Honda Elevate SUV Full Review హోండా ఎలివేట్‌ డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ ఫర్మామెన్స్‌ పుల్‌ రివ్యూ

హోండా సిటీ ద్వారా సెడాన్‌ సెగ్మెంట్‌లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. దీంతోపాటు కాంపాక్ట్‌ సెడాన్‌లు భారత్‌లో వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో వినియోగదారులను కనెక్ట్‌ కావడంలో హోండా కొన్ని తప్పులు చేసింది. హోండా అత్యుత్తమ ఎస్‌యూవీ CR-V భారత మార్కెట్‌లో భారీ విజయం సాధించలేదు.

అయితే ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన మార్క్‌ నిలుపుకొనేందుకు హోండా ప్రయత్నించింది. కానీ BR-V సరైన బాక్సీ డిజైన్‌ను కలిగి లేదు. అది కాస్త విక్రయాలపై ప్రభావం చూపింది. అయితే ఎలివేట్‌ రూపంలో ఎస్‌యూవీలో సత్తా చాటేందుకు హోండా సిద్ధంగా ఉంది. అయితే భారత మార్కెట్‌లో గణనీయ విక్రయాలను నమోదు చేసేందుకు హోండా ఎలివేట్‌లో ఎటువంటి ప్రత్యేకతలున్నాయో తెలుసుకొనేందుకు.. ఉదయపూర్‌లో ఎలివేట్‌ పనితీరును పరీక్షించాము.

Honda Elevate SUV Full Review

హోండా ఎలివేట్‌ డిజైన్‌, ఫీచర్లు : హోండా ఎలివేట్‌ ఎస్‌యూవీ బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. ఎలివేట్‌ మస్కులర్‌ బానెట్‌, ఫ్రంట్‌ ఎండ్‌, హోండా బ్యాడ్జ్‌ను కలిగి ఉన్న పెద్ద గ్రిల్‌ ఆకట్టుకుంటుంది. హోండా ఎలివేట్‌ ఫ్రంట్‌ గ్రిల్‌కు రెండు వైపులా ఆకర్షణీయమైన LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

ఎలివేట్‌ ఎస్‌యూవీ ఫ్రంట్‌ గ్రిల్‌ వద్దే ఎల్‌ఈడీ DRL కూడా ఉంది. సిటీ సెడాన్‌లో ఉన్నట్లుగా హెడ్‌ల్యాంప్‌లను కనెక్ట్‌ చేసేందుకు క్రోమ్‌ బార్‌ ఉంది. ఎలివేట్‌ బంపర్‌ దిగువున ఫాగ్ ల్యాంప్‌లు ఉంటాయి. అక్కడే ఎయిర్‌డ్యామ్‌ను కూడా చూడొచ్చు.

Honda Elevate SUV Full Review

ఈ ఎస్‌యూవీ ఇరువైపులా ఫేర్డ్‌ వీల్‌ ఆర్చ్‌లను కలుపుతూ ప్లాస్టిక్‌ క్లాడింగ్‌ ఉంటుంది. ఇదే తరహా ప్లాస్టిక్‌ మెటీరియల్‌ డోర్‌ దిగువ భాగాన కూడా ఉంటుంది. హోండా ఎలివేట్‌ ఎస్‌యూవీ 17 అంగుళాల డైమెండ్‌ కట్‌ అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటుంది. హోర్‌ హ్యాండిల్స్‌, విండో లైన్లు క్రోమ్‌తో చేయబడ్డాయి. అదే రూఫ్‌ రైయిల్స్‌ సిల్వర్‌ ఫినిష్‌తో వస్తుంది.

హోండా ఎలివేట్‌ వెనుక వైపున రూఫ్‌ మౌంటెడ్‌ స్పాయిలర్, రేక్డ్‌ రియర్‌ విండ్‌స్క్రీన్‌ త్వరగా ఆకట్టుకుంటాయి. L ఆకారంలోని టెయిల్‌ లైట్లు ఎరుపు రంగులోని ట్రిమ్‌ సాయంతో హోండా బ్యాడ్జ్‌ను కలిగి ఉంటుంది. వెనుక బంపర్‌ దిగువున నలుపు, సిల్వర్‌ రంగుల్లో ప్లాస్టిక్‌ క్లాడింగ్‌ను కలిగి ఉంటుంది.

