Kia Motors యొక్క నయా కార్ Carens: రివ్యూ & పూర్తి వివరాలు
భారతీయ వాహన వినియోగదారులు ఎక్కువగా యుటిలిటీ వాహనాలను ఇష్టపడతారనే విషయం అందరికి తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు అలాంటి వాహనాలనే దేశీయ మార్కెట్లో విడుదల చేసి మంచి ఆదరణ పొందుతూ విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇందులో సౌత్ కొరియా కార్ తయారీ సంస్థ కియా మోటార్స్ (Kia Motors) కూడా ఉంది.
కియా మోటార్స్ (Kia Motors) 2018 లో భారత మార్కెట్లో అరంగేట్రం చేసింది. 2019 లో కియా సెల్టోస్ మరియు 2020 లో కియా కార్నివాల్ & సోనెట్ వంటి వాటిని ప్రవేశపెట్టి ఊహకందని విజయాన్ని పొందింది. అయితే ఇప్పుడు దేశీయ విఫణిలో విడుదల కానున్న కియా మోటార్స్ యొక్క నయా కార్ 'కియా కారెన్స్' (Kia Carens). ఇది కంపెనీ యొక్క నాల్గవ ఉత్పత్తి. ఈ MPV కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.
ఇటీవల కియా మోటార్స్ యొక్క కొత్త కియా కారెన్స్ MPV ని మేము డ్రైవ్ చేసాము. కావున ఈ MPV గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూ తెలుసుకుందాం.. రండి.

Kia Carens డిజైన్ మరియు స్టైల్:
సాధారణంగా ఏ కారుకైన డిజైన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. అయితే కియా కారెన్స్ ను ఏ కోణం నుండి చూసినా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది చాలా వరకు ఆధునిక డిజైన్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. ఇందులో బ్రష్డ్ అల్యూమినియంతో పూర్తి చేసిన సూపర్ స్టైలిష్ కొత్త కియా లోగో చూడవచ్చు. ఇది ఇందులో చాలా ప్రత్యేకమైనది.

ఇక్కడ మీ దృష్టిని LED DRL లు మరియు హెడ్‌ల్యాంప్ సెటప్ ఎంతగానో ఆకర్షిస్తాయి. DRL లకు కుడివైపున మూడు-మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్ యూనిట్లు ఉన్నాయి. ఈ మొత్తం సెటప్ బ్లాక్-అవుట్ X-షేప్ ఎలిమెంట్ లో ఒక భాగం, ఇందులో ఫాక్స్ గ్రిల్ కూడా ఉంటుంది. ఈ గ్రిల్ ముడుచుకున్న నమూనాలో ఉండి, కారు వెడల్పును ఆక్రమిస్తుంది. దీని కింద కియా యొక్క సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్, హానీ కూంబ్ నమూనాతో దాని వెనుక ఉంచబడిన రేడియేటర్‌కు ఎయిర్ ప్లో అనుమతిస్తుంది.

ఇందులో బానెట్ కొద్దిగా పైకి లేపబడింది. సైడ్ ప్రొఫైల్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కియా కారెన్స్ యొక్క పెద్ద నిష్పత్తులను సైడ్ ప్రొఫైల్ నుండి చూసినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. A, B, మరియు C పిల్లర్స్ బ్లాక్ గా ఉన్నాయి, కానీ D- పిల్లర్ బాడీ కలర్‌లో ఉంటుంది. ఇందులో ఒక బ్రష్డ్ అల్యూమినియం స్ట్రిప్ ఉంది, అది D-పిల్లర్ వద్ద ప్రారంభమవుతుంది.

కియా కారెన్స్ యొక్క డోర్ హ్యాండిల్స్ చక్కగా మరియు మందంగా ఉండి, క్రోమ్ లో పూర్తి చేయబడి ఉంటాయి. ఇది 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉండి అద్భుతంగా కనిపిస్తాయి. అవి దాదాపు టర్బైన్-వంటి డిజైన్‌ను కలిగి ఉంటాయి మరియు డ్యూయల్-టోన్ ఫినిషింగ్ పొందుతాయి.

కారెన్స్ చుట్టూ మాట్టే-బ్లాక్ క్లాడింగ్‌తో ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లను పొందుతారు. ఇది సైడ్ క్లాడింగ్‌లో సిల్వర్ స్ట్రిప్‌తో కూడా వస్తుంది. వెనుక భాగంలో కియా కారెన్స్ ఒక SUV లాగా కనిపిస్తుంది. ఇక్కడ టెయిల్ ల్యాంప్ మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇది స్ప్లిట్ LED టెయిల్ ల్యాంప్, రెండు చివర్లలోని టెయిల్ ల్యాంప్‌లు మధ్యలో ఫాక్స్ టెయిల్ ల్యాంప్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. టెయిల్‌గేట్ పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ కూడా కియా బ్రాండ్ లోగో ఉంటుంది.

