Mahindra XEV 9e Full Review in Telugu మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్‌ కారు మెప్పించిందా? ఓవరాల్‌గా ఎలా ఉందంటే?

మహీంద్రా కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ డిజైన్ హెడ్ ప్రతాప్ బోస్‌ని చేర్చుకుంది. ఆయన రాకతో మహీంద్రా ఫేట్‌ మారిపోయింది. బోస్‌ డిజైన్‌ చేసే ప్రతీ కారు సూపర్‌ హిట్‌ అవుతోంది. తాజాగా మహీంద్రా చెన్నైలోని తన ఫెసిలిటీ సెంటర్‌లో కొత్త ఎక్స్‌ఈవీ 9ఇ (Mahindra XEV 9e), బీఈ 6ఇ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది. రెండేళ్ల పాటు ఈ కార్లపై మహీంద్రా పూర్తిగా ఫోకస్‌ చేసి తీసుకువచ్చింది. అందుకు తగినట్లుగానే ఇవి మార్కెట్‌ని హిట్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కొత్త మహీంద్రా XEV 9e, BE 6e లలో మహీంద్రా XEV 9e ని మా డ్రైవ్‌స్పార్క్ టీమ్ టెస్ట్‌డ్రైవ్‌ చేసింది. దీనికి సంబంధించిన ఫుల్‌ రివ్యూ ఈ కథనంలో..

ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌: ఈ కారు చూడటానికి స్పోర్ట్‌ లుక్‌లో కనిపిస్తుంది. XEV 9e ఫ్రంట్ ఎండ్‌లో L-ఆకారపు DRLలను కనెక్ట్ చేసే లైట్‌బార్‌పై ఉండే బ్లాక్-ఆఫ్ గ్రిల్ కళ్లకు కట్టి పడేస్తుంది. ఈ DRLs టర్న్‌ ఇండికేటర్స్‌గా కూడా పనిచేస్తాయి. ముందు బంపర్ దిగువ విభాగం పియానో ​​బ్లాక్‌లో ఉంటుంది. ఈ మెరిసే షైనీ బ్లాక్‌ వెనుక బంపర్‌, వీల్‌ఆర్చ్‌ల వరకు విస్తరించి ఉంటుంది.

Mahindra XEV 9e Review in telugu

ఇది కూపే లాంటి కప్పు, సైడ్‌లో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 19-అంగుళాల ఏరోడైనమిక్‌గా ఆప్టిమైజ్ చేయబడిన అల్లాయ్ వీల్స్‌, వెనుక భాగంలో ఏటవాలు పైకప్పు బూట్ మూత, చిన్న స్పాయిలర్‌ని కలిగి ఉంటుంది. స్పాయిలర్ కింద స్లిమ్‌లైన్ కనెక్ట్ చేయబడిన LED టెయిల్‌లైట్స్‌, ముందు భాగంలో ఉండే DRL సెటప్‌ని కలిగి ఉంటాయి. వెనుక గ్లాస్ పైన మరొ చిన్న స్పాయిలర్ ఎలిమెంట్ బ్రేక్‌ లైట్‌గా ఉంటుంది.

రేడియో కోసం షార్క్‌ఫిన్ యాంటెన్నా కూడా ఉంటుంది. బూట్ మూత వద్ద కొత్త మహీంద్రా ఇన్ఫినిటీ లోగోను కలిగి ఉంది. మహీంద్రా XEV 9e ఎడమ వైపున ఉన్న టెయిల్‌లైట్‌ల పక్కన ఎలక్ట్రిక్ SUV కోసం ఛార్జింగ్ పోర్ట్‌ని అందించారు. వెనుక ఫాగ్ ల్యాంప్స్, రిఫ్లెక్టర్లు, బ్యాక్‌ బంపర్, బూట్ లిడ్ ఎలక్ట్రికల్‌గా తెరుచుకుంటుంది. ఇందులో మొత్తం 663-లీటర్ల బూట్‌ స్పేస్‌ కలదు.

Mahindra XEV 9e Headlamp

ఇంటీరియర్ ఫీచర్లు: కొత్త మహీంద్రా XUV 9e క్యాబిన్‌లోకి అడుగుపెట్టగానే మంచి అనుభూతి వస్తుంది. ఎందుకంటే ఇందులో డ్యాష్‌బోర్డ్‌ ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌గా కారు ముందు భాగంలో విస్తరించి ఉంటుంది. ఈ మూడు 12.3-అంగుళాల స్క్రీన్స్‌ (ప్యాసింజర్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ల కోసం టచ్‌స్క్రీన్స్‌) డ్రైవింగ్ మోడ్‌కు తగినట్లుగా రేంజ్ (గ్రీన్), ఎవ్రీడే(పర్పుల్), రేస్ (రెడ్‌) అనే వేర్వేరు కలర్స్‌తో వస్తాయి.

