BYD eMax 7 Full Review డిజైన్, ఫీచర్లతో టెంప్ట్‌ చేస్తున్న కొత్త ఎలక్ట్రిక్‌ MPVని కొనవచ్చా.. లేదా?

చైనీస్ సంస్థ BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థంగా అవతరించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో టెస్లా వంటి కార్ల కంపెనీకి ఇది గట్టి పోటీని ఇస్తుంది. అలాగే భారత్‌లోనూ తమ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు 2021లో e6తో అడుగుపెట్టింది. అయితే ఈ కంపెనీని ముఖ్యంగా ఈ ప్రారంభ ఉత్పత్తిని జనాలు ఆదరించలేదు. దీంతో 2022లో Atto3 కాంపాక్ట్ క్రాస్‌ఓవర్ EV (BYD Atto Compact SUV)ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఏడాది ప్రారంభంలో మార్చిలో సీల్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును (BYD Seal EV)ని కూడా విడుదల చేసింది. తాజాగా BYD eMax 7తో తిరిగి వచ్చింది. దీనిని ఓ విధంగా e6 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అని కూడా చెప్పవచ్చు.

ఈ ఎలక్ట్రిక్‌ ఎంపీవీని 2024 బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో సాంగ్ మ్యాక్స్ EVగా పరిచయం చేసింది. కొత్త BYD eMax 7 ప్రస్తుతం ఉన్న వాటికంటే భారీ అప్‌గ్రేడ్స్‌తో అందరికీ అందుబాటు ధరలో మార్కెట్‌లోకి వచ్చింది. ఈ BYD eMax 7ని మా డ్రైవ్స్‌పార్క్‌ టీమ్‌ టెస్ట్‌డ్రైవ్‌ చేసింది. ఇది ఎలా ఫర్ఫామ్‌ చేసింది. దీనిని కొనవచ్చా.. లేదా? అనే వివరాలు ఈ పూర్తి రివ్యూ ద్వారా తెలుసుకోండి.

BYD eMax 7 Electric MPV Price in India

డిజైన్‌: BYD eMax 7 దాని మునుపటి బీవైడీ కార్లతో పోల్చితే సరికొత్త రూపాన్ని కలిగి ఉంది. దీని ఫ్రంట్ ఎండ్‌లో "డ్రాగన్ ఫేస్" డిజైన్‌, కొత్త LED హెడ్‌ల్యాంప్స్‌, LED డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. BYD నేమ్‌ప్లేట్‌తో క్రోమ్ బార్ ద్వారా కనెక్ట్ చేయబడింది. సైడ్‌లలో ఇంటెక్‌లతో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్, పెద్ద సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్, లెవల్ 2 అడాస్‌ కిట్‌ ఉన్నాయి.

ఇక దీని సైడ్‌ ఫ్రొఫైల్‌, వెనక డిజైన్‌ విషయానికి వస్తే ఈ ఎంపీవీ 225/55 R17 టైర్‌లతో కూడిన కొత్త 17-ఇంచెస్‌ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపున ఫేస్‌లిఫ్టెడ్ MPV కొత్త కనెక్ట్ చేయబడిన LED టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. అలాగే హెడ్‌ల్యాంప్‌లతో పాటు క్రోమ్ కనెక్టింగ్ ఎలిమెంట్, BYD eMax 7 బ్యాడ్జింగ్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్‌ను కలిగి ఉంది.

BYD eMax 7 Electric MPV Driving Impressions

ఇంటీరియర్: ఈ BYD eMax 7 క్యాబిన్‌ భారీ మార్పులు ఉన్నాయి. ఇందులో సులభంగా గమనించదగిన మార్పు ఏదైనా ఉందంటే అది ఫాక్స్ లెదర్ సీటు అప్హోల్స్టరీ బ్రౌన్ కలర్‌వేతో వస్తుంది. దీని క్యాబిన్‌ e6 ఆల్-బ్లాక్ క్యాబిన్‌తో పోలిస్తే eMax 7కి కొంచెం ఎక్కువ స్టైల్, క్లాసీ లుక్‌ని కలిగి ఉంటుంది. eMax 7ని ఆరు లేదా ఏడు-సీటర్‌ కాన్ఫిగరేషన్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

eMax 7 బిగ్‌ 12.3-ఇంచెస్‌ టచ్‌స్క్రీన్ (e6లో 10.1-అంగుళాల యూనిట్ ఉంది) ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ బటన్‌ను తాకినప్పుడు ల్యాండ్‌స్కేప్, పోర్ట్రెయిట్ మోడ్‌లను చూపిస్తుంది. కొత్త స్టీరింగ్ వీల్, 5-ఇంచెస్‌ మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేతో సహా ఉంటాయి. ఇందులోని కొత్త గేర్ లివర్, డ్రైవ్ మోడ్ సెలెక్టర్, డీఫాగర్స్‌ ఉన్నాయి.

BYD eMax 7 Electric MPV Interior

వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ల కోసం కంట్రోలర్‌లతో సహా కొత్త స్విచ్ గేర్‌ను సెంట్రల్ కన్సోల్‌లో కూడా కనుగొనవచ్చు. దీనిలోని ముందు సీట్లను ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు (డ్రైవర్‌కు 6-వే, ఫ్రంట్ ప్యాసింజర్‌కి 4-వే) చేసుకోవచ్చు. eMax 7 లో వెనుక ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చడానికి చాలా పెద్దవిగా, సౌకర్యవంతంగా ఉంటాయి. మధ్య వరుస సీట్లలో సెవెన్-సీటర్ కోసం బెంచ్, 6-సీటర్‌లో(మేము నడిపినవి) కోసం రెండు ఇండిపెండెంట్‌ కెప్టెన్ సీట్లు ఉన్నాయి.

ఇందులోని ఇండిపెండెంట్ సీట్లు సౌకర్యవంతంగా ఉండటానికి అవసరాలను బట్టి ముందుకు, వెనుకకు జరుపుకోవచ్చు. ఈ సీట్లు అలాగే వంగి కూడా ఉంటాయి. లాంగ్‌ జర్నీలో కంఫర్ట్‌గా నిద్రించడానికి, లేదా రెస్ట్‌ తీసుకోవడానికి ఇవి సహాయపడతాయి. ఇది మూడు స్టెప్‌ సీట్లలో 180-లీటర్ బూట్‌ స్పేస్‌, దీనిని మడతపెట్టడం ద్వారా దీనిని 400 నుంచి 580 లీటర్ల భారీ స్పేస్‌ని పెంచుకోవచ్చు.

BYD eMax 7 Electric MPV Range

BYD eMax 7 భారీ పనోరమిక్ రూఫ్‌తో వస్తుంది. ఇది క్యాబిన్ లోపల యాంబియంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ‌అందిస్తుంది. అలాగే రెండవ, మూడవ వరుసల లోని AC సిస్టమ్ కోసం రూఫ్-మౌంటెడ్ వెంట్స్‌, 360-డిగ్రీ కెమెరా, మల్టీ USB A, C పోర్ట్స్‌, పాటు డ్యూయల్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌లతో వస్తుంది. కావున ఈ ఫుల్‌ప్యాక్డ్‌ ఫీచర్లతో ఇంటీరియర్‌ మరింత స్మార్ట్‌ లుక్‌ని కలిగి ఉంటుంది.

పవర్‌ట్రైన్‌: eMax 7 ప్రీమియం, సుపీరియర్‌తో అనే వేరియంట్లలో డిఫరెంట్‌ పవర్‌ట్రైన్‌ ఆప్షన్స్‌తో వస్తుంది. ఈ రెండు వేరియంట్లు మంచి బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. రెండు బ్యాటరీ ప్యాక్స్‌ 7kW AC ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్ట్ చేస్తాయి. ప్రీమియం వేరియంట్‌ 89kW DC ఛార్జింగ్‌ ఆప్షన్‌, అలాగే సుపీరియర్ 115kW ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వస్తుంది. BYD eMax 7 ప్రీమియం 55.4kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.

BYD eMax 7 Electric MPV Powertrain

ఇది 161bhp మరియు 310Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌కు శక్తినిస్తుంది. ఇది ఫుల్‌ ఛార్జ్‌పై NEDC క్లెయిమ్ చేసిన 420కిమీ రేంజ్‌ని అందిస్తుంది. eMax 7 ప్రీమియం 10 సెకన్లలో 0-100km/h వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా 180km/h వేగంతో దూసుకుపోతుంది. ఇక BYD eMax 7 సుపీరియర్ పెద్ద 71.8kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.

ఫ్రంట్ యాక్సిల్‌కు మౌంట్ చేయబడిన సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా దీని పవర్ 201bhpకి పెరుగుతుంది. అయితే గరిష్ట టార్క్ 310Nm వద్ద అలాగే ఉంటుంది. BYD eMax 7 సుపీరియర్ 8.6 సెకన్లలో 0-100km/h వేగాన్ని అందుకుంటుంది. ఇది సింగిల్‌ ఛార్జ్‌లో 530 రేంజ్‌ని అందిస్తుంది. ఇది 180km/h వేగంతో ప్రయాణిస్తుంది.

BYD eMax 7 Electric MPV Design

సేఫ్టీ: BYD eMax 7లో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, EBDతో కూడిన ABS, ESC, ట్రాక్షన్ కంట్రోల్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, TPMS వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అలాగే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, కొలిషన్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, లాండే డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ఫీచర్లతో లెవెల్ 2 ADAS సూట్‌ని కూడా కలిగి ఉంది.

డ్రైవింగ్ ఇంప్రెషన్స్‌: ఈ BYD eMax 7ఎలక్ట్రిక్ మోటారు నుంచి ఒకేరీతిన పవర్ డెలివరీని విడుదల చేస్తుంది. దీంతో సిటీ డ్రైవింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. అయితే దీనిని తక్కువ వేగంతో డ్రైవ్‌ చేసినప్పుడు స్టీరింగ్ చాలా తేలికగా అనిపిస్తుంది. రద్దీగా ఉండే నగర వీధుల్లో సులభంగా నడపడానికి వీలు కల్పిస్తుంది. హైవేపై అధిక వేగంతో, స్టీరింగ్ బరువు పెరుగుతుంది.

BYD eMax 7 Electric MPV Boot Space

ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే 3 డ్రైవ్‌ మోడ్స్‌ ఉన్నాయి. మీరు థొరెటల్ పెడల్‌ను క్రిందికి నెట్టినప్పుడు వీటిలో తేడా గమనించవచ్చు. ఎకోలో రెస్పాన్స్‌ చాలా కూల్‌గా ఉంటుంది. నార్మాల్‌ మోడ్‌లోను ఆశించిన రెస్పాన్స్‌ని పొందవచ్చు. ఇక స్పోర్ట్స్ మోడ్‌లో eMax 7ని భారీ టార్క్‌ని విడుదల చేస్తుంది. తద్వారా మీరు సులభంగా 3 డిజిట్‌ మార్క్‌ని చేరుకోవచ్చు.

BYD eMax 7పై సస్పెన్షన్ అనేది మేము ఇప్పటి వరకు EVలో అత్యంత తక్కువ సస్పెన్షన్‌ ఫీట్స్‌ ఇందులో ఉన్నాయి. eMax 7 భారీ బరువు ఉన్నప్పటికీ, సస్పెన్షన్ అంత దృఢంగా లేదు, మీరు గడ్డలు, ఇతర రట్‌లను ఎదుర్కొంటారు. ఈ BYD eMax 7 ముఖ్యంగా తక్కువ వేగం వద్ద అధిక వేగాన్ని అందుకునేలా కంపోజ్ చేయబడిన ఎలక్ట్రిక్ MPVగా ఉంది.

BYD eMax 7 Electric MPV Telugu Review

ఇందులోని మృదువైన సస్పెన్షన్‌ సెటప్ వంపుల వద్ద తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది డ్రైవర్లకు మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు భాగం వెంటిలేటెడ్ డిస్క్స్‌, వెనుకవైపు సాధారణ డిస్క్స్‌ ఉన్నాయి. మీరు కొంతకాలం ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ డిస్క్‌లను ఉపయోగించడం చాలా సులభం, కానీ ప్రారంభంలో కొద్దిగా ఇబ్బందులకు గురిచేయవచ్చు.

చివరగా: BYD eMax 7 ప్రపంచంలోని అతిపెద్ద EV తయారీదారు నుంచి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారు భారత్‌లో టయోటా ఇన్నోవా హైక్రాస్‌కు ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. ఇదొక రిఫ్రెష్డ్‌ EVగా కనిపిస్తుంది. ఫుల్‌ ప్యాక్డ్‌ ఫీచర్లు, భారీ రేంజ్‌ని అందించే మంచి ఎలక్ట్రిక్‌ కారు కోసం చూస్తున్నట్లైతే ఇది మీకు ది బెస్ట్‌ ఆఫ్షన్‌ అవుతుంది. దీని ప్రారంభ ధరలు రూ. 26.90 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, October 28, 2024, 9:00 [IST]
English summary
Byd emax 7 review driving impressions specs features in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+