Hyundai Creta N Line Full Review హ్యుందాయ్‌ క్రెటా N లైన్ ఫీచర్లు, డిజైన్‌, ఇంజిన్‌ పర్ఫామెన్స్‌ ఫుల్‌ రివ్యూ

ఈ ఏడాది ప్రారంభంలోనే హ్యుందాయ్(Hyundai Creta Facelift) ఫేస్‌లిఫ్టెడ్ క్రెటా ఎస్‌యూవీని విడుదల చేసింది. క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్‌ చేసిన రెండు నెలల లోపే, హ్యుందాయ్ క్రెటా N లైన్‌ను సంస్థ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఈ సరికొత్త ఎస్‌యూవీని ఢిల్లీ రోడ్లపై టెస్ట్‌ డ్రైవ్‌ చేసేందుకు మా డ్రైవ్‌స్పార్క్ టీమ్‌కు ఆహ్వానం లభించింది.

కొత్త హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌లో ప్రధాన మార్పులను పరిశీలిస్తే.. లుక్‌ మరియు ఫీచర్ల పరంగా చాలా అప్‌డేట్లను చూడవచ్చు. ఈ మార్పులు అనేవి ఇప్పటికే మార్కెట్లో దూకుడు మీదున్న హ్యుందాయ్‌ మోటార్స్‌కు మరింత ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. టెస్ట్‌ డ్రైవ్‌లో మా టీమ్‌ పరిశీలించిన డిజైన్‌, ఫీచర్లు, స్పెక్స్‌, పనితీరు పూర్తి రివ్యూ ఈ కథనంలో..

Hyundai-Creta-N-Line-Features-Design-Specs-Full-Review

డిజైన్‌: కొత్త హ్యుందాయ్‌ క్రెటా ఎన్ లైన్ ఎక్స్‌టీరియర్‌ పరంగా కొత్త బంపర్‌లు, మరింత గుర్తించదగిన సైడ్ స్కర్ట్‌లు ఉంటాయి. లో ప్రొఫైల్‌ను చూసుకుంటే 215/55 R18 టైర్‌లలో 18-అంగుళాల చక్రాల కొత్త సెట్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక వెనుక వైపు పరిశీలిస్తే.. ప్రముఖ స్పాయిలర్ మరియు ట్విన్-టిప్ ఎగ్జాస్ట్ ఉంటుంది.

కొత్త Hyundai Creta N Lineను కస్టమర్లు మూడు మోనోటోన్ కలర్ ఆప్షన్‌లలో అబిస్ బ్లాక్ పెర్ల్, అట్లాస్ వైట్ మరియు టైటాన్ గ్రే మ్యాట్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఇందులో మూడు డ్యూయల్-టోన్ ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టింది. అట్లాస్ వైట్, షాడో గ్రే మరియు థండర్ బ్లూ - ఇవన్నీ కాంట్రాస్ట్ బ్లాక్ రూఫ్‌తో వస్తాయి. ఇవన్నీ బంపర్స్ మరియు సైడ్ స్కర్ట్‌లపై ఎరుపు రంగు కాంట్రాస్ట్ విభాగాలతో వస్తాయి.

Hyundai-Creta-N-Line-Features-Design-Specs-Full-Review

ఇంటీరియర్‌: కొత్త హ్యుందాయ్‌ క్రెటా ఎన్ లైన్ ఇంటీరియర్‌ విషయానికొస్తే.. ఆల్‌ బ్లాక్‌ థీమ్‌కు వ్యతిరేకంగా క్యాబిన్.. రెడ్ యాంబియంట్ లైటింగ్ ద్వారా మరింత హైలైట్ అవుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. కొత్త N-బ్యాడ్జ్డ్ స్టీరింగ్ వీల్ మరియు మెటల్ పెడల్స్‌తో పాటు గేర్ లివర్‌ను చూడవచ్చు. సీట్లపై ఉన్న నలుపు రంగు లెథెరెట్ అప్హోల్స్టరీ కూడా ఎరుపు రంగు లైన్స్‌, కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో పాటు N లోగోతో వస్తుంది.

Hyundai-Creta-N-Line-Features-Design-Specs-Full-Review

మెకానికల్‌ సెటప్‌: సాధారణ క్రెటాతో పోల్చితే కొత్త హ్యుందాయ్ క్రెటా N లైన్‌లో ఉన్న ఏకైక మెకానికల్ మార్పులు కొద్దిగా ట్వీక్ చేయబడిన సస్పెన్షన్ మరియు స్టీరింగ్ సెటప్ మరియు కొత్త ఎగ్జాస్ట్‌ను చూడవచ్చు. కాగా కొత్త క్రెటా N లైన్ (N10)లోని ఇతర ఫీచర్లు టాప్-స్పెక్ క్రెటా SX(O) మాదిరిగానే ఉన్నాయి.

ఫీచర్లు: కొత్త హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌లో పెద్ద పనోరమిక్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు (డ్రైవర్ సీట్ 8-వే పవర్డ్ యూనిట్), ఇన్‌స్ట్రుమెంటేషన్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్‌లు ఉన్నాయి. డ్యూయల్-డాష్ క్యామ్, డ్యూయల్-జోన్ క్లైమేట్‌, కంట్రోలింగ్‌, బోస్ నుండి 8-స్పీకర్ ఆడియో సిస్టమ్ ఫీచర్లు డ్రైవర్‌ ఫ్రెండ్లీగా ఉంటాయి.