పెద్ద ట్రిపుల్ డిస్‌ప్లే సెటప్ మహీంద్రా అడ్రినోఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ఇక ఇఁదులో మహీంద్రా కారు టెక్‌తో ఆటోమోటివ్ AI సహాయంతో ఫీచర్లను ఆపరేట్‌ చేయవచ్చు. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే అలాగే 5G కనెక్టివిటీ ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్స్‌ మృదువుగా అనిపిస్తాయి. క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ఆడియో, డ్రైవ్ మోడ్స్‌ వంటి ఫంక్షన్స్‌ వంటివి అన్ని ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌కి మహీంద్రా మార్చేసింది.

Mahindra XEV 9e Interior

ఇక మహీంద్రా XEV 9e సీట్లు చాలా ఖరీదైనవిగా కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. పవర్డ్‌ డ్రైవింగ్ సీటు మిమ్మల్నీ ఖచ్చితమైన డ్రైవింగ్ పొజిషన్‌లోకి రావడానికి అనుమతిస్తుంది. ముందు సీట్ల కోసం సీట్‌బ్యాక్‌లో 65W USB C ఛార్జింగ్ పోర్ట్ కలదు. వెనుక సీట్లు మంచి సపోర్ట్‌ను అందిస్తాయి. పెద్ద సన్‌రూఫ్, కూపే-స్టైల్‌ రూఫ్‌లైన్ ఉన్నప్పటికీ 6 అడుగుల ఎత్తు ఉన్న వారికి సైతం మంచి హెడ్‌రూమ్ స్పేస్‌ లభిస్తుంది.

బ్యాక్‌ విండోస్‌ సన్ బ్లైండ్స్‌ని కలిగి ఉన్నాయి. ఇది వేసవిలో ఉపయోగపడనున్నాయి. 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సిస్టమ్ 1400W అవుట్‌పుట్ డాల్బీ అట్మోస్ ద్వారా మంచి మ్యూజిక్‌ సౌండ్‌ని ఆస్వాదించవచ్చు. ఇక ఇంటీరియర్‌లోనీ భారీ స్టోరేజీ స్పేస్‌ లభిస్తుంది. ప్రతి డోర్‌ వద్ద బాటిల్ హోల్డర్స్‌, నిక్‌నాక్స్, ఇతర నిత్యావసర వస్తువులను నిల్వ చేయడానికి అదనపు స్పేస్‌ లభిస్తుంది. ముందు సీట్ల మధ్య కూడా అదనపు నిల్వ ఉంది.

Mahindra XEV 9e Infotainment

అదనంగా డ్యాష్‌బోర్డ్ సెంట్రల్ స్పైన్ సెక్షన్‌లో రెండు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్స్‌, స్టోరేజ్ ఏరియాలో రెండు USB-C ఛార్జింగ్ పోర్ట్‌లను కలిగి ఉంది. ఇది ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. ఇక XEV 9e క్యాబిన్‌లోనే టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్స్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, యాంబియంట్ లైటింగ్ వంటి వాటితో ఈ సరికొత్త ఈవీ అదరగొడుతుంది.

సేఫ్టీ ఫీచర్లు: మహీంద్రా కొత్త XEV 9e లో 7 ఎయిర్‌బ్యాగ్స్‌ (అన్ని వేరియంట్‌లలో 6 స్టాండర్డ్‌ ఎయిర్‌బ్యాగ్స్‌), డ్రైవర్ అలర్ట్‌నెస్ సిస్టమ్, లెవెల్ 2 ADAS, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఆటో పార్కింగ్ సహా అనేక సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు వస్తుంది. ఈ సేఫ్టీ ఫీచర్లతో మహీంద్రా క్రాష్‌ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ని సాధిస్తుందనే ధీమాతో ఉంది. కావున ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు.

Mahindra XEV 9e Rear Profile

స్పెక్స్ & డైమెన్షన్స్: మహీంద్రా XEV 9e కొత్త మాడ్యులర్ INGLO స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఈ INGLO ప్లాట్‌ఫారమ్ కొత్త XEV 9eలో ఫ్లాట్-ప్యాక్ బ్యాటరీ ప్యాక్, రియర్-యాక్సిల్-మౌంటెడ్ మోటార్‌తో వస్తుంది. ఇక ఈ XEV 9e 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తుంది. రెండు ప్యాక్స్ BYD బ్లేడ్ బ్యాటరీ టెక్‌, LFP కెమిస్ట్రీతో మిళితమై ఉన్నాయి.