Honda Elevate SUV Full Review

ఎలివేట్‌ లోపలి భాగాన్ని హోండా ప్రోగ్రెసివ్‌ క్యాబిన్‌ అని పిలుస్తోంది. ఇందులో 10.25 అంగుళాల HD ఇన్ఫోటైన్‌మెంట్‌ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. స్టీరింగ్‌ వీల్‌ వెనుక ఉన్న ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌లో స్పీడోమీటర్‌, 7 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్‌ యూనిట్‌ వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లేను సపోర్టు చేస్తుంది. మరియు 8 స్పీకర్ల సౌండ్‌ సిస్టమ్‌కు కనెక్ట్‌ చేయబడి ఉంటుంది.

హోండా ఎలివేట్‌ SUVలో లగ్జరీ సీటింగ్‌, వైర్‌లెస్‌ ఫోన్ ఛార్జర్‌, సన్‌రూఫ్‌ను కలిగి ఉంటాయి. ఫోన్‌ లేదా స్మార్ట్‌ వాచ్‌ సాయంతోనూ ఎస్‌యూవీకి కనెక్ట్‌ చేసేందుకు, నియంత్రించేందుకు అనుమతి ఇస్తాయి. కొత్త ఎలివేట్‌ ఐదు సంవత్సరాల హోండా కనెక్ట్‌ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది.

Honda Elevate SUV Full Review

హోండా ఎలివేట్‌ SUV అనేక మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్‌, EBDతో కూడిన ABS, వెహికల్‌ స్టెబిలిటీ అసెస్ట్‌, ఎజైల్‌ హ్యాండ్లింగ్‌ అసిస్ట్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, వెనుక పార్కింగ్‌ కెమెరా, పార్కింగ్‌ సెన్సార్లను కలిగి ఉంటుంది.

ఈ సెగ్మెంట్‌లో ADAS (అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్ సిస్టమ్‌)ను కలిగి ఉన్న మూడో ఎస్‌యూవీగా నిలిచింది. ఈ ఎలివేట్‌లో కొలిజన్‌ మిటిగేషన్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, రోడ్‌ డిపార్చర్‌ మిటిగేషన్‌ సిస్టమ్‌, లేన్‌ కీపింగ్‌ అసిస్ట్‌ సిస్టమ్‌, అడాప్టివ్‌ క్రూయిస్‌ కంట్రోల్‌, ఆటో హై బీమ్‌, లీడ్‌ కార్ డిపార్చర్‌ నోటిఫికేషన్‌ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి.

Honda Elevate SUV Full Review

హోండా ఎలివేట్‌ స్పెసిఫికేషన్లు : ఎలివేట్‌ 4392mm పొడవు, 1790mm వెడల్పు, 1650mm ఎత్తును కలిగి ఉంటుంది. 2650mm పొడవైన వీల్‌ బేస్‌ను కలిగి ఉంటుంది. మరియు 220mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో వస్తుంది. ఈ హోండా ఎలివేట్‌ SUV బరువు 1206 కిలోలు ఉంటుంది. అదే CVT వెర్షన్‌లో 1258 కిలోలు ఉంటుంది. కొత్త ఎలివేట్‌ 40 లీటర్ల ఇంధన ట్యాంక్‌, 458 లీటర్ల బూట్‌ స్పేస్‌ కలిగి ఉంటుంది.

