Hyundai Alcazar Facelift Review హ్యుందాయ్ అప్‌డేటేడ్ ఎస్‌యూవీని కొనవచ్చా, లేదా?
2024 హ్యుందాయ్ అల్కజార్ మునుపటి మోడళ్ల కంటే భారీ అప్‌గ్రేడ్స్‌తో మార్కెట్‌లో విడుదలైంది. రీ డిజైన్, కంఫర్ట్ సౌకర్యాన్ని పెంచే ఇతర కొత్త ఫీచర్లతో మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఇందులోని ఇంటీరియర్ స్పేస్ పెరగడంతో పాటు అధునాతన సాంకేతికత, మెరుగైన డ్రైవింగ్ డైనమిక్స్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఈ అల్కజార్ మిడ్ సైజ్ SUV విభాగంలోని ఇతర మోడళ్లకు గట్టి సవాలని విసురనుంది. సుదూర ప్రయాణాల కోసం విశాలమైన కారుని కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా ఉంటుంది. ఈ సరికొత్త ఎస్‌యూవీని మా డ్రైవ్స్‌పార్క్ టీమ్ టెస్ట్‌డ్రైవ్ చేసింది. దీనికి సంబంధించిన రివ్యూపై ఓ లుక్కేయండి.
డిజైన్ & ఫీచర్లు: 2024 హ్యుందాయ్ అల్కజార్ పూర్తి రీడిజైన్ అప్‌గ్రేడ్‌తో రానుంది. ప్రత్యేకించి దాని బోల్డ్ కొత్త ఫ్రంట్ ఫేసియాలో ఆధునిక హెడ్‌లైట్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఈ కారుని ప్రీమియం లుక్‌ని అందిస్తుంది. దీని వెనక భాగం కూడా టెయిల్‌లైట్‌లతో రిఫ్రెష్ చేయబడింది. ఇది వెనక భాగంలోనూ మెరుగైన లుక్‌ని పొందుతుంది. ఇందులో కొత్త బాడీ కలర్స్, అప్‌డేట్ చేసిన అల్లాయ్ వీల్స్‌ను పరిచయం చేసింది.

ఇక డైమెన్షన్స్ పరంగా ఇది మునుపటి మోడల్ వలె అదే సైజ్‌లో వస్తుంది. ఇక ఇందులో స్పేసియస్ పనోరమిక్ సన్‌రూఫ్, క్యాబిన్ విలాసవంతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇండిరీయర్‌లో రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, అప్‌గ్రేడ్ చేసిన అప్హోల్స్టరీ, అధునాతన సాంకేతికత ఈ ఎస్‌యూవీకి మరింత ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. ఇది 6, 7-సీట్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. 6-సీటర్‌లో మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు, 7-సీటర్ బెంచ్ సీటును కలిగి ఉంటుంది.
ప్రయాణీకులందరీ సౌలభ్యం కోసం ఫ్రంట్, మిడిల్-వరుసలో వెంటిలేటెడ్ సీట్లను అందిచారు. రెండు వైర్‌లెస్ ఛార్జర్స్, మూడవ వరుసలోని వ్యక్తి కూడా ఎయిర్ కండిషనింగ్ కంట్రోల్‌ని కలిగి ఉంటారు. ఇది ప్రయాణికుల కంఫర్ట్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. 2024 ఆల్కాజార్ స్టైల్, కంఫర్ట్, అధునాతన ఫీచర్లు SUV మార్కెట్లో ఓ స్ట్రాంగ్ కాంపీటీటర్‌గా దీనిని తీసుకువచ్చింది.

ఇంజిన్: ఈ ఫేస్‌లిఫ్ట్ రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులోని 1.5L టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 PS పవర్‌ని, 253 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా DCT ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇక 1.5L టర్బో డీజిల్ ఇంజిన్ 116 PS శక్తిని 250 Nm టార్క్‌ని విడుడల చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
ఈ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్స్ 17.5 నుంచి 20 కిమీ/లీ మైలేజీని అందించనున్నాయి. ఈ మైలైజీని హ్యుందాయ్ కొద్ది రోజుల క్రితమే క్లెయిమ్ చేసింది. ఇందులో సస్పెన్షన్‌కి అధిక ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పవచ్చు. అయితే కఠిన మైన రోడ్లలో మీ డ్రైవింగ్ సమయంలో కొంత బాడీ రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. అయితే మెరుగైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, ఇంజిన్ పనితీరు ఇతర ఫీచర్లు సౌకర్యవంతంగా ఉంటాయి.

డ్రైవింగ్ ఇంప్రెషన్స్: 2024 హ్యుందాయ్ అల్కాజర్ సౌకర్యవంతమైన సస్పెన్షన్‌తో మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది కఠినమైన రోడ్లలోనూ సాఫీగా ప్రయాణించేలా రూపొందించబడింది. దీనిలోని మృదువైన సెటప్ ప్రయాణికులకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. అయితే పైన చెప్పిన విధంగా మలుపులు ఇతర కఠిన రోడ్లలో బాడీ రోల్‌కు దారితీయవచ్చు. ఇది కేవలం 10 సెకన్లలో గంటకు 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
దీనిలోని డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) త్వరగా మారుతుంది. ముఖ్యంగా స్పోర్ట్ మోడ్‌లో ఉత్తేజకరమైన డ్రైవ్ అందిస్తుంది. స్టీరింగ్ తేలికైనదిగా, సిటీ నావిగేషన్‌కు అనువైనది ఉంది, అయితే హైవేలు, వైండింగ్ రోడ్‌లపై మెరుగైన నియంత్రణను కలిగి ఉంటుంది. ఆల్-డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ భారీ స్టాపింగ్ పవర్‌ని కలిగి ఉంటుంది. ఇది సేఫ్టీ, సాఫీ ప్రయాణాన్ని అందిస్తుంది.

చివరగా: 2024 హ్యుందాయ్ అల్కజార్ దాని ముందున్న దాని కంటే చెప్పుకోదగ్గ మెరుగుదలతో ఆకట్టుకుంటుంది. ఇందులో ఆధునిక డిజైన్, విశాలమైన ఇంటీరియర్, అధునాతన సాంకేతికతలు ఉన్నాయి. ఈ మల్టీ SUV కంఫర్ట్, స్టైలింగ్‌కి అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఇది కుటుంబాలు, రోజువారీ ప్రయాణికులకు అనువైనదిగా ఉంటుంది.
ఇది ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌ల కోసం రూపొందించబడనప్పటికీ, కొద్ది పాటి దూరం గల ప్రయాణాలు మరియు దూర ప్రయాణాలు రెండింటికీ సున్నితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడంలో అత్యుత్తమంగా ఉంటుంది. ధర, ఇంటిగ్రేటెడ్ ఫీచర్లు ఈ అల్కాజార్ SUVని ఓ మంచి ఆప్షన్‌గా ఉంటుంది. మంచి నమ్మకమైన ఎస్‌యూవీని కోరుకునే వారికి ఇది సరిపోతుంది.


Click it and Unblock the Notifications