ఇక ఇందులోని పెద్ద బ్యాటరీ ప్యాక్‌ 79kWh వేరియంట్‌ ఫుల్‌ ఛార్జ్‌పై 656km కి.మీ రేంజ్‌ని ఇందిస్తుందని మహీంద్రా క్లెయిమ్‌ చేస్తుంది. ఇక చిన్న 59kWh ప్యాక్ 542km రేంజ్‌ని (MIDC) అందించనుంది. ఈ కారుని DC ఛార్జర్‌కు కనెక్ట్ చేయడం ద్వారా రెండు బ్యాటరీ ప్యాక్స్‌ని కేవలం 20 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

Mahindra XEV 9e Review in Telugu

79kWh ప్యాక్‌ని 175kW DC ఛార్జర్‌తో ఛార్జ్‌ చేయవచ్చు. అలాగే 59kWh ప్యాక్‌ని 140kW ఫాస్ట్ DC ఛార్జింగ్‌తో వేగంగా ఛార్జ్‌ చేయవచ్చు. అంతే కాకుండా రెండు ప్యాక్స్‌ 8.7kW, 11kW హోమ్ AC ఛార్జర్‌లకు అనుమతిస్తాయి. 8.7kW ఛార్జర్‌ ద్వారా 59kWh, 79kWh ప్యాక్‌లను ఫుల్‌ఛార్జ్ చేయడానికి 8.7 నుంచి 11.7 గంటలు, 11kW ద్వారా ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది.

ఈ XEV 9e బ్యాటరీ ప్యాక్స్‌ ఎలక్ట్రిక్ మోటారుకి శక్తిని పంపుతాయి. వెనక వీల్స్‌తో నడిచే ఈ SUVలు 59kWh ప్యాక్‌కి కనెక్ట్ చేసినప్పుడు 228bhp, 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 79kWh బ్యాటరీ ప్యాక్‌ ఈవీ మోటార్‌తో 281.6bhp పవర్‌ పెరుగుతుంది. టార్క్ ఫిగర్ అలాగే ఉంటుంది. మహీంద్రా XEV 9e కేవలం 6.8 సెకన్లలో 0-100 వేగాన్ని అందుకుంటుంది.

Mahindra XEV 9e Review

మహీంద్రా XEV 9e మెక్‌ఫెర్సన్ స్ట్రట్ ఐ-లింక్ ఇండిపెండెంట్ సెమీ-యాక్టివ్ సస్పెన్షన్, ముందువైపు స్టెబిలైజర్ బార్ వంటివి కఠినమైన రోడ్లను ఎదుర్కోవడానికి, వెనుకవైపు 5-లింక్ ఇండిపెండెంట్ సస్పెన్షన్, స్టెబిలైజర్ బార్ ఉన్నాయి. అన్ని వీల్స్‌కి డిస్క్ బ్రేక్స్‌ SUV దీనిని ఏకకాలంలో ఆపివేయడంలో సహాయపడతాయి. బ్రేక్‌లు అప్లై చేసిన ప్రతీ సారి బ్యాటరీని ఛార్జ్ చేయడానికి శక్తిని సేకరించే రీజనరేట్‌ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది.

కొలతలు: సరికొత్త మహీంద్రా XEV 9e 4,790mm పొడవు, 1,905mm వెడల్పు, 1,690mm ఎత్తు, 2,775mm పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ XEV 9e 207mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. ఇది కఠినమైన రోడ్లలోనూ దూసుకెళ్లేందుకు సహాయపడుతుంది.

Mahindra XEV 9e

డ్రైవింగ్ ఇంప్రెషన్స్: ముందుగా దీని ఫర్ఫామెన్స్‌ పక్కనపెడితే ఈ కారు తోటి ప్రయాణికులతో పాటు రోడ్డుపై వెళ్లే పాదచారులు, డ్రైవర్ల దృష్టిని ఇది ఆకర్షిస్తుంది. ఇక ఈ మహీంద్రా కారు 0-100కిమీ/గం 6.8 సెకన్ల సమయాన్ని క్లెయిమ్ చేస్తుంది. మేము ఈ మహీంద్రా కారుని రీసెర్చ్ వ్యాలీ ఫెసిలిటీ వద్ద చెక్‌ చేసినప్పుడు కేవలం 6.75 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకుంది.

రేస్ మోడ్‌లో ఈ XEV 9e దూసుకుపోతుంది. XEV 9e స్టీరింగ్ సెటప్ తేలికగా ఉంటుంది. మీరు హైవేపై అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, స్టీరింగ్ కొంచెం ఎక్కువ బరువుగా అనిపిస్తుంది. ఈ XEV 9eలో సెమీ-యాక్టివ్ సస్పెన్షన్‌ని అందించారు. కాబట్టి ఇది మలుపుల వద్ద నిలకడగా ఉంటుంది. ఈ సెమీ-యాక్టివ్ సస్పెన్షన్‌ ఓవరాల్‌గా బాగుంది.

Mahindra XEV 9e

చివరగా: ఈ కొత్త మహీంద్రా కారు అధునాతన ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది. రోబోట్‌ లుక్‌ మాదిరిగా ప్రతీ ఒక్కరినీ ఈ XEV 9e కట్టిపడేస్తుంది. అయితే దీని ప్రారంభ ధర రూ. 21.90 లక్షల (ఎక్స్‌-షోరూమ్)గా ఉంది. టాటా కర్వ్ కంటే ప్రీమియం కారుని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు దీనిని ధైర్యంగా ఎంచుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, November 29, 2024, 9:00 [IST]
English summary
Mahindra xev 9e review driving impressions specs features and range details in telugu
Read more on: #mahindra #car review #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+