ఐరన్ మ్యాన్ లాంటి బాడీ.. కొండలైనా, గుట్టలైనా అవలీలగా ఎక్కేస్తుంది.. బొలేరో నయా మోడల్ వచ్చేసింది

భారతదేశంలో అత్యంత నమ్మకమైన, బలంగా ఉండు ఎస్యూవీ పేరుగాంచిన మహీంద్రా బొలెరో ఇప్పుడు కొత్త లుక్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. 2025 బొలెరో B8 మోడల్‌ ఫేస్‌లిఫ్ట్‌ను మహీంద్రా తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. ఇది తన పాత గుర్తింపును నిలబెట్టుకుంటూనే కొత్త స్టైలిష్ డిజైన్ మెరుగైన ఇంటీరియర్స్, కొన్ని అదనపు ఫీచర్లను యాడ్ చేసింది. కొత్త బొలెరో B8 ఆన్-రోడ్ ధర రూ.10.3 లక్షల నుంచి మొదలవుతుంది. కచ్చా రోడ్ల మీద కూడా సులభంగా దూసుకుపోయేందుకు ఇది అద్భుతమైన ఆప్షన్.

కొత్త డిజైన్, స్టైలింగ్
కొత్త బొలెరో B8 కంప్లీట్ బ్లాక్ కలర్లో లభిస్తుంది. వాహనంలోని ప్రతి ప్యానెల్ బ్లాక్ కలర్లో ఉండడం వల్ల ఇది మరింత బోల్డ్, అడ్వాన్సుడ్ లుక్ ఇస్తుంది. ముందు భాగంలో కొత్తగా రూపొందించిన గ్రిల్, గ్లోస్ బ్లాక్‌లోని లోయర్ బంపర్ ఉన్నాయి. హెడ్‌లైట్లు పాత ఆకారాన్ని కలిగి ఉన్నప్పటికీ, మెరుగైన విజిబిలిటీ కోసం ఫాగ్ లైట్లు కొత్తగా చేర్చారు.

Mahindra Bolero B8 2025 Facelift Launched in India On-Road Price Starts at Rs 10 3 Lakh

సైడ్, వెనుక భాగంలో మార్పులు
బొలెరో సైడ్ ప్రొఫైల్‌లో 15 అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను జోడించారు. ఇది దాని స్ట్రాంగ్ లుక్ మరింత పెంచుతుంది. గ్లోస్ బ్లాక్‌లో ఉన్న బాడీ క్లాడింగ్ ముందు నుంచి వెనుక వరకు విస్తరించి ఉంటుంది. వెనుక భాగంలో స్పేర్ వీల్‌పై బ్రాండెడ్ కవర్, కొత్త టైల్ లైట్లు ఉన్నాయి. వెనుక సేఫ్టీ కోసం సెన్సార్లు స్టాండర్డ్‎గా అందించారు. కానీ పార్కింగ్ కెమెరా మాత్రం ఇవ్వలేదు. వెనుక వైపర్, వాషర్ ఉన్నప్పటికీ, డిఫాగర్ సౌకర్యం అందించలేదు.

Mahindra Bolero B8 2025 Facelift Launched in India On-Road Price Starts at Rs 10 3 Lakh

ఇంజిన్, పర్ఫామెన్స్, ఫీచర్లు
కొత్త బొలెరో B8లో విశ్వసనీయమైన 1.5-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 75 bhp పవర్, 210 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇంజిన్, గేర్‌బాక్స్‌లో మార్పులు లేనప్పటికీ వెహికల్ రైడ్ క్వాలిటీని మెరుగుపరిచేందుకు సస్పెన్షన్‌లో కొన్ని మార్పులు చేశారు. దీని ఫ్యూయెల్ కెపాసిటీ లీటరుకు సుమారు 16 కి.మీగా ఉంది.

Mahindra Bolero B8 2025 Facelift Launched in India On-Road Price Starts at Rs 10 3 Lakh

బొలెరో B8 లోపల బ్లూటూత్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. అయితే ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు లేవు. సేఫ్టీ విషయానికి వస్తే.. ఇందులో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, EBDతో కూడిన ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ఈ మోడల్‌లో వెనుక పార్కింగ్ కెమెరా, వెనుక ఏసీ వెంట్స్ వంటి కొన్ని లేటెస్ట్ ఫీచర్లు మిస్సయ్యాయి.

Mahindra Bolero B8 2025 Facelift Launched in India On-Road Price Starts at Rs 10 3 Lakh

ధర, పోటీ
బొలెరో B8 ఒకే ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో లభిస్తుంది. ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఆన్-రోడ్ ధర రూ.10.3 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కొత్త మోడల్ భారతదేశం అంతటా ఉన్న మహీంద్రా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. డెలివరీలు త్వరలో మొదలవుతాయి. మార్కెట్లో దీనికి ప్రధాన పోటీదారులుగా మారుతి సుజుకి ఎర్టిగా, టాటా నెక్సాన్, రెనాల్ట్ ట్రైబర్ వంటి కార్లు ఉన్నాయి. సరసమైన ధరలో, స్ట్రాంగ్ బాడీ ఉన్న ఎస్యూవీ కోసం చూస్తున్న కస్టమర్లకు బొలెరో B8 బెస్ట్ ఛాయిస్.

More from DriveSpark

Article Published On: Monday, October 6, 2025, 17:00 [IST]
English summary
Mahindra bolero b8 2025 facelift launched in india on road price starts at rs 10 3 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+