Mahindra XUV 3XO Full Review మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO డిజైన్, ఫీచర్లు, పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల తన ప్రముఖ ఎస్‌యూవీ XUV 300 మోడల్ అప్‌డేటెడ్ వెర్షన్ XUV 3XO ను లాంచ్ చేసింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ రీఫ్రెష్ సబ్-4-మీటర్ SUV గా మన ముందుకు వచ్చింది. ఈ క్రమంలో XUV 3XO ను టెస్ట్ డ్రైవ్ చేసేందుకు మా డ్రైవ్‌స్పార్క్ టీమ్‌కు ఆహ్వానం లభించింది. పూర్తి రివ్యూ ఈ కథనంలో..
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా.. త్వరలో ఈవీని విడుదల చేయనుంది. ఈ క్రమంలో ఈవీ సెగ్మెంట్‌లోకి ప్రవేశిస్తున్న ఈ దిగ్గజ దేశీ ఆటో మేకర్.. ఇటీవల XUV 3XO ను అట్టహాసంగా లాంచ్ చేసింది. కేవలం రీఫ్రెష్ కోసమే కాకుండా ఇందులో ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్, ఫీచర్ల పరంగా సంస్థ భారీ మార్పులు చేసింది. అవేంటో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

డిజైన్: మహీంద్రా XUV 3XO ఎక్స్‌టీరియర్ డిజైన్ దాని ముందున్న XUV 3OOతో పోల్చినప్పుడు ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్‌ను వినూత్నంగా రూపొందించారు. మహీంద్రా దాని ఫ్లాగ్‌షిప్ XUV 7OO ఫ్రంట్ ఎండ్ ఆధారంగా.. దాని పరిమాణంలో సర్దుబాటు చేసింది. దీంతో ఇది ఇతర కార్ల మాదిరిగా రొటీన్ స్టైల్‌లో కనిపించదు.
కానీ XUV 7OO యొక్క LED హెడ్‌లైట్‌లు, DRLలు మరియు గ్రిల్ కాంబినేషన్‌ను XUV 3XO ఫ్ర్రంట్ ఎండ్‌లో చూడవచ్చు. అయితే ఈ ఎస్‌యూవీ పరిమాణం చిన్నగా ఉండటంతో వెడల్పులో అంత బాగా కనిపించదు. ఇక సైడ్స్ కూడా ఎటువంటి గందరగోళం లేకుండా పొందికగా ఉన్నాయి. అయితే, ఈ ఎస్‌యూవీలో అమర్చిన కొత్త 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఎక్స్‌టీరియర్ పరంగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది.

XUV 3XO యొక్క వెనుక భాగాన్ని చూసినప్పుడు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లుగా అనిపిస్తుంది. వెనుక భాగంలో బ్లాక్-అవుట్ రూఫ్ మరియు స్పాయిలర్ జెల్, రియర్ విండ్‌స్క్రీన్ మరియు లైట్‌బార్ "Infinity" LED టెయిల్‌లైట్‌లను కలుపుతూ XUV 3XO కి మరింత లుక్‌ను అందిస్తుంది.

ఇంటీరియర్: మీరు XUV 3XO క్యాబిన్‌లోకి ప్రవేశించి ఇంటీరియర్‌ను చూసినట్లయితే.. ఎక్స్‌టీరియర్‌లోని చిన్న చిన్న లోపాలను కూడా మర్చిపోతారు. డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ కార్డ్‌ల డార్క్ సెక్షన్‌లు మిగిలిన ఇంటీరియర్‌లోని అత్యంత ప్రశాంతమైన వైబ్‌లకు అద్భుతంగా కాంట్రాస్ట్‌ను అందించారు. ఇది తెలుపు రంగులో ఫినిష్ అయింది.
ఇక మహీంద్రా XUV 3XO ఎస్‌యూవీ డ్యాష్‌బోర్డ్ డిజైన్ మరియు లేఅవుట్‌ను చూసినట్లయితే.. ఎలక్ట్రిక్ XUV 4OO నుంచి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లేల ద్వారా ఇంటీరియర్ పరంగా క్యాబిన్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది.

XUV 3XO లోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం అందించిన టచ్‌స్క్రీన్ యూనిట్.. ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకి మద్దతు ఇస్తుంది. ఇంకా 7-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్‌కి కనెక్ట్ అయి వస్తుంది. దీని ద్వారా మ్యూజిక్ సిస్టమ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది.

ఫీచర్లు: ఇక మహీంద్రా XUV 3XO ఇంటీరియర్‌లో అతిపెద్ద-ఇన్-క్లాస్ సన్‌రూఫ్ అని చెప్పవచ్చు. దీని కొలతలు 940 mm * 870 mm. ఇంకా రిమోట్ ఫంక్షనాలిటీతో కూడిన డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లను సంస్థ అందించింది.
ఇంకా మీ స్మార్ట్ ఫోన్ కోసం వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, మల్టిపుల్ టైప్ A మరియు టైప్ C (65W వరకు) USB ఛార్జింగ్ పోర్ట్‌లు, యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీల సరౌండ్ కెమెరా మరియు సీట్ల కోసం లెథెరెట్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్ లిస్ట్‌లోని ఇతర ముఖ్యమైన అంశాలను జోడించారు.

సేఫ్టీ ఫీచర్లు: భద్రత పరంగా, మహీంద్రా XUV 3XO లో హై సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఫోర్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్ పాయింట్‌లు మరియు లెవెల్ 2 ADAS సెటప్‌తో సహా అనేక ఫీచర్లను మహీంద్రా అందిస్తోంది.
ఇంజిన్ పర్ఫామెన్స్: మహీంద్రా XUV 3XO లో దాని ముందున్న ఇంజిన్ ఆప్షన్లనే చూడవచ్చు. XUV 300 మాదిరిగానే 1.2-లీటర్ MPFi పెట్రోల్, 1.2-లీటర్ TGDi పెట్రోల్ మరియు 1.5-లీటర్ mHawk డీజిల్ వంటి మూడు ఇంజిన్‌లను ఆప్షన్లుగా ప్రవేశపెట్టింది.

