Citroen C3 Aircross Automatic సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ డిజైన్ ఇంజిన్ పర్మామెన్స్ పుల్ రివ్యూ
ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ గత సంవత్సరం ఆగస్టులో 4 మెట్రిక్+ SUV సెగ్మెంట్‌లోకి సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ద్వారా ప్రవేశించింది. డిజైన్ సహా ఇతర లుక్స్‌తో ఆకట్టుకుంది. డైవింగ్ అనుభూతి, టర్బో పెట్రోల్ ఇంజిన్ పనితీరుతో ఆకట్టుకుంది.
గత సంవత్సరం విడుదల సమయంలో సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ పెట్రోల్ ఇంజిన్‌తో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు తేలికపాటి క్లచ్‌తో అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ వాహనం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌లో (Citroen C3 Aircross Automatic) అందుబాటులోకి వచ్చింది.

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ కొత్త వేరియంట్ గురించి చెప్పేందుకు సంస్థ మమ్మల్ని సంప్రదించినప్పుడు సంతోషం వ్యక్తం చేశాం. ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ లో ఏయే మార్పులు చేశారో చూడాలని నిర్ణయించుకున్నాం. ఈ కారు ఆటోమేటిక్ వేరియంట్ పూర్తి రివ్యూ కథనం మీకోసం.
సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ రివ్యూ.. ఏయే మార్పులు చోటుచేసుకున్నాయంటే?
C3 ఎయిర్‌క్రాస్‌లో ఆటోమేటిక్ వెర్షన్‌ను మాత్రమే సిట్రోయెన్ తీసుకొచ్చింది. దీనిలో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అమర్చింది. ఈ గేర్‌బాక్స్‌ను జపాన్‌కు చెందిన Aisin నుంచి తీసుకుంది. ఈ ఆటోమేటిక్ వెర్షన్ 1.2 లీటర్ టర్బో ఇంజిన్‌ను కలిగి ఉంది.

ఈ ఇంజిన్ గత మోడల్ కంటే 15Nm టార్క్‌ను అదనంగా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా ఈ ఇంజిన్ గరిష్ఠంగా 205Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 108.4 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్‌లో చేసిన మార్పుల కారణంగా సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ బరువు 34 కేజీలు పెరిగింది.
ఈ గేర్‌బాక్స్ మినహా సెట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్‌లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతోపాటు ఆటోమేటిక్ వేరియంట్‌ను గుర్తించే విధంగా సెట్రోయెన్ ఎటువంటి చిహ్నాలు కారుపై ముద్రించలేదు. కారు లోపలి భాగాన్ని పరిశీలించినప్పుడు మాత్రమే ఆటోమేటిక్ వేరియంట్‌గా గుర్తించవచ్చు.

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ డ్రైవింగ్ ఇంప్రెసన్స్..
సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్‌లో మాన్యువల్ వెర్షన్‌తో పోలిస్తే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్ బరువు పెరిగింది. బరువు పెరగడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మాన్యువల్ వేరియంట్ మాదిరిగానే ఇంజిన్ ఎంతో సౌకర్యవంతంగా ఉంది. మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని కలిగిస్తుంది.
ఈ సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ చాలా మృదువైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా గేర్‌లను మార్చుతుంది. సిటీ ట్రాఫిక్ జామ్‌లు సహా ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేసే సమయంలో ఆటోమేటిక్ వేరియంట్ ఎంతో మెరుగైన పనితీరును కనబరిచింది.

ఈ C3 ఎయిర్‌క్రాస్ లో గేర్లు మార్చేందుకు గేర్ లివర్‌ను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. స్టీరింగ్ వీల్ వెనుక ఎటువంటి ప్యాడిల్ షిఫ్టర్లను కలిగి లేదు. ప్యాడిల్ షిఫ్టర్లు అమర్చాలని కోరుకుంటున్నాం. సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్‌లో ప్యాడిల్ షిఫ్టర్లు మెరుగైన అనుభూతిని అందించే అవకాశం ఉంది.
సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ ఫైనల్ రివ్యూ
మొత్తంగా సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్ మెరుగైన పనితీరును కనబరుస్తుంది. గేర్లు మార్చుకొనేందుకు ఇబ్బంది పడుతున్నవారికి ఈ ఆటోమేటిక్ వేరియంట్ మంచి ఎంపిక కానుంది. మీరు కూడా వెంటనే సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్‌ను డ్రైవ్ చేయండి.


Click it and Unblock the Notifications








