2025 Toyota Camry Full Review హైబ్రిడ్ కార్లలో రారాజుగా పిలుస్తున్న కొత్త టయోటా కారు ఎలా ఉందంటే?
2002లో జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా కామ్రీ సెడాన్‌ని భారతీయ మార్కెట్‌లో పరిచయం చేసింది. గత 22 సంవత్సరాలుగా ఈ కామ్రీ టయోటా ఫ్లాగ్‌షిప్ వెహికిల్‌గా ఉంది. టయోటా వెల్‌ఫైర్ MPVని రాకముందు వరకు ఇదే టాప్ మోడల్‌గా కొనసాగింది. 2013లో ఈ కామ్రీ భారతదేశంలో స్థానికంగా తయారు చేయబడిన మొట్టమొదటి హైబ్రిడ్ కారుగా అవతరించింది. భారత్‌లో అరంగేట్రం చేసిన 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 9th జనరేషన్(XV80)ని ఎట్టకేలకు విడుదల చేసింది. ప్రస్తుతం భారత్‌లో అమ్మకానికి ఉన్న టయోటా లైనప్‌లలో ఏకైక సెడాన్‌గా ఉంది. ఈ 2025 టయోటా కామ్రీని బెంగళూరులో మా డ్రైవ్‌స్పార్క్ టీమ్ టెస్ట్‌డ్రైవ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, స్పెసిఫికేషన్స్ మీకోసం..
డిజైన్: ఈ కొత్త 2025 కామ్రీ అప్‌డేటెడ్ డిజైన్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఈ ప్రీమియం సెడాన్ కంపెనీ అంతర్జాతీయ బ్రాండ్‌కి చెందిన లెక్సస్ నుంచి కొన్ని డిజైన్ మార్పులను స్వీకరించింది. దీంతో ఇది గతంలో కంటే స్పోర్టివ్‌గా కనిపిస్తుంది. దీని ముందు భాగంలో C-ఆకారపు LED DRLs, డ్యూయల్ ప్రొజెక్టర్ LED హెడ్‌లైట్స్, మునుపటి మోడల్‌తో పోలిస్తే టయోటా బ్యాడ్జ్‌ను కొద్దిగా బానెట్ పైకి అందించారు.

ఇక ఫ్రంట్ బంపర్ లెక్సస్ స్పిండిల్ డిజైన్ ద్వారా క్రేజీ రూపాన్ని కలిగి ఉంది. సైడ్ ఫ్రొఫైల్‌లో డోర్ హ్యాండిల్స్‌లో షార్ప్ క్యారెక్టర్ లైన్ కలదు. అలాగే రీడిజైన్ చేయబడిన 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ హోస్టింగ్ ఫ్లెర్డ్ వీలర్‌లను కలిగి ఉంది. ఇక వెనకాల అదే C-ఆకారపు LED కాంబినేషన్ టైల్‌లైట్స్, రీడిజైన్ చేయబడిన బంపర్, చిన్న బూట్ లిప్ స్పాయిలర్ కలదు.
ఫీచర్లు: ఈ 2025 టయోటా కామ్రీ క్యాబిన్‌లోకి అడుగు పెట్టగానే విప్లవాత్మకమైన మార్పులు గమనించవచ్చు. ఇప్పటి వరుక లేని విధంగా దీనిని అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్స్, సాఫ్ట్-టచ్ మెటీరియల్‌తో వచ్చే మల్టీ లేయర్డ్ డాష్ బోర్డ్ కలదు. వైర్‌లెస్ Apple CarPlay, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ వైర్‌తో వస్తుంది.

