2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

ప్రముఖ భారతీయ కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) యొక్క బాలెనో (Baleno) ఈ రోజు ప్రారంభమైనడి కాదు. ఇది 1999 లో ప్రారభించబడింది. అప్పటినుంచి 2007 వ సంవత్సరం వరకు దీని యొక్క ఉత్పత్తి నిరాఘాటంగా జరిగింది. అయితే ఆ తరువాత నిలిపివేయబడింది. అయితే ఇది 2015 లో తిరిగి మార్కెట్ కి వచ్చింది.అప్పుడు మారుతి సుజుకి బాలెనొ అనేది హ్యాచ్‌బ్యాక్ రూపంలో మార్కెట్లో అడుగుపెట్టింది.

కంపెనీ యొక్క పాత సెడాన్‌కు ఏమాత్రం తీసిపోని హ్యాచ్‌బ్యాక్‌లో బాలెనో పేరును ఉపయోగించడం పట్ల మారుతి ప్రియులు కొంత నిరాశ చెందారు. కానీ మారుతి సుజుకి బాలెనో హ్యాచ్‌బ్యాక్ ప్రీమియం విక్రయాల పరంగా ఈ విభాగంలో బెస్ట్ సెల్లర్‌లలో ఒకటిగా నిలిచింది. ఎక్కువమంది వినియోగదారులను ఆకర్శించడంలో ఇది విజయం పొందింది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు తొమ్మిది లక్షలకు పైగా బాలెనో హ్యాచ్‌బ్యాక్‌లు విక్రయించబడ్డాయి. అయితే మారుతున్న కాలంతో పాటు ఇందులో కొన్ని అప్డేట్స్ తీసుకురావలసి వచ్చింది. ఈ కారణంగానే కంపెనీ 2022 ఫిబ్రవరి 23 న భారతీయ మార్కెట్లో కొత్త బాలెనొ విడుదల చేసింది.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మారుతి సుజుకి బాలెనొ అనేది వినియోగదారులను ఆకర్షించడంలో విజయం పొందుతుందా.. ఇందులోని ఫీచర్స్ ఏమిటి, ఎలాటి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది అనే మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి సుందరమైన గోవాలో డ్రైవ్ చేసాము. కావున కొత్త మారుతి సుజుకి బాలెనొ గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూ ద్వారా మీ కోసం..

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

డిజైన్ మరియు స్టైల్:

మారుతి సుజుకి యొక్క బాలెనొ అద్భుతమైన డిజైన్ కలిగి రిఫ్రెష్ మరియు యూత్‌ఫుల్ డిజైన్ లాంగ్వేజ్‌ని పొందుతుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కోసం వెతుకుతున్న యువకులకు ఇది తప్పకుండా నచ్చే విధంగా ఉంటుంది. ఇది 2022 లో ఇతర వాహనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా డిజైన్ చేయబడింది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

మొత్తం మీద మారుతి సుజుకిలోని డిజైనర్లు కొత్త 2022 బాలెనోతో డిజైన్ మరియు స్టైలింగ్‌పై అద్భుతంగా పనిచేసినట్లు మనకు స్ఫష్టంగా తెలుస్తోంది. ఈ వెహికల్ యొక్క సిల్హౌట్ పాత మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ, డిజైన్ మరియు స్టైల్ వంటివి చాలా వరకు మారినట్లు తెలుస్తుది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

కొత్త మారుతి బాలెనొలో మొదటగా మిమ్మల్ని ఆకర్షించే అంశం స్టైలిష్ హెడ్‌ల్యాంప్‌లు. ఇవి అవుట్‌గోయింగ్ మోడల్ లాగా స్వెప్ట్ బ్యాక్‌గా ఉన్నాయి. అయితే ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి, ఫ్రంట్ ఎండ్ చాలా స్పోర్టివ్‌గా కనిపిస్తుంది. ఇవి ప్రొజెక్టర్ యూనిట్లు మరియు టర్న్ సిగ్నల్ ఇండికేటర్‌లను విలీనం చేస్తాయి.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

