Kia Seltos 2023 Full Review కియా సెల్టోస్‌ ఫీచర్లు, డిజైన్‌, ఇంజిన్‌ ఫర్మామెన్స్‌ పుల్‌ రివ్యూ

2019 సంవత్సరంలో కియా సంస్థ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో తన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటుచేసింది. కేవలం నాలుగు సంవత్సరాల్లో కియా సెల్టోస్‌ విక్రయాల ద్వారా విజయం సాధించింది. మరియూ కియాను భారత్‌లో ఐదో పెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించడంలో సాయపడింది.

అదే సమయంలో మారుతి సుజుకి, MG, టాయోటా వంటి కార్ల తయారీ సంస్థలు కూడా తమ కార్యకలాపాలను విస్తరించాయి. అయితే కియా మాత్రం తన సెల్టోస్‌ ద్వారా ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొంది. సెల్టోస్‌ తన పనితీరు, ఫీచర్ల ద్వారా కస్టమర్లను ఆకట్టుకుంది.

Kia Seltos 2023 Full Review

అయితే విక్రయాల్లో గరిష్ఠ స్థాయిని నమోదు చేసేందుకు.. సెల్టోస్‌ను కియా అంతర్జాతీయ స్థాయిలో అప్‌డేట్‌ చేసింది. కారు లోపల భాగం సహా ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్లలో మార్పులు చేసింది. అయితే ఈ అప్‌గ్రేడ్‌ ఏ మేరకు అమ్మకాలను ప్రభావితం చేస్తుందో చూడాలి.

కియా సెల్టోస్‌ డిజైన్‌ & ఫీచర్లు : కియా సెల్టోస్‌ 2.0ను దూరంగా చూస్తే పెద్దగా మార్పులు జరిగినట్లు గుర్తించలేరు. అయితే సరిగా గమనిస్తే మాత్రం కొన్నింటిని గమనించవచ్చు. కియా సెల్టోస్‌ మందు భాగంలో వేరియంట్‌ బ్యాడ్జ్‌ లేకుండా కొత్త గ్రిల్‌ను ఏర్పాటుచేశారు. దాని మధ్యలో డేటైమ్‌ లైట్లను అమర్చారు. మరియు ఫ్రంట్‌ బంపర్‌లో కొన్ని మార్పులు చేశారు. GT మరియు X మోడళ్లు వేర్వేరు సెటప్‌లను కలిగి ఉన్నాయి.

Kia Seltos 2023 Full Review

కొత్త సెల్టోస్‌ సైడ్‌లు పెద్దగా మార్పులు చేయలేదు. కానీ చక్రాల వద్ద డిజైన్‌లో చిన్న మార్పులను గమనించవచ్చు. మరియు అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. కారు వెనుక వైపు మార్పులను స్పష్టంగా గుర్తించవచ్చు. క్రోమ్‌ బార్‌కు బదులుగా LED టెయిల్‌లైట్లను ఏర్పాటుచేశారు. GT మోడల్‌ వాహనం డ్యూయల్‌ ఎగ్జాస్ట్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది.

కియా సెల్టోస్‌ 2.0 కారు ఇంటీరియర్‌లో భారీ మార్పులు చేసినట్లు వెంటనే గుర్తించవచ్చు. ట్రిమ్‌ లైన్‌ వేర్వేరు అప్హోల్స్టరీ సెటప్‌ను కలిగి ఉంటుంది. దాంతోపాటు డ్యాష్‌, రూఫ్‌లోనూ మార్పులు స్పష్టంగా ఉన్నాయి. కారు డ్యాష్‌బోర్డుపై రెండు 10.25 అంగుళాల డిస్‌ప్లేలు ఉన్నాయి. కుడివైపున ఉన్న డిస్‌ప్లై డ్రైవర్‌ డిస్‌ప్లేగా పనిచేస్తుంది.

Kia Seltos 2023 Full Review

మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్‌ కోసం HD టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్‌ యూనిట్ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లేను సపోర్టు చేస్తుంది. ప్రీమియం ఆడియో సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడి వస్తుంది. మరియు మీ స్మార్ట్‌వాచ్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్‌ చేసేందుకు కియా కనెక్ట్‌ ఫీచర్‌తో కనెక్ట్ కావచ్చు.

కియా సెల్టోస్‌ 2.0 కారు క్యాబిన్‌ డ్యూయల్‌ జోన్‌ పుల్‌ ఆటోమేటిక్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ వ్యవస్థను కలిగి ఉంటుంది. అవసరాన్ని బట్టి క్యాబిన్‌ను చల్లగా లేదా వెచ్చగా ఉంచుతుంది. సీట్లు కూడా చాలా సౌకర్యంగా ఉంటాయి. ముందు సీట్లు వెంటిలేషన్‌ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి. ఆరు అడుగులు ఉన్న వ్యక్తులు కూడా సౌకర్యంగా కూర్చొనేలా వెనుక భాగం ఉంటుంది.

Kia Seltos 2023 Full Review

కారు క్యాబిన్‌ విశాలంగా ఉంటుంది. మరియు భారీ డ్యూయల్‌ పేన్‌ సన్‌రూఫ్‌ను కలిగి ఉంటుంది. వాయిస్‌ కమాండ్‌తో సన్‌రూప్‌ను నియంత్రించవచ్చు. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, ఎయిర్‌ ఫ్యూరిఫైయర్‌, ఎలక్ట్రిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, 360 డిగ్రీల కెమెరా, హెడ్స్‌ అప్‌ డిస్‌ప్లే, లెథెరెట్ సీట్‌ అప్హోల్స్టరీ కూడా ఉన్నాయి.

