Kia Sonet Facelift 2024 Full Review కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ డిజైన్‌, ఫీచర్లు, పర్ఫామెన్స్‌ ఫుల్‌ రివ్యూ

2020లో ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పీడిస్తున్న సమయంలోనే ఆటోమొబైల్‌ రంగంలో సబ్‌ 4 మీటర్‌ SUV సెగ్మెంట్‌లోకి కియా సోనెట్‌(Kia Sonet) అడుగుపెట్టింది. గతేడాది డిసెంబర్‌లో కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌ను కియా ఇండియా ఆవిష్కరించగా.. జనవరి 12 న భారత మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ కారును టెస్ట్‌ డ్రైవ్‌ చేసేందుకు మా డ్రైవ్‌స్పార్క్‌ టీమ్‌కు ఆహ్వానం లభించింది.

ఫిబ్రవరి 2020లో విడుదలైన కియా సోనెట్‌ ఆగష్టులో ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుకుంది. కాగా గత మూడేళ్లుగా ఈ ఎస్‌యూవీలో ఎలాంటి మార్పులు జరగలేదు. సబ్‌ 4 మీటర్‌ కాన్సెప్ట్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టిన సోనెట్‌.. ఇప్పుడు 2024లో సోనెట్‌ ఫేస్‌లిఫ్టెడ్‌గా వస్తోంది. ఈ క్రమంలో ఈ కారులో పలు మార్పులను మా టీమ్‌ గమనించింది. కొత్త సోనెట్‌ డిజైన్‌, ఫీచర్లు, ఇంజిన్‌ పర్ఫామెన్స్‌ పూర్తి రివ్యూ ఈ కథనంలో.

Kia-Sonet-Facelift

డిజైన్‌: కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌.. ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌ పరంగా చాలా అప్‌డేట్లకు గురైంది. ముందుగా ఎక్స్‌టీరియర్‌ను పరిశిలిస్తే.. ఫ్రంట్‌ భాగంలో అప్‌డేట్‌ చేయబడిన పెద్ద 'టైగర్ నోస్' గ్రిల్‌ను కలిగి ఉంది. స్టార్ మ్యాప్ LED DRLల ద్వారా గ్రిల్‌కు మూడు వైపులా ఉన్న కొత్త క్రౌన్ జ్యువెల్ LED హెడ్‌ల్యాంప్‌లు బ్యూటిఫుల్‌ లుక్‌ను ఇస్తున్నాయి. రీడిజైన్డ్‌ ఫ్రంట్‌ బంపర్‌కు ఇరువైపులా కొత్త LED ఫాగ్ ల్యాంప్‌లను అడ్డంగా అమర్చారు.

అయితే సోనెట్ ఫేస్‌లిఫ్ట్ యొక్క సైడ్‌లు ముందు వెర్షన్‌తో పోలిస్తే పెద్దగా మార్పులు కనిపించవు. కొత్త 16-అంగుళాల క్రిస్టల్-కట్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మాత్రమే మారినట్లు ఇక్కడ చూడవచ్చు. వెనుకకు వెళ్తే.. అప్‌డేటెడ్‌ సోనెట్ స్పోర్ట్స్ LED కనెక్ట్ చేయబడిన టైల్‌లైట్‌లు ఉన్నాయి. అయితే GTX మరియు X-లైన్ వేరియంట్‌ల కోసం కొత్త స్పాయిలర్ మరియు బంపర్‌పై ఫాక్స్ స్కిడ్ ప్లేట్లను గమనించాం.

Kia-Sonet-Facelift

ఇంటిరీయర్‌: ఇక కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌ ఇంటీరియర్‌ విషయానికొస్తే.. ఇందులో చాలా మార్పులను చూస్తాం. మొదటిది స్టీరింగ్ వీల్ వెనుక కూర్చున్న కొత్త 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాకుండా కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్.. ఇన్‌స్ట్రుమెంటేషన్ స్క్రీన్‌కు సమానంగా ఉంటుంది.

ఫీచర్లు: ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే ఇంకా కియా కనెక్ట్ సూట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు(Features) ఇందులో ఉన్నాయి. దీని ద్వారా ఆటోమేటిక్ A/C వంటి ఫంక్షన్‌లను యాక్టివేట్ చేయడానికి ఇంకా OTA అప్‌డేట్‌లను పొందేందుకు ఈ సిస్టమ్‌ మీకు అనుమతినిస్తుంది. సెంట్రల్ ఎయిర్ వెంట్స్ అదనపు ఆకర్షణ.

Kia-Sonet-Facelift

స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్, 4-వే పవర్ డ్రైవర్ సీటు మరియు బోస్ నుండి 7-స్పీకర్ ప్రీమియం ఆడియో సిస్టమ్‌తో సహా ఇతర మార్పులు కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌కు అదనపు ఆకర్షణను జోడిస్తున్నాయి. ఇక కొత్త సోనెట్‌లో మరిన్ని సేఫ్టీ ఫీచర్ల(Safety Features)ను కూడా చూడవచ్చు.

సేఫ్టీ ఫీచర్లు: ESC, హిల్ అసిస్ట్ మరియు వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఫ్రంట్ అండ్‌ రియర్‌ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, TPMS, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌, ఇంకా 6 ఎయిర్‌బ్యాగ్‌లు కస్టమర్లకు మరింత భద్రతనిస్తాయి. కొత్త 2024 కియా సోనెట్‌లో లెవెల్ 1 ADAS కూడా ఉండటం చెప్పుకోదగినది.

