Citroen Basalt SUV Coupe Full Review సరికొత్త కూపే డిజైన్ కారు మెప్పించిందా? ఎలా ఉందో తెలుసుకోండి!
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్ (Citroen) 2019లో భారత మార్కెట్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత సరిగ్గా రెండేళ్లకు 2021లో కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ SUV C5 ఎయిర్‌క్రాస్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ కారు సంస్థ భారత్‌లో ఇప్పటి వరకు నాలుగు కార్లను విడుదల చేసింది. ఇందులో ఒక ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. ఇప్పుడు సిట్రోయిన్ సరికొత్త బాక్సీ డిజైన్‌లో బసాల్ట్ కూపే ఎస్‌యూవీ కంపెనీ పోర్ట్‌ఫోలియో నుంచి 5వ ఉత్పత్తిగా భారత్‌లోకి వస్తుంది. ఈ కారుని గోవాలో టెస్ట్-డ్రైవ్ చేయడానికి మా డ్రైవ్స్‌పార్క్ టీమ్‌కి ఆహ్వానం లభించింది. ఈ కారుని మేము కొన్ని గంటల పాటు టెస్ట్‌డ్రైవ్ చేశాము. ఈ SUV కూపేకి సంబంధించిన పూర్తి రివ్యూ మీకోసం..
డిజైన్: బసాల్ట్ ఆసక్తికరమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఎస్‌యూవీ ఒక స్లోపింగ్ రూఫ్‌లైన్ ఉండటం వల్ల ఇది కూపే స్టైల్ డిజైన్‌ని పొందుతుంది. ఈ డిజైన్‌లో అందుబాటులోకి వస్తున్న తొలి ICE వెర్షన్‌గా ఇది నిలువనుంది. దీని ముందు భాగంలో LED DRLs మరియు LED హెడ్‌లైట్ సెటప్, పియానో బ్లాక్ ఫినిషింగ్ మరియు క్రోమ్ ఫినిషింగ్‌ని కలిగి ఉంది. ఫాగ్ లైట్ హాలోజన్ యూనిట్‌ని కూడా ఉంది.

ఇక సైడ్ డిజైన్‌లో ఇది 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ మరియు చుట్టూ బాడీ క్లాడింగ్‌ను పొందుతుంది. సైడ్ మిర్రర్‌లు బ్లాక్ కలర్‌లో (Gloss black) అందిచబడ్డాయి. పైకప్పు కూడా అలాగే ఉంటుంది. ఇక అలాగే వెనక్కి వెళ్తే వాలుగా ఉన్న రూఫ్‌లైన్, 3D టెయిల్‌లైట్‌లు కనిపిస్తాయి. సైడ్ డిజైన్‌లో ఇది చూడటానికి భారీ ఎస్‌యూవీగా కనిపిస్తుంది.
వెనుకవైపు షార్క్‌ఫిన్ యాంటెన్నా మరియు డీఫాగర్‌లు ఉంటాయి. అయితే వెనుక విండోపై వైపర్‌లు లేవు. ఇక కొంచెం కిందకు వెళ్తే సిట్రోయెన్ మరియు బసాల్ట్ అనే రెండు బ్యాడ్జ్‌లు ఉంటాయి. అక్కడే రివర్స్ కెమెరా ఉన్నా కానీ అది అందులో కలిసిపోయేలా ఉండదు. వెనక భాగం పూర్తిగా క్లాసీ లుక్‌లో ఉంటుంది.

ఇంటీరియర్: లోపలి భాగంలో బసాల్ట్ ట్రిపుల్-టోన్ డాష్‌బోర్డ్‌ను పొందుతుంది. వైర్‌లెస్ Apple CarPlay మరియు AndroidAutoతో కూడిన 10.25 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు 15W వైర్‌లెస్ ఛార్జర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కారు అన్ని వైపులా ఎక్కువ స్టోరేజీ స్పేస్‌ని కూడా పొందుతారు. ఇది C3 ఎయిర్‌క్రాస్‌లో కనిపించే అదే 7-ఇంచెస్ TFT డిస్‌ప్లేను పొందుతుంది.
దీని స్క్రీన్ 3 విభిన్న థీమ్‌లను కలిగి ఉంది. డ్రైవర్ అవసరానికి అనుగుణంగా మీరు థీమ్‌ని మార్చుకోవచ్చు. ఇది కారు గురించిన పూర్తి సమాచారాన్ని ఈ డిస్‌ప్లేలో అందిస్తుంది. ఇది రెండు వైపులా స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్‌తో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ను పొందుతుంది. స్టీరింగ్ వీల్‌ని వంచేలా సర్దుబాటు చేయవచ్చు. అయితే టెలిస్కోపిక్ సర్దుబాటు మాత్రం లేదు.

