ఆడి క్యూ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ: ఇది ఎంత వరకు బెస్ట్ లగ్జరీ కార్?

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ లగ్జరీ కారు 'ఆడి క్యూ3'ని మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఇటీవలే ముంబైలో టెస్ట్ డ్రైవ్ చేసింది. ఆడి అందిస్తున్న ఈ బుజ్జి క్యూ సిరీస్ ఎస్‌యూవీలోని ప్లస్‌లు, మైనస్‌‌లు ఏంటో మనం ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

ఆడి క్యూ3 పేరుకే ఎంట్రీ లెవల్ లగ్జరీ కారు అయినప్పటికీ, ఇందులో అనేక విలాసవంతమైన ఫీచర్లు మరియు అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. పైపెచ్చు దీని కాంపాక్ట్ డిజైన్ తొలిచూపులోనే కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఆడి ఇండియా ఇటీవలే తమ క్యూ3 ఎస్‌యూవీలో 2.0టి క్వాట్రో పెట్రోల్ ఇంజన్ కలిగిన వేరియంట్‌ను విడుదల చేసింది.

మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఈ పవర్‌ఫుల్ అండ్ ఎఫీషియెంట్ పెట్రోల్ వెర్షన్ ఆడి క్యూ3ని టెస్ట్ డ్రైవ్ చేసింది. వాస్తవానికి మన దేశంలో అనేక మంది ఎస్‌యూవీ కొనుగోలుదారులు మైలేజ్, రన్నింగ్ కాస్ట్‌లను దృష్టిలో ఉంచుకొని డీజిల్ వెర్షన్లకే ప్రాధాన్యత ఇస్తుంటారు. పెట్రోల్ వెర్షన్ ఎస్‌యూవీలకు ప్రాధాన్యం ఇచ్చే వారి సంఖ్య చాలా తక్కువ.

కానీ, ఆడి క్యూ3 2.0టి పెట్రోల్ వెర్షన్‌ను ఒక్కసారి నడిపిన వారు మాత్రం, డీజిల్ వెర్షన్ ఎస్‌యూవీని కొనాలనే తమ నిర్ణయాన్ని మార్చుకోవటం ఖాయం అని చెప్పవచ్చు. ఆడి కార్లు నాణ్యతకు పెట్టింది పేరు, వీటిని ఫిట్ అండ్ ఫినిష్ విషయంలో కస్టమర్లు కళ్లు మూసుకొని ఈ బ్రాండ్ కార్లను కొనేయవచ్చు.

ఆడి క్యూ3 2.0 లీటర్ టిడిఐక్యూ డీజిల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ టిఎఫ్ఎస్ఐక్యూ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతోంది. ఈ ఇంజన్లు వరుసగా 177 హార్స్‌పవర్‌ల శక్తిని మరియు 211 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ ఫొటో ఫీచర్‌లోని మా రివ్యూలో పరిశీలించండి.

పరిచయం

పరిచయం

ఆడి ఇండియా తమ క్యూ3 ఎస్‌యూవీ 2013లో భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే, అంతకంటే ముందుగా 2012లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆడి ఇండియా ఈ కారును ఆవిష్కరించింది. డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ చేసిన ఆడి క్యూ3 ఎస్‌యూవీ సంబంధించిన పూర్తి సమీక్షను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

* టెస్ట్ డ్రైవ్ చేసిన మోడల్: 2.0 టిఎఫ్ఎస్ఐ క్వాట్రో (పెట్రోల్)

* కారును టెస్ట్ చేసిన వారు: అజింక్యా పారాలికర్

* టెస్ట్ చేసిన దురం: 180 కిలోమీటర్లు, ముంబై

* ధర: రూ.32.63 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఆడి క్యూ3 ధరల జాబితా (ఏప్రిల్ 2014 నాటికి)

ఆడి క్యూ3 ధరల జాబితా (ఏప్రిల్ 2014 నాటికి)

