2026 Tata Tiago EV Review: కారు వేరే లెవల్‌లో ఉంది.. పెట్రోల్ కారు కొనాలనే ఆలోచనే రాదు!

భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన టాటా టియాగో ఈవీ 2026 (Tata Tiago Ev 2026) మోడల్ తాజాగా సరికొత్త అప్‌డేట్‌లతో మార్కెట్లోకి వచ్చింది. కొత్త డిజైన్, మరింత ప్రీమియం క్యాబిన్, అదనపు భద్రతా ఫీచర్లు, వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయాలతో ఈ హ్యాచ్‌బ్యాక్ గతంతో పోలిస్తే మరింత ఆకర్షణీయంగా మారింది. ముఖ్యంగా, ప్రారంభ ధరను కూడా తగ్గించడం ద్వారా టాటా మోటార్స్ వినియోగదారులకు మరింత విలువను అందిస్తోంది. 2026 టాటా టియాగో ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే బ్యాటరీ, పవర్‌ట్రెయిన్ ఎంపికలను యథాతథంగా కొనసాగించినప్పటికీ, డిజైన్, ఫీచర్ల పరంగా గణనీయమైన మార్పులు చేసింది. దీంతో భారత మార్కెట్లో తొలి ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మరింత మెరుగైన ఎంపికగా నిలుస్తోంది.

టాటా మోటార్స్ తమ Battery-as-a-Service (BaaS) ప్రోగ్రామ్ కింద కూడా ఈ కారును అందిస్తోంది. ఈ పథకం ద్వారా కారు ప్రారంభ ధర కేవలం రూ. 4.69 లక్షలకు తగ్గుతుంది. అయితే వినియోగదారులు ప్రతి కిలోమీటర్‌కు రూ. 2.60 చొప్పున బ్యాటరీ వినియోగ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రారంభ పెట్టుబడిని తగ్గించుకోవాలనుకునే కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

2026 Tata Tiago EV Review Design Features Performanance Details In Telugu

కొత్త టియాగో ఈవీలో బాహ్య డిజైన్‌కు రిఫ్రెష్ చేసిన లుక్‌ను అందించగా, ఇంటీరియర్‌ను మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. అదనంగా, మరిన్ని భద్రతా ఫీచర్లు, మెరుగైన టెక్నాలజీ, వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలను అందించడం ద్వారా రోజువారీ వినియోగానికి మరింత అనుకూలంగా మార్చారు. ఈ మార్పులన్నీ కలిపి చూస్తే, గత మోడల్‌తో పోలిస్తే కొత్త టియాగో ఈవీ డబ్బుకు మరింత విలువను అందించే ఎలక్ట్రిక్ కారుగా నిలుస్తోంది.

ఈ కొత్త 2026 టాటా టియాగో ఈవీ లాంగ్ రేంజ్ వేరియంట్‌ను బెంగళూరు నగర పరిసర ప్రాంతాల్లో నడిపి పరిశీలించినప్పుడు, ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌గా ఇది ఎంతగానో అభివృద్ధి చెందిందని స్పష్టమైంది. మెరుగైన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, తక్కువ ప్రారంభ ధర, ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయోజనాలతో, తొలి ఈవీ కొనుగోలుదారుల కోసం టియాగో ఈవీ ఇప్పటికీ అత్యుత్తమ ఎంపికలలో ఒకటిగా కొనసాగుతోంది. మా డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఈ కథనంలో.

2026 Tata Tiago EV Review Design Features Performanance Details In Telugu

2026 టాటా టియాగో ఈవీ రివ్యూ: ఏం మారింది?

2026 టాటా టియాగో ఈవీలో మొదట కనిపించే మార్పులు ముందు భాగంలోనే ఉన్నాయి. కొత్త మోడల్‌కు మరింత ఆకర్షణీయమైన ఫ్రంట్ ఫాసియాను అందించారు. స్లీక్ LED హెడ్‌ల్యాంప్స్, కనుబొమ్మ ఆకారంలో ఉన్న LED DRLs, పూర్తిగా మూసివేసిన బాడీ-కలర్ గ్రిల్ కారణంగా ఇది ఒక ఆధునిక ఎలక్ట్రిక్ కారుగా కనిపిస్తోంది. గత మోడల్‌తో పోలిస్తే ముందు భాగం మరింత శుభ్రంగా, ప్రీమియంగా కనిపించేలా టాటా డిజైన్ చేసింది.

