ఒక్క కార్ చాలు.. రెండు కుటుంబాలు కలిసి వెళ్లొచ్చు.. తెలుగువారి కోసం డ్రైవ్‌స్పార్క్ స్పెషల్ రివ్యూ

భారత ఆటోమొబైల్ రంగంలో భారీ హైప్ మధ్య జరిగిన Bharat Mobility Global Expo 2025లో MG Motor అనేక కొత్త మోడళ్లను టీజ్ చేసింది. అందులో MG Cyberster, MG M9 ఇప్పటికే రోడ్లపై కనిపిస్తున్నాయి. అయితే దాదాపు ఏడాది నరంగా టీజ్ చేస్తూ వచ్చిన MG Majestor ఇప్పుడు మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫుల్-సైజ్ బాడీ-ఆన్-ఫ్రేమ్ SUV, డీ-సెగ్మెంట్‌లో రాజుగా పేరున్న Toyota Fortunerకు నేరుగా పోటీగా నిలవబోతోంది. మరి నిజంగా ఇది ఆ స్థాయిలో పోటీ ఇవ్వగలదా? దీని డ్రైవింగ్ గురించి తెలుసుకోవడానికి ఢిల్లీ NCR ప్రాంతంలో ఈ SUVను డ్రైవ్ చేశాం. ఆ అనుభవం వివరాలు ఈ కింది కథణంలో.

డిజైన్, ఫీచర్లు & ప్రాక్టికాలిటీ

MG మేజెస్టర్ డిజైన్ చూసిన వెంటనే ఇది ఒక భారీ, బలమైన SUV అని స్పష్టంగా తెలుస్తుంది. దీని సిల్హౌట్ Maxus D90ను గుర్తు చేస్తుంది. స్ట్రైట్ స్టాన్స్, డీప్ వీల్ ఆర్చెస్, బాడీ క్లాడింగ్ కలిసి ఈ SUVకు రఫ్ అండ్ టఫ్ లుక్ ఇస్తాయి. అయితే MG దీన్ని మరింత ప్రీమియంగా, అగ్రెసివ్‌గా మార్చేందుకు స్టైలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.

MG Majestor Review Features Performance Price In Telugu Full Details

ముందు భాగంలో హారిజాంటల్, వెర్టికల్ LED DRLs‌తో 'మొసాయిక్ మ్యాట్రిక్స్' గ్రిల్ ఈ SUVకు ప్రత్యేక ఐడెంటిటీ ఇస్తుంది. హెడ్‌లైట్స్ బంపర్‌లోని ఫ్లేర్డ్ సెక్షన్‌లో ఇమిడిపోయి, డిజైన్‌ను మరింత డైనమిక్‌గా మార్చాయి. టాప్ వేరియంట్లలో 19-ఇంచ్ డ్యూయల్-టోన్ అలోయ్ వీల్స్, ఫ్లేర్డ్ ఫెండర్స్‌తో కలిసి బలమైన రోడ్ ప్రెజెన్స్ ఇస్తాయి.వెనుక భాగంలో ఫుల్-విడ్త్ LED టెయిల్ లైట్స్, 'Morris Garages', 'Majestor' బ్యాడ్జింగ్ కనిపిస్తాయి.

రియర్ బంపర్‌లో ఫాక్స్ ఎగ్జాస్ట్ టిప్స్, స్కిడ్ ప్లేట్ ఇవ్వడం ద్వారా స్పోర్టీ టచ్ ఇచ్చారు. స్టాండర్డ్‌గా ఫిక్స్‌డ్ సైడ్ స్టెప్స్ కూడా ఉన్నాయి. కలర్ ఆప్షన్స్‌గా మెటల్ బ్లాక్, పెర్ల్ వైట్, కాంక్రీట్ గ్రే, మెటల్ యాష్ లభిస్తాయి. ఇంటీరియర్‌లో, 2,950mm వీల్‌బేస్ వల్ల ఈ SUVలో మూడో వరుస యూజ్ చేయడానికి సరిపడా స్పేస్ ఉంటుంది. 6-సీటర్ (కెప్టెన్ సీట్స్) లేదా 7-సీటర్ కాన్ఫిగరేషన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

