Mercedes EQE SUV Full Telugu Review మెర్సిడెస్‌ EQE SUV ఫీచర్లు, డిజైన్‌, ఫర్మామెన్స్‌ పుల్‌ రివ్యూ

జర్మన్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ ఈ దశాబ్దం చివరినాటికి తన ఉత్పత్తులను పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మార్చాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల భారత్ మార్కెట్‌లోకి EQE SUVను విడుదల చేసింది. ఇక్కడ మెర్సిడెస్ సంస్థకు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో EQE విక్రయాలు రాణించే అవకాశం ఉంది.

గత సంవత్సరం లేదా అంతకంటే ముందు భారత రోడ్లపైకి ఫ్లాగ్‌షిప్‌ EQS సెడాన్‌ రాకను చూశాం. EQB 7 సీటర్‌ SUV కూడా చూశాం. ప్రస్తుతం ఈ పోర్టుఫోలియో నుంచి మరో కొత్త Mercedes EQE SUV ఇటీవల లాంచ్‌ అయింది. ఈ కొత్త ఎస్‌యూవీని టెస్ట్‌ డ్రైవ్ చేసేందుకు మెర్సిడెస్‌ సంస్థ మా బృందాన్ని ఆహ్వానించింది. కశ్మీర్‌లోని అందమైన పర్వత శ్రేణుల్లో ఈ వాహనాన్ని పనితీరును పరీక్షించాము.

Mercedes EQE SUV Full Telugu review

మెర్సిడెస్‌ EQE SUV డిజైన్‌, ఫీచర్లు : మెర్సిడెస్‌ EQE ఎ‌స్‌యూవీ కారు డిజైన్‌ అందరిని ఆకట్టుకుంటుంది. ఫీచర్లు సహా ఇతర స్పెసిఫికేషన్లు ఆకర్షిస్తాయి. ఈ కారు ముందు భాగంలో సాధారణంగా ఉండే ICE గ్రిల్‌ EQ లైనప్‌ సీల్డ్‌ ఆఫ్‌ సెటప్‌కు మార్గం చూపిస్తుంది. దాంతోపాటు మధ్యలో ఉన్న మెర్క్‌ లోగో సహా అనేక త్రీ పాయింట్‌ స్టార్‌ లోగోలున్నాయి.

ఈ కారు ఫాక్స్ గ్రిల్‌ పైన అడాప్టివ్‌ హై బీమ్‌ సెటప్‌ని కలిగి ఉండే డిజిటల్ లైట్‌ LED హెడ్‌లైట్‌కు కనెక్ట్‌ చేసే లైట్‌ బార్‌ ఉంది. రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ వద్ద కూర్చున్న ఇంటెక్‌ చుట్టూ క్రోమ్‌ ట్రిమ్‌ను కలిగి ఉంటుంది.

Mercedes EQE SUV Full Telugu review

మెర్సిడెస్‌ EQE SUV సైడ్‌లు చాలా మృదువైన బాడీ వర్క్‌ను కలిగి ఉన్నాయి. దీంతోపాటు 20 అంగుళాల ఏరో అల్లాయ్‌ వీల్స్‌, డోర్‌ హ్యాండిల్‌, విండో వద్ద షైనీ క్రోమ్‌ సహా కుడి వైపున వీల్‌ ఆర్చ్‌పైన ఛార్జింగ్‌ పోర్టు ఉన్నాయి.

మెర్సిడెస్‌ EQE ఎస్‌యూవీ వెనుక భాగంలో అనేక డిజైన్‌ హైలెట్‌లు ఉన్నాయి. EQ లైనప్‌ 3D హెలిక్స్‌ కనెక్ట్‌టెడ్‌ టెయిల్‌లైట్లతో రూఫ్‌ హౌసింగ్‌పై స్పాయిలర్ వంటి డిజైన్‌లు ఉంది. దీంతోపాటు టెయిల్‌లైట్‌ల కింద త్రీ పాయింట్‌ స్టార్ బ్యాడ్జ్‌ ఉంది. అక్కడ ఉన్న బటన్ నొక్కినప్పుడు బూట్‌ ఓపెన్‌ అవుతుంది. ఈ EQE క్యాబిన్‌లో ఎడ్జ్‌ టూ ఎడ్జ్‌ 56 అంగుళాల MBUX హైపర్‌ స్క్రీన్‌ సెటప్‌ ఉంటుంది.

Mercedes EQE SUV Full Telugu review

EQS మాదిరిగానే ప్రతి వైపు రెండు 12.3 అంగుళాల స్క్రీన్‌లు ఉన్నాయి. మరొకటి ఇన్‌స్ట్రుమెంటేషన్‌గా పనిచేస్తుంది. మధ్యలో 17.7 అంగుళాల స్కీన్‌ ఉంటుంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్‌ సెటప్‌ను నియంత్రిస్తుంది. ఇది వైర్‌లైస్ ఆండ్రాయిడ్‌ ఆటో సహా ఆపిల్‌ కార్‌ప్లే సహా మరిన్ని యాప్‌లను సపోర్టు చేస్తుంది. దీనికి 15 స్పీకర్‌ బర్మెస్టర్‌ 3D సౌండ్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.