దేశీయ విపణిలో ఆడి క్యూ3 ధరలు రూ.24.02 లక్షల నుంచి రూ.38.51 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. పూర్తి బ్రేకప్‌ను ఇలా ఉంది:

* ఆడి క్యూ3 ఎస్ ఎడిషన్ - రూ.24.02 లక్షలు

* ఆడి క్యూ3 2.0 టిడిఐ క్వాట్రో బేస్ గ్రేడ్ - రూ.29.69 లక్షలు

* ఆడి క్యూ3 2.0 టిడిఐ హై బేస్ గ్రేడ్ - రూ.35.28 లక్షలు

* ఆడి క్యూ3 2.0 టిఎఫ్ఎస్ఐ - రూ.32.63 లక్షలు

* ఆడి క్యూ3 2.0 టిఎఫ్ఎస్ఐ క్వాట్రో ప్రీమియం ప్లస్ - రూ.38.51 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఆడి క్యూ3 ఎక్స్టీరియర్స్

ఆడి క్యూ3 ఎక్స్టీరియర్స్

ఆడి క్యూ3 ఎస్‌యూవీ ఫిట్ అండ్ ఫినిష్ చాలా నీట్‌గా ఉంటుంది, ప్యానెల్స్ మరియు ప్లాస్టిక్స్ మధ్య ఎలాంటి ఖాలీ ఉండకుండా నీట్‌గా ఫిక్స్ చేయబడి ఉంటాయి. మేము టెస్ట్ డ్రైవ్ చేసింది డార్క్ బ్లూ కలర్ ఆడి క్యూ3, దీని పెయింట్ జాబ్ చాలా ఆకర్షనీయంగా ఉంది. ఆడి క్యూ సిరీస్ ఎస్‌యూవీ డిజైన్ లాంగ్వేజ్‌ను ప్రతిభింభింపజేసేలా ఈ బుజ్జి ఎస్‌యూవీని డిజైన్ చేశారు. దూరం నుంచి చూస్తే, ఇది చిన్నదిగా అనిపించినప్పటికీ, వాస్తవానికి ఇది 4.39 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది.

ఆడి క్యూ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ

అన్ని ఆడి కార్లలో మాదిరిగానే ఈ ఆడి క్యూ3లో కూడా C (సి) ఆకారంలో ఉండే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో కూడిన హెడ్‌లైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. జెనాన్ ప్లస్ యూనిట్‌తో పాటుగా ఓ ఆప్షనల్ వెడ్జెడ్ హెడ్‌లైట్ క్లస్టర్ కూడా అందుబాటులో ఉంది. టెయిల్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి లైట్లలో లభిస్తాయి. ముందు వైపు ఫాగ్ ల్యాంప్స్ చిన్నివిగా ఉండి, బంపర్ క్రింది భాగంలో అమర్చబడి ఉంటాయి.

ఆడి క్యూ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఆడి క్యూ3 ఎక్స్టీరియర్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే, వీటి బాడీ లైన్స్. ఎస్‌యూవీకి మరింత స్పోర్టీ అప్పీల్‌నిచ్చేలా దీని బాడీ లైన్స్‌ను డిజైన్ చేశారు. బోరింగ్‌గా లేని ఓ స్టయిలిష్ ప్రీమియం ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే అంతర్జాతీయ కస్టమర్లను టార్గెట్‌గా చేసుకొని దీని ఎక్స్టీరియర్స్‌ను డిజైన్ చేశారు.

ఆడి క్యూ3 కలర్ ఆప్షన్స్

ఆడి క్యూ3 కలర్ ఆప్షన్స్

ఆడి క్యూ3 ఎస్‌యూవీ ఫాంటమ్ బ్లాక్, మిసానో రెడ్ పెరల్, అమల్ఫీ వైట్, సమోవా ఆరెంజ్, కారిబౌ బ్రౌన్, ఐస్ సిల్వర్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే ఇది గ్లాసీయర్ వైట్ మెటాలిక్ మరియు కోబాల్ట్ బ్లూ మెటాలిక్ అనే మెటాలిక్ ఫినిష్ పెయింట్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.