ఇందులో NEXWave గ్రిల్ ఉంది, ఇది బోల్డ్ డిజైన్ మరియు స్టైలింగ్‌ను మరింత మెరుగుపరుస్తుంది. గ్రిల్ ఎలిమెంట్ ప్రత్యేకమైనది మరియు చాలా బాగుంది. ప్రత్యేకించి దాని కింద క్రోమ్ స్ట్రిప్ ఉంది. ఇందులోని బంపర్ కూడా సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంది. బంపర్ దిగువ గ్రిల్‌ను కూడా కలిగి ఉంది, దీనికి రెండు వైపులా ఫాగ్ హౌసింగ్ ఉంటుంది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

మారుతి సుజుకి యొక్క ఈ డిజైన్ లాంగ్వేజ్‌ని 'లిక్విడ్ ఫ్లో' అని పిలుస్తుంది. ఇది ఈ కొత్త మోడల్ లో మాత్రమే మెరుగుపరచబడింది. డిజైన్ లైన్లు బానెట్‌పై మరియు సైడ్ ప్రొఫైల్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా కొత్త బాలెనొని మరింత అద్భుతంగా చేయడానికి అనుకూలంగా ఉంటాయి.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇందులో షోల్డర్ లైన్ మరియు షార్ప్ క్యారెక్టర్ లైన్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అంతే కాకూండా ఇందులోని 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ దీనిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. డైమండ్-కట్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి. మొత్తానికి కొత్త బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ తన సెగ్మెంట్‌లో అత్యంత స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

ఇక బాలెనొ యొక్క రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ కూడా చాలావరకు డిజైన్ మరియు స్టైలింగ్ చాలా అప్డేట్ చేయబడి ఉంటాయి. ఇది స్ప్లిట్ టెయిల్ ల్యాంప్ డిజైన్‌ని పొందుతుంది. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు లిక్విడ్ ఫ్లో డిజైన్‌ను బాగా అనుసంధానించబడి దాని లోపల ఉండే కర్వ్‌లు మరియు ఎల్ఈడీ మ్యాట్రిక్స్‌ కలయిక వల్ల టెయిల్ ల్యాంప్‌లు చాలా అద్భుతంగా కనిపిస్తాయి.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

అంతే కాకూండా ఇందులో స్లోపింగ్ రూఫ్‌లైన్, ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్‌తో కూడిన స్పాయిలర్ వంటివి ఉన్నాయి. మందపాటి క్రోమ్ స్ట్రిప్ హ్యాచ్‌బ్యాక్‌కి ఇప్పటికే ఉన్నదానికంటే చాలా ఎక్కువ ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. రియర్ కెమెరా కూడా ఈ క్రోమ్ స్ట్రిప్‌లో పొందుపరచబడింది. మొత్తం మీద కొత్త బాలెనొ అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక స్టైలింగ్ పొందుతుంది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

కాక్‌పిట్ మరియు ఇంటీరియర్:

కొత్త 2022 మారుతి బాలెనొ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా వరకు అప్‌గ్రేడ్ చేయబడింది. ఇందులో అప్డేటెడ్ క్యాబిన్ లేఅవుట్ మరియు సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో కూడిన సరికొత్త డ్యాష్‌బోర్డ్‌ ఉన్నాయి.