ఇక దిగువ భాగంలో ఒక క్రోమ్ స్ట్రిప్‌తో కూడిన చంకీ బంపర్ ఉంది, అది ముడుచుకున్న నమూనాను కలిగి ఉంటుంది. పైన స్టాప్ ల్యాంప్‌తో కూడిన స్పాయిలర్ ఉంది. మొత్తానికి ఇది అద్భుతమై డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. అంతే కాకూండా ఇది పరిమాణంలో కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది.

Kia Carens కాక్‌పిట్ & ఇంటీరియర్స్:
Kia Carens యొక్క మందపాటి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ లాగగానే మీకు విశాలమైన క్యాబిన్ స్వాగతం పలుకుతుంది. ఇందులో ఇప్పుడు చాలా టెక్నాలజీ ఉపయోగించబడిందని మీకు స్పష్టంగా తెలుస్తుంది. మేము కారెన్స్ యొక్క టాప్-స్పెక్ మోడల్ డ్రైవ్ చేసాము. ఇది ప్రత్యేకమైన డ్యూయల్-టోన్ ఇంటీరియర్ కలిగి ఉంటుంది. ఇది నేవీ బ్లూ మరియు బీజ్ (లేత గోధుమరంగు) కలర్ లో ఉంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Kia Carens యొక్క లోపలి భాగంలోని ఎలిమెంట్స్ వివిధ రంగుల్లో ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్ పైభాగం నేవీ బ్లూ కలర్ లో ఉంది. అదే విధంగా దిగువ భాగం బీజ్ కలర్ లో ఉంది. డ్యాష్‌బోర్డ్ మధ్యలో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది Apple CarPlay మరియు Android Auto తో లోడ్ చేయబడింది. ఈ రెండు ఫీచర్లకు వైర్‌లెస్ కనెక్టివిటీ లేదు. కానీ బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది.

సిస్టమ్‌తో మీ ఫోన్‌ను కనెక్ట్ చేయడం సులభమైన మరియు సరళమైన ప్రక్రియ. ఇందులో అద్భుతమైన ఆడియో సిస్టమ్ అందుబటులో ఉంది. దీనికోసం ఇందులో బోస్ నుండి 8-స్పీకర్ సిస్టమ్ పొందుతుంది. కంపెనీ యొక్క కియా సెల్టోస్ కూడా బోస్ ఆడియో సిస్టమ్‌తో వస్తుంది.

కియా కారెన్స్‌లోని బోస్ ఆడియో సిస్టం చాలా అద్భుతంగా ఉంది. అంతే కాకుండా కంపెనీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఫీచర్లతో లోడ్ చేసింది మరియు వాటిలో ఒకటి 'సౌండ్స్ ఆఫ్ నేచర్'. ఇది రైన్ ఫాల్, ఫైర్, స్నో స్ట్రోమ్ వంటి సహజమైన శబ్దాలు కూడా కలిగి ఉంది.

ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఫోన్ కాల్‌లు చేయడానికి, టెక్స్ట్ మెసేజస్ చదవడానికి, 64-కలర్ యాంబిఎంట్ లైటింగ్ మరియు అనేక ఇతర వాహనాల ఫంక్షన్‌లను కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇందులో కియా కనెక్ట్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా వాహనాన్ని స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా పర్యవేక్షించవచ్చు.

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్రింద బ్రష్డ్ అల్యూమినియంతో ఫినిష్ చేయబడిన డాష్‌బోర్డ్ వెడల్పులో ఒక ప్రత్యేకమైన లైన్ ఉంది. ఇది AC వెంట్‌లను కూడా దాచిపెడుతుంది. దీని కింద టెంపరేచర్, ఫ్యాన్ స్పీడ్ మరియు బ్లోవర్ దిశను ప్రదర్శించడానికి చిన్న స్క్రీన్‌తో ఎయిర్ కండిషనింగ్ కోసం కంట్రోల్స్ ఉన్నాయి.

మొత్తం మీద, డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్‌లోని అన్ని ఎలిమెంట్‌లు చక్కగా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌ను అందిస్తాయి. ఇందులో సెంటర్ కన్సోల్ చాలా ఆచరణాత్మకమైనది మరియు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డ్రైవ్ మోడ్‌లను మార్చడానికి, హిల్ డిసెంట్ కంట్రోల్‌ని ఆన్/ఆఫ్ చేయడానికి మరియు ఫ్రంట్ సీట్ల కోసం వెంటిలేషన్/కూలింగ్ చేయడానికి ముందు భాగంలో కొన్ని బటన్‌లు ఉన్నాయి.

