Mahindra BE 6e Full Review in Telugu మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేయవచ్చా, లేదా?

ఇటీవల మహీంద్రా కార్లు అమ్మకాల్లో దూసుకెళ్తున్నాయి. మాస్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ విడుదల చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO, ఆఫ్‌రోడర్‌ కింగ్‌ మహీంద్రా థార్ రాక్స్‌, XUV 400 EV వంటివి మార్కెట్‌లో అదరగొడుతున్నాయి. దీంతో టాటా మోటార్స్‌ని అధిగమించి మూడవ స్థానాన్ని ఆక్రమించింది. తమ ఈవీ లైనప్‌ని విస్తరించే పనిలో భాగంగా సరికొత్త BE 6e, XEV 9e కార్లను విడుదల చేసింది. ఇందులో BE 6eని మా డ్రైవ్‌స్కార్క్‌ టీమ్ టెస్ట్‌డ్రైవ్ చేసింది. ఈ కొత్త కారు ఫర్ఫామెన్స్‌, స్పెసిఫికేషన్స్‌కి సంబంధించిన ఫుల్‌ రివ్యూ మీకోసం..

ఎక్స్‌టీరియర్‌ డిజైన్: ఈ సరికొత్త మహీంద్రా BE 6e చూడగానే ఆకట్టుకునే డిజైన్‌తో ఉంటుంది. ముందు భాగంలో C-ఆకారపు LED డేటైమ్ రన్నింగ్ లైట్స్‌, లైట్‌బార్‌ వంటి ఇండికేటర్స్‌ కూడా రెట్టింపు అందాన్ని ఇస్తుంది. LED హెడ్‌లైట్స్‌, బంపర్‌ కింద సొగసైన ఫాగ్ ల్యాంప్స్‌ ఉన్నాయి. ఇక BE 6e ఫ్రంట్ ఎండ్ బానెట్ వింగ్ ముందు భాగంలో మెరుస్తున్న BE లోగో కలదు.

Mahindra BE 6e Review in Telugu

ముందు భాగంలోనే ఫ్రంక్ (ఫ్రంట్ స్టోరేజీ) 45 లీటర్ల కలదు. పియానో ​​బ్లాక్ ప్యానెల్స్‌, వీల్‌ఆర్చ్స్‌, కూపే SUV కింది భాగం నుంచి వెనుక బంపర్ ముగిసే వరకు ఉంటుంది. సైడ్‌లో ఏరో-ఆప్టిమైజ్ చేయబడిన 19-అంగుళాల వీల్స్, వెనుక ఎడమ వీల్‌ఆర్చ్‌పై ఛార్జింగ్ పాయింట్‌ ఉంటుంది. ఇక వెనక A-పిల్లర్, ఫ్రంట్ విండ్‌స్క్రీన్‌తో పాటు రూఫ్‌లైన్, జాక్-అప్ గ్రౌండ్ క్లియరెన్స్‌తో BE 6e అచ్చం SUV కూపేలా కనిపిస్తుంది.

అయితే ఆ కూపే రూఫ్‌లైన్ వల్ల వెనుక విండోస్‌ చిన్నవిగా కనిపిస్తాయి. వెనుక భాగంలోని విండ్‌స్క్రీన్ పై డ్యూయల్ స్పాయిలర్ సెటప్ ఉంటుంది. బూట్ లిడ్ కింద మరొక స్పాయిలర్‌ను కలిగి ఉంది. ఇది C-ఆకారపు టైల్‌లైట్స్‌, మూడవ బ్రేక్ లైట్‌ను కలిగి ఉంటుంది. బూట్ లిడ్ కొత్త మహీంద్రా ఇన్ఫినిటీ లోగో యొక్క ఇల్యూమినేటెడ్ వెర్షన్‌కు హోస్ట్‌గా పనిచేస్తుంది. దాని కింద ట్విన్ డిఫ్యూజర్ ఎలిమెంట్స్‌ ఉన్నాయి.

Mahindra BE 6e Range

ఈ BE 6e బూట్ ఎలక్ట్రికల్‌గా తెరుచుకుంటుంది అలాగే మూసివేయబడుతుంది. ఇక వెనకాల లగేజీ క్యారీ చేయడానికి 455 లీటర్ల స్పేస్‌ కలదు. ఇది మీరు లాంగ్‌ ట్రిప్‌కి ఉపయోగపడుతుంది. ఓవరాల్‌గా ఇది చూడటానికి ఆకట్టుకునే డిజైన్‌లో అచ్చం స్పోర్ట్‌ కారు వలె కనిపిస్తుంది.