బాలెనొ యొక్క డోర్ హ్యాండిల్స్‌పై టగ్ చేసి, స్వింగ్ ద్వారా డోర్ ఓపెన్ చేయగానే మీకు అద్భుతమైన క్యాబిన్ దర్శనమిస్తుంది. ఇక్కడే మీకు మునుపటి మోడల్ కి మరియు ఈ కొత్త మోడల్ కి గల తేడా తెలిసిపోతుంది. క్యాబిన్ మొత్తం చాలా స్మూత్ గా ఉండటమే కాకుండా ఫ్లో లైన్‌లను పొందుతుంది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

మారుతి సుజుకి బాలెనో డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ కలిగి ఉంది. ఇందులో బ్లూ మరియు బ్లాక్ థీమ్ కలర్స్ ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్ మరియు స్టీరింగ్ వీల్ సిల్వర్ యాక్సెంట్‌లను పొందుతాయి. ఇవి ఇంటీరియర్‌కు మరింత ప్రీమియం అనుభూతిని అందిస్తాయి. ఇందులో కొన్ని ప్రాంతాలలో పియానో ​​బ్లాక్ ఇన్సర్ట్‌లను కూడా గమనించవచ్చు.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

ఇందులోని డ్యాష్‌బోర్డ్ పైభాగం బ్లాక్ కలర్ లో ఉండి, మధ్య భాగం బ్లూ కలర్ లో పూర్తి చేయబడింది. ఇక్కడ బ్లాక్ అండ్ బ్లూ రంగులను వేరు చేసే సిల్వర్ స్ట్రిప్ ఉంది. ఇది ముందువైపు గ్రిల్‌పై కనిపించే క్రోమ్ స్ట్రిప్‌ను అనుకరిస్తుంది. ఇది సెంటర్ AC వెంట్‌లను కూడా అండర్‌లైన్ చేస్తుంది,

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

9-ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ బాలెనో యొక్క మధ్యభాగంలో ఉంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని కలిగి ఉంది, కావున ఇది నావిగేషన్, మీకు ఇష్టమైన మ్యూజిక్ యాప్‌లు మొదలైన వాటితో సహా వివిధ ఫీచర్‌లను యాక్సెస్‌ చేయడానికి ఉపయోగపడుతుంది. సిస్టమ్‌తో మీ ఫోన్‌ను కనెక్ట్ చేయడం చాలా సరళమైన ప్రక్రియ.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

సరౌండ్ సెన్స్ టెక్నాలజీతో ఉన్న ARKAMYS స్పీకర్ల ద్వారా సౌండ్ ప్రొడ్యూస్ చేయబడుతుంది. ఇది మీ అభిరుచికి అనుగుణంగా స్పీకర్లు ఉత్పత్తి చేసే ధ్వనిని కస్టమైజ్ చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది చాలామంది వాహన వినియోగదారులకు తప్పకుండా నచ్చుతుందని మేము భావిస్తున్నాము.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

కొత్త మారుతి బాలెనోలో 360-డిగ్రీ కెమెరా కూడా అందుబటులో ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. స్క్రీన్‌పై ప్రదర్శించబడిన వీడియో మంచి క్వాలిటీ కలిగి ఉందని టెస్టింగ్ ద్వారా రుజువైంది. ఇది మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

మారుతి సుజుకి యొక్క టెలిమాటిక్స్ సొల్యూషన్ అయిన సుజుకి కనెక్ట్‌ కారుతో కనెక్ట్ చేయడానికి అన్ని సమయాల్లోనూ అనుమతిస్తుంది, అంతే కాకుండా కొన్ని మొదటి విభాగంలోని ఫీచర్‌లకు యాక్సెస్‌ని అందిస్తుంది. కావున మీరు ఇప్పుడు హెడ్‌ల్యాంప్‌లు, హజార్డ్ లైట్లు, డోర్ లాక్‌లు, ఇంజన్ ఇమ్మొబిలైజర్ మొదలైనవాటిని రిమోట్‌గా ఆపరేట్ చేయవచ్చు. ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

సుజుకి కనెక్ట్‌ చాలా అద్భుతమైనది, కావున మీ ఫోన్‌లోని కమాండ్ ద్వారా క్యాబిన్‌ను కూడా చల్లబరచవచ్చు. ఇది వెహికల్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్, వెహికల్ అలర్ట్‌ వంటి సాధారణ సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

కొత్త మారుతి సుజుకి బాలెనో ఇప్పుడు Amazon Alexa మరియు Smarwatch కనెక్టివిటీ వంటి వాటిని కూడా పొందుతాయి. ఇది కారుకు వాయిస్ కమాండ్‌లను ఇవ్వడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది నిజంగా మంచి ఫీచర్.