ఇక బేస్, 1.2-లీటర్ టర్బో పెట్రోల్ MPFi ఇంజన్, 109bhp మరియు 200Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ వెర్షన్ లీటర్‌కు 18.89 km మైలేజ్ అందిస్తుంది. కొత్త ఆరు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది లీటర్‌కు 17.96 కి.మీ మైలేజ్ అందిస్తుంది.
మహీంద్రా XUV 3XO లో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ TGDi ఇంజిన్ 129 bhp మరియు 230 Nm టార్క్‌ను ముందు చక్రాలకు సరఫరా చేస్తుంది. ఇంకా ఇతర పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే అదే గేర్‌బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. కాగా మాన్యువల్ రూపంలో లీటర్‌కు 20.10 కి.మీ మైలేజ్‌ని అందిస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్‌లో లీటర్‌కు 18.20 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది.

ఇక మహీంద్రా XUV 3X0 లో ఏకైక డీజిల్ ఇంజన్ 1.5-లీటర్ mHawk యూనిట్, ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. ముందు చక్రాలకు 115bhp మరియు 300Nm శక్తిని సరఫరా చేస్తుంది. మాన్యువల్ వెర్షన్‌లో, లీటర్‌కు 20.60 కి.మీ మైలేజ్‌ను అందిస్తుండగా.. AMT వెర్షన్‌లో లీటర్‌కు 21.20 కి.మీ మైలేజ్‌ను క్లెయిమ్ చేస్తుంది.
అయితే టెస్ట్‌డ్రైవ్‌లో మేము 1.2-లీటర్ TGDi టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో అమర్చబడిన మహీంద్రా XUV 3XO టాప్-స్పెక్ AX7 L AT వేరియంట్‌ని మేము పరీక్షించాము. ఇది 128bhp మరియు 230Nm ఆన్ ట్యాప్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

మహీంద్రా XUV 3XO మూడు డ్రైవింగ్ మోడ్‌లను అందిస్తుంది. అవి జిప్(Zip), జాప్(Zap) మరియు జూమ్(Zoom). ఇక డ్రైవింగ్ మోడ్‌లను మార్చేటప్పుడు.. థొరెటల్ పెడల్ నుంచి రియాక్షన్‌ను అలాగే స్టీరింగ్ వీల్ యొక్క దృఢత్వం మార్పులో తేడాలను గమనిస్తారు.
డ్రైవింగ్ ఇంప్రెషన్స్: ఇక జూమ్ డ్రైవింగ్ మోడ్‌లో మీరు థొరెటల్ నుంచి స్ఫుటమైన రియాక్షన్ మరియు సరైన గట్టి స్టీరింగ్ వీల్ సెటప్‌తో అత్యంత శక్తివంతమైన వెర్షన్‌ను ఆస్వాదిస్తారు. ఈ మోడ్‌లో మీరు నగరంలోని రోడ్లపై లేన్‌ల మధ్య సులభంగా మారడానికి తేలికగా అనిపిస్తుంది.

TGDi టర్బో-పెట్రోల్ ఇంజిన్ ద్వారా మీరు 3XOని కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ వేగాన్ని అందుకుంటారు. అంతేకాకుండా హైవేపై మూడు అంకెల వేగాన్ని చేరుకోవడంలో కూడా మీకు దోహదపడుతుంది. అధిక వేగంతో వెళ్లినా కూడా కొత్త మహీంద్రా XUV 3XO చాలా స్థిరంగా పనిచేస్తుంది.
ఇంకా మీరు హై స్పీడ్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు XUV 3OOతో పోలిస్తే సడెన్ బ్రేక్ వేయడం లేదా సడెన్‌గా ఆగిపోవడం సులభం. ఎందుకంటే ఈ ఎస్‌యూవీలో నాలుగు చక్రాలకు అమర్చిన డిస్క్ బ్రేక్‌లే ఇందుకు కారణం. ఈ సిస్టమ్‌కు ధన్యవాదాలు చెప్పుకోవచ్చు.

సస్పెన్షన్ సెటప్: XUV 3XO లో సస్పెన్షన్ సెటప్‌ను సంస్థ సరిగా డ్యాంప్ చేసింది. కఠినమైన రోడ్లు, గుంతలు, టర్నింగ్‌ల్లో కూడా ఎలాంటి సమస్యా లేకుండా దాని పని అది చేసుకుపోతుంది. తన లైన్‌లోనే వెళ్లిపోతుంది. కాబట్టి మీ జర్నీ మీకు చాలా మృదువుగా అనిపిస్తుంది.
చివరగా భారత మార్కెట్‌కు మహీంద్రా 3XO సరికొత్త వాహనం అని డౌట్ లేకుండా చెప్పవచ్చు. ఎక్స్‌టీరియర్ పరంగా XUV 300 ను పోలి ఉన్నప్పటికీ.. ఫ్రంట్ ఎండ్ ద్వారా మీరు కొంచెం నిరాశపడ్డా.. ఇంటీరియర్ ద్వారా ఆ లోపాలను మర్చిపోతారు. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో XUV 3XO మంచి ఆప్షన్. ఇక ఇతర వేరియంట్లతో పోలిస్తే టాప్ స్పెక్ వేరియంట్‌లో మీరు పూర్తి డ్రైవింగ్ పర్ఫామెన్స్‌ను ఆస్వాదించవచ్చు.


Click it and Unblock the Notifications