ఈ కారు మెర్సిడెస్‌ హెడ్స్‌ అప్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు పనోరమిక్‌ సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌, ఎయిర్‌ ఫిల్ట్రేషన్‌ సిస్టమ్, 4 జోన్ ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, కారులోపల ఎల్లప్పుడూ తాజాగా ఉండే విధంగా ఫ్రాగ్‌రెన్స్‌ డిఫ్యూజింగ్‌ వ్యవస్థ ఉంటుంది.

Mercedes EQE SUV Full Telugu review

మెర్సిడెస్‌ EQE SUV సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు చాలా సౌకర్యంగా, చల్లగా ఉంచుతాయి. ఈ సీట్లు మసాజ్‌ ఫంక్షన్‌ను కలిగి ఉంటాయి. బాగా కష్టపడి వచ్చిన తర్వాత ఈ కారు సీట్లలో కూర్చుని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. ఈ సీట్లు అలసటను తగ్గించి, ఓదార్పునిచ్చే విధంగా ప్రయాణం ఉంటుంది. ఈ కారు దూర ప్రయాణాలు సహా భారీగా పొడవుగా ఉన్న వారు కూడా సౌకర్యవంతంగా కూర్చొనే విధంగా ఉంటాయి.

మెర్సిడెస్‌ EQE SUV ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేసేందుకు అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. లెవల్‌ 2 ADAS- అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ సహా అనేక ఎయిర్‌బ్యాగ్‌లు సహా డిజిటల్‌ లైటింగ్‌ వ్యవస్థ, 360 డిగ్రీల కెమెరా, పార్కింగ్ అసిస్ట్‌ సహా అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

Mercedes EQE SUV Full Telugu review

మెర్సిడెస్‌ EQE SUV స్పెసిఫికేషన్లు, కొలతలు : ఈ కారు 4,863mm పొడవు, 1,940mm వెడల్పు, 1685mm ఎత్తు ఉంటుంది. దీంతోపాటు 3030mm వీల్‌ బేస్‌ ఉంటుంది. ఈ కారు బరువు 2.5 టన్నులు ఉంటుంది. మరియు 520 లీటర్ల బూట్‌స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు 174mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో వస్తుంది.

ఈ ఎలక్ట్రిక్‌ కారు డ్యూయల్‌ మోటార్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే 90.56kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కారు డ్యూయల్‌ మోటార్‌, ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ సెటప్‌ 402bhp, 858Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 4.6 సెకన్లలోనే 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. మరియు గరిష్ఠంగా 210km/h వేగంతో ప్రయాణం చేయగలదు.

Mercedes EQE SUV Full Telugu review

మెర్సిడెస్ EQE SUV భారీ బ్యాటరీ సింగిల్‌ ఛార్జింగ్‌తో 550 కి.మీ రేంజ్‌ ఇస్తుంది. 11kW AC ఛార్జర్‌తో 9.5 గంటల్లో 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చు. ఈ కారు 170kW DC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. మొత్తంగా రేంజ్‌ ఆకట్టుకుంటుంది.

మెర్సిడెస్‌ EQE SUV డ్రైవింగ్‌ ఇంప్రెసన్స్‌ : మెర్సిడెస్‌ EQE మృదువైన పనితీరును కనబరుస్తుంది. ఎకో, కంఫర్ట్‌, స్పోర్ట్‌, ఆఫ్‌రోడ్‌, ఇంజివిడ్యువల్‌లో ఏ డ్రైవింగ్‌ మోడ్‌ను ఎంచుకున్నా చాలా సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. ఎకో నుంచి స్పోర్ట్‌ మోడ్‌లోకి మారినప్పుడు స్టీరింగ్‌ సర్దుబాటు అవుతుంది.

Mercedes EQE SUV Full Telugu review

డ్రైవింగ్‌ మోడ్‌ను బట్టి ఎయిర్‌ సస్పెన్షన్‌ ఆటోమేటిక్‌గా మారుతుంది. ఫలితంగా ప్రయాణం సాఫీగా సాగుతుంది. గతుకులు సహా ఇతర రోడ్లపై ఈ కారు దూసుకెళ్లింది. మూడు స్థాయిల్లో ఉన్న రీజెన్‌లు బాగా పనిచేస్తాయి. అయితే బ్రేక్‌ పెడల్‌ అనుభూతి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. ఈ సమస్యను మెర్సిడెస్‌ పరిష్కరించగలదని మేము భావిస్తున్నాం. మెర్సిడెస్ EQE SUV భారత్‌లో Stuttgart నుంచి వచ్చి ఆల్‌ ఎలక్ట్రిక్‌ EQ మోడల్‌ ఇది. చాలా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. .

EQE SUV 500 ప్రస్తుతం CBUగా విక్రయించబడుతోంది, దీని వలన పెద్ద వాలెట్లు ఉన్నవారు కొన్ని పెద్ద బక్స్ ఎక్కువగా ఉండే EQS ఎలక్ట్రిక్ ల్యాండ్ బార్జ్ గురించి ఆలోచించేలా చేస్తుంది. ప్రస్తుతం EQE SUV 500 CBUగా విక్రయాలు జరుపుతోంది. అలాంటి వారిని ఈ ఎలక్ట్రిక్‌ కారు గురించి ఆలోచించేలా చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, September 29, 2023, 11:31 [IST]
English summary
Mercedes eqe suv features specs design driving impressions full review in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+