డ్యాష్‌బోర్డ్‌ యొక్క బ్లూ ఎలిమెంట్ కింద ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కోసం మీకు కంట్రోల్స్ ఉన్నాయి. సెంటర్ కన్సోల్ చాలా సరళంగా మరియు సూటిగా ఉంటుంది. మీరు గేర్ లివర్ కంటే ముందుగా క్యూబీహోల్‌ పొందుతారు. గేర్ లివర్ వెనుక హ్యాండ్‌బ్రేక్ లివర్ ఉంది. తర్వాత సెంటర్ ఆర్మ్‌రెస్ట్ వస్తుంది. అదనపు నిల్వ స్థలం కోసం క్యూబీహోల్స్ అందుబాటులో ఉంటాయి.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

ఇందులోని స్టీరింగ్ వీల్ సరికొత్తగా ఉంది, ఇది మారుతి సుజుకి స్విఫ్ట్‌లోని స్టీరింగ్ వీల్ నుండి స్ఫూర్తిని పొందినట్లు కనిపిస్తోంది. మీరు ఆడియో, వాయిస్ కమాండ్‌లు మరియు క్రూయిజ్ కంట్రోల్ కోసం స్గ్టెరింగ్-మౌంటెడ్ కంట్రోల్‌లను పొందుతారు.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

స్టీరింగ్ వీల్ వెనుక డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. టాకోమీటర్ మరియు స్పీడోమీటర్ అనలాగ్ యూనిట్లు డ్రైవర్ కోసం చాలా సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఇది డిస్టెన్స్ టు ఎంప్టీ, యావరేజ్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీ, ​​కరెంట్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీ, ట్రిప్ మీటర్లు, ఓడోమీటర్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

డాష్‌బోర్డ్‌లో డ్రైవర్ ముందు హెడ్ ఆఫ్ డిస్‌ప్లేను పెంచడానికి ఒక బటన్ ఉంది. స్క్రీన్ డ్రామాస్టిక్ పద్ధతిలో పైకి లేస్తుంది. ఇది మీరు ఫ్లెక్స్ చేయగల ఉబెర్-కూల్ ఫీచర్. ఆ హెడ్ ఆఫ్ డిస్‌ప్లే స్క్రీన్‌పై సమాచారం ఎక్కడ అంచనా వేయబడిందో అడ్జస్ట్ చేయడానికి బటన్లు ఉన్నాయి. ఈ ఫీచర్‌తో డ్రైవర్‌కి కారు గురించిన సమాచారాన్ని అందిస్తుంది, కావున డ్రైవర్ తన దృష్టిని రోడ్డుపైన ఉంచవచ్చు. మొత్తం మీద ఇది మంచి ఇంటీరియర్ డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ తో నిండి ఉంటుంది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్:

కొత్త మారుతి బాలెనొ యొక్క డ్యూయల్-టోన్ 'బ్లూ అండ్ బ్లాక్ థీమ్' అనేది సీట్లపై కూడా కనిపిస్తుంది. ఈ సీట్లు ఫాబ్రిక్‌లో పూర్తి చేయబడ్డాయి. ఇందులోని డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ సీట్లు అద్భుతమైన తై సపోర్ట్ అందిస్తాయి. ఇలాంటి సీట్లతో టైట్ కార్నర్‌లను తీసుకోవడం చాలా సులువైన పని.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

కుషనింగ్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కొత్త మారుతి సుజుకి బాలెనో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్రయాణీకులను ఎక్కువ సమయం పాటు సౌకర్యంగా ఉంచడానికి కావలసినంత స్థలం కలిగి ఉంటుంది.