సీటింగ్: ముందు మరియు వెనుక సీట్లు రెండూ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అదనపు కుషనింగ్ (హెడ్‌రెస్ట్‌లు) కలిగి ఉంటాయి. ఇక వెనక సీట్‌లో 3 స్టెప్ సర్దుబాట్లను చేయగల అండర్-థై సపోర్ట్ ఉంది. దీనివల్ల ఎత్తుగా ఉండే వ్యక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. అలాగే వెనుక హెడ్‌రెస్ట్‌లకు సైడ్ వింగ్స్ ఉండటం వల్ల వెనక కూర్చున్న ప్రయాణికులు నిద్రిస్తున్నప్పుడు తల ఎక్కువగా కదలదు.
వెనుక భాగంలో AC వెంట్లు 2 ఛార్జింగ్ సాకెట్లు ఉన్నాయి. మొత్తం మీద బసాల్ట్ క్యాబిన్ ప్రీమియంగా అనిపిస్తుంది. ఇది మంచి ఫీచర్లను పొందుతుంది. కానీ ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్ మొదలైన కొన్ని ఫీచర్లు ఉండవు. అయినా కానీ దీని ఫీచర్లు మిమ్మల్నీ ఎక్కడా నిరాశకు గురిచేయవు.

ఇంజిన్: బసాల్ట్ 2 రెండూ పెట్రోల్ ఇంజిన్లతో పనిచేస్తుంది. ఒకటి 1.2 NA (న్యాచ్‌రల్ ఆస్పిరేటెడ్) ఇంజిన్ ఇది 82bhp మరియు 115Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు 1.2 టర్బో పెట్రోల్ 3-సిలిండర్ ఇంజిన్ ఇది 109bhp వద్ద మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 190Nm మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 205Nm ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ బసాల్ట్ మంచి యాక్సిలరేషన్‌ని కలిగి ఉంటుంది. ఇది అతి త్వరగా ట్రిపుల్-డిజిట్ మార్క్‌ని అందుకుంటుంది. ఇందులో గేర్ షిఫ్ట్‌లు బాగానే ఉన్నాయి. వీటిలో ఎలాంటి ఇబ్బందులు కనిపించలేదు. స్టీరింగ్ కొంచెం బరువుగా అనిపిస్తుంది. ఇది ఒక విధంగా మంచిది ఎందుకంటే అధిక వేగంలో ఇంలాటి స్టీరింగ్స్ తేలికైనవిగా ఉంటాయి. మొత్తానికి స్టీరింగ్ రెస్పాన్స్ బాగుంది. దీనివల్ల సులభంగా లేన్‌లలోకి మారిపోవచ్చు.

సస్పెన్షన్: బసాల్ట్‌లో సస్పెన్షన్ సెటప్ మీకు ఫ్లయింగ్ కార్పెట్ (గాల్లో ప్రయాణిస్తున్న) అనుభూతిని ఇస్తుంది. ఎత్తు పల్లాలు, గుంతల వద్ద శబ్దాలు ఎక్కువగా వినిపించవు. ఏదైన ఎత్తు కొండ ఎక్కేటప్పుడు క్యాబిన్ లోపల కొంత శబ్దం రావడం మొదలవుతుంది. అయినా కానీ మిమ్మల్నీ ఎక్కడా ఇబ్బందులకు గురిచేయదు.
సేఫ్టీ పరంగా చూస్తే బసాల్ట్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ISOFIX మరియు మరెన్నో సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. మైలేజీ విషయానికి వస్తే రెండు ఇంజిన్లు లీటరుకు సుమారుగా 18 నుంచి 19.5 కిమీల మధ్య మైలేజీ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

చివరగా: ఈ సిట్రోయిన్ బసాల్ట్ SUV కూపే భారతీయ మార్కెట్ మిడ్ రేంజ్ SUVలో ఓ ఉత్తేజకరమైన జోడింపుగా చెప్పవచ్చు. డిఫరెండ్ ఎక్స్‌టీరియర్ డిజైన్ మరియు మంచి ఫీచర్లను కలిగి ఉంది. ఇది ఖచ్చితంగా యువ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. కాబట్టి మీరు మంచి ఫీచర్లను కలిగి ఉండి.. చూడటానికి క్లాసీ లుక్, బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, మంచి పవర్ ఉన్న కారు కోసం వెతుకుతున్నట్లయితే మీకు ఇది బెస్ట్ ఆప్షన్.


Click it and Unblock the Notifications