ఈ కొత్త ఎస్‌యూవీ హోండా సీటి తరహాలో నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ DOHC, 1.5 లీటర్‌, 4 సిలిండర్‌ i-VETC పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 6,600 rpm వద్ద 119.35bhp శక్తి, 4,300 rpm వద్ద 145Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Honda Elevate SUV Full Review

హోండా ఎలివేట్‌ శక్తిని ఫ్రంట్‌ వీల్‌కు శక్తిని పంపుతుంది. మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌, CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ 15.31 kmpl మైలేజీ, అదే CVT గేర్‌బాక్స్‌ 16.92 kmpl మైలేజీని అందిస్తుంది. CVT గేర్‌బాక్స్‌లో అధిక మైలేజీని పొందవచ్చు.

హోండా ఎలివేట్‌ SUV 16 అంగుళాల స్టీల్‌ వీల్స్‌, 17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటుంది. అల్లాయ్‌ వీల్స్‌లో ముందు టైర్‌ 215/60, వెనుక టైర్లు 215/55 కలిగి ఉంటాయి. స్పేర్‌ వీల్‌ 16 అంగుళాల స్టీల్‌ వీల్‌ ఉంటుంది.

Honda Elevate SUV Full Review

హోండా ఎలివేట్‌ ఎస్‌యూవీ డ్రైవింగ్‌ ఇంప్రెషన్స్‌ : హోండా ఎలివేట్‌ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 7000rpm వరకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇస్తుంది. DOHC ఇంజిన్‌ పవర్‌ లీనియర్‌గా ఉంటుంది. ఎలాంటి రోడ్లపైనైనా స్థిరమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. ఎలివేట్‌ లైట్‌ క్లచ్‌, షార్ట్‌ త్రో గేర్‌బాక్స్‌.. సులభంగా గేర్లను మార్చేందుకు అనుమతిస్తుంది. అయితే ఇంజిన్‌ 3500rpmకు చేరుకున్నప్పుడు క్యాబిన్‌ NVH (నాయిస్‌, వైబ్రేషన్‌, హార్షనెస్‌)ను మరింత మెరుగుపరచాల్సి ఉంటుంది.

ఎలివేట్‌ క్యాబిన్‌ పరిమాణంలో ఆకట్టుకుంటుంది. ముందు, వెనుక సీట్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు. హోండా సస్పెన్షన్‌ వ్యవస్థ ప్రయాణాన్ని చాలా సౌకర్యంగా ఉంచుతుంది. అందువల్ల గతుకుల రోడ్లు కారణంగా ఎటువంటి అసౌకర్యం కలగదు. గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఆకట్టుకుంటుంది. ఎలివేట్ స్టీరింగ్‌ కంట్రోల్‌ కూడా చాలా తేలికగా ఉంటుంది. నెమ్మదిగా, వేగంగా, లేన్‌ మార్చినా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వేగం పెంచినప్పుడు స్టీరింగ్‌ వీల్‌ కొంచెం బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది.

Honda Elevate SUV Full Review

ఎలివేట్‌ SUV బ్రేకింగ్‌ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. వేగంగా వెళ్తున్న సమయంలోనూ కచ్చితత్వంతో బ్రేకులు వేయవచ్చు. ఎలివేట్‌ రేడార్‌ మాడ్యూల్‌ను కలిగి ఉండదు. దీనికి బదులుగా వెనుక కెమెరాలపై ఆధారపడి ఉంటుంది. ఆటోమేటిక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

హోండా ఎలివేట్‌ బాక్సీ డిజైన్‌, అధిక గ్రౌండ్‌ క్లియరెన్స్‌, భారీ, సౌకర్యవంతమైన క్యాబిన్‌, శక్తివంతమైన పవర్‌ట్రైయిన్‌.. ఇతర కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. కియా, మారుతి, టయోటా కార్లు కాకుండా ఇతర కార్ల కోసం వేచిచూస్తుంటే వారు హోండా ఎలివేట్‌ను ఎంచుకోవచ్చు. ఈ సెగ్మెంట్‌లో దూసుకెళ్లేందుకు హోండాకు ఇదే మంచి సమయం.

More from DriveSpark

Article Published On: Tuesday, August 1, 2023, 10:58 [IST]
English summary
Honda elevate suv features specs driving impressions full review in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+