బంపర్ డిజైన్‌ను కూడా పూర్తిగా మార్చారు. అంచుల వద్ద కొత్త ఫాక్స్ ఎయిర్ వెంట్స్‌ను జోడించగా, కొత్తగా డిజైన్ చేసిన 14 అంగుళాల వీల్స్, కాంట్రాస్టింగ్ వీల్ ఆర్చ్ క్లాడింగ్ వాహనానికి మరింత స్పోర్టీ లుక్‌ను తీసుకొచ్చాయి. మొత్తంగా టియాగోకు ఉన్న సుపరిచితమైన సిల్హౌట్‌ను అలాగే ఉంచుతూ, మరింత ఆధునిక రూపాన్ని అందించారు. వెనుక భాగంలో కూడా గమనించదగ్గ మార్పులు ఉన్నాయి.

2026 Tata Tiago EV Review Design Features Performanance Details In Telugu

ప్రస్తుతం మార్కెట్లో ట్రెండ్‌గా మారిన కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్‌ను టాటా ఈ మోడల్‌లో అందించింది. రీడిజైన్ చేసిన రియర్ బంపర్, డ్యూయల్-టోన్ బ్లాక్ రూఫ్, షార్క్-ఫిన్ యాంటెన్నా, క్రోమ్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్ కారుకు ప్రీమియం టచ్‌ను జోడిస్తున్నాయి. కొత్త టియాగో డెహ్రాడూన్ డ్యూ, సోబో సర్జ్, పాంగాంగ్ పల్స్, మాథేరాన్ మాన్సూన్, ప్యూర్ గ్రే, ప్రిస్టిన్ వైట్ వంటి కలర్ ఆప్షన్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి.

అయితే ఈ కారులో అతిపెద్ద మార్పు క్యాబిన్‌లోనే కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌ను పూర్తిగా కొత్తగా రూపొందించారు. డ్యూయల్-టోన్ థీమ్‌తో కూడిన ఇంటీరియర్ మరింత ప్రీమియంగా కనిపిస్తుండగా, ఇందులో 10.25 అంగుళాల ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పాక్షికంగా డిజిటల్‌గా కొనసాగుతున్నప్పటికీ, ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అదనపు ఫీచర్లను అందిస్తోంది.

2026 Tata Tiago EV Review Design Features Performanance Details In Telugu

వాహనంలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఆర్కిటెక్చర్‌ను కూడా టాటా అప్‌గ్రేడ్ చేసింది. అధిక ప్రాసెసింగ్ పవర్‌తో కొత్త ఫీచర్లను సులభంగా నిర్వహించగల సామర్థ్యాన్ని కల్పించింది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, 40కిపైగా ఫంక్షన్లతో కూడిన కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఆటో-ఫోల్డింగ్ ORVMలు వంటి ఫీచర్లు ఇప్పుడు ఈ హ్యాచ్‌బ్యాక్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇతర అప్‌డేట్‌లలో ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, కొత్త డోర్ ప్యాడ్స్, గ్రే కలర్ అప్హోల్స్టరీ, గ్లోస్-బ్లాక్ సెంటర్ కన్సోల్ ఉన్నాయి. రెండు స్పోక్‌ల స్టీరింగ్ వీల్ డిజైన్‌ను కొనసాగించినప్పటికీ, ఇప్పుడు దీనిపై కొత్త Tata.ev లోగోను అమర్చారు. ముఖ్యంగా ముందు సీట్లలో అండర్-థై సపోర్ట్‌ను మెరుగుపరచడం వల్ల సుదూర ప్రయాణాల్లో మరింత సౌకర్యం లభిస్తుంది.

2026 Tata Tiago EV Review Design Features Performanance Details In Telugu

భద్రత పరంగా టియాగో ఈవీ భారీ ముందడుగు వేసింది. గతంలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లతో వచ్చిన ఈ కారు, ఇప్పుడు స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది. అలాగే 360-డిగ్రీ కెమెరా, బహుళ వ్యూ మోడ్‌లు, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి ఆధునిక భద్రతా సదుపాయాలు కూడా జోడించబడ్డాయి. ESP, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్, TPMS, టార్క్ వెక్టరింగ్ బై బ్రేకింగ్, ABS, EBD వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

అదనంగా ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రైన్-సెన్సింగ్ వైపర్స్, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు మెరుగైన రక్షణ కల్పించేందుకు దీన్ని మరింత బలంగా రూపొందించినట్లు టాటా చెబుతోంది. ఛార్జింగ్ పనితీరులో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. కొత్త టియాగో ఈవీ కేవలం 18 నిమిషాల్లో 100 కిలోమీటర్ల రేంజ్‌ను జోడించగలదని టాటా పేర్కొంటోంది. ఇది గత మోడల్‌తో పోలిస్తే దాదాపు 40 శాతం వేగవంతమైన ఛార్జింగ్.