భద్రతా పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, బ్రేక్‌ అసిస్ట్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, ట్రాక్షన్ కంట్రోల్‌, హిల్‌ డిసెంట్‌ కంట్రోల్‌, హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌, వెహికల్‌ స్టెబిలిటీ మెనేజ్‌మెంట్‌, ముందు, వెనుక పార్కింగ్‌ సెన్సార్లు, ISOFIX మరియు ఆల్‌ వీల్‌ డిస్క్‌ బ్రేక్‌లను కలిగి ఉంటాయి.

Kia Seltos 2023 Full Review

కియా కొత్త సెల్టోస్‌ ADAS (అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్‌) లెవల్‌ 2తో వస్తుంది. ఇందులో స్టాప్‌ అండ్ గో ఫీచర్‌తో కూడిన క్రూయిజ్‌ కంట్రోల్‌, ఫ్రంట్‌ కొలిజన్‌ వార్నింగ్‌, ఎగవేషన్‌ అసిస్ట్‌, లేన్‌ కీప్‌ అసిస్ట్‌, బ్లైండ్‌ స్పాట్‌ కొలిజన్‌ వార్నింగ్‌ సహా మరిన్ని మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.

కియా సెల్టోస్‌ స్పెసిఫికేషన్లు, కొలతలు: కియా సెల్టోస్‌ మూడు ఇంజిన్ ఆప్షన్‌లో వస్తుంది మరియు 4 గేర్‌బాక్స్‌లను కలిగి ఉంటుంది. ఈ కారు నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌.. 113bhp శక్తి, 144Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Kia Seltos 2023 Full Review

కియా సెల్టోస్‌ ఇంజిన్‌ 6 స్పీడ్‌ మాన్యువల్‌ లేదా iVT గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. 1.5 లీటర్‌ డిజిల్‌ ఇంజిన్‌.. 114bhp శక్తి, 250Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ iMT మరియు ఆటోమేటిక్ 6 స్పీడ్‌ ట్రాన్సిమిషన్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.

1.5 టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 158bhp శక్తి, 253Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్‌ iMT మరియు 7 స్పీడ్‌ DCT ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. కియా సెల్టోస్‌ 2.0 4,365mm పొడవు, 1800mm వెడల్పు, 1645mm ఎత్తు, 2610mm వీల్‌ బేస్‌ను కలిగి ఉంటుంది. మరియు సెల్టోస్‌ 190mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌, 433 లీటర్ల బూట్‌స్పేస్‌తో వస్తుంది.

Kia Seltos 2023 Full Review

కియా సెల్టోస్‌ డ్రైవింగ్‌ ఇంప్రెషన్‌: కియా కొత్త సెల్టోస్‌ టర్బో ఛార్జడ్‌ ఇంజిన్‌, 7 స్పీడ్‌ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన కారును డ్రైవ్‌ చేశాము. 5000rpm వద్ద 158bhp మరియు 1500 నుంచి 3500rpm వద్ద గరిష్ఠంగా 253Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ కారులో మూడు ఇంజిన్‌ మోడ్‌లు ఉన్నాయి. ఎకో, నార్మల్‌ మరియు స్పోర్ట్‌లో లభిస్తుంది. ఎకో నుంచి స్పోర్ట్‌కు మారినప్పుడు థ్రోటర్‌ రెస్పాన్స్ మెరుగుపడుతుంది. ప్రారంభం నుంచి క్రమబద్ధంగా శక్తి ఉత్పత్తి జరుగుతుంది. టర్బో ఇంజిన్‌లో త్వరగా పెరుగుతుంది.

Kia Seltos 2023 Full Review

కియా సెల్టోస్‌ 7 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ చాలా సజావుగా మారుతుంది. ఓవర్‌టేక్‌ చేస్తున్న సమయంలో గేర్లు మార్చేందుకు సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. ఈ కారు నగరాల్లో ఉపయోగించడం కూడా చాలా సులభంగా ఉంటుంది. కియా కొత్త సెల్టోస్‌ సస్పెన్షన్‌ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా ఉంటుంది. గుంతలు, ఎత్తైన ప్రాంతాల్లోని రోడ్లపైనా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

స్టీరింగ్‌ వీల్‌ కూడా చాలా తేలికగా డ్రైవింగ్‌ సమయంలో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. లేన్‌ మారినప్పుడు లేదా డ్రైవింగ్‌ మోడ్‌ ఎకో నుంచి స్పోర్ట్‌కు మారినప్పుడు స్టీరింగ్ వీల్‌ బరువు పెరిగినట్లు అనిపిస్తుంది. మరియు కీలకమైన ADAS ఫీచర్‌ సెల్టోస్‌ 2.0 సొంతం. ఇది కారుకు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుతుంది.

కియా కొత్త సెల్టోస్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌, ADAS సహా మరిన్ని మార్పులను తీసుకొస్తుంది. ఫలితంగా మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. నగర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Sunday, July 23, 2023, 10:11 [IST]
English summary
Kia seltos 2023 features specs design driving impressions full review in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+