MG Majestor Review Features Performance Price In Telugu Full Details

డాష్‌బోర్డ్‌లో 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే అందుబాటులో ఉన్నాయి. MG i-Smart 2.0 కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు, 12-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్, 64-కలర్ అంబియెంట్ లైటింగ్, ప్యానోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto ఈ SUVను ప్రీమియంగా నిలబెడతాయి. సీట్ల కంఫర్ట్ విషయానికి వస్తే, ముందువరుస సీట్లు కూలింగ్, మసాజ్ ఫంక్షన్‌లతో వస్తాయి.

సీట్లు పెద్దగా, మెత్తగా ఉండి లాంగ్ డ్రైవ్స్‌లో మంచి సపోర్ట్ ఇస్తాయి. రెండో వరుస కెప్టెన్ సీట్లు బెస్ట్ కంఫర్ట్ అందించే వాటిలో ఒకటిగా చెప్పవచ్చు. దూర ప్రయాణికులకు సరిపడా లెగ్‌రూమ్ ఉంటుంది. మూడో వరుస సీట్లు ఇతర పెద్ద SUVలతో పోలిస్తే కొంచెం మెరుగైన స్పేస్ ఇస్తాయి. అయితే 6 అడుగులకు పైగా ఎత్తు ఉన్నవారు ఎక్కువ కంఫర్ట్ కోసం ముందు రెండు వరుసల్లో కూర్చోవడం మంచిదని అనిపిస్తుంది.

MG Majestor Review Features Performance Price In Telugu Full Details

ప్రాక్టికాలిటీ, కంఫర్ట్ & సేఫ్టీ

MG Majestorలో ప్రాక్టికాలిటీ కూడా మంచి స్థాయిలో ఉంటుంది. మూడో వరుస సీట్లు ఉపయోగంలో ఉన్నప్పుడు బూట్ స్పేస్ 343 లీటర్ల వరకు లభిస్తుంది. అవసరాన్ని బట్టి మూడో వరుసను ఫ్లాట్‌గా ఫోల్డ్ చేస్తే, 1,350 లీటర్లు పెరుగుతుంది లాంగ్ ట్రిప్స్,పెద్ద లగేజీ కోసం ఇది చాలా ఉపయోగకరం. మూడు వరుసలలోనూ కప్ హోల్డర్స్, బాటిల్ హోల్డర్స్, స్టోరేజ్ పాకెట్స్, ఛార్జింగ్ పోర్ట్స్ చిన్న చిన్న సౌకర్యాలు కంఫర్టబుల్‌గా ఉంటాయి.

క్లైమేట్ కంట్రోల్ కోసం ట్రై-జోన్ ఆటోమేటిక్ సిస్టమ్ ఇవ్వబడింది. ముఖ్యంగా మూడో వరుస ప్రయాణికులకు ప్రత్యేక ఎయిర్ వెంట్స్ ఉండటం వల్ల వెనుక కూర్చున్నవారికి కూడా కంఫర్ట్ తగ్గదు. అదనంగా ఆటో-టిల్టింగ్ ORVMలు, జెశ్చర్‌తో పనిచేసే టెయిల్‌గేట్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ఈ SUV చాలా అడ్వాన్స్‌గా ఉంటుంది.

MG Majestor Review Features Performance Price In Telugu Full Details

లెవల్-2 ADAS ఫీచర్లలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, కోలిజన్ డిటెక్షన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్, హిల్-డిసెంట్ కంట్రోల్ ఫీచర్లు స్టాండర్డ్‌గా అందించబడతాయి. ఇతర సేఫ్టీ ఫీచర్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ISOFIX మౌంట్స్, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్ ఉన్నాయి. డ్రైవింగ్‌ను మరింత ఎంగేజింగ్‌గా మార్చేందుకు ప్యాడిల్ షిఫ్టర్లు ఇవ్వడం జరిగింది.