వెనుక వైపు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మొత్తం మీద మంచి మొత్తంలో లెగ్‌రూమ్, క్నీ రూమ్ మరియు హెడ్‌రూమ్ వంటి వాటిని పొందుతాయి. మధ్యలో ఉన్న ట్రాన్స్‌మిషన్ టన్నెల్ చాలా పొడవుగా లేదు, ఇది మధ్యలో ప్రయాణీకులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. ఇందులో వెనుక భాగంలో ముగ్గురు వ్యక్తులు సులభంగా కూర్చోగలరు.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కావున, వెనుకవైపు ఉన్న ప్రయాణీకులు ఫోల్డ్-డౌన్ ఆర్మ్‌రెస్ట్‌ను పొందలేరు, కావున సాధారణంగా అదే ఆర్మ్‌రెస్ట్‌లో విలీనం చేయబడిన కప్‌హోల్డర్‌లను కూడా కోల్పోతారు. అయితే, వెనుక ప్రయాణీకులు AC వెంట్‌లు మరియు USB ఛార్జింగ్ పోర్ట్‌లను పొందుతారు. డోర్ పాకెట్స్‌లో 1-లీటర్ బాటిల్‌తో పాటు కొన్ని నిక్-నాక్స్‌ను ఉంచడానికి తగినంత స్థలం కూడా ఉంది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

మారుతి సుజుకి ఎల్లప్పుడూ ప్రాక్టికల్ కార్లను తయారు చేస్తుంది. కావున 2022 బాలెనో కూడా అదే విధంగా ఉంటుంది. మీరు 60:40 స్ప్లిట్-ఫోల్డింగ్ రియర్ సీటును పొందుతారు. ఇది అవసరమైనప్పుడు మరియు ఎక్కువ లగేజ్ ఉంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇందులోని బూట్ స్పేస్ 318-లీటర్లు. ఇది ఈ సెగ్మెంట్లో అతిపెద్దది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

ఇంజిన్ పర్ఫామెన్స్ & డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. బాలెనో యొక్క అవుట్‌గోయింగ్ మోడల్‌కు శక్తినిచ్చే అదే ఇంజన్, అయితే, ఇప్పుడు ఇది ఒక ప్రధాన మార్పుతో వస్తుంది. మారుతి సుజుకి గతంలో బాలెనోలో ఉన్న మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ను తొలగించింది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

ఇందులోని 1,197 సిసి 4-సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 88.5 బిహెచ్‌పి పవర్ శక్తిని మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మునుపటి బాలెనోతో పోల్చినప్పుడు, ఈసారి గేర్‌బాక్స్‌లో కూడా ఒక ప్రధాన మార్పు గమనించవచ్చు.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

మారుతి సుజుకి బాలెనో గతంలో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది. అయితే ఇందులో సివిటి గేర్‌బాక్స్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇప్పుడు మారుతి సుజుకి AMT కి అనుకూలంగా ఉండే CVT గేర్‌బాక్స్‌ను నిలిపివేసింది.

మేము కొత్త బాలెనో యొక్క రెండు ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లను డ్రైవ్ చేసాము మరియు రెండూ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మొదట స్టార్టర్ బటన్‌ను స్టార్ట్ చేయగానే ఫోర్-సిలిండర్ ఇంజిన్ నిశ్శబ్దంగా స్టార్ట్ అవుతుంది. ఇంజిన్ చాలా స్మూత్ గా ఉంటుంది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

ఇంజిన్ దాదాపు 5,000 ఆర్‌పిఎమ్ వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత గరుకుగా మారుతుంది. కె-సిరీస్ ఇంజన్‌కి విలక్షణమైనది బలమైన మిడ్-రేంజ్ మరియు లో-ఫినిష్ డ్రైవింగ్ మరియు కొత్త బాలెనోలోని 1.2-లీటర్ పెట్రోల్ దానినే అందిస్తుంది. ట్రిపుల్-డిజిట్ వేగాన్ని చేరుకోవడం చాలా సులభం.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