ఈ బటన్‌ల మధ్య మరియు గేర్ లివర్‌కు ముందు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది. దాని పైన ఇన్ఫోటైన్‌మెంట్ కోసం USB పోర్ట్, 12 V సాకెట్ మరియు USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. గేర్ లివర్ వెనుక కూలింగ్ ఫంక్షన్‌ను కలిగి ఉండే కప్‌హోల్డర్ ఉంటుంది. దీనివల్ల వాటర్ బాటిల్ కప్‌హోల్డర్‌లో ఉన్నప్పుడు చల్లగా ఉంటుంది. కప్‌హోల్డర్ వెనుక డ్రైవర్ మరియు కో-డ్రైవర్ కోసం ఆర్మ్‌రెస్ట్ ఉంది.

ఇక ఇందులోని స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే, ఇది అత్యంత ప్రీమియం యూనిట్‌లలో ఒకటిగా గుర్తించబడుతుంది. ఈ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఇన్ఫోటైన్‌మెంట్, క్రూయిజ్ కంట్రోల్, వాయిస్ కమాండ్‌లు మొదలైన వాటి కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్ కలిగి ఉంటుంది.

స్టీరింగ్ వీల్ వెనుక ఇన్‌స్ట్రుమెంటేషన్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది లార్జ్ ఫుల్ కలర్ LCD స్క్రీన్, మధ్యలో ఒక చిన్న 4.2-అంగుళాల MID ఉంటుంది. ఈ MID రేంజ్, యావరేజ్ ఫ్యూయెల్ కెపాసిటీ, డ్రైవింగ్ మోడ్‌లు మరియు నావిగేషన్ వంటి చాలా సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.

ఇందులోని ప్రీమియం-ఫీలింగ్ డోర్ ప్యానెల్‌లు కాక్‌పిట్ అనుభవాన్ని పూర్తి చేస్తాయి. ఆర్మ్‌రెస్ట్ లెదర్‌తో పూర్తి చేయబడింది మరియు మీరు ఏదైనా నిల్వ చేయవలసి వస్తే దాని కింద ఒక స్టోరేజ్ ప్లేస్ ఉంటుంది. తర్వాత బోస్ స్పీకర్ మరియు రెండు 1-లీటర్ బాటిళ్లకు సరిపోయేంత పెద్ద నిల్వ స్థలం మరియు నీరు బయటకు వెళ్లడానికి దిగువన డ్రైన్ హోల్‌తో కూడిన అమ్రుల్లా హోల్డర్ కూడా ఉంది. మొత్తం మీద కియా కారెన్స్ యొక్క ఇంటీరియర్ డిజైన్ చూడచక్కగా ఉంటుంది.

కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్:
2022 కియా కేరెన్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది మంచి ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇందులో కియా కారెన్స్‌లోని సీట్లును గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం ఉంది. మేము టాప్-స్పెక్ లగ్జరీ ప్లస్ వేరియంట్‌ను డ్రైవ్ చేసాము, కావున ఇది వెంటిలేటెడ్/కూల్డ్ ఫ్రంట్ సీట్‌లను అందిస్తుంది. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా వినియోగదారులకు చాలా హాయిగా ఉంటాయి.

లగ్జరీ ప్లస్ ట్రిమ్‌లోని రెండవ వరుసలో రెండు కెప్టెన్ సీట్లు ఉన్నాయి. ఇవి పరిమాణం మరియు ఆకృతి పరంగా ముందు-రెండు సీట్ల వలె ఉంటాయి. తై సపోర్ట్, బ్యాక్ సపోర్ట్, బోల్‌స్టరింగ్ మరియు టెక్స్చరింగ్ స్పాట్ ఆన్‌లో ఉన్నాయి. రెండు కెప్టెన్ సీట్లు కూడా ఆర్మ్‌రెస్ట్‌లను కలిగి ఉంటాయి. ఈ సీట్లు ముందుకు మరియు వెనుకకు కదలడానికి, వంగి ఉండేలా అడ్జస్ట్ చేయవచ్చు మరియు టంబుల్ ఫీచర్‌తో కూడా వస్తుంది.