ఇంజన్, స్పెసిఫికేషన్లు & డైమెన్షన్స్

MG Majestor పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో 2.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్ ఇవ్వబడింది. ఇది గరిష్టంగా 215hp పవర్ మరియు 478Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజన్ MG Gloster హై-స్పెక్ వేరియంట్లలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్‌కు 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడింది. డ్రైవింగ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ప్యాడిల్ షిఫ్టర్లు కూడా ఉన్నాయి.

MG Majestor Review Features Performance Price In Telugu Full Details

వేరియంట్‌ను బట్టి రియర్-వీల్ డ్రైవ్ లేదా 4WD ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. 4WD సిస్టమ్‌ను MG యొక్క 'M-Hub' టెర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో కలిపి, 10 వరకు డ్రైవ్ మోడ్‌లు అందిస్తున్నారు. కఠినమైన ఆఫ్-రోడింగ్ కోసం M-Crawl ఫంక్షన్, లో-స్పీడ్ ట్రాన్స్‌ఫర్ కేస్, మూడు డిఫరెన్షియల్ లాక్స్ కూడా ఇవ్వడం జరిగింది.

డైమెన్షన్స్ విషయానికి వస్తే, ఈ SUV పొడవు 5,046mm, వెడల్పు 2,016mm, ఎత్తు 1,876mm. వీల్‌బేస్ 2,950mm ఉండటం వల్ల క్యాబిన్‌లో మంచి స్పేస్ లభిస్తుంది. 19-ఇంచ్ అలోయ్ వీల్స్, 219mm గ్రౌండ్ క్లియరెన్స్ ఈ SUVను రఫ్ రోడ్స్‌కి కూడా అనుకూలంగా మారుస్తాయి. అదనంగా 810mm వరకు నీటిలో కూడా వెళ్లగల సామర్థ్యం ఉండటం ఆఫ్-రోడింగ్‌కు పెద్ద ప్లస్ పాయింట్.

MG Majestor Review Features Performance Price In Telugu Full Details

డ్రైవింగ్ అనుభవం

డ్రైవింగ్‌లోకి తీసుకెళ్తే MG Majestor చాలా కాంపోజ్డ్‌గా అనిపిస్తుంది. ఇంజన్ పవర్ బలంగా ఉన్నప్పటికీ, కొన్ని చిన్న లోపాలు కనిపిస్తాయి. ముఖ్యంగా 2,000rpm కంటే తక్కువ రేంజ్‌లో థ్రోటిల్ రెస్పాన్స్ కొద్దిగా స్లోగా ఉంటుంది. గేర్‌బాక్స్ కూడా సరైన గేర్‌ను ఎంచుకోవడానికి కొంచెం టైమ్ తీసుకుంటుంది. అయితే ఆ లిమిట్ దాటిన తర్వాత పవర్ ఒక్కసారిగా పెరిగి SUV వేగంగా ముందుకు దూసుకెళ్తుంది.

ప్యాడిల్ షిఫ్టర్లు మాన్యువల్ కంట్రోల్ ఇచ్చినా, ఇంజన్ రేవ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సిస్టమ్ అగ్రెసివ్ డౌన్‌షిఫ్ట్‌లను అనుమతించదు. 3,900rpm వద్ద ఇంజన్ రెడ్‌లైన్ అవుతుండటం వల్ల ఇది ఎక్కువగా హైవే డ్రైవింగ్‌కు అనుకూలంగా ట్యూన్ చేసినట్టు అనిపిస్తుంది. హైవేలో ఈ SUV తన అసలైన సామర్థ్యాన్ని చూపిస్తుంది. తక్కువ స్పీడ్‌లోనే 7వ, 8వ గేర్లు ఎంగేజ్ అవుతూ స్మూత్‌గా ప్రయాణిస్తుంది.