ఇక ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ తొమ్మిది-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్‌కి కనెక్ట్ చేయబడి ఉంది. దీని ద్వారా మెరుగైన మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయవచ్చు. వీటితో పాటు 3-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 10-ఇంచెస్ హెడ్-అప్ డిస్‌ప్లే, సన్‌షేడ్‌తో కూడిన సన్‌రూఫ్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల అలాగే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రిక్లైనింగ్ వెనక సీట్లు కలవు. అలాగే డ్రైవర్ సీటుని 10-స్టెప్ ద్వారా సర్దుబాటు చేయవచ్చు.
సేఫ్టీ ఫీచర్లు: ఈ కొత్త టయోటా కామ్రీ సేఫ్టీలో భేష్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది 3.0 సూట్ ADAS సెటప్‌తో వస్తుంది. దీంతో టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లు కలవు. పాదచారులను గుర్తించడం, రాడార్-ఆధారిత క్రూయిజ్ కంట్రోల్, లేన్-ట్రేసింగ్ అసిస్ట్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ఇందులో 9 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, రెండు చివర్లలో పార్కింగ్ సెన్సార్స్ కలవు.

కొలతలు: ఇది టయోటా TNGA-K ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి వస్తుంది. ఈ సెడాన్ 4,920mm పొడవు, 1,840mm వెడల్పు, 1,455mm ఎత్తు, 2,825mm పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఇది వస్తుంది. ఈ కారు బరువు మొత్తం 1,645 కిలోలుగా ఉంది.
ఇది తొమ్మిదవ జనరేషన్ కారు అయినప్పటికీ 2025 కామ్రీ ఐదవ తరం హైబ్రిడ్ సిస్టమ్ కలిగిన కారుగా వస్తుంది. ఇది నికెల్-మెటల్ హైడ్రైడ్ (Ni-MH) బ్యాటరీ ప్యాక్‌తో ఆధారితమైన ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌తో 2.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది మునుపటి జనరేషన్ కారుతో పోల్చితే 215bhp నుంచి 227bhpకి పెరిగింది. అంటే దాదాపు 12bhp పెంచారు. ఈ హైబ్రిడ్ కారు e-CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

డ్రైవింగ్ ఇంప్రెషన్స్: కొత్త కామ్రీ మునుపటి జనరేషన్ కారుతో పోల్చితే బెస్ట్ ఫర్ఫామర్‌గా అనిపిస్తుంది. ఈ కారులో ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ కలవు. సిటీ రైడింగ్‌లో లైట్ యాక్సిలరేషన్‌లో బ్యాటరీ ప్యాక్‌తో నడుస్తుంది. ఈ సమయంలో బ్యాటరీ ప్యాక్ రీఛార్జ్ అవ్వడానికి ఇంజిన్ ద్వారా పవర్ పంపబడుతుంది. ఇది EV కారు డ్రైవ్ వలె లగ్జరీ సెడాన్‌ని నడుపుతున్న అనుభూతిని అందిస్తుంది.
అయితే, కామ్రీని స్పోర్ట్ మోడ్‌లోకి మార్చడం ద్వారా "గో ఫాస్టర్" పెడల్‌తో సులభంగా మూడు-అంకెల వేగాన్ని చేరుకోగలుగుతారు. అలాగే e-CVT సాధారణంగా సిల్కీ స్మూత్‌గా ఉన్నప్పటికీ, తిరిగి యధాస్థితికి చేరుకునేందుకు కాస్త ఆలస్యం అవుతుంది. ఇందులో సస్పెన్షన్ చాలా బాగుంది. ఇది బంప్స్, రట్స్‌ని సులభంగా క్రాస్ చేస్తుంది. కానీ హై స్పీడ్‌లో కొన్ని లోపాలను గుర్తించగలవు. స్టీరింగ్ వీల్ సులువుగా ఉంటుంది.

చివరగా: ఈ కొత్త 2025 టయోటా కామ్రీ దాని తాజా అవతార్‌లో కొంచెం స్పోర్టియర్ ఎక్స్‌టీరియర్ డిజైన్, సరికొత్త టెక్ ప్యాక్డ్ ఇంటీరియర్ అలాగే మరింత శక్తివంతమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ సెటప్‌తో తిరిగి వచ్చింది. అయితే దీని ధర రూ. 48 లక్షలు (ఎక్స్-షోరూమ్) చాలా ఎక్కువ. కాని దీనిని ఒక హైబ్రిండ్ కింగ్‌గా పిలువడంలో ఎటువంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications








