చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విడుదల చేసిన ఎర్టిగా ఎమ్‌పివి జోరుకు చెక్ పెడుతూ అమెరికా అగ్రగామి కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ తమ అధునాత 'చెవర్లే ఎంజాయ్' ఎమ్‌పివిని నేడు మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసినదే. సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లు, సరసమైన ధర, సరికొత్త లుక్ అండ్ ఫీల్, సౌకర్యవంతమైన క్యాబిన్ స్పేస్ తదితర అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని, ప్రత్యేకించి భారతీయ వినియోగదారుల అభిరుచికి తగినట్లు జనరల్ మోటార్స్ తమ ఎంజాయ్ ఎమ్‌పివిని అభివృద్ధి చేసింది.
భారత ఎమ్‌పివి సెగ్మెంట్లో చెవర్లేక ఎంజాయ్ మొదటి ఉత్పత్తి కావటం విశేషం. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం ఆరు వేరియంట్లలో (3 డీజిల్, 3 పెట్రోల్) వేరియంట్లలో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్‌పిల శక్తిని, 13.25 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేయనుంది. అలాగే, డీజిల్ వెర్షన్‌లో అమర్చిన 1.3 లీటర్ ఇంజన్ గరిష్టంగా 76 బిహెచ్‌పిల శక్తిని, 19.17 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ రెండు వెర్షన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి.
చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి 3 ఏళ్లు లేదా 45,000 కిలోమీటర్లు (ఎది ముందుగా ముగిస్తే అది) వారంటీతో లభిస్తుంది. ఈ వారంటీలో క్లచ్, ప్లెజర్ ప్లేట్, రిలీస్ బేరింగ్, బ్రేక్ ప్యాడ్స్, లేబర్ చార్జీలు మొదలైనవి కవర్ అవుతాయి. అయితే ఇందులో బ్యాటరీలు, టైర్లు మరియు ప్రమాదకర రిపేర్లు వంటి మాత్రం కవర్ కావు. ఇది ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో (వెల్వెట్ రెడ్, కేవియర్ బ్లాక్, లీనెన్ బీజ్, స్విచ్‌బ్లేడ్ సిల్వర్, శాండ్‌డ్రిఫ్ట్ గ్రే, సమ్మిట్ వైట్) లభ్యమవుతుంది. కొనుగోలుదారుల ఎంపికను బట్టి ఇందులో 7-సీటర్, 8-సీటర్ ఆప్షన్లు ఆందుబాటులో ఉంటాయి.
చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిలో పవర్ స్టీరింగ్, వెనుక సీట్లలోని (2వ వరుస, 3వ వరుస) ప్యాసింజర్ల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రియర్ ఏసి వెంట్స్, ఆల్ పవర్ విండోస్, ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకునే సామర్థ్యం కలిగిన బాడీ నిర్మాణం (సేఫ్ కేజ్ బాడీ స్ట్రక్చర్), డే అండ్ నైట్ రియర్ వ్యూ మిర్రర్, డ్యూయెల్ కలర్డ్ బంపర్స్, రెండు కెప్టెన్ సీట్లపై అడ్జస్టబల్ ఆర్మ్ రెస్ట్స్, టిల్ట్ క్వార్టర్ విండో, ఫ్లెక్సి స్మార్ట్ డబుల్ ఫోల్డింగ్ ధర్డ్ రో సీట్స్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి. మొత్తమ్మీద చూసుకుంటే, ఇది ఈ సెగ్మెంట్లో ఎర్టిగా కన్నా ఎన్నో రెట్లు బెస్ట్ అని చెప్పవచ్చు. మరిన్ని ఫీచర్లను క్రింది ఫొటోల్లో పరిశీలించవచ్చు.

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విడుదల చేసిన ఎర్టిగా ఎమ్‌పివి జోరుకు చెక్ పెడుతూ అమెరికా అగ్రగామి కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ తమ అధునాత 'చెవర్లే ఎంజాయ్' ఎమ్‌పివిని మార్కెట్లోకి విడుదల చేసింది.

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
ఈ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి తెర లేపుతూ రూ.5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే కంపెనీ ఈ ఎమ్‌పివిని అందిస్తుంది.

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
ఇదే సెగ్మెంట్లో లభిస్తున్న మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి ప్రారంభ ధర రూ.5.98 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
పవర్‌ఫుల్ హెడ్‌ల్యాంప్స్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
స్టయిలిష్ ఫాగ్‌ల్యాంప్స్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
ఆకర్షనీయమైన 4-లైన్ క్రోమ్ గ్రిల్, పెద్ద హనీ కోంబ్ గ్రిల్ ఎయిర్ ఇన్‌టేక్ డ్యామ్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
రియర్ వైపర్ విత్ వాషర్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
డ్యూయెల్ కలర్ ఇంటీరియర్స్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
7-సీటర్, 8-సీటర్ ఆప్షన్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
విశాలమైన లెగ్‌రూమ్ అండ్ ఇంటీరియర్ క్యాబిన్ స్పేస్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
వెనుక సీట్లలోని ప్యాసింజర్ల కోసం 12-వోల్ట్ పవర్ సాకెట్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
హైట్ అడ్జస్టబల్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్స్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
డిజిటల్ అండ్ అనాలాగ్ కాంబినేషన్ మీటర్ కన్సోల్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
స్మూత్ గేర్ షిఫ్టింగ్ ఫీల్‌నిచ్చే 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
బాడీ కలర్డ్ సైడ్ వ్యూ మిర్రర్స్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
6-స్పోక్, 14-ఇంచ్ అల్లాయ్ వీల్స్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
పెట్రోల్ వెర్షన్ చెవర్లే ఎంజాయ్ ధరలు:
- చెవర్లే ఎంజాయ్ ఎల్ఎస్ 8 సీటర్ - రూ.5.49 లక్షలు
- చెవర్లే ఎంజాయ్ ఎల్ఎస్ 7 సీటర్ - రూ.5.54 లక్షలు
- చెవర్లే ఎంజాయ్ ఎల్‌టి 7 సీటర్ - రూ.6.31 లక్షలు
- చెవర్లే ఎంజాయ్ ఎల్‌టిజెడ్ 7 సీటర్ - రూ.6.99 లక్షలు
- చెవర్లే ఎంజాయ్ ఎల్ఎస్ 8 సీటర్ - రూ.6.69 లక్షలు
- చెవర్లే ఎంజాయ్ ఎల్ఎస్ 7 సీటర్ - రూ.6.75 లక్షలు
- చెవర్లే ఎంజాయ్ ఎల్‌టి 7 సీటర్ - రూ.7.42 లక్షలు
- చెవర్లే ఎంజాయ్ ఎల్‌టిజెడ్ 7 సీటర్ - రూ.7.99 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
డీజిల్ వెర్షన్ చెవర్లే ఎంజాయ్ ధరలు:
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి 3 ఏళ్లు లేదా 45,000 కిలోమీటర్లు (ఎది ముందుగా ముగిస్తే అది) వారంటీతో లభిస్తుంది.

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
వెల్వెట్ రెడ్ కలర్ ఆప్షన్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
కేవియర్ బ్లాక్ కలర్ ఆప్షన్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
లెనిన్ బీజ్ కలర్ ఆప్షన్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
స్విచ్‌బ్లేడ్ సిల్వర్ కలర్ ఆప్షన్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
సమ్మిట్ వైట్ కలర్ ఆప్షన్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ
శాండ్‌డ్రిఫ్ట్ గ్రే కలర్ ఆప్షన్

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి రివ్యూ



Click it and Unblock the Notifications








