Hyundai Exter Full Review హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫీచర్లు, డిజైన్, ఇంజిన్ ఫర్మామెన్స్ పుల్ రివ్యూ
భారత్ ఆటోమొబైల్ రంగంలో SUV లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఫలితంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఈ తరహా వాహనాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. పంచ్ మైక్రో SUV కారు ద్వారా టాటా మోటార్స్ సంస్థ ఈ సెగ్మెంట్‌లో పోటీ ఇస్తోంది.
మహీంద్రా KUV100 చిన్న, బాక్సీ కార్ల శ్రేణిలోకి టాటా పంచ్ చేరింది. ఫలితంగా చాలా మంది కొనుగోలుదారులు ఈ తరహా ఎస్‌యూవీల్లోకి మారేందుకు సాయపడింది. టాటా పంచ్ కార్ల కారణంగా హ్యుందాయ్ సంస్థ కొంత ప్రభావితం అయింది. కొన్నిసార్లు నెలవారీ విక్రయాలను పంచ్ అధిగమించింది.

అయితే ఈ విభాగంలో టాటా మోటార్స్‌కు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్న హ్యుందాయ్ సంస్థ సరికొత్త ఎక్స్‌టర్‌తో మైక్రో SUVల సెగ్మెంట్‌లోకి దూసుకొచ్చింది. అయితే విక్రయాల్లో హ్యుందాయ్‌ను గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లేందుకు ఎక్స్‌టర్ కారు ఎటువంటి ప్రత్యేకతలను కలిగి ఉందో చూద్దాం.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ డిజైన్, ఫీచర్లు : హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీ.. గ్రాండ్ i10 నియోస్ హ్యాచ్‌బ్యాక్, ఆరా సెడాన్‌తో అండర్‌పిన్నింగ్‌ను పంచుకుంది. కానీ సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు మైరుగైన అనుభూతిని ఇస్తుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ పారామెట్రిక్ డిజైన్ ఈ మైక్రో ఎస్‌యూవీకి ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది. కారు కొంచెం సమయం గమనించిన వారికి అర్థమవుతుంది. స్ల్పిట్ హెడ్‌లైట్, పారామెట్రిక్ గ్రిల్.. ఎక్స్‌టర్‌కు మంచిలుక్‌ను ఇస్తుంది.

పారామెట్రిక్ గ్రిల్‌కు ఇరువైపులా బై ఫక్షనల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. H ఆకారంలో ఎల్‌డీఈ DRLలతో కూడిన పొజిషన్ ల్యాంప్‌లు.. ముందు బంపర్ కంటే కొంచెం ఎత్తులో ఉంటాయి.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో SUV ఫ్రంట్ బంపర్ కింద భాగాన.. సిల్వర్ స్కిడ్ ప్లేట్‌ను కలిగి ఉంటుంది. మరియు హ్యుందాయ్ బ్యాడ్జ్ బానెట్‌పై ఉంటుంది. ఎక్స్‌టర్ నేమ్‌ప్లేట్ మాత్రం స్ప్లిట్ లైటింగ్ వ్యవస్థ మధ్య ఉంటుంది.
ఎక్స్‌టర్‌కు ఇరువైపులా 15 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వద్ద ఫ్లేర్డ్ వీలర్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటుగా ఈ ఎస్‌యూవీ షార్క్ ఫిన్ యాంటెనాను కలిగి ఉంటుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో SUV వెనుక భాగం H ఆకారంలో సిగ్నెచర్ డిజైన్‌తో LED టెయిల్ లైట్‌లను కలిగి ఉంటుంది ఈ లైట్లు పారామెట్రిక్ డిజైన్‌తో బ్యాడ్జ్‌కు కనెక్ట్ అవుతాయి.

వీటితోపాటు సిల్వర్ రంగులో స్కిడ్ ప్లేట్ మరియు బ్లాక్ రంగులో రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ ఉంటుంది. ఈ స్పాయిలర్ బ్రేక్ లైట్‌ను కలిగి ఉంటుంది. అయితే హ్యుందాయ్ ఎక్స్‌టర్ SUV లోపలి భాగం చాలా వరకు i10, ఆరా వాహనాలకు పోలి ఉంటుంది. కానీ డ్యాష్‌బోర్డు, డోర్ ప్యానల్‌కు బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంటుంది. లోపలి భాగంలో పైన తెలుపు రంగు ఉంటుంది.
డ్యాష్‌బోర్డులో 8 అంగుళాల టచ్‌స్ర్కీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటోప్లే, ఆపిల్ కార్‌ప్లేను సపోర్టు చేస్తుంది నావిగేషన్‌ను కూడా సపోర్టు చేస్తుంది. దీంతోపాటు 4.2 అంగుళాల MID, వాయిస్ యాక్టివేటెడ్ కమాండ్‌లతో పనిచేసే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్. ఆటోమేటిక్ క్రైమెట్ కంట్రోల్ వ్యవస్థ, వైర్‌లెస్ ఛార్జింగ్, టూ వే డ్యాష్‌కామ్, ఓవర్ ది ఎయిర్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

