Mahindra Thar Roxx Full Review in Telugu మతిపోగొడుతున్న మహీంద్రా థార్‌.. ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా?

మార్కెట్‌లో బెస్ట్‌ ఆఫ్-రోడర్‌ ఎస్‌యూవీ ఏదైనా ఉందా అంటే ఠక్కున మహీంద్రా థార్‌ గుర్తుకు వస్తుంది. ఆఫ్‌రోడ్‌ ఎస్‌యూవీలలో ఇది ఎప్పుడూ టాప్‌లోనే కొనసాగుతుంది. అయితే ఇన్ని రోజులు కేవలం మూడు డోర్ల ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇది ఈ ఆఫ్‌రోడర్‌ ఎస్‌యూవీలో అతిపెద్ద రిమార్క్‌గా ఉండేది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తేవి. వెనకాల డోర్లు లేకపోవడంతో వాహనంలో వెనుకకు వెళ్లేందుకు సీట్లను సర్దుబాటు చేసి వెనక్కి వెళ్లడం కష్టంగా ఉండేది. ఈ సమస్యకు మహీంద్రా ఇప్పుడు చెక్‌పెట్టింది. మహీంద్రా థార్ 5-డోర్ల ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీనిని కేవలం రూ. 12.99 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త థార్ రాక్స్‌ని మా డ్రైవ్స్‌పార్క్‌ టీమ్‌ కొచ్చిన్‌లో టెస్ట్‌డ్రైవ్‌ చేసింది. దీని ఫర్పామెన్స్‌, స్పెసిఫికేషన్స్‌ ఇతర విషయాలు మీకోసం..

డిజైన్: ముందుగా థార్ రాక్స్ మునుపటి మాదిరిగానే బాక్సీ ఆకారాన్ని కలిగి ఉంది, అయితే ఈ 5 డోర్ వెర్షన్‌లో కొన్ని మార్పులు చేసింది. LED హెడ్‌లైట్‌లు, C-ఆకారపు DRLలు, పొగమంచు LEDలను కలిగి ఉంది. ముందుభాగంలో కొత్త గ్రిల్‌ ఉంటుంది. ఇది బాడీ కలర్ పెయింట్‌లో వస్తుంది. అలాగే 360-డిగ్రీ కెమెరా ఫీచర్లను కలిగిన ఫ్రంట్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది.

ఇక ఈ థార్‌ రాక్స్‌ 7కలర్‌ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులోని కలర్‌ ఆప్షన్స్‌ అద్భుతంగా కనిపిస్తాయి. సైడ్‌ లుక్‌లో కొత్త 19-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ (255/60/R19 టైర్) పొందుతుంది. ఇది ఆఫ్-రోడింగ్ కోసం చంకీ ఫెండర్‌లను కూడా పొందుతుంది. రెండు వైపులా మాట్ బ్లాక్ ORVMలు కెమెరాలను కలిగి ఉంటుంది.

Mahindra Thar Roxx Full Review in Telugu

మీరు అలాగే ముందుకు వెళుతున్నప్పుడు వెనుక డోర్లు మీకు ప్రధాన మార్పును గమనించవచ్చు. అయితే, ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్ మ్యాట్ బ్లాక్‌లో ఫినిష్ చేయబడ్డాయి. వెనుక డోర్ హ్యాండిల్స్‌ను సీ పిల్లర్ దగ్గర ఉంచడం వల్ల అవి బాడీ కలర్‌లోనే ఫినిష్ చేశారు. సీ పిల్లర్ ఢిఫరెంట్‌ స్లోపింగ్ లైన్‌ను కలిగి ఉంది. ఇది థార్ రాక్స్‌కి వెనుక వైపున మంచి డిజైన్‌ను అందిస్తుంది.

ఇక వెనకాల పూర్తిగా LED టైల్‌లైట్‌ ఉంది. రియర్‌వ్యూ వైపర్‌, డీఫాగర్‌లతో కూడిన స్పేర్ వీల్‌ని గమనించవచ్చు. మీరు టైల్‌గేట్‌ని తెరిచినప్పుడు పెద్దలకు సరిపోయే 644-లీటర్ బూట్ స్పేస్‌ లభిస్తుంది. అంతే కాకుండా మరింత స్పేస్‌ని పొందేందుకు 60:40 స్ప్లిట్ సీటును కూడా పొందుతుంది. ఇది థార్‌లో సరికొత్త జోడింపు అని చెప్పవచ్చు.

Mahindra Thar Roxx Full Rear view

ఇంటీరియర్స్: ఇక ఇంటీరియర్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది. అలాగే, ఐవరీ వైట్ ఇంటీరియర్‌లు క్యాబిన్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో పాటు డాష్‌బోర్డ్ మరియు డోర్‌లపై సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఉంది. ఇది కొత్త 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా పొందుతుంది. దీని ద్వారా మీరు SUVకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుతారు.