2026 Tata Tiago EV Review Design Features Performanance Details In Telugu

30kWh DC ఫాస్ట్ ఛార్జర్‌తో రెండు బ్యాటరీలు 10 శాతం నుంచి 80 శాతం వరకు 35 నిమిషాల్లో ఛార్జ్ అవుతాయి. అలాగే 3.3kW, 7.2kW AC ఛార్జింగ్ ఆప్షన్లు యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితే కొన్ని లోపాలు ఉన్నాయి. డోర్ల కోసం ప్రత్యేక లాక్, అన్‌లాక్ బటన్‌ను అందించలేదు. అలాగే వెనుక సీట్ల ప్రయాణికులకు USB Type-C ఛార్జింగ్ పోర్టులు లేకపోవడం, అడ్జస్టబుల్ రియర్ హెడ్‌రెస్టులు అందుబాటులో లేకపోవడం నిరాశ.

డ్రైవింగ్ అనుభవం ఎలా ఉంది?

2026 టాటా టియాగో ఈవీ లాంగ్ రేంజ్ వేరియంట్‌ను బెంగళూరు నగరంలో నడిపి పరీక్షించగా, డ్రైవింగ్ అనుభవంలో పెద్దగా మార్పులు కనిపించలేదు. ఇందులో గత మోడల్‌లో ఉన్న 75 bhp పవర్, 114 Nm టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌నే కొనసాగించారు. సిటీ, స్పోర్ట్ అనే రెండు డ్రైవింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. సిటీ మోడ్‌లో కారు చాలా స్మూత్‌గా నడుస్తుంది.

2026 Tata Tiago EV Review Design Features Performanance Details In Telugu

ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయడానికి అనువుగా ఉండటంతో పాటు పవర్ డెలివరీ కూడా చాలా లీనియర్‌గా ఉంటుంది. స్పోర్ట్ మోడ్‌కు మారగానే యాక్సిలరేషన్ మరింత చురుకుగా అనిపిస్తుంది. ఓవర్‌టేకింగ్ సమయంలో కూడా మంచి స్పందన అందిస్తుంది. రియల్ వరల్డ్ పరిస్థితుల్లో లాంగ్ రేంజ్ వేరియంట్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగింది.

జెనరేటివ్ బ్రేకింగ్‌కు పలు స్థాయిలు ఉండటంతో డ్రైవర్ తనకు నచ్చిన విధంగా సెట్టింగ్‌ను ఎంచుకోవచ్చు. టియాగో ఈవీ బలమైన అంశాల్లో సస్పెన్షన్ ఒకటి. గుంతలు, స్పీడ్ బ్రేకర్లు వచ్చినా ప్రయాణికులకు మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. స్టీరింగ్ కూడా తేలికగా ఉండటంతో నగర రోడ్లపై డ్రైవింగ్, పార్కింగ్ చాలా సులభంగా అనిపిస్తుంది.

2026 Tata Tiago EV Review Design Features Performanance Details In Telugu

చివరగా

ఈ కారుకి వచ్చిన అప్‌డేట్‌లు దీనిని గతం కంటే మరింత ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ కారుగా మార్చాయి. కొత్త డిజైన్, ప్రీమియం క్యాబిన్, మెరుగైన భద్రతా ఫీచర్లు, వేగవంతమైన ఛార్జింగ్ దీనికి ప్రధాన బలాలు. ముఖ్యంగా ధరను తగ్గించడంతో తొలి ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఉపయోగకరం. సౌకర్యవంతమైన రైడ్, సులభమైన డ్రైవింగ్ అనుభవం, మంచి ఫీచర్ల కారణంగా 2026 టాటా టియాగో ఈవీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Article Published On: Monday, June 8, 2026, 11:00 [IST]
English summary
2026 tata tiago ev review design features performanance details in telugu
Read more on: #review #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+