ఇంటీరియర్ & ఫీచర్లు: డ్రైవర్ సీటు నుంచి ఈ కారులోనికి వెళ్తుంటే పైలట్ కాక్‌పిట్‌లోకి అడుగుపెట్టినట్లు అనుభూతి వస్తుంది. డ్రైవర్ సీటు పర్సనల్‌ కాక్‌పిట్ లాగా అనిపిస్తుంది. ఇంటీరియర్‌ లోని యాంబియంట్ లైటింగ్‌ కట్టిపడేస్తుంది. అద్భుతమైన ఫీచర్లు గల 12.3-అంగుళాల స్క్రీన్స్‌ని గమనించవచ్చు. ఒకటి ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం అందించారు. ఇది క్యాబిన్‌కు హైటెక్ వైబ్‌ని తీసుకువస్తుంది.

Mahindra BE 6e Driving Impressions

ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్ సాంప్రదాయ పుష్ బటన్‌ను కాకుండా కెపాసిటివ్ టచ్‌తో వస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ యూనిట్ 5G కనెక్టివిటీ, Android Auto, Apple CarPlay కోసం వైర్‌లెస్ సపోర్ట్‌తో సహా ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఇది డాల్బీ అట్మోస్ ఫీచర్‌తో కూడిన ప్రీమియం 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్‌తో వస్తుంది. దీంతో మంచి మ్యూజిక్‌ సౌండ్‌ని ఎక్స్‌పీరియన్స్‌ చేయవచ్చు.

మహీంద్రా BE 6e సీట్లు ఫాబ్రిక్, లెథెరెట్ అప్హోల్స్టరీతో ప్రీమియంగా కనిపిస్తాయి. ఇవి డ్యూయల్‌-టోన్ కలర్‌తో వస్తాయి. ముందు సీట్లు అద్భుతంగా సపోర్టివ్‌గా ఉంటాయి. డ్రైవర్ సీటు ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయవచ్చు. సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌, ఈ సీట్లు కాన్సెప్ట్-వంటి డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఓవరాల్‌గా మీ తల, మెడకు మంచి సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, వెనుక సీట్లు కొంచెం ఇరుకైనట్లు అనిపిస్తుంది.

Mahindra BE 6e Price

ప్రత్యేకించి ముందు ఒక పొడవైన డ్రైవర్ ఉంటే మోకాలి, హెడ్‌రూమ్‌ని వెనక్కి జరపడం వల్ల వెనుక సీటు ప్రయాణీకులు కాస్త ఇబ్బంది పడతారు. అంతే కాకుండా ఇందులో థై సపోర్ట్‌ కాస్త తక్కువే ఉంది. మీరు వెనుక సీట్లలోకి వెళ్లేటప్పుడు తక్కువ రూఫ్‌లైన్‌ కలిగి ఉండటం వల్ల పొడవైన వారు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దీంతో ఎత్తైన ప్రయాణీకులు వెనుక సీట్లు కొంచెం అలర్ట్‌గా ఉండాలి.

వాలుగా ఉండే రూఫ్‌లైన్ వల్ల బ్యాక్‌ విండోస్‌ చిన్నగా ఉంటాయి. అయితే పనోరమిక్ సన్‌రూఫ్‌ కవర్‌ నుంచి మీకు మంచి వెలుతురు రావడం వల్ల ఇరుకైన భావన (క్లాస్ట్రోఫోబియా) తగ్గుతుంది. ఇక విండోస్‌లో, అలాగే ముందు భాగంలో మంచి స్టోరేజీ స్పేస్‌ లభిస్తుంది.

Mahindra BE 6e Interior

సేఫ్టీ ఫీచర్లు: ఈ కారు ఏడు ఎయిర్‌బ్యాగ్స్‌తో వస్తుంది. ఇందులో డ్రైవర్ మోకాళ్లకు ఒకటి, డ్రైవర్ అలర్ట్‌నెస్ సిస్టమ్, లెవల్‌ 2+ ADASలో రాడార్, కెమెరాలు ఉన్నాయి. అంతే కాకుండా బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఆటో పార్కింగ్, EBDతో కూడిన ABS, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి. అలాగే ఇది పావ్‌పాల్ (PawPal) అనే ప్రత్యేకమైన ఫీచర్‌ను అందిస్తుంది. ఇది పెంపుడు జంతువులను తీసుకువెళ్లేటప్పుడు సహాయ పడుతుంది.

