ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల వచ్చే నెలలోనే
ఫేస్‌లిఫ్ట్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని ఫోర్డ్ ఇండియా వచ్చే సెప్టెంబర్ 15 వ తేదీన ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమైంది.
ఫోర్డ్ ఇండియా గత కొంత కాలం నుండి ఫేస్‌లిఫ్ట్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని పరీక్షిస్తోంది. అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు టెస్టింగ్ పూర్తి చేసుకుని ప్రొడక్షన్ దశకు చేరుకున్న ఫేస్‌లిఫ్ట్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని ఫోర్డ్ ఇండియా వచ్చే సెప్టెంబర్ 15 వ తేదీన ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమైంది.

2016 లాంస్ ఏంజిల్స్ ఆటో షో వేదిక మీద ఫోర్డ్ తమ ఫేస్‌లిఫ్ట్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని తొలిసారిగా ఆవిష్కరించింది. సరికొత్త ఫ్రంట్ డిజైన్ మరియు అప్‌డేట్స్‌కు గురైన రియర్ డిజైన్ ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి.
Recommended Video


సరికొత్త ఎకోస్పోర్ట్ ఇంటీరియర్ మొత్తం ప్రస్తుతం విపణిలో ఉన్న రెగ్యులర్ వెర్షన్ ఇంటీరియర్‌నే పోలి ఉండనుంది. అయితే ఎన్నో కొత్త ఫీచర్లు మరియు అదనపు భద్రత ఫీచర్లను ఫోర్డ్ ఇందులో అందివ్వనుంది.

ఫేస్‌లిఫ్ట్ ఎకోస్పోర్ట్ ఇప్పటికే ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ మరియు టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ అదే విధంగా 1-లీటర్ ఎకోబూస్ట్ డీజల్ ఇంజన్ లతో రానుంది. ఇందులో పెట్రోల్ ఇంజన్ 110బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో లభించనుంది.

అదే విధంగా ఇందులో రానున్న డీజల్ ఇంజన్ గరిష్టంగా 99బిహెచ్‌పి పవర్ మరియు 205ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. అదే విధంగా 1-లీటర్ ఎకోబూస్ట్ ఇంజన్ 124బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2013లో విడుదలయ్యింది, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి ఇప్పుడు అప్‌డేట్స్ అవసరం. కాబట్టి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో వస్తోన్న ఎకోస్పోర్ట్ వితారా బ్రిజా మరియు టాటా నెక్సాన్ లకు గట్టిపోటీనివ్వనుంది.


Click it and Unblock the Notifications








