంగా, నాలుగు USB-C పోర్ట్‌లు, ఒక్కొక్కదానికీ 45W అవుట్‌పుట్, ఫాస్ట్ ఛార్జింగ్‌కి అందిస్తాయి.

ఆకాశాన్ని దగ్గరగా చూసే వారికి, బిగ్ పనోరమిక్ సన్‌రూఫ్ మరింత అందాన్ని పెంచుతుంది. ముందు సీట్లు ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్, వాటిలో హీట్, వెంటిలేషన్, అంతేకాకుండా మసాజ్ ఫంక్షన్ వంటి లగ్జరీ అంశాలు కూడా ఉన్నాయి. రెండవ వరుస సీట్లు ముందుకు లేదా వెనక్కు జరిపి, మూడవ వరుసలో స్పేస్‌ను సర్దుబాటు చేయవచ్చు. అయితే, మూడవ వరుస సీట్లు చిన్నారుల కోసం సరిపోయేంత పరిమితిగానే ఉన్నాయి, పెద్దవారికి చాలా కంఫర్ట్‌గా అనిపించకపోవచ్చు.

2025 Skoda Kodiaq Driving

సేఫ్టీ పరంగా, స్కోడా ఎప్పటిలాగానే ఏ మాత్రం రాజీ పడలేదు. 9 ఎయిర్‌బ్యాగ్స్, ముందు వెనుక 360 డిగ్రీ కెమెరా సిస్టమ్, పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి శక్తివంతమైన భద్రతా ఫీచర్లతో ఇది రోడ్డుపై మీకు పూర్తి విశ్వాసాన్ని కలిగిస్తుంది.

కాస్త నిరాశ కలిగించే విషయం ఏంటంటే, అంతా ఉన్నప్పటికీ ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) అందుబాటులో లేదు. ఈ సెగ్మెంట్‌లో మిగతా కార్లతో పోటీ పడాలంటే, అది ఉండాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది.

2025 Skoda Kodiaq Driving Impressions Specifications

కొలతలు అండ్ మెకానికల్ బిట్స్: కొత్త కోడియాక్ మొత్తం 4,758 మిల్లీమీటర్ల పొడవు, 1,864 మిల్లీమీటర్ల వెడల్పు, 1,659 మిల్లీమీటర్ల ఎత్తు కలిగి ఉంది. అంటే గత తరం కంటే ఇది 59 మిల్లీమీటర్ల పొడవుగా, 18 మిల్లీమీటర్ల సన్నగా, 17 మిల్లీమీటర్ల తక్కువ ఎత్తుగా ఉంది. అయితే, వీల్‌బేస్ మాత్రం 2,791 మిల్లీమీటర్ల వద్ద యథాతథంగా కొనసాగుతోంది. SUV 18-అంగుళాల అలాయ్ వీల్స్‌పై నడుస్తుంది.

వీటికి 235/55 టైర్లు అమర్చారు. అదనంగా, 145/85 టైర్ పరిమాణంతో కూడిన 18-అంగుళాల స్పేర్ వీల్‌ను కూడా అందిస్తున్నారు. మొత్తం బరువు విషయానికి వస్తే, 1,825 కిలోలు. ఇది 155mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. నగర వీధుల్లోనూ, కొంచెం గడ్డిమైదానాల్లోనూ ఈ SUV సాఫీగా ప్రయాణించగలదు. ఈ కారులో, అన్ని వరుసల సీట్లు వినియోగంలో ఉంటే 281 లీటర్ల బూట్ స్పేస్ అందుతుంది.

2025 Skoda Kodiaq Driving Impressions Specifications Full Review In Telugu

మూడవ వరుసను మడతపెడితే అది 786 లీటర్లకు, రెండవ వరుస కూడా మడతపెడితే దాదాపు 1,976 లీటర్ల వరకు విశాలంగా మారుతుంది. దీని ద్వారా ఇది కుటుంబ ప్రయాణాలకి, ఎక్కువ సామానుతో కూడిన లాంగ్ రైడ్స్‌కి అత్యుత్తమ ఎంపిక అవుతుంది. 62 లీటర్ల ఇంధన ట్యాంక్ వాల్యూమ్‌తో మరింత దూరం ప్రయాణించవచ్చు. ఇంజిన్ విషయానికి వస్తే, ఇది మునుపటిలాగే 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ నాలుగు సిలిండర్ల పెట్రోల్‌తో రన్ అవుతుంది.