స్పెక్స్ & డైమెన్షన్స్: XEV 9e వలె BE 6e EV కూడా INGLO స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. 2,775mm వీల్‌బేస్, 4,371mm పొడవు, 1,907mm వెడల్పు, 1,627mm ఎత్తు, 207mm గ్రౌండ్ క్లియరెన్స్ అలాగే 10-మీటర్ల టర్నింగ్ సర్కిల్ డయామీటర్‌ని కలిగి ఉంటుంది.

Mahindra BE 6e Instrument Cluster

బ్యాటరీ: XUV 9e వలె, BE 6e కూడా 59 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తుంది. 59kWh బ్యాటరీ ప్యాక్‌ ఫుల్‌ ఛార్జ్‌పై 535km (MIDC) రేంజ్‌ని అందిస్తుంది. దీనిని 140kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 20 నిమిషాల్లో 20% నుంచి 80% వరకు ఛార్జ్‌ చేయవచ్చు. అలాగే 7.2kW AC ఛార్జర్‌ కూడా లభిస్తుంది.

AC ఛార్జర్‌తో ఫుల్‌ ఛార్జ్‌ చేయడానికి 8.7 గంటలు పడుతుంది. 11kW ఛార్జర్‌తో ఆరు గంటల్లో ఫుల్‌ ఛార్జ్ చేయవచ్చు. ఇక పెద్ద 79kWh బ్యాటరీ ప్యాక్ ఒకే ఛార్జ్‌పై 682km ఆకట్టుకునే MIDC రేంజ్‌ని అందిస్తుంది. 175kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 20% నుంచి 80% ఛార్జ్‌ చేయడానికి కేవలం 20 నిమిషాలు మాత్రమే సమయం తీసుకుంటుంది.

Mahindra BE 6e Safety Features

7.2kW AC ఛార్జర్ తో 11.7 గంటల్లో ఫుల్‌ ఛార్జ్‌ చేయవచ్చు. అలాగే 11kW ఛార్జర్ ద్వారా ఎనిమిది గంటల్లో ఛార్జింగ్ కంప్లీట్ చేయవచ్చు. ఇందులోని 79kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 281.6bhp పవర్‌ని అందిస్తుంది. అలాగే 59kWh ప్యాక్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ 228bhp, 380Nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది కేవలం 6.7 సెకన్లలో 0-100km/h వేగాన్ని అందుకుంటుంది.

సస్పెన్షన్‌: XEV 9e వలె కొత్త మహీంద్రా BE 6e కూడా సెమీ-యాక్టివ్ మెక్‌ఫెర్సన్ స్ట్రట్ ఐ-లింక్ ఇండిపెండెంట్ సస్పెన్షన్‌తో వస్తుంది. 5-లింక్ ఇండిపెండెంట్ సస్పెన్షన్, స్టెబిలైజర్ బార్ బంప్స్‌ కఠినమైన రోడ్లలో మంచి ప్రయాణాన్ని అందిస్తాయి. ప్రయాణంలో బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేయడానికి బ్రేకింగ్ ద్వారా విడుదలయ్యే అదనపు శక్తిని వినియోగించుకునేందుకు రీజనరేట్‌ బ్రేకింగ్ సిస్టమ్‌ కలదు.

Mahindra BE 6e Side Design

చివరిగా: ఆ కారు ఆకట్టుకునే డిజైన్‌తో మంచి లుక్‌ని కలిగి ఉంటుంది. టాటా కర్వ్‌కి ఇది ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కర్వ్‌ ఈవీ కంటే దీని ధర రూ. 1.50 లక్షలు ఎక్కువగా ఉంది. అయితే ఓ క్లాసీ కారు, మంచి ఫర్ఫామెన్స్‌, ఫుల్‌ప్యాక్డ్‌ ఫీచర్లతో కొనాలని భావిస్తే ఇది మీకు ఫర్‌ఫెక్ట్‌ ఆప్షన్‌ అవుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 29, 2024, 17:00 [IST]
English summary
Mahindra be 6e review driving impressions specs features and range details in telugu
Read more on: #mahindra #car review #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+