కార్లు సీట్ల విషయానికి వస్తే హ్యుందాయ్ ఎక్స్‌టర్ లెథెరెట్ అప్హోల్స్టరిని కలిగి ఉంటాయి. వెనుక భాగంలో ముగ్గురు కూర్చొనే విధంగా సౌకర్యవంతంగా ఉంటుంది. మరియు తగినంత స్థలం కూడా ఉంటుంది. మొత్తంగా హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారులో చాలా సౌకర్యంగా కూర్చొనే వెసులుబాటు ఉంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ భద్రత విషయానికి వస్తే.. ఈ మైక్రో SUV 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్), హిల్ అసిస్ట్ కంట్రోల్, EBDతో కూడిన ABS, రేర్ పార్కింగ్ సెన్సార్లు-కెమెరా, వెనుక ఉన్న మూడు సీట్లకు సీట్‌బెల్ట్‌లు, అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్‌ను కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ స్పెసిఫికేషన్లు : హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో SUV 3815mm పొడవు, 1710mm వెడల్పు, 1613mm ఎత్తును కలిగి ఉంటుంది. 2450mm వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. మరియు 185mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. పెట్రోల్ వేరియంట్‌లో 391 లీటర్ల బూట్‌స్పేస్‌ను కలిగి ఉంటుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో SUV 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. పెట్రోల్, CNGలతో నడుస్తుంది. పెట్రోల్ మోడ్‌లో కప్పా సీరిస్ ఇంజిన్ 81.8bhp శక్తి, 113.8Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే CNGలో 67.7bhp శక్తి, 95.2Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌లను ఆప్షన్‌లలో వస్తుంది. కానీ CNG వెర్షన్ కేవలం 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ 19.4 kmpl మైలేజీని ఇస్తుంది. అయితే AMT (ఆటోమేటిక్ గేర్‌బాక్స్)లో 19.2 kmpl మైలేజీ మాత్రమే ఇస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ డ్రైవింగ్ ఇంప్రెషన్ : హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో SUV పెట్రోల్ AMT వేరియంట్‌ను జైపూర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసే అవకాశం లభించింది. 1.2 లీటర్ ఇంజిన్ చాలా స్మూత్ అనుభూతిని అందించింది. హైవేపై 100 కి.మీ వేగంతో ప్రయాణించినా సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తుంది. ఎత్తుపల్లాల ప్రాంతంలోని కూడా మెరుగైన పనితీరును కనబరుస్తుంది.

AMT గేర్‌బాక్స్ ద్వారా గేరింగ్ పనితీరు సులభంగా ఉంది. ఇతర కార్ల కంటే మెరుగైన పనితీరు కనబరిచింది. మరియు తక్కువ వేగంతో ప్రయాణం చేసినప్పుడు స్టీరింగ్ కొంచెం తేలికగా అనిపిస్తుంది. వేగం పెరుగుతున్న సమయంలో స్టీరింగ్ వీల్ బరువు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. అయితే ఈ తరహా పనితీరు హైవేల డ్రైవింగ్ చేసిన సమయంలో మెరుగైన అనుభూతి, విశ్వాసాన్ని ఇస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీ సస్పెన్షన్ సెటప్ కొంచెం గట్టిగా ఉంటుంది. అయితే గుంతల రోడ్లపై ప్రయాణం చేస్తున్న సమయంలో సస్పెన్షన్ సెటప్ అంత కఠినంగా అనిపించలేదు. అయితే ఎక్స్‌టర్ బెండ్ ద్వారా కొంచెం గట్టి సస్పెన్షన్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో SUV బ్రేకింగ్ : హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో SUV బ్రేకింగ్ పెడల్ మెరుగ్గా పనిచేస్తుంది. టైర్ల గ్రిప్ ఎక్కువగా ఉన్నప్పుడు మరింత మెరుగైన బ్రేకింగ్ అనుభూతిని పొందుతాయి. వేగంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మెరుగైన బ్రేకింగ్‌ను పొందవచ్చు.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో SUV.. ఈ సెగ్మెంట్‌లో ఇతర కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. నెలవారీ విక్రయాల్లో తన స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. టాటా పంచ్‌కు సరైన పోటీ ఇవ్వగలదు. ఎక్స్‌టర్ బాక్సీ లుక్, ధర, ఫీచర్లు.. హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ను వినియోగదారులు ఆకట్టుకొనేలా చేస్తుంది.


Click it and Unblock the Notifications