కానీ ఈసారి ఇంజిన్ శక్తి మరింతగా పెరిగింది, 201 bhp పవర్ (గత తరం కంటే 14 bhp అధికం), 320 Nm టార్క్ ఉత్పత్తి చేస్తోంది. దీనికి జతగా 7-స్పీడ్ DSG డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆల్-వీల్ డ్రైవ్ వ్యవస్థ అమర్చబడి ఉంది. మైలేజీ పరంగా చూస్తే, కొత్త కోడియాక్ ARAI ప్రమాణాల ప్రకారం 14.86 కిలోమీటర్లు అందిస్తుంది.

2025 Skoda Kodiaq Driving

డ్రైవింగ్ ఇంప్రెషన్స్ - బిగ్ బేర్ ఆన్ ది ఛార్జ్: కొత్త స్కోడా కోడియాక్‌ను నడపడం మొదలుపెట్టగానే, అది ఎంత సజావుగా, సౌకర్యవంతంగా డ్రైవ్‌ను అందిస్తుందో మీరు వెంటనే గమనిస్తారు. డ్రైవ్ మోడ్ ఏదైనా కావచ్చు, ఈ SUV ఇంజిన్ పవర్ డెలివరీను మృదువుగా, లీనియర్‌గా అందిస్తూ, మీకు కావాల్సిన విధంగా ప్రతిస్పందన ఇస్తుంది. మీరు హఠాత్తుగా యాక్సిలరేటర్‌పై నొక్కినా, 7-స్పీడ్ DSG ట్రాన్స్‌మిషన్ గట్టిగా కనిపించకుండా చక్కగా గేర్‌ల మధ్య మారుతుంది.

కోడియాక్ రోడ్డు మీద గడ్డలకైనా, చిన్న గుంతలకైనా అంతగా ప్రభావితమవకుండా సజావుగా ముందుకు సాగుతుంది. ఎలాంటి శబ్దం లేకుండా తేలికగా జారిపోతుంది. అలాగే హై-స్పీడ్ స్టెబిలిటీ బాగా మెరుగుపడింది. మలుపుల వద్ద కూడా మంచి నియంత్రణను చూపిస్తుంది. అయితే వెనుక కూర్చున్నవారికి కొంచెం బాడీ రోల్ అనిపించవచ్చు, కానీ అది సాధారణ స్థాయిలోనే ఉంటుంది.

2025 Skoda Kodiaq Interior

చివరగా - ది బిగ్ బేర్ గెట్స్ ఈవెన్ ఇయర్: రెండవ తరం స్కోడా కోడియాక్, గత తరం మాదిరిగా కాకుండా మరింత మెరుగైన రూపాన్ని, ఫీచర్లను, అనుభూతిని తీసుకొచ్చింది. దీనిలో మునుపటి తరానికి మనం ఇష్టపడిన ప్రతి అంశాన్ని తీసుకొని మరింత మెరుగుదలతో అందించారు. ఎక్స్‌టీరియర్ డిజైన్ సొగసుగా ఉంది, ఇంటీరియర్ విశాలంగా ఉండటమే కాకుండా, పనికిరావడంలో కూడా ముందుంది.

ఈ SUV ఒక ప్రీమియం ఫ్యామిలీ కారుగా నిలవడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ జర్మన్ SUVలతో రాజీ పడకూడదనుకునే వారికి ఇది సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. అలాగే స్కోడా ఇందులో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)‌ను జోడించి ఉంటే, ఇది మరింత పర్ఫెక్ట్ కారు అయ్యేదని మాత్రం కొంచెం ఆశిస్తున్నాం.

Article Published On: Thursday, April 17, 2025, 11:00 [IST]
English summary
2025 skoda kodiaq driving impressions specifications full review in telugu
Read more on: #skoda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+