సరికొత్త ఎర్టిగా ఆవిష్కరిస్తున్న మారుతి సుజుకి

మారుతి సుజుకి తమ పాపులర్ ఎర్టిగా ఎమ్‌పీవీ కారును విడుదల చేయడానికి సిద్దమవుతోంది. డిజైన్ మార్పులతో, కొత్త పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో టయోటా ఇన్నోవా క్రిస్టా వాహనానికి పోటీగా నెక్ట్స్ జనరేషన్

By Anil

మారుతి సుజుకి తమ సరికొత్త ఎర్టిగా ఎమ్‌పీవీ వాహనాన్ని కొత్త వెర్షన్‌లో విడుదల చేయడానికి ఏర్పాట్లు సిద్దం చేసుకుంది. ఎమ్‌పీవీ సెగ్మెంట్లోకి కొత్త రూపంలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మారుతి పలుమార్లు న్యూ వెర్షన్ ఎర్టిగా కారును భారతీయ రోడ్ల మీద పరీక్షించింది.

మారుతి ఎర్టిగా

వచ్చే ఏడాది ఆగష్టులో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసిన మారుతి ఎర్టిగా బాడీ పరిమాణానాన్ని పెంచినట్లు తెలిసింది. దీంతో విశాలమైన క్యాబిన్‌లో సౌకర్యవంతమైన 7-సీటింగ్ లేఔట్ అందించే ప్రయత్నం చేస్తోంది.

మారుతి ఎర్టిగా

టయోటా ఇన్నోవా క్రిస్టా కు గట్టి పోటీని సృష్టించేందుకు ఎర్టిగా ఎమ్‌పీవీని మోనోకోక్యూ బాడీ ఆధారంగా సరికొత్త స్విఫ్ట్ మరియు డిజైర్ కార్లను నిర్మించిన హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద మారుతి దీనిని నిర్మిస్తోంది.

Recommended Video

Mahindra KUV100 NXT Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మారుతి ఎర్టిగా

2018 ఎర్టిగా లో తక్కువ స్టీల్ వినియోగించి తేలికపాటి బరువుతో ధృడంగా నిర్మిస్తోంది. దీంతో బరువు గణనీయంగా బరువు తగ్గడమే కాకుండా... మైలేజ్ పెరగనుంది. అంతే కాకుండా అత్యుత్తమ ఇంజన్ పవర్ మరింత మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని కలిగిస్తుంది.

మారుతి ఎర్టిగా

మారుతి సరికొత్త 2018 ఎర్టిగా ఎమ్‌పీవీలో నూతన పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను అందివ్వనుంది. డీజల్ ఇంజన్ కోసం సుజుకి ప్రత్యేకంగా సరికొత్త టుర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను తయారు చేస్తోంది. 1.4-లీటర్ కెపాసిటితో వచ్చే అవకాశం గల ఇది 90బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

మారుతి ఎర్టిగా

పెట్రోల్ ఇంజన్‌ను కూడా 1.5-లీటర్ వెర్షన్‌లో అభివృద్ది చేస్తున్నారు. అయితే, ఇది టుర్బోఛార్జ్‌డ్ కాదని తెలిసింది. మారుతి అభివృద్ది చేస్తున్న నూతన పెట్రోల్ ఇంజన్‌తో రానున్న మొదటి కారు సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కాగా, ఎర్టిగా కొత్త డీజల్ ఇంజన్‌తో రానుంది.

మారుతి సుజుకి ఎర్టిగా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి కొత్త మోడళ్ల విడుదలతో పాటు, ఇప్పటికే ఉన్న పాత మోడళ్లకు అప్‌డేట్స్ నిర్వహించి మళ్లీ విడుదల చేసింది. అందులో డిజైర్ ఇప్పటికే విడుదల కాగా, మారుతి పాపులర్ మోడళ్లయిన సియాజ్, ఎర్టిగా మరియు స్విఫ్ట్ కార్లను వచ్చే ఏడాది విడుదల చేయనుంది.

Images source:Team-BHP

Render courtesy: Adrians Ramadhani

More from DriveSpark

Article Published On: Thursday, October 19, 2017, 18:40 [IST]
English summary
Read In Telugu: All-new Maruti Ertiga India launch details revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+