విటారాకు హలో బ్రదర్ వచ్చేశాడు.. 5 స్టార్ సేఫ్టీతో మరెన్నో అద్భుత ఫీచర్లతో మారుతి నయా కార్

మారుతి సుజుకి తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ తాజాగా కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ విక్టోరిస్‎ను బుధవారం మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ వాహనం మారుతి మరో ప్రముఖ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా ప్లాట్‌ఫారమ్‌పైనే నిర్మించబడింది. దీంతో ఈ రెండింటి మధ్య తేడాలు, పోలికలపై చర్చ మొదలైంది. గ్రాండ్ విటారాకు విక్టోరిస్ హలో బ్రదర్‎లా ఉన్నప్పటికీ, కొన్ని కీలకమైన మార్పులు, అదనపు ఫీచర్లతో విక్టోరిస్ మెరుగ్గా కనిపిస్తోంది. ఈ రెండు ఎస్‌యూవీల మధ్య ఉన్న మెయిన్ సిమిలారిటీలు, తేడాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

మారుతి సుజుకి విక్టోరిస్, గ్రాండ్ విటారా మాదిరిగానే పెట్రోల్, సీఎన్‌జీ, హైబ్రిడ్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే, విక్టోరిస్ గ్రాండ్ విటారా కంటే కొంచెం పెద్దదిగా ఉంది. ముఖ్యంగా విక్టోరిస్‌లో ఎలక్ట్రిక్ బూట్, మెరుగైన ఇంటీరియర్ డిజైన్ వంటి ఫీచర్లు అదనంగా ఉన్నాయి. అలాగే, గ్రాండ్ విటారా నెక్‌సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడగా, విక్టోరిస్ అరేనా డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులోకి వచ్చింది.

Maruti s New Mid-Size SUV Victoris Launched Check Out its Features and Price

డిజైన్, ఫీచర్లు
డిజైన్ పరంగా విక్టోరిస్, గ్రాండ్ విటారా రెండూ ఎస్‌యూవీ లుక్‌ను కలిగి ఉన్నాయి. కానీ విక్టోరిస్‌లో కొన్ని కొత్త డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకు, విక్టోరిస్ ముందు భాగంలో క్రోమ్ స్ట్రిప్‌తో కూడిన గ్రిల్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, సిల్వర్ స్కిడ్ ప్లేట్ ప్రత్యేకంగా నిలుస్తాయి. పక్కల నుంచి చూస్తే, విక్టోరిస్‌లో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ స్పెషల్ అట్రాక్షన్‎గా నిలుస్తాయి. అయితే గ్రాండ్ విటారాలో ఇవి చిన్నవిగా ఉంటాయి.

ఇంటీరియర్, టెక్నాలజీ
గ్రాండ్ విటారా ఇంటీరియర్‌తో పోలిస్తే, విక్టోరిస్ ఇంటీరియర్ మరింత అడ్వాన్సుడ్‎గా, టెక్నాలజీ ఆధారంగా రూపొందించబడింది. విక్టోరిస్‌లో 10.25 అంగుళాల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డాల్బీ అట్మోస్‌తో 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గ్రాండ్ విటారాలో కూడా కొన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ, విక్టోరిస్ అడ్వాన్సుడ్ టెక్నాలజీతో మెరుగైన అనుభూతిని అందిస్తుంది. లోపలి భాగం పూర్తిగా టెక్నాలజీ-ఫోకస్డ్‌గా ఉంది.

Maruti s New Mid-Size SUV Victoris Launched Check Out its Features and Price

సేఫ్టీ, పర్ఫామెన్స్
సేఫ్టీ విషయంలో విక్టోరిస్ గ్రాండ్ విటారా కంటే ఒక అడుగు ముందుంది. విక్టోరిస్‌కు ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించడమే కాకుండా ఇందులో లెవల్ 2 ఏడీఏఎస్ (ADAS) వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి గ్రాండ్ విటారాలో అందుబాటులో లేవు. ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, రెండు కార్లలోనూ 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, విక్టోరిస్‌లో సీఎన్‌జీ ట్యాంక్‌ను అండర్‌బాడీకి మార్చడం వల్ల బూట్ స్పేస్ పెరిగింది.

బుకింగ్, ధర
విక్టోరిస్ కోసం రూ. 11,000 చెల్లించి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.70 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు. గ్రాండ్ విటారా కూడా ఇదే ధరల శ్రేణిలో ఉన్నప్పటికీ, విక్టోరిస్ అడ్వాన్సుడ్ ఫీచర్లు, మెరుగైన డిజైన్‌తో మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, ఎంజీ ఆస్టర్, వోక్స్‌వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 3, 2025, 18:21 [IST]
English summary
Marutis new mid size suv victoris launched check out its features and price
Read more on: #maruti suzuki #review #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+