ఆడి క్యూ3 ఇంటీరియర్స్

ఆడి క్యూ3 ఇంటీరియర్స్

ఇందులోని గ్రే అండ్ బీజ్ కలర్ కాంబినేషన్‌తో తయారు చేసిన విలాసవంతమైన ఇంటీరియర్లు ఆడి బ్రాండ్ ఇమేజ్‌ను తలపిస్తాయి. అయితే, డ్యాష్‌బోర్డుపై అమర్చిన ఉడెన్ పీస్ మాత్రం మాకెందుకో అంత ఆకర్షనీయంగా అనిపించలేదు, దానిని అసలు పూర్తిగా తొలగించి వేసినా బాగుండేదనిపించింది. ఇందులోని గ్యాడ్జెట్స్ అన్నీ కూడా సులువుగా అర్థం చేసుకునేలా ఉంటాయి. కొత్తగా ఈ కారును నడిపే వారికి వీటిని అర్థం చేసుకోవటానికి ఎక్కువ సమయం పట్టదు. ఇన్ఫోటైన్‌మెంట్ కన్సోల్‌ను మధ్యలో ఉంచడం వలన ఇది డ్రైవర్ దృష్టికి ఆటంకం కలిగించదు. అంతేకాదు అవసరం లేదనుకుంటే, దీనిని క్లోజ్ చేసుకోవచ్చు కూడాను.

ఆడి క్యూ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఈ ఎస్‌యూవీలోని వెనుక సీటులో ముగ్గురు ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. దానికి తగినట్లుగానే మూడు సీట్ బెల్టులు, మూడు హెడ్‌రెస్ట్‌లను కూడా ఇందులో అమర్చారు. ఇందులోని విశాలమైన లెగ్‌రూమ్ ప్రయాణీకులకు మంచి సౌకర్యాన్నిస్తుంది. అలాగే, వెనుక సీటులో కూర్చునే ప్రయాణీకులకు సైతం ఎయిర్ కండిషనింగ్ వచ్చేలా ఇందులో రియర్ ఏసి వెంట్స్ అమర్చారు.

ఆడి క్యూ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ

డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్‌కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఇందులో డ్రైవర్ సీటును డిజైన్ చేశారు. కారును నడిపే డ్రైవర్ యొక్క సౌలభ్యాన్ని బట్టి ఈ సీటుకు తమకు నచ్చిన విధంగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఇందులో ప్రీమియం లెథర్ సీట్స్ లాంగ్ జర్నీలకు మరింత సౌకర్యంగా ఉంటాయి.

ఆడి క్యూ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఆడి క్యూ3 ఎస్‌యూవీ రెండు వరుసల సీట్లను కలిగి ఉంటుంది. అయితే, ఇందులోని వెనుక వరుసలో ఉండే సీట్ల యొక్క హెడ్‌రెస్ట్‌ల హైట్‌ను పెంచినట్లయితే, డ్రైవర్ సెంటర్ రియర్ వ్యూ మిర్రర్‌లో నుంచి స్పష్టంగా చూడటం కష్టమవుతుంది. కాబట్టి డ్రైవింగ్‌లో మెరుగైన విజిబిలిటీ కావాలంటే, వీటిని లోవర్ పొజిషన్‌లో ఉంచటమే ఉత్తమం.

ఆడి క్యూ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఆడి క్యూ3లో విశాలమైన బూట్ స్పేస్ ఉంది, దీని సామర్థ్యం 460 లీటర్లు. బూట్ స్పేస్ మరింత కావాలనుకుంటే, వెనుక సీటర్లను మడచుకోవచ్చు, అప్పుడు లభించే బూట్ స్పేస్ సామర్థ్యం 1365 లీటర్లు. వెనుక సీట్లను 60:40 నిష్పత్తిలో ఫోల్డ్ చేసుకోవచ్చు.