MG Majestor Review Features Performance Price In Telugu Full Details

ఓవర్‌టేక్ చేయాల్సినప్పుడు కూడా గేర్‌ను ఎక్కువగా తగ్గించాల్సిన అవసరం లేకుండా సరిపడా టార్క్ అందుబాటులో ఉంటుంది. గేర్ షిఫ్ట్స్ సాఫ్ట్‌గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయి. రిఫైన్మెంట్ ఈ SUVలో పెద్ద ప్లస్ పాయింట్. సిటీ లేదా హైవే ఎక్కడైనా ఇంజన్, గాలి, రోడ్ నాయిస్ చాలా వరకు కంట్రోల్‌లో ఉంటుంది. లాడర్-ఫ్రేమ్ చాసిస్ ఉన్నప్పటికీ, రైడ్ క్వాలిటీ స్టేబుల్‌గా, కంఫర్టబుల్‌గా ఉంటుంది.

లో స్పీడ్‌లో కొద్దిగా అప్-డౌన్ మోషన్ కనిపించినా, స్పీడ్ పెరిగేకొద్దీ రైడ్ మరింత స్మూత్‌గా మారుతుంది. సస్పెన్షన్ గుంతల రోడ్లను కూడా హార్ష్‌గా ఫీల్ కాకుండా హ్యాండిల్ చేస్తుంది. హైవేలో ఫ్లోటింగ్ ఫీలింగ్ లేకుండా స్టేబిలిటీ మెయింటైన్ అవుతుంది. అయితే పెద్ద SUV కావడంతో కార్నర్లలో బాడీ రోల్ కనిపించడం సహజమే. హై-స్పీడ్ లేన్ మార్పుల్లో కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది, ప్రత్యేకంగా వెనుక కూర్చున్నవారి కంఫర్ట్ కోసం.

MG Majestor Review Features Performance Price In Telugu Full Details

స్టీరింగ్ లైట్‌గా, డైరెక్ట్‌గా ఉండటంతో 5,046mm పొడవున్న ఈ SUVను ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. స్పీడ్ పెరిగినప్పుడు మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తూ కంట్రోల్‌లో ఉంటుంది. ఆఫ్-రోడ్‌లో Majestor సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఆన్-డిమాండ్ 4WD సిస్టమ్, 10-మోడ్ M-Hub టెర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో డ్రైవింగ్ సులభమవుతుంది. గుట్టలు, గుంతలు, అసమానమైన మార్గాల్లో M-Crawl ఫంక్షన్, లో-స్పీడ్ ట్రాన్స్‌ఫర్ కేస్, మూడు డిఫరెన్షియల్ లాక్స్ సహాయంతో ఈ SUV బాగా హ్యాండిల్ చేస్తుంది.

చివరగా

మొత్తానికి MG Majestor ఒక పర్పస్-బిల్ట్ SUVగా కనిపిస్తుంది. పెద్ద మూడు వరుసల క్యాబిన్, మంచి హైవే పనితీరు, అలాగే ఆఫ్-రోడింగ్ సామర్థ్యం కలిపి ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్. 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్ మిడ్-రేంజ్‌లో బలమైన పనితీరు ఇస్తుంది. అలాగే M-Hub టెర్రైన్ సిస్టమ్, M-Crawl ఫీచర్లు నిజమైన ఆఫ్-రోడ్ యుటిలిటీని అందిస్తాయి.

MG Majestor Review Features Performance Price In Telugu Full Details

అయితే లో స్పీడ్‌లో ఇంజన్ కొద్దిగా స్లోగా అనిపించడం, గేర్‌బాక్స్ రెస్పాన్స్ ఆలస్యం కావడం వంటి విషయాలు ముఖ్యంగా సిటీ డ్రైవింగ్‌లో చిన్న మైనస్ పాయింట్స్‌గా కనిపిస్తాయి. అలాగే 5 మీటర్లకు పైగా పొడవు ఉండటం వల్ల ట్రాఫిక్‌లో మేనేజ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అయినా, పెద్ద 7-సీటర్ ఫ్యామిలీ SUV కోసం చూస్తున్నవారికి ఇది ఖచ్చితంగా ఒక మంచి ఆప్షన్.

Article Published On: Saturday, April 25, 2026, 12:04 [IST]
English summary
Mg majestor review features performance price in telugu full details
Read more on: #car review #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+