ఈ టంబుల్ ఫీచర్ చాలా ఉపయోగకరమైనది మరియు ఆచరణాత్మకమైనది మరియు మూడవ-వరుస ప్రయాణీకులకు చాలా అనుకూలంగా ఉంటాయి. కియా కారెన్స్ మూడవ వరుస సీటింగ్‌తో 6/7-సీటర్‌గా విక్రయించబడుతుంది. మిగిలిన MPV లలో మాదిరిగా మూడవ వరుస ఇరుకైనదిగా ఉంటుందని మేము ఊహించాము. కానీ ఇది చాలా అనుకూలంగా ఉంది.

మూడవ వరుస సీట్ల విషయానికి వస్తే, కుడి వైపున ఉన్న కెప్టెన్ సీటులో టంబుల్-డౌన్ ఫంక్షన్ కోసం మాన్యువల్‌గా పనిచేసే లివర్ ఉంది. ఎడమ వైపున ఉన్న సీటు వన్-టచ్ ఎలక్ట్రిక్ టంబుల్-డౌన్ ఫీచర్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా మూడవ వరుసలోని ప్రయాణీకులు సీటు ముడుచుకోవాలని కోరుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. పెద్దలు వెనుకకు వెళ్లడానికి కూడా చాలా స్థలం ఇందులో ఉంటుంది. పెద్దలు కూడా మూడవ వరుసలో చాలా సౌకర్యవంతంగా ఉంటారు. రెండవ వరుస సీట్లను కూడా వెనక్కి నెట్టవచ్చు.

మూడవ వరుస సీట్లు రిక్లైన్ ఫంక్షన్‌ను కలిగి, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లను కూడా పొందుతాయి. మూడవ వరుసలో ఇద్దరు ప్రయాణీకులకు ఓవర్‌హెడ్ AC వెంట్‌లను కలిగి ఉంటాయి. వారు కప్‌హోల్డర్‌తో పాటు టైప్-సి స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ స్లాట్ మరియు ఫోన్/టాబ్లెట్ హోల్డర్‌ను కూడా పొందుతారు. ఇది దాదాపు రెండవ వరుస కెప్టెన్ సీట్లు వలె సౌకర్యవంతంగా ఉంటుంది.

మూడు వరుసల సీటింగ్‌తో, కియా కారెన్స్ 3 క్యాబిన్ బ్యాగ్‌లకు సరిపోయేంత పెద్ద బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. మూడవ వరుస సీట్లను మడవవచ్చు మరియు ఇది చాలా పెద్దదిగా ఉండే ఫ్లాట్‌బెడ్‌ను వెల్లడిస్తుంది. మొత్తానికి బూట్ స్పేస్ చాలా అద్భుతంగా ఉంటుంది.

అయితే ఇందులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ముందు సీట్లకు వెంటిలేషన్/కూలింగ్ వంటివి ఉన్నాయి. కానీ డ్రైవర్ సీటులో ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫీచర్ లేదు. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించలేదు, కానీ మేము సింగిల్ పేన్ సన్‌రూఫ్‌తో సరిపెట్టుకోవాలి. కానీ కారెన్స్ కొన్ని ప్రత్యేకమైన ఎంపికలతో వస్తుంది. రెండవ వరుసలో ఎడమ వైపు ప్రయాణీకుడికి ఫోల్డ్-అప్ డైనింగ్ ట్రే/మినీ వర్క్ డెస్క్ లభిస్తుంది. ఇందులో అతిపెద్ద స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంటుంది.

ఇంజిన్ పర్ఫామెన్స్ & డ్రైవింగ్ ఇంప్రెషన్స్:
Kia Carens రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ కలిగి ఉంది. Carens లైనప్‌లో అత్యంత శక్తివంతమైన ఇంజన్ 1.4 లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్. ఇది 138 బిహెచ్‌పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్‌ని అందిస్తుంది. ఈ మోటారును 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 7-స్పీడ్ DSG తో జత చేయబడి ఉంటుంది.

ఇక రెండవ పెట్రోల్ ఇంజన్ 113.4 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జత చేయబడి ఉంటుంది.

మేము CRDi డీజిల్ ఇంజిన్‌తో నడిచే లగ్జరీ ప్లస్ వేరియంట్ డ్రైవ్ చేసాము. ఇది 4,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113.4 బిహెచ్‌పి పవర్ మరియు 1,500 - 2,750 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. మేము నడిపిన కియా కారెన్స్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ పొందింది.

ఇందులోని స్టార్ట్/స్టాప్ బటన్‌ను నొక్కిన వెంటనే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. గేర్‌బాక్స్‌ను 'D' లోకి స్లాట్ చేయండి మరియు అది ఎటువంటి ప్రయత్నం లేకుండా కదులుతుంది. ఇది స్టాప్ అండ్ గో ట్రాఫిక్ ద్వారా డ్రైవింగ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. పట్టణ ప్రాంతాల్లో కూడా, Kia Carens చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటుంది.

