Maruti Suzuki Swift 2024 Full Review: మారుతి సుజుకి స్విఫ్ట్ ఫీచర్స్, స్పెక్స్ ఫుల్ రివ్యూ

మారుతి సుజుకి స్విఫ్ట్‌కి భారతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో సామాన్యులకు ఈ కారు అందుబాటులో ఉండటంతో దీనిని కొనేందుకు జనాలు ఎగబడతారు. సాధారణంగా మారుతి కార్లలో స్విఫ్ట్‌ మంచి మార్కెట్‌ కలిగి ఉన్న కారుగా ఉంది. తాజాగా ఆ సంస్థ మారుతి స్విఫ్ట్‌ 2024 కారుని విడుదల చేసింది.

మారుతి స్విఫ్ట్‌ కారుకి గల స్మార్ట్ లుక్‌ మరియు దాని డిజైన్‌కి మండి డిమాండ్‌ ఉంది. అందులో భాగంగానే ఈ సంస్థ విడుదల చేసిన తాజా 2024 4th జనరేషన్‌ కారుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కార్‌ ప్రియులు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ కారుని మారుతి సుజుకి రూపొందించింది. ఈ కారుని మా డ్రైవ్స్‌పార్క్‌ టీమ్‌ టెస్ట్‌ డ్రైవ్ చేసింది. ఈ కారు డ్రైవింగ్‌ ఇంప్రెషన్స్‌, స్పెసిఫికేషన్స్‌ మీకోసం..

2024-Maruti-Suzuki-Swift-Design-Specs-Performance-Full-Review

రూ. 6.49 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)తో నాల్గవ తరం స్విఫ్ట్‌ని సంస్థ తీసుకువచ్చింది. 19 సంవత్సరాల చరిత్ర కలిగిన స్విఫ్ట్‌ కారుని ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. కొత్త ఇంజన్ మరియు పూర్తిగా లోడ్ చేయబడిన భద్రతా ఫీచర్లతో ఈ కారు భారతీయ మార్కెట్‌లో సంస్థ ప్రవేశ పెట్టింది.

బాహ్య డిజైన్: 2024 స్విఫ్ట్ కారు పూర్తిగా ముందు మోడళ్ల మాదిరి లుక్‌తోనే రానుంది. అయితే అది పొడవు (+15 మిమీ), ఎత్తు (+30 మిమీ) మార్పులతో సంస్థ రూపొందించింది.
స్విఫ్ట్‌ కారులో కొత్త ఫ్రంట్ బంపర్‌ని గమనించవచ్చు. రీడిజైన్ చేయబడిన గ్రిల్‌ నలుపు రంగులో వస్తుంది. దీనికి దగ్గరగా హెడ్‌లైట్‌ను చూడవచ్చు. గ్రిల్ పైన సుజుకి బ్యాడ్జ్‌ ఉంది.

2024-Maruti-Suzuki-Swift-Design-Specs-Performance-Full-Review

హెడ్‌లైట్‌లతో కనెక్ట్‌ చేయబడిన టైల్‌లైట్‌లు గమనించవచ్చు. టెయిల్‌లైట్‌లు సిగ్నేచర్ C-ఆకారపు LEDలతో వస్తాయి. ఇది కారుకి అదనపు లుక్‌ని అందించనుంది. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ మూడు డ్యూయల్-టోన్ కలర్‌లతో మొత్తం తొమ్మిది రంగులలో అందించబడుతుంది. ఇక కంపెనీ తీసుకువచ్చిన 'స్పోర్టీ' రేసింగ్ రోడ్‌స్టర్ మరియు 'ఎనర్జిటిక్' థ్రిల్ ఛేజర్‌లు సరికొత్తగా కనిపించనున్నాయి.

ఇంటీరియర్ & ఫీచర్లు: కొత్త స్విఫ్ట్ క్యాబిన్ డిజైన్‌ బాలెనో కారు మాదిరిగా ఉండనుంది. మల్టీ-లేయర్డ్ డ్యాష్‌బోర్డ్‌ కొత్త 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో మంచి అనుభూతిని కలిగిస్తుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, నావిగేషన్ మరియు OTA అప్‌డేట్‌లకు ఈ ఇన్ఫోటైన్‌మెంట్‌ మద్దతు ఇస్తుంది. ఇక రివర్సింగ్ కెమెరా కోసం డిస్‌ప్లే కూడా పనిచేస్తుంది.

