2013 టాటా సుమో గోల్డ్ ధర రూ.5.93 లక్షలు: రివ్యూ
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తమ హారిజానెక్స్ట్ ప్రణాళికలో భాగంగా గడచిన జూన్ నెలలో ఆవిష్కరించిన 8 అప్‌గ్రేడెడ్ కార్లలో ఒకటైన సరికొత్త '2013 టాటా సుమో గోల్డ్' ఎస్‌యూవీని వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
టాటా మోటార్స్ అందిస్తున్న ఈ రఫ్ అండ్ టఫ్ ఎస్‌యూవీ 'టాటా సుమో గోల్డ్' ఇప్పుడు మరింత శక్తివంతమైన ఇంజన్‌తో లభ్యం కానుంది. ఇందులో అధునాతన బిఎస్4 ఇంజన్‌ను, మునపటి వెర్షన్ కన్నా మెరుగైన ఫీచర్లను జోడించింది.
కొత్త 2013 టాటా సుమో గోల్డ్ మొత్త ఐదు వేరియంట్లలో (జిఎక్స్, ఎఫ్ఎక్స్, ఈఎక్స్, ఎల్ఎక్స్, సిఎక్స్) లభ్యమవుతుంది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర కేవలం రూ.5.93 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మాత్రమే.
ఈ సరికొత్త 2013 టాటా సుమో గోల్డ్ ఎస్‌యూవీలో లభ్యం కానున్న పూర్తి ఫీచర్ల వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

సిఆర్4 ఇంజన్
కొత్త 2013 టాటా సుమో గోల్డ్‌లో పవర్‌ఫుల్ 3 లీటర్, సిఆర్4 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 3000 ఆర్‌పిఎమ్ వద్ద 85 పిఎస్‌ల గరిష్ట శక్తిని మరియు 1000-2000 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్ప్తతి చేస్తుంది.

డై టర్బో బిఎస్3 ఇంజన్
గ్రామీణ, పట్టణ మార్కెట్ల కోసం ఇందులో డై టర్బో బిఎస్3 ఇంజన్‌ను కూడా జోడించారు. ఈ 2956సీసీ ఇంజన్ 3000 ఆర్‌పిఎమ్ వద్ద 70 పిఎస్‌ల గరిష్ట శక్తిని మరియు 1600-2000 ఆర్‌పిఎమ్ వద్ద 223 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్ప్తతి చేస్తుంది.

మైలేజ్
ఈ 2013 టాటా సుమో గోల్డ్ సొంతం లీటరు డీజిల్‌కు 15.3 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఫీచర్స్
స్పోర్టీ గేర్ నాబ్, డబుల్ విష్‌బోన సస్పెన్షన్, స్టయిలిష్ ఉడెన్ సెంటర్ కన్సోల్ మరియు డ్యాష్‌బోర్డ్, ప్లష్ ఫ్యాబ్రిక్, విశాలమైన ఇంటీరియర్స్, ఉత్తమ హెడ్, లెగ్ మరియు షోల్డర్ స్పేస్, వన్ టచ్ పవర్ విండోస్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఫుల్లీ ఫీచర్డ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి ఫీచర్లు ఈ కొత్త 2013 టాటా సుమో గోల్డ్ సొంతం.

వేరియంట్స్, ధర
కొత్త 2013 టాటా సుమో గోల్డ్ మొత్త ఐదు వేరియంట్లలో (జిఎక్స్, ఎఫ్ఎక్స్, ఈఎక్స్, ఎల్ఎక్స్, సిఎక్స్) లభ్యమవుతుంది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.5.93 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

వారంటీ
టాటా సుమో గోల్డ్ 3 ఏళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది (ఏది ముందుగా ముగిస్తే అది).

సెగ్మెంట్లో కెల్లా తొలిసారిగా డ్యూయెల్ ఏసి
వెనుక వరుసలోని సీట్లలో కూర్చునే ప్రయాణికులకు కూడా ఎయిర్ కండిషన్ వచ్చే విధంగా రూఫ్‌కు ఏర్పాటు చేసిన రియర్ ఏసి వెంట్స్ ఇందులో మరో ప్రత్యేకమైన ఫీచర్.

యూఎస్‌బి, బ్లూటూత్ ఆప్షన్‌తో మ్యూజిక్ సిస్టమ్
కొత్త టాటా సుమో గోల్డ్ ఎస్‌యూవీలో సెగ్మెంట్లో కెల్లా తొలిసారిగా యూఎస్‌బి, బ్లూటూత్ ఆప్షన్‌తో కూడిన మ్యూజిక్ సిస్టమ్‌ను జోడించారు.

సున్నితమైన గేర్‌బాక్స్
కొత్త టాటా సుమో గోల్డ్‌లో గేర్ బాక్స్‌ను మెరుగు పరచారు. ఇప్పుడు కొత్త సుమోలో గేర్ ఛేంజింగ్ మరింత సున్నితంగా అనిపిస్తుంది.

సాఫ్ట్ చేయబడిన సస్పన్షన్
ఉత్తమ రైడ్ క్వాలిటీ కోసం సాఫ్ట్ చేయబడిన సస్పన్షన్

హై పెర్ఫామెన్స్ క్లచ్
ఇందులో హై పెర్ఫామెన్స్ క్లచ్‌ను జోడించారు. ఇది 40 శాతం అధనపు జీవిత కాలాన్ని ఆఫర్ చేస్తుంది. సుమారు 1 లక్ష కిలోమీటర్లకు పైగా క్లచ్ విషయంలో ఎలాంటి టెన్షన్ లేకుండా డ్రైవ్ చేయవచ్చు.

ఆల్ పవర్ విండోస్
కొత్త సుమోల్ విండోలు పవర్ విండో స్విచ్‌తో లభిస్తాయి. ఈ స్విచ్‌లను సెంటర్ కన్సోల్‌పై ఏర్పాటు చేశారు. ఇంకా ఇందులో కొత్త తరం స్టయిలింగ్‌తో కూడిన విలాసవంతమైన అప్‌హోలెస్టరీ మరో ప్రత్యేకత.

టర్నింగ్ రేడియస్, గ్రౌండ్ క్లియరెన్స్
కొత్త సుమో గోల్డ్ బెస్ట్ ఇన్ క్లాస్ టర్నింగ్ రేడియస్‌ను, బెస్ట్ ఇన్ క్లాస్ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. దీని టర్నింగ్ రేడియస్ 5 మీటర్లు, గ్రౌండ్ క్లియరెన్స్ 182 మి.మీ.

క్లాస్ లీడింగ్ స్పేస్
క్లాస్ లీడింగ్ స్పేస్ మరియు కంఫర్ట్‌తో కూడిన కొత్త 2013 టాటా సుమో గోల్డ్ ఈ విభాగంలో కెల్లా పొడవైన వాహనంగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