దీనిలో ఎలక్ట్రిక్ స్టీరింగ్ వీల్‌ చాలా తేలికగా అనిపిస్తుంది. సిటీలో ఉండే నగర వాసులు సులభంగా U-టర్న్‌లు చేయవచ్చు. ఇది ఫ్లాట్ బాటమ్ వీల్ మరియు రెండు వైపులా స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్‌ని కలిగి ఉంటుంది. కానీ ఇది టిల్ట్ కోసం మాత్రమే సర్దుబాటు చేయబడుతుంది టెలిస్కోపిక్ కాదు. ముందు డ్రైవర్ సీటు ఇప్పుడు 6-వే ఎలక్ట్రిక్‌గా సర్దుబాటు చేసుకోవచ్చు. రెండు ముందు సీట్లు ఇప్పుడు వెంటిలేషన్ చేయబడ్డాయి.

Mahindra Thar Roxx Full Interior

సీటింగ్‌ సౌకర్యం అద్భుతంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో మిమ్మల్ని అలసిపోనివ్వదు. వెనుక సీటు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ తొడ కింద థాయ్‌ సపోర్ట్ లేదు. సీట్లలో మీరు 2 కప్ హోల్డర్‌లతో ఆర్మ్‌రెస్ట్‌ని పొందుతారు. దీనికి 3 హెడ్‌రెస్ట్‌లు అందులో 2 మాత్రమే సర్దుబాటు చేయడానికి వీలుంటుది. వెనుక భాగంలో AC వెంట్లు ఉన్నాయి. ఇది క్యాబిన్‌ను వేగంగా చల్లబరుస్తుంది.

ఇంజిన్ & హ్యాండ్లింగ్: థార్ రాక్స్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్లతో పనిచేస్తుంది. పెట్రోల్-ఆధారిత బేస్-స్పెక్ మహీంద్రా Roxx MX1 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ 160hp, 330Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. హై-స్పెక్ పెట్రోల్ వేరియంట్స్‌ 177hp మరియు 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

Mahindra Thar Roxx Sunroof

డీజిల్ బేస్ వేరియంట్‌లు 150hp మరియు 330Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. హై-స్పెక్ మోడల్‌లు 175hp పవర్‌ని మరియు 370Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. మేము టాప్-స్పెక్ డీజిల్ మాన్యువల్ 4x4 వేరియంట్‌ను డ్రైవ్ చేశాము. దీని యాక్సిలరేషన్ ప్రారంభంలో కొద్దిగా నెమ్మదించినట్లు అనిపించింది. అయితే టర్బో స్పూల్ అయిన తర్వాత పవర్‌ వేగంగా పెరుగుతుంది. ఇది స్ట్రాంగ్-మిడిల్‌ రేంజ్, మంచి టాప్-ఎండ్ పవర్‌ని కలిగి ఉంది.

బ్రేకింగ్ విధులు అన్ని వైపులా డిస్క్‌లచే నిర్వహించబడతాయి. దీని ఫలితంగా మంచి స్టాపింగ్ పవర్ లభిస్తుంది. ఇందులో సస్పెన్షన్ కూడా ప్రధాన అప్‌డేట్స్‌లో ఒకటిగా ఉంది. ముందు భాగంలో డబుల్-విష్‌బోన్ సస్పెన్షన్ సెటప్‌ను, వెనుక భాగంలో పెంటా-లింక్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు. కాబట్టి మెరుగైన నిర్వహణ సస్పెన్షన్‌ సెటప్‌ని కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీని మేము ఎత్తైన కొండలు మరియు గుంతల మీదుగా నడిపాము. ఇది అన్ని రోడ్లలోనూ స్థిరంగా రాణించింది.

Mahindra Thar Roxx Front design

సేఫ్టీ ఫీచర్లు: థార్ రాక్స్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, సీట్ బెల్ట్ రిమైండర్‌లు, పిల్లల సేఫ్టీ కోసం ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ ఆన్/ఆఫ్, ISOFIX మౌంట్‌లు, ESC, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, TPMS వంటి మరెన్నో సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో లెవల్‌ 2 ADAS ఫంక్షన్‌లను అందించారు. ఇది పలు అలర్ట్స్‌తో పాటు ప్రయాణికులకు మెరుగైన సేఫ్టీని అందిస్తుంది.

Mahindra Thar Roxx

చివరగా: 2 అదనపు డోర్ల జోడింపుతో థార్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఎస్‌యూవీగా మార్పు చెందింది. ఈ విషయంలో మహీంద్రా సక్సెస్‌ అయ్యిందని చెప్పవచ్చు. సస్పెన్షన్, ఇంటీరియర్స్, స్టైలింగ్‌తో థార్ రాక్స్ అద్భుతంగా ఉంది. మంచిగా కనిపించే, బెస్ట్‌ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌, మంచి ఫీచర్లు కలిగిన SUV కోసం చూస్తున్నట్లయితే వారు మహీంద్రా థార్ రాక్స్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా ఉంటుంది. కాబట్టి ఓసారి ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి.

More from DriveSpark

Article Published On: Saturday, August 17, 2024, 10:00 [IST]
English summary
Mahindra thar roxx 5 door driving impressions and specifications full review in telugu
Read more on: #mahindra #car review #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+