ఆడి క్యూ3 ఫీచర్లు

ఆడి క్యూ3 ఫీచర్లు

ఆడి క్యూ3లో రెండు అనలాగ్ మీటర్స్ మరియు వాటి మధ్యలో ఓ డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ అనలాగ్ మీటర్లు ఆర్‌పిఎమ్, ఇంజన్ ఆయిల్ టెంపరేచర్, స్పీడ్, ఫ్యూయెల్ లెవల్ వంటి బేసిక్ ఇన్‌ఫర్మేషన్‌ను ఇస్తాయి. ఇకపోతే డిజిటల్ డిస్‌ప్లే ట్రిప్ మీటర్స్, మీరు నడిపిన దూరం, సగటు వేగం, సగటు మైలేజ్, డోర్ ఓపెన్ వార్నింగ్ వంటి అనేక అంశాలను తెలియజేస్తుంది.

ఆడి క్యూ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఆడి క్యూ3లోని ఇన్ఫోటైన్‌మెంట్ వినోదంతో పాటుగా సమాచారాన్ని కూడా అందిస్తుంది. దీని సాయంతో మీరు మ్యూజిక్/రేడియో వినటంతో పాటుగా నావిగేషన్‌ను కూడా పొందవచ్చు. అంతేకాకుండా, ఇది రివర్స్ పార్కింగ్ కెమెరా డిస్‌ప్లే యూనిట్ గాను మరియు అదనపు కనెక్టివిటీ కోసం బ్లూటూత్ గాను కూడా ఉపయోగపడుతుంది.

ఆడి క్యూ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఆడి క్యూ3 స్టీరింగ్ వీల్‌పై అవసరమైన కంట్రోల్స్ అన్నీ లేకుండా కావల్సిన కంట్రోల్స్‌తో సింపుల్‌గా ఉంటుంది. మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్, ట్రిప్ మీటర్స్, డిస్టన్స్ టూ ఎంప్టీ వంటి ఫీచర్లను కంట్రోల్స్ చేసుకునేందుకు వీలైన కంట్రోల్స్‌ను స్టీరింగ్ వీల్‌పై చూడొచ్చు. ఇంకా అనేక ఫీచర్లను స్టీరింగ్ వీల్‌ను వదలకుండానే యాక్సెస్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది.

ఆడి క్యూ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఆడి క్యూ3 సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తుంది. ఈ సన్‌రూఫ్‌ను యాంత్రికంగా కంట్రోల్ చేసుకోవచ్చు. కారు లోపల రూఫ్‌పై అమర్చిన కంట్రోల్స్‌లో ఒక్క బటన్‌ను నొక్కగానే సన్‌రూఫ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇంటీరియర్ లైట్లను కూడా స్విచ్ ఆన్/ఆఫ్ చేసుకోవచ్చు.

ఇంజన్

ఇంజన్

ఇందులో 2.0 లీటర్ టిఎస్ఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 211 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది క్వాట్రో సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు బదిలీ అవుతుంది. ఇదొక ఆల్-వీల్ డ్రైవ్ ఎస్‌యూవీ. ఈ ఇంజన్ రన్నింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది, దీని వలన క్యాబిన్‌లో ఎలాంటి శబ్ధం వినిపించదు. ఆడి క్యూ3 ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది, తక్కువ వేగం వద్ద వెళ్లే టప్పుడు పికప్ కొంచెం తక్కువ అనిపిస్తుంది.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

ఆడి క్యూ3 ఎస్‌యూవీని ఎంత భయకరంగా నడిపినా కూడా ఇది సురక్షితమైన ఫీల్‌నిస్తుంది. ఎందుకంటే, ఇందులోని సాంకేతికపరమైన మరియు భద్రతా అంశాలు అంత పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తాయి కాబట్టి. పెర్ఫార్మెన్స్ విషయంలో, ఈ కారును ఎస్ మోడ్‌లో ఉంచితే మరింత ఎక్కువ పవర్‌ను ఫీల్ అవ్వొచ్చు. ఇందులోని ఆటో స్టార్ట్/స్టాఫ్ ఫీచర్‌ను చాలా మంది ఉపయోగించరు, మెరుగైన మైలేజీ కావాలనుకుంటే ఈ ఫీచర్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి.