2024-Maruti-Suzuki-Swift-Design-Specs-Performance-Full-Review

స్టీరింగ్ వీల్‌లో రివైజ్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ బినాకిల్‌ని గమనించవచ్చు. దీని మధ్యలో 4.2-అంగుళాల డిజిటల్ MIDని అందించింది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సెటప్ కోసం కొత్త సెంట్రల్ వెంట్స్‌ మరియు స్విచ్ గేర్ ఉన్నాయి. AC వెంట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సర్దుబాటు చేయగల పవర్ ORVMలు, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ ఉన్నాయి.

ఇక ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ కోసం స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్ మరియు LED ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. కొత్త 2024 మారుతి స్విఫ్ట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX యాంకర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, EBDతో కూడిన ABS, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు ESC ఉన్నాయి. ఇవి అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్ సేఫ్టీ కిట్‌గా సంస్థ అందిస్తోంది.

2024-Maruti-Suzuki-Swift-Design-Specs-Performance-Full-Review

ఇంజిన్: కొత్త 2024 మారుతి సుజుకి స్విఫ్ట్‌లో అతిపెద్ద మార్పును బానెట్ కింద చూడవచ్చు. స్విఫ్ట్ మరింత పొదుపుగా ఉండే Z సిరీస్ పవర్‌ప్లాంట్ కోసం సుజుకి యొక్క K-సిరీస్ ఇంజిన్‌లను తొలగించింది. తాజాగా ఈ స్విఫ్ట్‌ ఇంజిన్‌లో ఒక సిలిండర్‌ను తగ్గించింది. కొత్త Z12E ఇంజన్ 80.46bhp వద్ద 5,700rpm మరియు 111.7Nm 4,300rpm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడుతుంది. స్విఫ్ట్ మాన్యువల్ 24.8km/l మైలేజీని అందిస్తుంది. ఇక AMT వేరియంట్ 25.75km/l వరకు అందిచనుంది. కొత్త స్విఫ్ట్ దాని ముందున్న దాని కంటే కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. దీని కొలతలలోని తేడాల కారణంగా వీల్‌బేస్‌లో ఎలాంటి మార్పు కనిపించదు. ఇది 2,450mm వీల్‌బేస్‌ని కలిగి ఉంది.

2024 మారుతి సుజుకి స్విఫ్ట్ 3,860mm పొడవు, 1,735mm వెడల్పు మరియు 1,520mm ఎత్తుని కలిగి ఉంటుంది. ఇది 163mm గ్రౌండ్ క్లియరెన్స్‌, 920kg (AMTకి 925kg) బరువును కలిగి ఉంది. ఈ కారు మొత్తం 265 లీటర్ల బూట్‌ స్పేస్‌ కెపాసిటీని కలిగి ఉంటుంది. దీంతో సులభంగా మనం వస్తువులను క్యారీ చేయవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ 37 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

2024-Maruti-Suzuki-Swift-Design-Specs-Performance-Full-Review

డ్రైవింగ్ ఇంప్రెషన్స్‌: కొత్త స్విఫ్ట్ 0-100 కిమీ వేగాన్ని కేవలం 12.5 సెకన్లలో అందుకుంటుంది. 2024 స్విఫ్ట్ కొత్త సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంది. ఇది బంప్‌లు మరియు రట్‌లను పూర్తిగా సులభంగా డీల్ చేస్తుంది. పదునైన మరియు చురుకైన స్టీరింగ్‌తో కలిపి, స్విఫ్ట్ కొత్త సస్పెన్షన్‌తో ఆఫ్‌-రోడ్‌లోనూ సులభంగా ప్రయాణించవచ్చు.

కొత్త స్విఫ్ట్‌లో అప్‌డేట్ చేయబడిన డిజైన్ మరియు మరిన్ని ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తుంది. ఇక ముఖ్యంగా భద్రత విషయంలో కంపెనీ ఎటువంటి రాజీ పడలేదు. అన్ని వేరియంట్‌లలో ఫుల్‌ సేఫ్టీ మెజర్స్‌ని సంస్థ అందించింది. ఇక కొత్త 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ మంచి మైలేజ్ ఇవ్వడమే కాకుండా.. కొత్త సస్పెన్షన్ సెటప్‌ని కలిగి ఉంది. ఇక ఫైనల్‌గా ఇప్పుడున్న హ్యాచ్‌బ్యాక్‌లలో దీనిని ఉత్తమమైన కారుగా పరిగణించవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, May 16, 2024, 11:02 [IST]
English summary
New 2024 maruti suzuki swift driving impressions specifications full review in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+