మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ - సమీక్ష
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అందిస్తున్న బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్ 'స్విఫ్ట్ డిజైర్'లో గడచిన నెలలో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసినదే. మారుతి సుజుకి తమ స్విఫ్ట్ డిజైర్ కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది.
ఇదివరకటి స్విఫ్ట్ డిజైర్‌లో అనేక మార్పులు చేర్పులు చేసి, ఎక్సైంజ్ సుంకం రాయితీలను పొందేందుకు దీని పొడవును నాలుగు మీటర్ల కన్నా తక్కువ ఉండేలా అభివృద్ధి చేసి రిఫ్రెష్డ్ లుక్‌తో మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌కు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ కారు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్లలో రెండవ స్థానంలో నిలిచింది.
మారుతి సుజుకి గతంలో నిలిపివేసిన అధిక బూట్‌స్పేస్ కలిగిన స్విఫ్టి డిజైర్ కూడా ఇప్పుడు టాక్సీ టూరర్ పేరుతో అందుబాటులో ఉంది. అయితే, ఈ మోడల్‌ను కేవలం టాక్సీ వెర్షన్‌గా మాత్రమే కంపెనీ అందిస్తోంది. ఇకపోతే, కంపెనీ తాజాగా అందుబాటులోకి తెచ్చిన స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ విషయానికి వస్తే, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌కు మరిన్ని అదనపు ఫీచర్లను జోడించి 'స్విఫ్ట్ డిజైర్ రీగల్' (Swift Dzire Regal) పేరుతో ఈ మోడల్‌ను విడుదల చేయటం జరిగింది.
ఈ స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్లలో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ ధర రూ.5.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ మోడల్‌కు సంబంధించిన మరిన్ని ఫీచర్లను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
మారుతి సుజుకి తమ స్విఫ్ట్ డిజైర్ కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ ధర రూ.5.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
ఇది కొత్త సెరెన్ బ్లూ పెయింట్ షేడ్‌లో కొత్త బాడీ గ్రాఫిక్స్‌తో లభ్యమవుతుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
సిల్కీ సిల్వర్ కలర్‍లో పెయింట్ చేయబడిన ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, ఓఆర్‌విఎమ్స్, ఫ్రండ్ గ్రిల్స్ (అప్పర్ అండ్ లోవర్).

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (సిల్వర్ కలర్ సెన్సార్స్).

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
వెనుక వైపు క్రోమ్ గార్నిష్, రీగల్ డెకాల్ మరియు రీగల్ బ్యాడ్జ్‌లను జోడించారు.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
క్రోమ్ బేస్ రీగల్ బాడీ గ్రాఫిక్స్.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
బాడీ కలర్ మడ్‌ఫ్లాప్స్.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
ఆటో వాల్యూమ్ కంట్రోల్ మరియు ట్వీటర్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
విలాసవంతమైన ఎంబ్రాయిడర్డ్ ఆర్ట్-లెథర్ సీట్ కవర్స్.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
ఉడెన్ ఫినిష్ ఇంటీరియర్ స్టయిలింగ్ కిట్.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
హైగ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ డోర్ సిల్ గార్డ్.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
బ్రాండెడ్ బీజ్ ఫ్లోర్ మ్యాట్స్.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
ఫుల్ లెథర్ బ్లాక్ కలర్ స్టీరింగ్ వీల్ కవర్.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
క్లాసీ బీజ్ ఎంబ్రాయిడర్డ్ ఆర్ట్ లెథర్ కుషన్స్.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
కార్ పెర్ఫ్యూమ్.

Click it and Unblock the Notifications