మైలేజ్

మైలేజ్

లక్షలు పోసి ఆడి లాంటి కార్లను ఖరీదు చేసేటప్పుడు మైలేజ్ గురించి ఆలోచించే వారు చాలా తక్కువగా ఉంటారు. ఏదేమైనప్పటికీ, ఆడి క్యూ3 పెట్రోల్ వెర్షన్ అయినప్పటికీ, ఇది మెరుగైన మైలేజీనే ఇస్తుందని చెప్పాలి. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఇది లీటరుకు 11.72 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. అయితే, రియల్ వరల్డ్ కండిషన్స్ ప్రకారం ఇది లీటరుకు సగటున 10.2 కి.మీ. మైలేజీనిస్తుంది. ఈ సెగ్మెంట్లోని బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 లీటరుకు 15 కి.మీ. మైలేజీనిస్తుంది.

ట్రాన్సిమిషన్

ట్రాన్సిమిషన్

ఆడి క్యూ3లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఆఫర్ చేస్తున్నారు, దీనిని డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా అరుదుగా గేర్ మారిగిన అనుభం కలుగుతుంది. ఇందులో డ్రైవింగ్ మోడ్‌ల మధ్య మారే ట్రిగ్గర్ టైప్ మెకానిజం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రత్యేకించి ఇందులోని స్పోర్ట్స్ మోడ్‌లో మనకు నచ్చిన విధంగా మ్యాన్యువల్‌గా గేర్లను మార్చుకోవచ్చు. ఇందులోని ఆల్ వీల్ డ్రైవ్ క్వాట్రో సిస్టమ్ ఆఫ్-రోడింగ్‌కు మరియు లూజ్ రోడ్లకు చక్కగా ఉంటుంది.

డ్రైవ్ అండ్ హ్యాండ్లింగ్

డ్రైవ్ అండ్ హ్యాండ్లింగ్

తారు రోడ్లపై అలాగే లూస్ గ్రావెల్ రోడ్లపై ఈ కారు సమర్థవంతమైన హ్యాండ్లింగ్‌ను కలిగి ఉంటుంది. కారు నడిపేవారు చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతారు, కొద్దిగా బాడీ రోల్ అనిపిస్తుంది. ఇదివరకు చెప్పుకున్నట్లుగానే ఇన్‌స్టాంట్ పికప్ కొంచెం తక్కువగా ఉందనిపిస్తుంది.

బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్

బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్

ఆడి క్యూ3 బ్రేకింగ్ సిస్టమ్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఇది సమర్థవంతమైన బ్రేకింగ్‌ను ఆఫర్ చేస్తుంది. ప్రత్యేకించి అత్యవసర సమయాల్లో దీని బ్రేకింగ్ సిస్టమ్ చాలా చక్కగా పనిచేస్తుంది. సస్పెన్షన్ చాలా సాఫ్ట్‌గా అనిపిస్తుంది. ప్రత్యేకించి గతుకుల రోడ్లపై ప్రయాణిస్తున్న దీనిని సస్పెన్షన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది.

