చెవర్లే సెయిల్: చీప్ అండ్ బెస్ట్ సెడాన్ - కార్ రివ్యూ
అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ అందరినీ ఆశ్చర్య పరుస్తూ అతి తక్కువ ధరకే తమ సెయిల్ సెడాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే జనరల్ మోటార్స్ తమ సెయిల్ సెడాన్‌ను అందిస్తోంది. జిఎమ్ ఇండియా తాజాగా మార్కెట్లో విడుదల చేసిన సెయిల్ యువా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన ఈ సెయిల్ సెడాన్ సరసమైన ధరలో లభించే సెడాన్‌లలో ముందుండటమే కాకుండా, సౌకర్యవంతమైన అనుభూతిని కూడా కల్పిస్తుంది.
ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, టొయోటా ఎతియోస్, ఫోర్డ్ క్లాసిక్, మహీంద్రా వెరిటో, టాటా ఇండిగో ఈసిఎస్ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీగా వచ్చిన చెవర్లే సెయిల్ సెడాన్ 370 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్‌ను కలిగి ఉండి మంచి లగేజ్ స్పేస్‌ను ఆఫర్ చేయనుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. భారతీయ రోడ్లకు అనుగుణంగా ఈ కారు సస్పెన్షన్‌ను, 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‍ను ట్యూన్ చేశామని కంపెనీ పేర్కొంది.
పెట్రోల్ వెర్షన్ సెయిల్‌లో 1.2 లీటర్ (1199సీసీ) స్మార్టెక్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 86 పిఎస్‌ల శక్తిని, 113 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే డీజిల్ వెర్షన్ సెయిల్‌లో ఫియట్‌ను గ్రహించిన 1.3 లీటర్ (1248సీసీ) స్మార్టెక్ టర్బో-ఛార్జ్‌డ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 78 పిఎస్‌ల శక్తిని, 205 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.
మరి చెవర్లే సెయిల్ సెడాన్ విశిష్టతుల, విశేషాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
* స్లీక్ స్టయిలిష్ లుక్స్:
రోడ్డుపై వెళ్తుంటే, అవతలి వాళ్ల తలలు తిప్పుకునేలా, హృదయాలను గెలుచుకునేలా చెవర్లె సెయిల్ సెడాన్‌ను డిజైన్ చేశారు. ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్స్, ఆకట్టుకునే ఇంటీరియర్స్ ఈ కారుకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
* విశాలమైన ఇంటీరియర్ స్పేస్:
సెయిల్‌లో ఉండే ఎక్సలెంట్ లెగ్ రూమ్, విశాలమైన బూట్ స్పేస్, రియర్ సీట్ ఆర్మ్‌రెస్ట్, స్మార్ట్ స్టోరేజ్ స్పేసెస్ వంటి ఫీచర్ల వలన ఇది విలాసవంతమైన కారు అనుభూతిని కల్పిస్తుంది.

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
* సాటిలేని పెర్ఫామెన్స్:
చెవర్లే సెయిల్ యూ-వీఏ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన ఇంజన్లనే చెవర్లే సెయిల్ సెడాన్‌లోను ఉపయోగించనున్నారు. పెట్రోల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1.2 లీటర్ (1199సీసీ) స్మార్టెక్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 86 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 4400 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1.3 లీటర్ (1248సీసీ) స్మార్టెక్ టర్బో-ఛార్జ్‌డ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 78 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 205 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
విశాలమైన ఇంటీరియర్ స్పేస్

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
సౌకర్యవంతమైన వెనుక సీట్లు

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆర్మ్ రెస్ట్, రెండు కప్ హోల్డర్స్

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
బయటి, కారు లోపలి వాతావరణం, ఉష్ణోగ్రతలను బట్టి పనిచేసే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
సైడ్ మిర్రర్లను కారు లోనుంచే ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసుకునే వెసలుబాటు

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
డ్రైవర్ వైపు ఉండే అన్ని పవర్ విండో స్విచ్‌లు, వన్ టచ్ విండో డౌన్/అప్ స్విచ్

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
ఫ్యూయెల్ లిడ్, బూట్ లిడ్ ఓపెనర్ బటన్

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
బ్లూటూత్‌ను సపోర్ట్ చేసే మ్యూజిక్ సిస్టమ్

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
3-స్పోక్ స్టీరింగ్ వీల్ విత్ ఎయిర్‌బ్యాగ్

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
డిజిటల్, అనలాగ్ కాంబినేషన్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
భారతీయ రోడ్లకు అనుగుణంగా తీర్చిదిద్దిన సస్పెన్షన్

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
డ్రైవర్ సౌకర్యార్థం ఏర్పాటు చేసిన టిల్ట్ అడ్జస్టబల్ స్టీరింగ్

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
అత్యవర సమయాల్లో సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
హాక్-వింగ్ స్టయిల్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
370 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
బాడీ కలర్‌లో ఉండే సైడ్ మిర్రర్స్

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
ఫ్రంట్ వ్యూ

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
రియర్ వ్యూ

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
సైడ్ వ్యూ

చెవర్లే సెయిల్ సెడాన్ - రివ్యూ
టాప్ వ్యూ

చెవర్లే సెయిల్ సెడాన్ - ఫొటోలు

చెవర్లే సెయిల్ సెడాన్ - ఫొటోలు

చెవర్లే సెయిల్ సెడాన్ - ఫొటోలు

చెవర్లే సెయిల్ సెడాన్ - ఫొటోలు

చెవర్లే సెయిల్ సెడాన్ - ఫొటోలు



Click it and Unblock the Notifications