అధిక వేగంతో ఓవర్‌టేక్ చేయడానికి కొంత ప్రయత్నం పడుతుంది. ఆ అదనపు డ్రైవ్‌ను పొందడానికి మీరు డౌన్‌షిఫ్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. గేర్‌షిఫ్ట్‌ల గురించి చెప్పాలంటే, మాన్యువల్ గేర్‌బాక్స్ పరిపూర్ణంగా ఉంది. షిఫ్టింగ్ మృదువైనది. కావున అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

ఇందులో 5-స్పీడ్ AMT అత్యంత అనుకూలమైన ఎంపిక. షిఫ్టింగ్‌లో కొంచెం లాగ్ ఉంటుంది. మాన్యువల్ మోడ్‌కి మారడం వలన షిఫ్టింగ్ సమయం మరియు రెస్పాన్స్ కొంతవరకు మెరుగుపడుతుంది. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ మాన్యువల్ గేర్‌బాక్స్ కంటే నెమ్మదిగా ఉంటుంది.

కొత్త మారుతి సుజుకి బాలెనో రీవర్క్ చేసిన సస్పెన్షన్ సెటప్‌ను పొందుతుంది. ఇది మరింత డైనమిక్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఖచ్చితంగా పాత మోడల్ కంటే మెరుగ్గా ఉందని ఖచ్చితంగా చెప్పగలము.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

స్టీరింగ్ వీల్ తక్కువ వేగంతో చాలా తేలికగా ఉంటుంది మరియు వేగం పెరిగే కొద్దీ బరువు పెరుగుతుందని మేము ఊహించాము. కానీ తక్కువ వేగంతో కూడా వీల్ చాలా బరువుగా ఉందని కనుగొన్నాము. అయితే మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఇది అవుట్‌గోయింగ్ మోడల్ కంటే హ్యాండ్లింగ్ బాగా మెరుగుపడిందని చూపిస్తుంది.

మారుతి సుజుకి కొత్త బాలెనోలో బ్రేకింగ్ మరింత అద్భుతంగా ఉంటుంది.అయితే ప్రస్తుత డ్రమ్ బ్రేక్ సెటప్‌కు బదులుగా వెనుకవైపు డిస్క్ బ్రేక్‌ సెట్ చాలా మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాము.

2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

కీ ఫీచర్స్:

  • హెడ్ అప్ డిస్ప్లే
  • 9-ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్
  • 360-డిగ్రీ కెమెరా
  • నెక్స్ట్-జెన్ సుజుకి కనెక్ట్
  • క్రూయిజ్ కంట్రోల్
  • రియర్ టైప్-ఎ & టైప్-సి ఛార్జర్
  • రియర్ ఏసీ వెంట్స్
  • టిల్ట్ & టెలిస్కోపిక్ స్టీరింగ్
  • 2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

    2022 మారుతి సుజుకి బాలెనో సేఫ్టీ ఫీచర్లు:

    • 6 ఎయిర్‌బ్యాగ్‌లు
    • ఏబీఎస్ విత్ ఈబిడి
    • ఈఎస్‌పి
    • సీట్ బెల్ట్ రిమైండర్
    • రియర్ పార్కింగ్ సెన్సార్లు
    • హిల్ హోల్డ్ అసిస్ట్
    • ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

      2022 Maruti Suzuki Baleno రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ పర్ఫామెన్స్ ఇంకా..

      డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

      మారుతి సుజుకి యొక్క బాలెనో అనేది ఎప్పుడూ వినియోగదారులకు ఇష్టమైన కారు. అయితే ఇప్పుడు మార్కెట్లో విడుదలైన 2022 మోడల్ దాని పాత మోడల్ కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. ఇందులో ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. బాలెనో ఇప్పుడు సురక్షితమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందులో మీరు గుర్తించడానికి ఏ విధమైన లోపాలు లేవని ఖచ్చితంగా చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 2, 2022, 9:00 [IST]
English summary
Maruti suzuki baleno review design specs performance interiors features other details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+