క్వాట్రో సిస్టమ్ హిస్టరీ

క్వాట్రో సిస్టమ్ హిస్టరీ

క్వాట్రో అనేది ఆడి ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్, ఆడి ఈ సిస్టమ్‍‌ను తొలిసారిగా 1980 మార్చ్ 3వ తేదీన జరిగిన జెనీవా మోటార్ షో ద్వారా పరిచయం చేసింది. ఇదివరకు ఆడి తమ రోడ్/ర్యాలీ కారును క్వాట్రో అని పిలిచేది, ఆ కారును 1991 వరకు ఉత్పత్తి చేశారు. క్వాట్రో అంటే ఇటాలియన్ భాషలో నాలుగు అని అర్థం. ఈ జర్మన్ కార్ కంపెనీ ఇప్పుడు తమ అన్ని ఫోర్-వీల్ డ్రైవ్ మోడళ్లకు క్వాట్రో సిస్టమ్‌ను ఆఫర్ చేస్తుంది.

ఆడి క్యూ3లో మాకు నచ్చనివి

ఆడి క్యూ3లో మాకు నచ్చనివి

వాస్తవానికి ఆడి క్యూ3లో ఎవ్వరికీ నచ్చని విషయం/అంశం అంటూ ఏదీ ఉండకపోవచ్చు. అయితే, ఇంటీరియర్‌లో క్లీన్‌గా ఉండే డ్యాష్‌బోర్డుపై ఉడ్ ఇన్‌సెర్ట్‌ను ఉంచడం మాకు నచ్చని అంశంగా చెప్పుకోవచ్చు.

ఆడి క్యూ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ

డ్రైవింగ్ ఎక్స్‌పీరెయన్స్, రైడ్ కంఫర్ట్, సస్పెన్షన్ సిస్టమ్ చక్కగా ఉన్నప్పటికీ, ఇందులో ప్రధానంగా తక్కవ వేగం నుంచి ఎక్కువ వేగాన్ని వెళ్లేటప్పుకు ఎక్కువ సమయం పట్టడం (సింపుల్‌గా చెప్పాలంటే ఇన్‌స్టాంట్ పికప్ లేకపోవటం) మరో వైఫల్యంగా చెప్పుకోవచ్చు.

మంచి, చెడు, ఎక్స్-ఫ్యాక్టర్

మంచి, చెడు, ఎక్స్-ఫ్యాక్టర్

మంచి:

* ఆడి నుంచి బెస్ట్ లుకింగ్ క్యూ సిరీస్ ఎస్‌యూవీ

* సుపీరియర్ డ్రైవింగ్ సామర్థ్యం

* డ్రైవర్ కోసం ఎక్కువ బ్యాక్ సపోర్ట్

* ఆఫ్ రోడింగ్ యాక్షన్ కోసం డీసెంట్ గ్రౌండ్ క్లియరెన్స్

* విలాసవంతమైన ఇంటీరియర్

* ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీ

* జర్మన్ బిల్డ్ క్వాలిటీ

* అనేక సేఫ్టీ ఫీచర్లు

చెడు:

* యాక్సిలరేషన్‌లో జాప్యం

* ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కన్నా పాత కేబుల్ టైప్ పార్కింగ్ బ్రేక్ ఉంటే బాగుండేది

* డ్యాష్‌బోర్డుపై ఉండే సింగిల్ ఉడ్ ఇన్‌సెర్ట్

* కొన్ని సేఫ్టీ ఫీచర్లను శాశ్వతంగా ఆఫ్ చేయటం సాధ్యం కాకపోవటం

ఎక్స్-ఫ్యాక్టర్:

ఫస్ట్ టైమ్ ప్రీమియం ఎస్‌యూవీని కొనాలకునే వారికి ఆడి క్యూ3 చక్కటి ఆప్షన్. అయితే, అధిక రన్నింగ్ కాస్ట్‌ను దృష్టిలో ఉంచుకొని, ఈ మోడల్‌ను ఎంచుకునే వారి సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది.

వ్యాల్యూ ఫర్ మనీ:

3/5

More from DriveSpark

Article Published On: Wednesday, April 16, 2014, 14:47 [IST]
English summary
Audi Q3 reviewed by Drivespark. We test drive Audi Q3 SUV & list out its off-road capability, features & performance. Audi Q3 engine review, mileage, variants.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+