Kia-Sonet-Facelift

ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ మరియు అవాయిడెన్స్(కారు, సైకిళ్లు, పాదచారులు), లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఇంకా ఇలా 10 అటానమస్ సేఫ్టీ ఫీచర్ల ప్యాక్‌గా కియా సోనెట్‌(Kia Sonet Facelift Safety Features) అత్యంత భద్రతనిస్తోంది.

ఇంజిన్‌: 2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్‌ విషయానికొస్తే ఇది దాని పాత వెర్షన్ మాదిరిగానే ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంది. అయితే డీజిల్ పవర్‌ప్లాంట్ కోసం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను తిరిగి ఇందులో తీసుకువచ్చారు. బేస్ ఇంజిన్ 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో ఉంది. ఇది 82bhp మరియు 115 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంది.

Kia-Sonet-Facelift

పెట్రోల్‌ ఇంజిన్‌ 998cc, టర్బోచార్జ్డ్, మూడు-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 182bhp మరియు 172Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. ఇంజిన్ 6-స్పీడ్ iMT లేదా 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో కియా ఇండియా ప్రవేశపెట్టింది. ఇక కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌ 2024 లో ఏకైక డీజిల్ ఇంజిన్ 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌లో ఇది అతి పెద్దదని గుర్తించాము. ఈ ఇంజిన్‌ 114 bhp మరియు 250 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 6-స్పీడ్ iMT మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో జతచేయబడి ఉంటుంది.

Kia-Sonet-Facelift

అయితే టెస్ట్‌ డ్రైవ్‌ చేసేటప్పుడు మేము కొత్త సోనెట్ యొక్క డీజిల్ ఆటోమేటిక్ (టార్క్ కన్వర్టర్) వెర్షన్‌ను తీసుకోవాల్సి వచ్చింది. ఇది కొన్ని మార్పులతో ఉన్నప్పటికీ డ్రైవింగ్‌ అనుకూలంగా అనిపించింది. కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌ డీజిల్‌ ఇంజిన్‌ వెర్షన్‌ను డ్రైవ్‌ చేస్తున్నప్పుడు చాలా మృదువుగా అనిపించింది. కానీ రెవ్‌ రేంజ్‌లో వెళ్లినప్పుడు కొంచెం హార్డ్‌గా అనిపించింది. కాగా ఇది 100 కి.మీ వేగాన్ని సులభంగా అందుకుంది.

కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ చాలా వరకు శక్తిని సులభంగా వీల్స్‌కు సరఫరా చేస్తుండటాన్ని గుర్తించాం. అయితే ప్యాడిల్ షిఫ్టర్‌లను ఉపయోగించినప్పుడు, కొన్ని సార్లు షిఫ్ట్‌లు చాలా ఆలస్యంగా అనిపించినట్లుగా గమనించాం. ఇక సస్పెన్షన్ సెటప్‌ను పరిశీలిస్తే ఇది మునుపటి కంటే కొంచెం మృదువుగా ఉండేలా మార్పులు చేశారు.

Kia-Sonet-Facelift

కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌లో మృదువైన సస్పెన్షన్‌ సెటప్‌ ద్వారా గరుకైన రోడ్లపై ప్రయాణించినప్పుడు సులువుగా అనిపించింది. చాలా స్మూత్‌గా డ్రైవ్‌ చేయవచ్చు. టర్నింగుల్లో కూడా సునాయాసంగా వెళ్తుంది. అయితే దీనిని రఫ్‌ అండ్‌ టఫ్‌గా వాడకూడదని గమనించాలి. ఇక కొత్త సోనెట్‌లో బ్రేక్‌లు చాలా బాగా పని చేస్తున్నాయి. కానీ ప్రారంభ దశలో కొంచెం సెన్సిటివ్‌గా అనిపించవచ్చు.

కానీ కొత్త 2024 సోనెట్‌ను కొనుగోలు చేసిన తర్వాత.. మీరు కొన్నాళ్లు వినియోగించాక.. ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లకు అలవాటు పడినట్లయితే ఇది మీకు సులభంగా అనిపిస్తుంది. కాగా ADAS సిస్టమ్ కొంచెం హిట్ మరియు మిస్ అయినట్లుగా కనిపించాయి. అయినప్పటికీ కస్టమర్ల సేఫ్టీలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Kia-Sonet-Facelift

చివరిగా కొత్త 2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌.. రెగ్యులర్‌గా వస్తున్న సాధారణ ఫేస్‌లిఫ్ట్‌ల కంటే ఎక్కువగా అప్‌డేట్‌ అయి ఉంది. ఇందులో కొత్త ఫీచర్లు, సేఫ్టీ కిట్‌తో పాటు ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్ డిజైన్‌ పరంగా చాలా మార్పులను చూడవచ్చు. అదే పవర్‌ట్రెయిన్‌ శ్రేణితో.. గత వెర్షన్‌తో పోలిస్తే చాలా సురక్షితంగా ఫీచర్డ్‌ ప్యాక్‌గా వస్తోంది. సబ్‌ 4 మీటర్‌ SUVని కొనుగోలు చేయాలనుకునేవారు.. ఏం ఆలోచించకుండా కొత్త సోనెట్‌ను పరిశీలించవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, January 11, 2024, 10:00 [IST]
English summary
Kia sonet facelift 2024 design features specs engine performance full review
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+