Hyundai-Creta-N-Line-Features-Design-Specs-Full-Review

సేఫ్టీ ఫీచర్లు: సేఫ్టీ ఫీచర్ల పరంగా కొత్త హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్‌.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, 360-డిగ్రీ కెమెరాలు, TPMS, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు లెవల్ 2 ADAS వంటి ఫీచర్‌లతో ప్రయాణికులకు నాణ్యమైన రైడింగ్‌ అనుభవాన్ని, సురక్షిత ప్రయాణాన్ని అందిస్తుంది.

Hyundai-Creta-N-Line-Features-Design-Specs-Full-Review

ఇంజిన్: కొత్త హ్యుందాయ్‌ క్రెటా ఎన్‌ లైన్‌.. బానెట్ కింద, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 5,500 rpm వద్ద 158 bhp మరియు 1,500 మరియు 3,500 rpm మధ్య 252 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది లీటర్‌కు 18కి.మీ మైలేజ్‌ను క్లెయిమ్‌ చేస్తుంది. లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది లీటర్‌కు 18.7 కి.మీ మైలేజ్‌ను క్లెయిమ్‌ చేస్తుంది.

Hyundai-Creta-N-Line-Features-Design-Specs-Full-Review

కొత్త హ్యుందాయ్‌ Creta N లైన్‌లోని మాన్యువల్ మరియు ఆటోమేటిక్ పవర్‌ట్రెయిన్ ఎంపికలు.. రెండూ మూడు డ్రైవింగ్ మరియు ట్రాక్షన్ మోడ్‌లతో వస్తుండటం విశేషం.. ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్- డ్రైవింగ్‌ మోడ్‌లు.. స్నో, ఇసుక మరియు మడ్- ట్రాక్షన్‌ మోడ్‌లను కలిగి ఉంటుంది. అయితే నగరాల్లో నివసించే వారికి వీటి అవసరం పెద్దగా ఉండదు.

ఇక డ్రైవింగ్‌ పనితీరును పరిశీలిస్తే Hyundai Creta N Line.. ఉత్సాహభరితమైన డ్రైవ్‌ను అందిస్తుంది. 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఎప్పటిలాగే ఉంటుంది. 7-స్పీడ్ DCT గేర్‌ల ద్వారా స్పీడ్ పెరుగుతుంది. అయితే కొంచెం ఎక్కువ నియంత్రణను కోరుకునే వారికి, గేర్ లివర్‌ను స్పోర్ట్ మోడ్‌లోకి మార్చడం వల్ల ప్యాడిల్స్ ద్వారా మాన్యువల్ షిఫ్ట్‌లకు మారవచ్చు.

Hyundai-Creta-N-Line-Features-Design-Specs-Full-Review

అయితే ఇవన్నీ.. సాధారణ క్రెటాలో చూడవచ్చు. కానీ ఇక్కడ N లైన్‌ను సాధారణ క్రెటా నుంచి వేరు చేసేంది.. సస్పెన్షన్ మరియు స్టీరింగ్. సాధారణ SUVతో పోలిస్తే క్రెటా N లైన్‌లోని సస్పెన్షన్ సెటప్ కొంచెం గట్టిగా ఉంటుంది. కొత్త 18 అంగుళాల వీల్స్‌ మరియు లో ప్రొఫైల్ టైర్‌లతో కలిపి స్పోర్టియర్ N లైన్ గరుకు రోడ్లపై సైతం అధిక వేగంతో దూసుకుపోతున్నట్లు మాకు అనిపించింది.

పదునైన స్టీరింగ్ ర్యాక్‌ ద్వారా టర్నింగ్‌ల్లో కూడా క్రెటా ఎన్ లైన్‌ను సులభంగా హ్యాండిల్‌ చేయవచ్చు. వంపులు తిరిగిన రోడ్లపై క్రెటా ఎన్‌ లైన్‌ స్పోర్టియర్‌ మీకు మెరుగైన డ్రైవింగ్‌ అనుభవాన్ని జోడిస్తుంది. సీట్లు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. జోడించిన వెంటిలేషన్ ఫీచర్‌ కూడా బాగా పనిచేస్తుంది.

Hyundai-Creta-N-Line-Features-Design-Specs-Full-Review

సాధారణ క్రెటాతో పోలిస్తే N లైన్‌ ధర రూ. 30,000 ఎక్కువగా ఉన్నా.. దీని అసమాన ఫీచర్లకు ముచ్చటపడొచ్చు. కాగా హ్యుందాయ్‌ క్రెటా ఎన్‌ లైన్‌ను సంస్థ రూ. 16.82 లక్షల నుంచి 20.30 లక్షల మధ్య ధరతో విడుదల చేసింది.

చివరిగా క్రెటాను హ్యుందాయ్‌ ఎల్లప్పుడూ ఒక కంప్లీట్‌ SUVగా పరిచయం చేస్తుంది. మైలేజ్‌ పరంగానే కాకుండా పుష్కలమైన ఫీచర్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా కస్టమర్లకు మంచి అనుభూతిని అందిస్తుంది. ఫ్యామిలీ టూర్‌, ఫ్యామిలీ వెహికల్‌ పరంగా హ్యుందాయ్ క్రెటా N లైన్‌ను పరిశీలించవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, March 15, 2024, 11:42 [IST]
English summary
Hyundai creta n line suv design features specs engine performance full review
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+