ఇది ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లను పొందుతారు. ఈ డ్రైవ్ మోడ్‌లు కారెన్స్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌లతో మాత్రమే అందుబాటులో ఉంటాయి. డ్రైవ్ మోడ్‌ల మధ్య మారడానికి డ్రైవర్ సెంటర్ కన్సోల్‌లోని బటన్‌ను ఉపయోగించవచ్చు మరియు ప్రతి డ్రైవ్ మోడ్‌కు ప్రత్యేక పాత్ర ఉంటుంది.

ఎకో మోడ్‌లో త్రాటల్ రెస్పాన్స్ కొంత ఆలస్యం అవుతుంది. స్టీరింగ్ వీల్ చక్కగా మరియు తేలికగా ఉంటుంది. ఈ మోడ్ పట్టణ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక నార్మల్ మోడ్ విషయానికి వస్తే, స్టీరింగ్ వీల్ కొంత బరువు ఉంటుంది, అదే సమయంలో ఇంజిన్ రెస్పాన్స్ మెరుగ్గా ఉంటుంది.

స్పోర్ట్ మోడ్‌లో గేర్‌బాక్స్ ఎక్కువ కాలం పాటు గేర్‌లను పట్టుకుంటుంది. గేర్ లివర్‌ను స్పోర్ట్/మాన్యువల్ మోడ్‌లోకి స్లాట్ చేయవచ్చు మరియు గేర్‌లను మార్చడానికి ప్యాడిల్ షిఫ్టర్‌లను ఉపయోగించవచ్చు. ఈ మోడ్‌లో గేర్ షిఫ్ట్‌లు చాలా త్వరగా జరుగుతాయి. పనితీరు ఇందులో మరింత ఉత్తమంగా ఉంటుంది.

హ్యాండ్లింగ్ పరంగా ఎంచుకున్న డ్రైవ్ మోడ్ ప్రకారం స్టీరింగ్ వీల్‌పై అనుభూతి మారుతుంది. అయినప్పటికీ, అన్ని డ్రైవ్ మోడ్‌లలో బాడీ రోల్ ఒకే విధంగా ఉంటుంది. కియా సస్పెన్షన్ సౌకర్యవంతమైన రైడ్ మరియు మంచి హ్యాండ్లింగ్‌ని అందించడానికి ట్యూన్ చేయబడింది. కియా కారెన్స్‌లో బ్రేకింగ్ సిస్టం మరింత షార్ప్ గా ఉంటుంది. ఇందులో ఆరు లేదా ఏడుగురు ప్రయాణికులను తప్పకుండా సంతోషపరుస్తుంది. మొత్తం మీద, Kia Carens ఒక గొప్ప డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని ఖచ్చితంగా చెప్పగలము.

కియా కారెన్స్ సేఫ్టీ ఫీచర్స్:
కియా కారెన్స్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో
- ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
- వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్
- ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు
- బ్రేక్ అసిస్ట్ సిస్టమ్
- డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్
- హిల్ అసిస్ట్ కంట్రోల్
- టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్
- యాంటీ-లాక్ బ్రేక్‌లు
- రియర్ పార్కింగ్ సెన్సార్లు
- ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్
- స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్
- సౌకర్యవంతమైన సీటింగ్ మరియు కార్గో స్పేస్
- 64 కలర్ యాంబియంట్ లైటింగ్
- వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్
- వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
- డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- రెండవ వరుస కోసం వన్-టచ్ టంబుల్
- కియా కనెక్ట్ టెక్నాలజీ
- 10.25-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
- 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్
- స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్
పైన పేర్కొన్న అన్ని సేఫ్టీ ఫీచర్స్ కారెన్స్ యొక్క అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటాయి. కావున ఈ విభాగంలో ఇది అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది.

కియా కారెన్స్ కీ ఫీచర్స్:

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
కియా మోటార్స్ యొక్క ఈ కొత్త కియా కారెన్స్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉండి, 6 లేదా 7 మంది ప్రయాణికులకు అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉంటుంది. కావున ఇది భారతీయ మార్కెట్లో తప్పకుండా మంచి ఆధారణపొందుతుంది. ఈ కొత్త సంవత్సరంలో లెక్కకుమించిన లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన MPV కొనుగోలుచేయాలనుకునే వారికి కొత్త కియా కారెన్స్ అద్భుతమైన ఎంపిక అవుతుంది.


Click it and Unblock the Notifications








