హోండా జాజ్ వర్సెస్ హ్యూందాయ్ ఎలైట్ ఐ20
ఈ ఏడాది విడుదలైన కార్లలో హోండా జాజ్ కూడా ఒకటి. జపనీస్ కార్ తయారి కంపెనీ దీన్ని తయారుచేసింది.
ఇది హ్యూందాయ్ ఎలైట్ ఐ20 తో పోటీ పడుతోంది.
హోండా జాజ్, హ్యూందాయ్ ఎలైట్ ఐ20 మధ్య గల పోటీని క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.......

ధర :
హోండా జాజ్ :
దీని పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.5.31లక్షలు(ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) మరియు డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.50లక్షలు(ఎక్స్-షోరూమ్,ఢిల్లీ).
హ్యూందాయ్ ఎలైట్ ఐ20 :
దీని పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.5.30లక్షలు(ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) మరియు డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.42లక్షలు(ఎక్స్-షోరూమ్,ఢిల్లీ).

డిజైన్ :
హోండా జాజ్ :
దీని మొత్తం డిజైన్ కొత్తగా, స్పోర్టీగా మరియు క్రోమ్ టచెస్‌తో ఉంది. బోల్డ్ చారెక్టర్ లైన్‌తో స్లీక్ వ్రాప్‌గ్రౌండ్ హెడ్‍లైట్‌ను కలిగి ఉంది.

డిజైన్ :
హ్యూందాయ్ ఎలైట్ ఐ20 :
దీని డిజైన్ మొత్తం ఫ్లూయిడిక్ 2.0 డిజైన్ కాన్సెప్ట్‌తో తయారుచేయబడింది. బౌండరీ కన్వేలో క్రోమ్ ఎలిమెంట్‌తో కూడిన హెక్సాగానల్ గ్రిల్ కలిగి ఉంది.

ఫీచర్స్ :
హోండా జాజ్ :
- 5 ఇంచెస్ ఐఏఎస్.
- ఆటో ఏసీ.
- ప్రీమియం డ్యాష్ బోర్డ్.
- స్టీరింగ్ మోటెడ్ ఆడియో కంట్రోల్.
- అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్.
- రేర్ పార్కింగ్ కెమెరా.

ఫీచర్స్ :
హ్యూందాయ్ ఎలైట్ ఐ20 :
డీఐఎన్ ఆడియో సిస్టమ్.
ఆటో ఏసీ.
కూలింగ్ గ్లోవ్ బాక్స్.
అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్.

ఇంజన్ మరియు స్పెసిఫికేషన్స్ :
హోండా జాజ్ :
ఇది 90 పీఎస్ పవర్‌ను ఉత్పత్తి చేయగల, 18.7 కి.మీ/లీ మైలేజ్ ఇవ్వగల 1.2 లీ పెట్రోల్ ఇంజన్‌ను, 100 పీఎస్ పవర్‌ను ఉత్పత్తి చేయగల, 27.3 కి.మీ/లీ మైలేజ్ ఇవ్వగల 1.5 లీ ఐ-డీటెక్ డీజల్ ఇంజన్‌ను అందిస్తోంది.

ఇంజన్ మరియు స్పెసిఫికేషన్స్ :
హ్యూందాయ్ ఎలైట్ ఐ20 :
ఇది 83 పీఎస్ పవర్‌ను ఉత్పత్తి చేయగల, 17.19 కి.మీ/లీ మైలేజ్ ఇవ్వగల 1.2 లీ పెట్రోల్ ఇంజన్‌ను, 90 పీఎస్ పవర్‌ను ఉత్పత్తి చేయగల, 21.19 కి.మీ/లీ మైలేజ్ ఇవ్వగల 1.4 లీ డీజల్ ఇంజన్‌ను అందిస్తోంది.

భద్రత :
భద్రత పరంగా రెండు కార్లు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ మరియు రేర్ పార్కింగ్ అసిస్ట్‌లను కలిగి ఉన్నాయి. అయితే హోండా జాజ్ లోడ్ లిమిటర్‌తో సీట్ బెల్ట్ ఫ్రీ టెన్షనర్‌ను కలిగి ఉంది.

తీర్పు :
కలర్స్‌లో జాజ్ చాలా బాగా కన్పిస్తుంది. ఎక్కువ ఇంటిరియర్ స్పేస్‌ను కలిగి ఉంది. జాజ్ ఎక్కువ పవర్ ఇంజన్‌ను, ఎక్కువ ఫీచర్స్‌ను కలిగి ఉంది. మా అభిప్రాయం ప్రకారం హోండా జాజ్ ముందంజలో ఉంది.


Click it and Unblock the Notifications








